....................
ఓం
శ్రీ శంకర జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.
......................................................
పాపాలు చేసిన వాళ్ళు పాపపరిహారం చేసుకున్నంత మాత్రాన పాపఫలితాలు అనుభవించనక్కరలేదా ?
ఈ విషయాల గురించి తోచినంతలో ఏమనిపిస్తుందంటే......
నిజమే పాపపరిహారం చేసుకోవటం ద్వారా పూర్వ పాపఫలితాలను తగ్గించుకోవటం, నిర్మూలించుకోవటం సాధ్యమే.
అయితే చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెంది, వర్తమానంలో పాపకర్మలను చేయటం మాని , సత్కర్మలను ఆచరిస్తూ .. పరిహారం చేసుకోవటం ద్వారా పాపకర్మఫలితాన్ని తగ్గించుకోవటం, నిర్మూలించుకునే అవకాశం ఉందంటారు.
తెలిసోతెలియకో పాపాలు చేసిన తరువాత పశ్చాత్తాపపడితే , పడే శిక్ష తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా పాపాలు చేస్తూనే ప్రాయశ్చిత్తంగా పరిహారక్రియలను చేసేవారి అతితెలివిని దైవం చూస్తూ ఊరుకోరు.
పూర్వం హిరణ్యకశిపుడు వంటి ఎందరో రాక్షసులు తపస్సులు చేసి వరాలను పొందారు. (వరాలను కోరుకోవటంలో తమదే గొప్ప తెలివి అని భ్రమించారు. )
సృష్టినే సృష్టించిన దైవం తెలివి ముందు వారి ఆటలు సాగవు కదా !
వర గర్వంతో రాక్షసులు లోకాలను పీడించినప్పుడు, దైవం ఎటువంటి మొహమాటం లేకుండా ఆ రాక్షసులను సంహరించారు. ( రాక్షసులు పొందిన వరాలకు భంగం కలుగకుండానే. )
అందువల్ల దైవకృపను పొందాలన్నా, పూర్వం చేసిన పాపఫలితాన్ని వదిలించుకోవాలన్నా వర్తమానం, భవిష్యత్తులో పుణ్యకార్యాలను చేస్తూ సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించాలి.
అంతేకానీ అతితెలివితో చెడ్డపనులు చేస్తూనే ఆ పాపఫలితాలను పరిహారక్రియలను చేయటం ద్వారా పోగొట్టుకోవాలనుకోవటం వృధాప్రయాస మాత్రమేనని గ్రహించాలి.
......................................
పాపకర్మపరిహారక్రియల ద్వారా తమ పాపాన్ని పోగొట్టుకోవటం అందరికీ సాధ్యమయితే , రాక్షసులు కూడా పాపపరిహారక్రియల ద్వారా తాము చేసిన పాపాలను పోగొట్టుకుని హాయిగా ఉండేవారు కదా !
రావణాసురుని వంటివారికి తాము చేసిన పాపాలకు విరుగుడుగా చేసే పాపపరిహారక్రియల గురించి కూడా తెలుస్తాయి కదా !
ఇలాంటి వారు అధర్మమైన లోకపీడాకరమైన పూజలు, తపస్సులు మొదలైనవి .. చేయాలనుకున్నా దైవం వారి ఆటలను సాగనివ్వరు. వారి పూజలలో ఎక్కడో ఒక దగ్గర దోషాలు లేక విఘ్నాలు వచ్చేలా చేస్తారు.
రామ రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు చేస్తున్న పూజకు ఆటంకాలను కల్పించి దైవం ఇంద్రజిత్తును సంహరించారు.
రావణాసురుడు ఎన్నో పూజలు కూడా చేసేవాడట. అయినా సీతాదేవిని అపహరించటం అనే పెద్ద పాపం చేయటం వల్ల రావణాసురునితో పాటూ అతని బంధుమిత్రులు కూడా కష్టాలపాలయ్యారు. రావణుడు చేసిన పాపం వల్ల యుద్ధంలో అతని సంతానం కూడా ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది.
ఇవన్నీ గమనిస్తే మనకు ఏం తెలుస్తుందంటే, చెడ్డపనులు చేసేవారి పూజలకు సత్ఫలితాలు లభించవు. అని.
....................................................
పాపపరిహారక్రియల వల్ల పాపాలు పోగొట్టుకోవచ్చు ...... అని పెద్దలు చెప్పటానికి కొన్ని కారణాలు ఉండి ఉండవచ్చని అనిపిస్తోంది. కొన్ని కారణాలు......
1. తెలిసోతెలియకో క్రితం జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కష్టాలు వస్తున్నప్పుడు ఇప్పుడు ప్రాయశ్చితం చేసుకోవటం ద్వారా గత కాలపు పాపభారాన్ని వదిలించుకోవచ్చు. ( ఈ జన్మలో సత్ప్రవర్తనతో ప్రయత్నించినప్పుడు .....)
2. జీవితంలో కొన్నిసార్లు మనకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల పొరపాట్లు చేయవలసి వస్తుంది. ఇలాంటివారికి కూడా ప్రాయశ్చితం ద్వారా పాపభారాన్ని వదిలించుకునే అవకాశం ఉండవచ్చు.
3 ప్రాయశ్చిత్తం ద్వారా చేసిన పాపఫలితాన్ని వదిలించుకోవచ్చు .... అనే ఆశను కల్పిస్తే, పాపాత్ములలో కొందరయినా మంచిగా మారే అవకాశం ఉంది.
4. పాపాలు చేస్తున్న వారికి ప్రాయశిత్తం లేనే లేదు..... అంటే ఆ నిస్పృహతో కొందరు చెడ్డవాళ్ళు మరింతగా చెడ్డపనులు చేసే అవకాశం ఉంది.
ఇలాంటివారికి మంచిగా మారటానికి మరల అవకాశం ఇచ్చి చూడాలనే అభిప్రాయంతో పెద్దలు అలా చెప్పి ఉండవచ్చు.
5. కొందరు వ్యక్తులకు చెడ్డపనులు చేయటం ఇష్టం ఉండదు. అయినా తమ మనస్సును నిగ్రహించుకోలేక చెడ్డపనులను చేస్తుంటారు. తాము చెడ్డపనులను చేసినందుకు విపరీతమైన మానసికబాధను అనుభవిస్తారు. తమ మనస్సును నిగ్రహించుకోలేనందుకు తమను తాము నిందించుకుంటారు. ఇలాంటివారు ధ్యానం, దానధర్మాలు చేయటం, పూజ, తీర్ధయాత్రలు చేయటం....వంటి పద్ధతుల వల్ల మానసికచాంచల్యం నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది.
6. ఇంకా చాలా కారణాలు ఉంటాయి......
ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తోందంటే , ప్రాయశ్చిత్తం ద్వారా పూర్వ పాపఫలితాన్ని పోగొట్టుకోవాలంటే , ఇప్పుడు సత్ప్రవర్తనతో ఉండటానికి ప్రయత్నిస్తూ పాపపరిహార క్రియలను ఆచరించవచ్చు.
అంతేకానీ , పాపాలు చేస్తూనే ప్రాయశ్చిత్తం ద్వారా పాపఫలితాలను పోగొట్టుకోవచ్చు.......అన్నది పెద్దల అభిప్రాయం కాదు అని.
............................
తప్పులు చేసి జైలు శిక్ష పడిన ఖైదీలు జైలులో సత్ప్రవర్తనతో ఉంటే , పై అధికారులు ఖైదీ యొక్క శిక్షా కాలాన్ని తగ్గించి , అతనిని కారాగారం నుంచి త్వరగా విడుదల చేసే అవకాశం ఉంది.
అలాగే పూర్వజన్మలో చెడ్డ పనులు చేసి ఈ జన్మలో కష్టాలను అనుభవిస్తున్నవారు ఇప్పుడు మరింత ఎక్కువగా సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నిస్తే , దైవం కరుణించి వారిని కష్టాలనుంచి కాపాడే అవకాశం ఉంది.
............................................
దైవకృపను పొందాలన్నా, పూర్వ పాపఫలితాన్ని పోగొట్టుకోవాలన్నా..... సత్ప్రవర్తనతో జీవించటానికి ప్రయత్నించాలి. సద్బుద్ధిని కలిగి సరైన దారిలో నడిపించమని దైవాన్ని శరణు వేడాలి.
అంతేకానీ దైవం దగ్గర ట్రిక్కులు పనికి రావు.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

No comments:
Post a Comment