koodali

Friday, May 3, 2013

మనస్సును నిగ్రహించుకోలేకపోతే....

  శరీరానికి   ఏదైనా  గాయం   లేక  కురుపు  వచ్చి   నయమయే  సమయంలో  బాగా   దురదగా  అనిపిస్తుంది.   గోకాలనిపిస్తుంది.  

గోకితే    కురుపు    పెద్దదవుతుందని ,   గోకవద్దని  పెద్దలు  హెచ్చరిస్తారు.

 పెద్దవాళ్ళ  మాట   వినకుండా  గోకటం  మొదలుపెడితే  మొదట  ఉపశమనంగానే  అనిపిస్తుంది.  

 కొంచెం  సేపటికి  అసలు  కధ   మొదలవుతుంది. 


  విపరీతమైన  మంట, నొప్పి.  గాయం  రేగి  రక్తం  కూడా  రావచ్చు.  

అప్పుడు  తెలిసివస్తుంది..పెద్దవాళ్ళు  ఎందుకు  హెచ్చరించారో.....

....................................

గాయం  మానేవరకు   కొంచెం  ఓర్పుతో  మనస్సును  నిగ్రహించుకుంటే  గాయం  త్వరగా  మానిపోతుంది. 


 అలా  కాకుండా   గోకటం  వల్ల  గాయం  తిరగబెట్టి  మళ్ళీ  కధ  మొదలుకు వస్తుంది.

 ఈ సారి  పుండు  త్వరగా  మానకపోవచ్చు    సెప్టిక్  కాకుండా  ఇంజక్షన్  కూడా  తీసుకోవలసి   రావచ్చు.

 ..............................................

జీవితంలో  కూడా  అంతే.  మనకు  హాని  కలిగించే  విషయాలు  ఎక్కువ  ఆకర్షణీయంగా  అనిపిస్తాయి.

 వ్యసనాలు  మొదలైనవి   ఆకర్షణీయంగా  కనిపించి  అలవాటయ్యాక   మనిషిని  పీల్చి  పిప్పి  చేస్తాయి.  అధోగతికి  తీసుకువెళతాయి.

...................................

  
హాని  కలిగించే  విషయాల  పట్ల  మనస్సును  నిగ్రహించుకుంటే  సుఖంగా  ఉండగలము.

మనస్సును  నిగ్రహించుకోలేకపోతే  ఎన్నో  కష్టాలు    ఎదురయ్యే  అవకాశం  ఉంది. 


 మనసును  నిగ్రహించుకోవటం  కష్టమే.

మనస్సును  నిగ్రహించుకునే  శక్తి  లేకపోతే  ఆ  శక్తిని  ఇవ్వమని  దైవాన్ని  ప్రార్ధించాలి.




4 comments:

  1. మనసు అదుపులో ఉంటే గొడవేముందండీ! శంకరులు, నువ్వు బిచ్చగాడివి కదా నా మనసనే కోతిని తీసుకుపోవయ్యా అని శివుని వేడుతారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీ వ్యాఖ్యను ఈ రోజే చూసాను. పనివత్తిడి వల్ల ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      నిజమేనండి, మనసు అదుపులో ఉంటే గొడవే ఉండదు.

      మన మనస్సు మన మాట వినకపోవటమేమిటో .... ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

      మన మనస్సు మన మాట వినాలంటే , సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నిస్తూ దైవానుగ్రహాన్ని పొందాలంటారు.

      Delete
  2. manchi vishanni meere vivarinchi cheparu thanks.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీ వ్యాఖ్యను ఈ రోజే చూసాను. పనివత్తిడి వల్ల ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      Delete