ఓం
శిరిడి సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధము ద్వారా తెలుసుకున్న కొన్ని విషయములు ...
దాము అన్నా( సాయి భక్తుడు )
ఒక బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్తుడుగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు, నెంతమాత్రము ప్రమాదకరము కాదనియు , గనుక అవకాశము పోగొట్టకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్నా యా బేరమును చేయుటయా ? మానుటయా ? యను నాందోళనలో పడెను.
జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. . దాని గూర్చి బాగుగా ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము వ్రాసి బాబానడిగి వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందర బెట్టెను. .................
బాబా యిట్లనెను. ఏమి వ్రాయుచున్నాడు ? ఏమి యెత్తు వేయుచున్నాడు ? భగవంతు డిచ్చినదానితో సంతుష్టిజెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము..
బాబా చెప్పినదే ఆ యుత్తరములో గల సమాచారమని , ...ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదవమని బలవంతపెట్టుచున్నావు ? అని శ్యామా అనెను.

అయినప్పటికి , బాబా శ్యామాను ఉత్తరమును చదవమనగా....
అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను...........
బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. , సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తన కున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామా జవాబును పంపెను..........
దాము అన్నా స్వయముగా శిరిడీకి వెళ్ళెను.
అతనికి బాబాను బహిరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబా కిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను.
బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతినున్న యుసిరికాయ వలె భూతభవిష్యత్వర్తమానములు కూడ బాబా తెలిసినవారు.
బిడ్దకు తీపివస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్రలు ఆరోగ్యమును వృద్ధిచేయును. తల్లి తన బిడ్డయొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును.
బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భూత భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్నా మనస్సును కనిపెట్టి బాబా యిట్లనెను. ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు.
బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.
ధాన్యముల బేరము.
పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగువాని వ్యాపారము చేయతలపెట్టెను. ఈ యాలోచన కూడ బాబా గ్రహించి యిట్లనెను.
నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి ఉంటుంది. కనుక నీ వ్యాపారము కూడ మానుకొనుమనెను.
కొన్నాళ్ళ వరకూ ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కానీ యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యము నిలువచేసిన వారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను.
ప్రత్తిజట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్పనష్టము వచ్చెను.
బాబా తనను రెండుసార్లు గొప్పనష్టముల నుండి తప్పించెనని , దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను.
.....................................
ఇవన్నీ గమనించితే నాకు ఏమనిపించిందంటే, వ్యాపారములో తగినంతమేరకు లాభాలను పొందటం వరకూ ఫరవాలేదు కానీ, అత్యాశతో అత్యధిక స్థాయిలో లాభాలను ఆశించటం మంచి పద్ధతి కాదు . అనిపించింది. ...... ఇలాంటివి దైవానికి ఇష్టం ఉండవు. అనిపించింది.
సమాజంలో అందరూ బాగుండాలి కదా ! అయితే, కొందరు వ్యాపారస్తులు , అధికలాభాల కొరకు కల్తీ చేసిన సరుకులను అమ్ముతుంటారు. కొందరు వ్యాపారస్తులు , అత్యాశతో అత్యధిక లాభాల కొరకు రైతుల వద్ద అతి చవకగా పంటలను కొని అతి ఎక్కువ రేట్లకు వినియోగదారులకు అమ్ముతారు. ఇందువల్ల అటు రైతులు ఇటు వినియోగదారులు నష్టపోతారు.... ఇలాంటివి దైవానికి ఇష్టం ఉండవు అనిపించింది.
దైవానికి నచ్చినట్లు జీవించినవారికి మంచి జరుగుతుంది అనిపించింది.
............................
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.

మీ పోస్ట్ బావుంది , మంచి baba collection ,
ReplyDeleteధన్యవాదాలు
http://www.techwaves4u.blogspot.in
తెలుగు లో టెక్నికల్ బ్లాగు
మీవ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeletehttp://www.techwaves4u.blogspot.in ద్వారా మీరు చక్కటి విషయములను తెలియజేస్తున్నారు.
Good collection
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteమీ వ్యాఖ్యను ఇప్పుడే చూసానండి..
. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.