* శ్రీపాదశ్రీవల్లభస్వామివారు, శ్రీ వరాహస్వామి వారి అవతారం గురించి చెప్పిన రకం జాతి జీవుల గురించి, ఈ టపా వ్రాసిన తరువాత మళ్ళీ అంతర్జాలంలో స్పష్టంగా చూస్తే.... ఆ జీవులకు ఒకే కోర ఉంటుంది. ఇంకా, ఆ జాతిలోని కొన్ని రకాలకు రెండుకోరలు కూడా ఉండే అవకాశం ఉంది.అనీ ,
ఇంకా అడవిజాతికి చెందిన వరాహాల గురించి అంతర్జాలంలో వ్రాసినది చూస్తే ...... వాటిలో పురుషజాతివరాహాలకు పెద్దకోరలు ఉంటాయనీ, స్త్రీజాతివరాహాలకు చిన్నవైన కోరలుంటాయని నాకు అర్ధమయింది మరి. ..
* చాలా,మంది భావిస్తున్నట్లు అడవిలో తిరిగే వరాహాలకు ఒక్కటే కోర ఉండటం జరగదు కదా !. వాటికి నోటికి ఇరుప్రక్కలా రెండు కోరలు ఉంటాయి.
* వరాహావతారం శ్రీపాదశ్రీవల్లభస్వామివారు చెప్పిన జీవజాతికి సంబంధించినదే .
.................
శ్రీ వరాహస్వామివారి అవతారం గురించి కొన్ని వివరాలు ......... క్రిందటి టపాలో వ్రాశాను కదండి. ...
." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో .........
వరాహస్వామి భూదేవిని సముద్రంలోనుంచీ పైకి తీసుకువస్తున్న సందర్భాన్ని గురించి ఒక దగ్గర ఇలా ఉంది..........
" ఒక పద్మాన్ని కోరమీద నిలబెట్టిన దిగ్గజం లాగా భాసించాడు.ఆదివరాహమూర్తియైన ఆ యజ్ఞేశుడూ యజ్ఞపూరుషుడూ "..... అని వర్ణించబడింది...అంటే " ఒకే కోర " .అన్నమాట.
అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు.
అని కొన్ని వివరాలు ,
............ఇంకా.......,
ఈ వసుంధర ( భూదేవి ) వరాహావతారము సమయంలో వారాహిగా అర్చింపబడిందట.
" శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో ....
శుంభనిశుంభుల వధ గురించి చదివితే ఒక దగ్గర ...... శుంభనిశుంభులతో యుద్ధం జరిగిన సందర్భంలో .....వారాహీ దేవికి కోరలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది.
మా ఇంట్లో ....ఇద్దరు రచయితలు వచనరూపంలో అందించిన .... "శ్రీ దేవీ భాగవతము " గ్రంధములు రెండు ఉన్నాయండి.
౧. ఒక దగ్గరేమో ....నారసింహి నఖాగ్రాలతోనూ, వారాహి ముట్టెతోనూ దానవుల శరీరాల్ని చీల్చివేశారు...అని ఉంది.
2 .ఇంకొకరు అందించిన గ్రంధములో ...... వారాహీ దంష్ట్రాలకు రానురాను పదును పెరిగింది. ....అనీ అలా ఉంది.
*మరి ." శ్రీ దేవీ భాగవతము " గ్రంధములో వరాహస్వామి గురించి.......
గజరాజు తొండంతో కమలాన్ని ఎత్తినట్లు......తన దంష్ట్రాగ్రంతో భూదేవిని పైకి ఎత్తాడు...అని ఉంది కదా !
ఇవన్నీ చదివిన తరువాత నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి.
* నాకు ఏమనిపిస్తోందంటే సృష్టిలో స్త్రీ పురుష జాతి జీవులకు శరీరనిర్మాణంలో తేడాలుంటాయి కదా!
అలాగే వరాహస్వామికి పెద్దగా ఒక కోర ఉంటే వారాహీదేవికి రెండు కోరలున్నాయేమో ? అనిపించింది. ( పొరపాటైతే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. )
వరాహస్వామి అవతారం చాలా కాలం క్రితం జరిగింది కదా ! ఇప్పుడున్న అలాంటి జీవులలో , స్త్రీజాతి జీవులలో కొన్ని మార్పులు జరిగి కూడా ఉండవచ్చేమో ? అనికూడా అనుకున్నాను.
ఇదంతా చదువుతున్న వారికి అసలు వరాహస్వామి ధరించినది ఏ జీవి రూపం అన్నది స్పష్టంగా తెలుసుకోవాలంటే ....... దీనికి సమాధానం " శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి " వారే చెప్పటం జరిగింది.
" శ్రీ పాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము " అన్న గ్రంధములోని 7 వ అధ్యాయములో 61 వ పేజీలో ఆ వివరములు చక్కగా ఉన్నాయండి.
ఇంకా....
ఒకసారి బ్రహ్మ, విష్ణువులు తామే గొప్ప అని భావించిన సందర్భంలో ఒక మహా లింగాకారం వారి మధ్యన ఆవిర్భవించిన కధ మనకు తెలుసు.
* అయితే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లింగాకారము యొక్క ఆది ..అంతము , కనుగొనే సమయంలో ....... వారు వేరొక విధమైన ఆకారములు ధరించారని "శ్రీదేవీ భాగవతము"లోవివరించబడలేదు. .
................................................................
* ఈ టపా చదువుతున్న వారికి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానని అనిపిస్తోందా ?
మరి .. వారాహీదేవికి రెండు కోరలున్నాయని చదివాను అని ఎవరైనా అంటారేమోనని ఇలా వ్రాయటం జరిగింది.
విజ్ఞానం గురించి లోతుకు వెళ్ళేకొద్దీ ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ( ఇది ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా వర్తిస్తుంది. )
కొన్ని విషయాల్లో కొంతవరకూ ఎక్కువగా ఆలోచించటం అవసరం , కొన్ని విషయాల్లో అనవసరం . ఏది ఎంతవరకు అన్నది .... అది వారివారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తెలియకపోతే చేతనయినంతవరకూ ప్రయత్నించి , సరైన మార్గాన్ని చూపించమని దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమం...
*వ్రాసిన విషయాల్లో అచ్చుతప్పులు గానీ, ఇతరత్రా ఏమైనా పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment