వెనకటికి ఒక ఈగ ఇల్లిల్లు తిరుగుతూ తన పేరు మర్చిపోయి అందరిని అడిగిందట. బదిలీల వల్ల ఊర్లు తిరిగే మాకు మా సొంత ఊరు ఏదో దయచేసి చెబుతారా ?
...............................
* మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల లోనూ బంధువులున్నారు. మాది బదిలీలతో కూడిన ఉద్యోగము. ఈ బదిలీల వల్ల మంచీ ఉంది. చెడూ ఉందనిపిస్తుంది.
ఒకసారి బదిలీ వల్ల ఒక ప్రాంతానికి వెళ్ళాము. యధాప్రకారం చుట్టుప్రక్కల వారితో పరిచయాలు అయ్యాయి.
కొంతకాలం తర్వాత , ఒకరోజు మా పొరుగామె ఒకామె మా ఇంటికి వచ్చారు.
ఆమెతో నాకు మంచి స్నేహమే ఉంది. నాకన్నా వయసులో పెద్ద. అలా మాటల్లో ఇళ్ళ అద్దెలు, స్థలాల రేట్ల ప్రసక్తి వచ్చింది.
నేను, ఇక్కడ వాటి రేట్లు ఎలా ఉంటాయండి ? అని అడిగాను.
అంతే, అప్పటివరకు చక్కగా కబుర్లు చెబుతున్న ఆమె ఒక్కసారిగా .
* ఏం ? కొంటారా ? బదిలీపై వచ్చారు. అద్దెకుండి మీ పని అయ్యాక వెళ్ళిపొండి. అంతే. ఇక్కడ రేట్లతో మీకేం పని ? అనేసింది.
నేను ఒక్క క్షణం బిత్తర పోయి, అబ్బే నేను కొనాలని అడగలేదండి. అన్నాను.
* నిజంగానే , నేను కొనే ఉద్దేశంతో అడగలేదు. నాకు అలా విషయసేకరణ చేయటం అలవాటు.విషయ పరిజ్ఞానం పెంచుకుందామని పనీపాటా లేక అలా అడిగానంతే.
కానీ, ఆమె ముఖం మీదే అలా అనేస్తుందని అనుకోలేదు.
ఇంకొకామె ఇతరప్రాంతం వాళ్ళు తమ ప్రాంతానికి వచ్చి స్థిరపడుతున్నారని వారిని తిట్టారు.
ఇతర ప్రాంతాల నుంచీ వలసలు మితిమీరి పెరిగితే స్థానికులు ఆందోళన పడటం , వలసలవల్ల తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడటం జరుగుతుంది.
* ఈ భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందుకే ఎక్కడివాళ్ళు అక్కడే జీవించటం వల్ల ఇలాంటి గొడవలు తగ్గే అవకాశం ఉంది అనిపిస్తుంది.
సరే, అప్పుడు వాళ్ళు నాతో అలా అన్నందుకు నాకు బాధతో పాటు ఆశ్చర్యము, ఎన్నో ఆలోచనలు కూడా కలిగాయి.
* ఎందుకంటే , నన్ను అలా అడిగిన వాళ్ళ యొక్క పిల్లలు, బంధువులు .. ఇతర ప్రాంతాలలోనూ, రాష్ట్రాల్లోనూ, ఇతరదేశాల్లోనూ ఉద్యోగ, వ్యాపార రీత్యా ఉంటున్నారు.
వారు అక్కడ ఆస్తులూ కొనుక్కుంటున్నారు.
అలాంటప్పుడు ఆమె నన్ను అలా అడగటం న్యాయమా?
* కొందరు తమకొక నీతి ఇతరులకు ఒక నీతిగా ప్రవర్తిస్తుంటారు.
* మా ఊరు ఎవరూ రాకూడదు అనేవారు ఇతరుల ఊళ్ళు కూడా వెళ్ళకూడదు కదా !
* అయినా ఆమె నన్ను పరాయి ప్రాంతం వాళ్ళగా భావించింది కానీ, మాకు ఆ ప్రాంతం వారితో వివాహబంధుత్వాలు కూడా ఉన్నాయి.
* మాకు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లోనూ బంధువులు, ఆత్మీయులు ఉన్నారు.
.........................................
భార్యా భర్తలు వేరేవేరే ప్రాంతాలకు చెందిన కుటుంబాల్లో ఈ స్థానికత అనే విషయాలపై అపార్ధాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
.............................
* విదేశాలకు వెళ్తే స్థానికులు .. వలసదారులు అనే తేడా ఉందంటే ఆశ్చర్యం అనిపించదు. స్వదేశంలోనే వలసదారులు.. దోపిడిదారులు.. అంటుంటే ఎంతో అవమానంగా, బాధగా ఉంది.

* స్థానికులు..వలసవాదులు ... అంటూ ఉద్యమాలు చేస్తున్న స్టూడెంట్స్ భవిష్యత్తులో ఉద్యోగాలు , వ్యాపారాలు కొరకు ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్ళకుండా ఉంటారా ?
బదిలీలవల్ల మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది.
............................
* మేధావులు ఇవన్నీ ఆలోచించి కొన్ని ఊళ్ళు ఒక ప్రాంతంగా నిర్ణయించి ( జోనల్ సిస్టం లా )..ఇక అక్కడి వాళ్ళు బయటికి పోకుండా అక్కడనే జీవించేటట్లూ ఉపాధి అవకాశాలు కల్పించాలి.
బదిలీలు కూడా ఆ పరిధిలోని ఊళ్ళలోనే జరగాలి.
* ఇదంతా సంకుచితతత్వం అంటే నేనేమీ చెప్పలేను. గొడవలు రాకుండా ఉంటాయని ఇలా చెబుతున్నాను.
బదిలీల ఉద్యోగాలు చేసేవారు ఆస్తిపాస్తులను కొనుక్కోవాలన్నా ఎక్కడ కొనాలనే సమస్య ఎదురవుతుంది.
* ఇది మన రాష్ట్రం అనుకునేంతలో మీ రాష్ట్రం కాదంటున్నారు. మన ప్రాంతం అనుకుంటే మీ ప్రాంతం కాదంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో స్థానికత గురించి అయోమయంగా ఉంటుంది .
..........................
* స్థానికతను భాష ఆధారంగా కూడా నిర్ణయిస్తారని ఇంతకుముందు అనుకునేవారం. ఒకే భాష వాళ్ళ మధ్య కూడా స్థానికులు..వలసవాదులు అనే తేడాలు వచ్చిన ప్రస్తుత పరిస్థితిలో అసలు స్థానికత అంటే ఏమిటో తెలియటం లేదు.
* చదివిన ప్రాంతం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తారని కొందరు అంటున్నారు.
అలా అయితే, బదిలీల వల్ల ఒకే ఇంట్లోని కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాల్లో చదివితే .... ఒకే ఇంట్లో కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాలకు చెందే అవకాశం ఉంది కదా !
ఏమిటో..స్థానికత విషయం ప్రస్తుత పరిస్థితిలో గందరగోళంగా ఉంది .
.............................
* మేము ఇక్కడ స్థానికులం అని మనము, మన తరువాతి తరాల వాళ్లు కూడా చెప్పుకుని ప్రశాంతంగా జీవించాలంటే అసలు స్థానికత అనేది ఎలా నిర్ణయిస్తారో తెలియాలి.
* స్థానికత అనే విషయం గురించి మేధావులు గట్టిగా ఆలోచించి దయచేసి తెలియజేయండి .
మీరు మేథావులను సలహా అడుగుతున్నారా?
ReplyDeleteసరిపోయింది!
మన దేశంలో మేథావి అంటే రాజకీయగాలివాటం తెలిసి తదనుగుణంగా సిధ్ధాంతాలు వండి వడ్డించేవాడు అన్నది అందరికీ తెలుసును గదా? అలాంటప్పుడు వాళ్ళను అడిగితే పనుకోచ్చే ముక్కలకన్నా పుల్లలు పెట్టే మాటలు వినిపిస్తారని గహించండి దయచేసి.
మీ వ్యాసం బాగుంది. ఇలాంటి అనుమానం అనేకులకు ఉండవచ్చును.
పొరుగుదేశం వెడితే స్థానికత సమస్య.
పొరుగురాష్ట్రానికి పోతే స్థానికత సమస్య.
పొరూ జుల్లాకు వెళ్ళినా స్థానికత సమస్య.
పొరుగు తాలుకాకు పోయినా స్థానికత సమస్య.
పొరుగు ఊరికి పోయినా స్థానికత సమస్య.
మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన జిల్లా లోనే మన తాలూకాలోనే, మన ఊళ్ళొనే ఉంటే స్థానికత సమస్య ఉండదు కదా!?
ఆగండాగండి.
మన ఊళ్ళోనే ప్రక్క పేటకు పోయినా, చివరికి మన పేటలోనే ప్రక్కవీధికి మారినా స్థానికత సమస్య అన్నమాట వచ్చే రోజులొచ్చాయి!
మన పరిధుల్ని మనం కుంచుంచుకుంటూ అభివృధ్ధి చెందుతున్నామన్న మాట!
( అక్కగారు తమ్ముడితో అంటోంది. ఒరేయ్ నా గదిలోకి ఎందుకువ వచ్చావ్. నీ గదిలోనే ఏడు. నాగదిలో నీ వస్తువులు పెట్టుకోవటం ద్వారా దాన్ని మెల్లగా ఆక్రమిద్దామనుకుంటే కుదరదు. ఆయ్ఁ ")
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteబాగా చెప్పారు. నిజమేనండి,
టెక్నాలజి వల్ల ప్రపంచం కుగ్రామం అయిపోయింది అని కొందరు అంటున్నారు కానీ,
ఇప్పటి మానవ సంబంధాలలో స్నేహం, ఆప్యాయత, సర్దుబాటు ధోరణి తగ్గిపోతోందనిపిస్తోంది.
స్థానికత చట్టపరంగా రెండో విషయాలలో వర్తిస్తుంది: ప్రభుత్వ విద్యాసంస్థలలో చేరిక & ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు. నిర్వచనం కావాలంటే 1975 రాష్ట్రపతి ఉత్తర్వులో దొరకుతుంది.
ReplyDeleteఇకపోతే నేను ఎక్కడున్నా ఆ వాతావరణంలో పూర్తిగా కలిసిపోతాను అనే మనస్తత్వం ఉంటె ఎ ఇబ్బందులు రావు. కాదు నేను నా పద్దతిలో (నేను పుట్టిపెరిగిన ఊరిలో ఉండే పద్దతిలో) ఉంటాననుకున్న వారు తమ స్వగ్రామం తప్ప ఎక్కడికి వెళ్ళినా ఇమడలేరు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను.
నాకు తెలిసినంతలో , ఒక విద్యార్ధి చదివిన ప్రాంతాన్ని బట్టి కూడా స్థానికతను నిర్ధారిస్తారకుంటున్నాను. 5 సంవత్సరాలు ఒక జోన్లో చదివితే ఎం సెట్ వంటి పరీక్షలు వ్రాయటానికి లోకల్ కేటగిరీకి చెందుతారంటున్నారు.
తల్లితండ్రుల బదిలీల వల్ల పిల్లలను వేరే దగ్గర చదివిస్తే లోకల్...నాన్ లోకల్ అంటూ కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ సరిగ్గా అర్ధం కాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
తమిళనాడులో ఈ బాధ లేదని అంటున్నారు. తమిళులు అయితే చాలు దేశంలో ఎక్కడ చదువుకున్నా వారు తమిళనాడులో లోకల్ కేటగిరీలోకే వస్తారట.
ఒకే రాష్ట్రంలో లోకల్...నాన్ లోకల్ గొడవలన్నీ తెలుగు వాళ్ళకే ఉన్నాయేమో ? మనలో మనకు ఐకమత్యం తక్కువ ... విభేదాలు ఎక్కువ కదా !
* చదివిన ప్రాంతం ఆధారంగా స్థానికత నిర్ణయిస్తే, బదిలీల వల్ల ఒకే ఇంట్లోని పిల్లలు వేరేవేరే ప్రాంతాల్లో చదివితే .... ఒకే ఇంట్లో కుటుంబసభ్యులు వేరేవేరే ప్రాంతాలకు చెందే అవకాశం ఉంది కదా !
ఇబ్బందులు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. మనుషుల మధ్య స్వార్ధం పెరిగినా ఇబ్బందులు వస్తాయి. ఇతరులతో కలిసిమెలసి ఉండాలని ఉన్నా అవతలి వాళ్ళు ఒప్పుకోవాలి కదా !
Deleteమన భారతీయులు విదేశాలకు వెళ్తే భారతీయ సంస్కృతిని వదిలేసి పాశ్చాత్య సంస్కృతి అవలంబించాలని మీ ఉద్దేశమా ?
నాకు తెలిసి దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వరంగ విద్య & ఉపాధి రంగాలలో ప్రవేశానికి నియమాలు ఉన్నాయి. భాష లేదా మూలాలు పరిగిణిలో తీసుకోవడం కుదరదు కాబట్టి నివాస పరిమితి తప్పని సరి.
Deleteఅయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (మీరు తెలుగు వారిలో అన్నారు, ఇవి సమాంతర పదాలు కావు) ఉన్న ప్రత్యేకతలు రెండు: 1. జోనల్ వ్యవస్థ; 2. నాన్ లోకల్ వ్యక్తులకు కూడా ప్రవేశం ఉండడం.
వీటి వెనకాల ఎన్నో చారిత్రిక విషయాలు ఉన్నాయి.
విదేశాలకు (లేదా పరప్రాంతం) వెళ్ళిన వారికి రెండు ఆప్షన్సు ఉంటాయి. మొదటిది అక్కడి సంస్కృతితో మమేకం కావడం, రెండు తన పాత పద్దతులను పట్టుకొని ఉండడం. ఏమి చేస్తారన్నది వారివారి సొంత నిర్ణయం. అయితే స్థానిక సంస్కృతిని పూర్తిగా తిరస్కరిస్తే (లేదా తూలనాడితే) వచ్చే కష్టనష్టాలు స్వయంక్రుతమేనని గుర్తించాలి.
Deleteఇక స్వార్ధం అంటారా, అది అన్ని వైపులా ఉంటుంది. మేమే మంచివారిమని, "స్థానికులు" దుర్మార్గులు (లేదా మూర్ఖులు, సొంబెరులు వగైరా) అనుకోవడం మనకే మంచిది కాదు.
Deleteఅపార్ధాలు, విభేదాలు రావటానికి వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. అవి ఏమిటో మనకు తెలిసినవే.
లోకల్..నాన్ లోకల్ వల్ల మాకూ కొన్ని సమస్యలు వచ్చాయి. మాకు ఇద్దరు పిల్లలు. మా బదిలీ వల్ల మా పిల్లలు చెన్నైలో చదివారు.
ReplyDeleteఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ వ్రాయించటానికి తీసుకు వస్తే మేము నాన్..లోకల్ కేటగిరీకి చెందుతామన్నారు.
అదేమిటండి మేము తెలుగువాళ్ళమే కదా ! సొంత రాష్ట్రంలో మేము నాన్..లోకల్ అంటారేమిటి ? అని అడిగితే ..
ఇతర రాష్ట్రాలలో చదివిన వాళ్ళు ఇక్కడ నాన్..లోకల్ కేటగిరీకి చెందుతారన్నారు. నాన్..లోకల్ కోటాలో తక్కువ సీట్లే ఉంటాయి.
ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని చెన్నై నుంచి కేరళ లేక నార్త్ ఇండియాకు ట్రాన్స్ ఫర్ చేస్తామని అన్నారు.
మా పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో లోకల్ అవ్వాలని మాకు కోరిక. అందుకని మేము రెండో వాళ్ళ విషయంలో జాగ్రత్తపడి పై అధికారులను బ్రతిమలాడి ఆంధ్రప్రదేశ్ బదిలీ చేయించుకుని వచ్చాము.
ఇక్కడ చూస్తే రాయలసీమ లో చదివిన పిల్లలు కోస్తా, తెలంగాణాలో నాన్ లోకల్స్, అక్కడ చదివిన వాళ్ళు ఇంకొక దగ్గర నాన్..లోకల్ అంటూ ఎన్నో గొడవలు ఉన్నాయి .
"నాన్..లోకల్ కోటాలో తక్కువ సీట్లే ఉంటాయి"
ReplyDeleteనాన్ లోకల్ కోటా అంటూ ఏమీ లేదండీ. స్థానికులకు కేటాయించిన సీట్లు ముగిసాక మిగిలిన వాటికి స్థానికులు & స్థానికేతరులు అందరూ పోటీ పడతారు.
ఈ తేడా తెలియకనో లేదా కావాలనో అనేకమంది ఆఫీసర్లు నాన్ లోకల్ కోటా అంటూ అర్హత లేని వారికి కొలువులు ఇచ్చారని తెలుస్తుంది. ప్రభుత్వ విధానం నచ్చినా నచ్చకపోయినా పాటించాలి కానీ ఇలా దొడ్డి దారిన అసమదీయులకు కట్టపెట్టడం తప్పు కదా.
ఏది ఏమయినా అడ్మిషన్ అర్హత లేని వారికి కూడా కొద్దో గొప్పో అవకాశం నాకు తెలిసి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
Deleteమన రాష్ట్రంలో ప్రాంతాల మధ్య కోటాలు ఉన్నాయండి.
లోకల్ కోటా ఉంటే నాన్ లోకల్ కోటా ఉన్నట్లే కదా !
ఉదా.. ఎం సెట్ వంటి పరీక్షల విషయంలో స్థానికులకు 85% సీట్లు కేటాయిస్తే, స్థానికేతరులకు 15% సీట్లు కేటాయిస్తారని అంటారు. ( నాకు తెలిసినంతలో ).