ఓం
వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి సందర్భముగా శుభాకాంక్షలు.
వాసవి కన్యకా పరమేశ్వరీదేవినగరేశ్వర స్వామి వార్లకు వందనములు.
అనఘాదేవీదత్తాత్రేయస్వామివార్లకు వందనములు
శ్రీ పాద శ్రీ వల్లభస్వామి వారికి వందనములు.
శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము .... గ్రంధములో వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి గురించి అనేక వివరములున్నాయి.
.........................................
ఇంతకుముందు ఒక టపాలో దైవానికి ఆది, అంతము లేవు ...అనే విషయం గురించి చెప్పుకున్నాము.
ఆండాళ్ అమ్మవారి చరిత్ర ( శ్రీ గోదాదేవి శ్రీ రంగనాధుల కల్యాణం ) సినిమా ద్వారా తెలుసుకున్న కొన్ని విషయములు....
ఒక రాజుగారు నాస్తికులు.
ఆ రాజు , ఆస్తికులను ......... దైవం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు.
సృష్టికర్త అయిన దైవాని కంటే ముందు ఏమున్నది ? అనే అర్ధం వచ్చేటట్లు ప్రశ్న అడుగుతారు.
అప్పుడు , ఆండాళ్ మాతకు తండ్రి అయిన విష్ణుచిత్తుల వారు రాజుతో ... ఒకటి అనే అంకెకు ముందు ఉన్న అంకె పేరు చెప్పమంటారు.
అప్పుడు రాజు చెప్పలేకపోతారు. ( ఒకటి అనే అంకెకు ముందు ఏ అంకె లేదు కదా ! )
............................................
విష్ణుచిత్తులవారు చెప్పిన విషయాన్ని గమనిస్తే, మనకేం తెలుస్తుందంటే, నిజమే. ఒకటి అనే అంకెకు ముందు ఏ అంకె లేదు.
అలాగే, సంఖ్యలలో ఆఖరి సంఖ్య ఏది ? అనే ప్రశ్నకు కూడా మనకు జవాబు తెలియదు.
ఎందుకంటే, సంఖ్యలను అలా లెక్కవేసుకుంటూ వెళ్తే ఒకదానితరువాత ఒకటి అంతం లేకుండా అలా వస్తూనే ఉంటాయి కదా !
ఇదంతాగమనిస్తే, 1,2,3,4,...అనే వాటికి ఆది, అంతమూ అనేవి లేవు . అని మనకు తెలుస్తుంది.
అలాగే , దైవానికి ఆది, అంతమూ అనేవి లేవు . అని కూడా మనకు తెలుస్తుంది.
ఆది, అంతమూ లేక అంతటా వ్యాపించి ఉన్న శక్తినే దైవమని ఆరాధిస్తారు. ఆస్తికులు.
....................................
" Matter and energy cannot be created or destroyed " సిద్ధాంతం ప్రకారం ............
మంచు గడ్డ నీరులా మారుతుంది. నీరు ఎండ వేడికి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారి వర్షంలా కురుస్తుంది...... అని ఆధునిక శాస్త్రవేత్తలు తెలియజేసారు.
అయితే " Matter and energy cannot be created or destroyed " సిద్ధాంతం ప్రకారం జీవులు ఏమవుతారో .. ఆదునిక శాస్త్రవేత్తలు చెప్పలేదు.
అయితే ఈ విషయాల గురించి ప్రాచీనులు చక్కగా తెలియజేసారు.
ప్రాచీనులు తెలియజేసిన ...." కర్మలను బట్టి " జన్మపరంపర విధానాన్ని " "Matter and energy cannot be created or destroyed "..... ప్రకారం అన్వయించి చూస్తే జన్మలు, పునర్జన్మలు ఉండే మాట వాస్తవమే అని తెలుస్తుంది .
ఉదాహరణకు... ఎవరైనా వ్యక్తి యొక్క జీవితం ముగిసినప్పుడు , పంచభూతాలతో తయారైన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది.
జీవించి ఉన్నప్పుడు మనిషి మనస్సుతో ఎన్నో ఆలోచనలు ( పనులు ) చేస్తాడు. అంటే, మనస్సు కూడా శక్తే కదా !....
మరణించిన వ్యక్తి యొక్క మనస్సు ( ఆత్మ ) మరో శరీరాన్ని ధరిస్తుంది. మరో జన్మనెత్తుతుంది.
పరమాత్మను చేరేవరకూ (మోక్షాన్ని పొందేవరకూ) ఈ జన్మపరంపర .... కొనసాగుతుంది.
ఇవన్నీ గమనిస్తే , ప్రాచీనులు చెప్పినట్లు జన్మలు, పునర్జన్మలు ఉన్నాయన్నది పరమసత్యం . అని తెలుస్తుంది.
జన్మలు, పునర్జన్మలు ఉన్నప్పుడు , జీవికి తాను చేసిన పూర్వకర్మల ఆధారంగా భవిష్యజన్మ ఉంటుంది. ఈ విధంగా జీవులు జననమరణచక్రంలో పరిభ్రమిస్తుంటారు.
సృష్టిలో ప్రతి చర్యకూ ప్రతి చర్య ఉంటుందని అంటారు. అంటే మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు చెడ్డపనులు చేస్తే చెడ్డఫలితాలు లభిస్తాయి.
మనం చేసే ప్రతిపని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
వివేకానందుల వారు చెప్పినట్లు మన భవితకు మనమే బాధ్యులం.
అందువల్ల చెడ్డపనులను చేయకుండా జాగ్రత్తగా జీవించటానికి ప్రయత్నించాలి.
.....................................
పాత టపాలను చూడాలనుకుంటే ఈ లంకెల ప్రకారం చూడగలరు......
దైవానికి ఆది, అంతము లేవు ....ఒక ఉదాహరణ.
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

".Matter and energy cannot be created or destroyed...
వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment