తెలుగుభావాలు వారి బ్లాగులో వరాహమూర్తి అవతారం గురించి కొన్ని అభిప్రాయాలు చదివానండి.
* నాకు ఏమనిపిస్తోందంటే......." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో .........వరాహస్వామి తన బంగారుకోరతో భూదేవిని సముద్రం నుంచీ పైకి తెచ్చి స్థిరంగా నిలబెట్టారని చెప్పటం జరిగింది. అంటే " ఒకే కోర " .
ఇంకా, వరాహస్వామి భూదేవిని సముద్రంలోనుంచీ పైకి తీసుకువస్తున్న సందర్భాన్ని గురించి ఒక దగ్గర ఇలా ........." ఒక పద్మాన్ని కోరమీద నిలబెట్టిన దిగ్గజం లాగా భాసించాడు.ఆదివరాహమూర్తియైన ఆ యజ్ఞేశుడూ యజ్ఞపూరుషుడూ "..... అని వర్ణించబడింది...
అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు.
* మరి ఏమిటి ? అంటే దీనికి సమాధానం " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి " వారే చెప్పటం జరిగింది. " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " అన్న గ్రంధంలో 7 వ అధ్యాయములో .... 61 వ పేజీలో వివరములు ఉన్నాయండి.
ఇంకా " శ్రీ దేవీ భాగవతము " గ్రంధములోని వివరముల ప్రకారం చూస్తే ........ భూమిని హిరణ్యక్షుడు మహా సముద్రంలో విసిరేశాడని చెప్పబడింది. అంటే ఈ సముద్రం భూమిపైన ఉన్న సముద్రం కాదు. అయినా భూమిపై ఉన్న సముద్రంలోకి భూమిని ఎలా పడవేస్తాడు లెండి.
*మరి ఆ మహా సముద్రం మాత్రం దేని ఆధారంగా నిలబడిఉందని మనకు సందేహం వస్తుంది. ఆలోచిస్తే సమస్త విశ్వానికి ఆదిశక్తి అయిన పరమాత్మ శక్తే ఆధారశక్తిగా నిలుస్తోంది. ఆ మహా శక్తివల్లనే అనంతబ్రహ్మాండాలుగా సృష్టిరచన సాగుతోందని మనం తెలుసుకోవచ్చు.
ఉదా... భూమి తిరుగుతున్నప్పుడు భూమిపైని సముద్రాలలోని నీరు క్రింద పడటం లేదు కదా ! గురుత్వాకర్షణ శక్తి వల్ల పడటం లేదు అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తిని ఇచ్చింది దైవమే కదా ! అలాగే .ఎన్నో గ్రహాలు కూడా క్రింద పడిపోకుండా విశ్వంలో నిలిచే ఉన్నాయి.
సూర్యచంద్రులు గతి తప్పకుండా వస్తున్నారు.ఊళ్ళను ముంచేసే వానలు వానగా కురవకముందు తేలికైన మబ్బుల్లో ఆకాశంలోనే నిలిచి ఉంటున్నాయి కదా !
ఇన్ని సాధ్యమయినప్పుడు మహాసముద్రాలు కూడా ఏ ఆధారం లేకపోయినా వాటికవే విశ్వంలో నిలిచి ఉండగలవు. దైవం ప్రసాదించిన విశ్వగురుత్వాకర్షణశక్తి కూడా ఉంటుందేమో ! దైవానికి ఏదీ అసాధ్యం కాదు.
కొన్ని విషయాలు ................
*ఒకప్పుడు త్రిమూర్తులు ఆదిపరాశక్తి అయిన పరమాత్మ వద్దకు వెళ్ళి వారిని స్తుతించగా ఆదిపరాశక్తి వారికి ఎన్నో విషయాలను వివరించటం జరిగిందట. అందులో కొద్ది భాగం.........
ఆదిపరాశక్తి బ్రహ్మదేవునికి వివరించిన విషయాలలోని కొద్ది భాగం.........
*.........ఇక్కడ అంతా జలమయం, పృధివి లేదు, సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృధివి లేదు అంటే పరమాణువు(లు )గా ఉందని తెలుసుకో. పృధివ్యభావం పరమాణ్వభావం కాదు........అని ఆదిపరాశక్తి ( పరమాత్మ ) ఎన్నో విషయాలను చెప్పటం జరిగింది.
..............................................
* యమధర్మరాజు సావిత్రీదేవితో చెప్పిన దేవీ మహిమలోని కొన్ని భాగాలు...
........................................................
సర్వకారణకారణుడు సర్వాత్మకుడు సర్వభగవంతుడు సర్వేశ్వరుడు సర్వాద్యుడు సర్వవేత్త సర్వపరిపాలకుడు నిత్యరూపి నిత్యదేహి నిత్యానందుడు నిరాకృతి నిరంకుశుడు నిరాశంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడూ అయిన పరాత్పరుడు ( ప్రకృతి ) మాయావిశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు. ఈ ప్రకృతిపురుషులు పరస్పరం అభిన్నులు. అగ్ని - దాని దాహకశక్తి లాగా అవిభాజ్యులు. వీరి వికారాలే సర్వప్రాకృతరూపాలూనూ. ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు. సచ్చిదానందరూపిణి. తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది. మొట్టమొదటగా గోపాలసుందరీ రూపాన్ని సృష్టించింది. వెంటనే అత్యంత మనోహరుడైన గోపసుందరుణ్ణి సృష్టించింది. ఆమె రాధాదేవి,. అతడు శ్రీకృష్ణపరమాత్మ. ...............
*యముడు చెప్పిన మరికొన్ని విశేషాలు.........
వాయువు సముద్రాన్ని మోసినా, సముద్రం కూర్మాన్ని మోసినా, కూర్మం అనంతుణ్ణి మోసినా ,అనంతుడు ధరణిని మోసినా, ధరణి రత్నరాశులనూ సముద్రాలనూ పర్వతాలనూ సకల చరాచర ప్రాణికోటినీ ఓర్పుతో భరిస్తున్నా - ఇదంతా పరమాత్ముని ఆజ్ఞయే.
*యమధర్మరాజు ప్రళయం గురించి చెప్పిన మరి కొన్ని విషయాలు ..........................
వైకుంఠంలో క్షీరసముద్రమధ్యాన శేషతల్పం మీద శయనించే చతుర్భుజ నారాయణుడు సైతం శ్రీకృష్ణపరమాత్ముని వామపార్శ్వంలో లీనమవుతాడు............అనీ,
ఇంకా........
* ఇలా ప్రళయం సంభవించినప్పుడు సమస్తమూ శ్రీకృష్ణుడిలో లీనమైతే శ్రీకృష్ణుడు ప్రకృతిలో లీనమవుతాడు. ఒక్కటే పరాశక్తి. ఒక్కడే పరాత్పరుడు నిర్గుణుడు. అగ్ర అసీత్ అని వేదాలు చెప్పేది ఇదే. అవ్యక్త మూల ప్రకృతి . అవ్యాకృత పదవాచ్య. చిదభిన్న. ప్రళయంలో తానే మిగులుతుంది. ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవరి వల్లా కాదు .........అని ఇంకా ఎన్నో విషయాలను యముడు సావిత్రికి చెప్పటం జరిగింది.
...............................
ఒకసారి బ్రహ్మ, విష్ణువులు తామే గొప్ప అని భావించిన సందర్భంలో ఒక మహా లింగాకారం వారి మధ్యన ఆవిర్భవించిన కధ మనకు తెలుసు. అప్పుడు విష్ణుమూర్తి వేరొక ఆకారం ధరించి లింగాకారం యొక్క వేరొకకొస కనుగొనాలని ప్రయత్నించారు అని కొందరు అంటారు. . అప్పుడు ధరించిన అవతారం కూడా వరాహావతారం లాంటిదేనో నాకు తెలియదు.
* అయితే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లింగాకారము యొక్క ఆది అంతము కనుగొనే సమయంలో ....... వారు వేరొక విధమైన ఆకారములు ధరించారని "శ్రీ దేవీ భాగవతము "లో వివరించబడలేదు. .
...............................
*బ్రహ్మమానసపుత్రుడైన స్వాయంభువ మనువు తన తండ్రియైన బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం మహాదేవిని ఆరాధించి ప్రజలను సృష్టించే శక్తిని పొందారట.
అచ్చుతప్పులు గానీ ఇతరత్రా పొరపాట్లు గానీ ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..

No comments:
Post a Comment