ఒక దగ్గరనుంచి ఇంకొక దగ్గరికి వాహనాలలో తరలించే పశువులను చాలామంది చూసే ఉంటారు. కొద్ది స్థలంలో ఎక్కువ సంఖ్యలో పశువులను కుక్కి తరలించేటప్పుడు కొన్నిసార్లు ఆ ఇరుకు వల్ల తల తిప్పటానికి కూడా వాటికి అవకాశం ఉండదు .
ఇలా ప్రయాణం చెయ్యాలంటే ఎంతో ఇబ్బంది . వాటికి ఇబ్బందిగా ఉంటుందని తెలిసినా అలాగే కుక్కి పంపిస్తుంటారు.
ఇలాంటి ప్రయాణాలలో వాటికి దాహం వేసినా, ఆకలి వేసినా వెంటనే నీళ్ళు త్రాగటానికి ఏర్పాట్లు అవీ ఉంటాయా ? పాపం అవి తమ బాధలను, ఇబ్బందులను చెప్పుకోలేని మూగ జీవులు .
వాటికి తమ హక్కుల గురించి పోరాడటం చేతకాదు కదా ! అందువల్ల అలా బాధలు పడుతుంటాయి.
..........................
మనుషులయితే ఒక ఊరి నుంచి ఇంకో ఊరు ప్రయాణించాలంటే ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణించే వాహనంలో ఏసి సౌకర్యం ఉందా ? లేదా ? ట్రైన్ అయితే పై బెర్తా ? క్రింద బెర్తా ? మధ్యలో బెర్తా ? కూర్చుని వెళ్తే కిటికీ ప్రక్కన సీట్ దొరుకుతుందో లేదో ?
వాహనంలో వీడియో సౌకర్యం ఉందా ? లేదా ? ఇలా ఎన్నో ఆలోచిస్తాము.
ప్రయాణం మధ్యలో త్రాగటానికి, తినటానికి రకరకాల ఫలహారాలు, పానీయాలు.....ఇలా ఎన్నో సౌకర్యాలను ఏర్పాటుచేసుకుంటాము.
.................
బలవంతులు బలహీనులను పీడిస్తున్నారని హక్కుల కోసం ఉద్యమిస్తుంటాము. మరి మూగజీవులైన పశుపక్ష్యాదుల పట్ల ఎంతమంది మానవులు దయగా ప్రవర్తిస్తున్నారు ?
మానవజన్మ ఎంతో గొప్పది. మన అభిప్రాయాలను ఇతరులతో చెప్పుకోగలం. ఇంకా ఎన్నో సౌకర్యాలను పొందగలం. ఇవన్నీ చేతకాని పశుపక్ష్యాదుల పట్ల మానవులు దయగా ప్రవర్తించాలి.
తోటి మానవుడిపై దయ చూపించలేని వారు ఇక పశువులపై ఎలా చూపిస్తారు.జీవ కారుణ్యం మానవ ధర్మం.
ReplyDelete
Deleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
మీరన్నది నిజమే. తోటి మానవుడిపై దయ చూపించలేని వారు ఇక పశువులపై ఎలా చూపిస్తారు.జీవ కారుణ్యం మానవ ధర్మం.
మీరు అన్నది నిజం అండి ...
ReplyDeleteమనకి వీలున్నంతవరకు చెప్తూ ఉంటె ఒకనాటికి ఒక్కరు అయినా అర్ధం చేసుకుంటారు
మీకు కుదిరితే మా బృందావనం ఒకసారి చూసి మీ అభిప్రాయలు తెలియచేయండి
kallurisailabala గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ వ్యాఖ్యను ఈ రోజే చూశాను. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.
బృందావనం తప్పకుండా చూస్తానండి.