ఓం
.....................
అందరికి .. మే డే .. శుభాకాంక్షలు .
......................
శ్రీ దేవీ భాగవతము గ్రంధము ద్వారా ......
యమధర్మరాజు సత్యవంతుని ప్రాణాలను తీసుకువెళ్తుంటే .. సావిత్రి పతి ప్రాణాల కోసం యముని అర్ధించటం... మొదలగు విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు.
యమధర్మరాజు సావిత్రికి ఎన్నో విషయాలను తెలియజేశారు. పాపాత్ములు అనుభవించే శిక్షల గురించి కూడా తెలియజేశారు.
పాపాలు చేసినవారు అనుభవించే శిక్షల గురించి కొన్ని విషయాలు......
...లోభంతో గానీ స్వలాభం కోసం గానీ జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో లక్షసంవత్సరాలు మగ్గుతాడు. ఆ పైని ఏడు జన్మలు శశకంగా , ఏడు జన్మలు మీనంగా పుడతాడు. మూడుజన్మలు వరాహంగా ఏడుజన్మలు కోడిగా ఏడుజన్మలు లేడిగా ఎత్తిఎత్తి కడకు పాతకశుద్ధి పొందుతాడు.
సావిత్రీ ! ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్రనరకంలో యాతనపడతాడు. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేటంతకాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు.
బలప్రయోగంతో గానీ మోసంచేసి గానీ ఇతరుల పిత్రార్జిత భూమిని కాజేసిన వాళ్ళు తప్తసూచీ కూపంలో పడి దగ్ధులవుతారు. ఏడు మన్వంతరాలు ఈ నరకం అనుభవించి అరవైవేల సంవత్సరాలు కృమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు.
గోడలకు కన్నం వేసి తలుపులు బద్దలు చేసి ఇళ్ళల్లో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకాముఖనరకంలో మూడుయుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలూ గొర్రెపొటేళ్ళూ మేకపోతులూ కొమ్ములతో కుమ్ముతోంటే గిట్టలతో మట్టగిస్తోంటే హాహాకారాలు చేస్తారు. ఆ పైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా ఏడుజన్మలూ మేషజాతిలో మూడుజన్మలూ ఛాగజాతిలో మూడుజన్మలూ ఎత్తి మానవుడిగా దారిద్ర్యం నిత్యరోగం భార్యా వియోగం బంధు వియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు.
ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరినుంచి కాజేసినా చోరుడు నక్రముఖకుండంలో నలిగిపోవలసిందే. మూడు శతాబ్దాలపాటు యమభటుల దండతాడనలు తినవలసిందే. ఆ పైన రోగిష్టి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధిపొందుతాడు........ఇలా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి.
..........................................
ఈ నరకబాధలు లేకుండా ఉండాలంటే, సత్ప్రవర్తనతో దైవ కృపను పొందటానికి ప్రయత్నించాలి . దేవీభక్తిని కలిగి ఉండాలి. జీవితాన్ని సరైనదారిలో నడిపించాలని దైవాన్ని ప్రార్ధించాలి.
...............
వ్రాసిన విషయాలలో అచ్చుతప్పులు వంటి పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

evaru sir vinedi ivanni.
ReplyDeleteantha gnanam unte desam ila enduku untundi.
asalu devudu unnado ledo kuda doubte.endukante chudaledu kabatti.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.
Deleteఈ రోజుల్లో జరుగుతున్న విషయాలను గమనిస్తే బాధగా ఉండే మాట నిజమే . అయితే మంచిరోజులు తప్పకుండా వస్తాయి.
ఈ రోజుల్లో చాలామందికి దైవం, పాపం, పుణ్యం వంటివాటి మీద నమ్మకం ఉన్నా కూడా మనస్సును నిగ్రహించుకోలేక చెడ్డపనులను చేస్తున్నారు.
ఎవరైనా మనస్సును నిగ్రహించుకోలేక చెడ్డపనులను చేస్తే చట్టం ప్రకారం శిక్ష పడుతుంది . ఒకవేళ చట్టం విధించే శిక్షనుండి తప్పించుకున్నా కూడా దైవం యొక్క న్యాయస్థానంలో విధించబడే శిక్షణ ( శిక్ష ) నుండి ఎవరూ తప్పించుకోలేరు.
.......................................
ఈ ప్రపంచంలో మనకు అంతుబట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. మనకు తెలియనంత మాత్రాన అవన్నీ అబద్ధం అని అనుకోకూడదు .
దైవాన్ని అందరూ చూడలేరు కాబట్టి దైవం అనే శక్తి లేరు . అనుకోకూడదండి. మన మనస్సును మనం చూడలేము. అలాగని మనస్సు లేదు .అనలేము కదా !
కనిపించని మనస్సు ఉంది. దైవం కూడా ఉన్నారు.
మీకు తెలియని ఇలాంటి గుడ్డి విషయానికి పబ్లిసిటీ ఇవ్వకండి.. ఇప్పటికే, గుడ్డిగా, లోకంలో మస్తు పైత్యాలున్నాయి.. తెలిసో, తెలియకో ఇలాంటివి లేని పోనివి కల్పించి తమ తమ స్వార్థం కోసం రాజకీయాలు చేసే వాళ్ళు బహు బాగా మజా చేస్కుంటున్నారు అనాది నుంచి..
ReplyDeleteఎవరి నమ్మకం వారిది. వారిని నమ్మద్దని చెప్పే హక్కు మీకు లేదేమో!
Deleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.
Deleteఇవన్నీ గుడ్డి విషయాలు కావండి.
మనం చేసే చర్యలకు ప్రతి చర్యలు కూడా ఉంటాయి. ఉదా...మంచి శుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటే చక్కటి ఆరోగ్యంతో సంతోషంగా ఉంటాము. అశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పాడయ్యి బాధలను అనుభవించవలసి ఉంటుంది.
అలాగే మనం మంచి పనులను చేస్తే దాని ఫలితంగా మనకూ మంచి జరుగుతుంది. మనం చెడ్డ పనులను చేస్తే మనకూ కష్టాలు వస్తాయి. అనే కర్మ సిద్ధాంతాన్ని నమ్మటంలో తప్పేమీ లేదు.
గొప్ప తపశ్శక్తి సంపన్నులైన మహర్షులు తపశ్శక్తి ద్వారా దైవకృపను పొంది , సృష్టి రహస్యాలను తెలుసుకుని ఎంతో విజ్ఞానాన్ని గ్రంధాల ద్వారా మనకు అందించారు.
పెద్దలు గ్రంధాల ద్వారా తెలియజేసిన ఎన్నో విషయాలను ఇప్పటికి మనం ఉపయోగించుకుంటున్నాము. అలాంటప్పుడు పెద్దలు తెలియజేసిన స్వర్గం, నరకం మొదలైన విషయాలను నమ్మటంలో తప్పేమీ లేదు.
Anonymous గారి వ్యాఖ్యకు ధన్యవాదములండి.
Deleteఇవన్నీ మనలను ఋజుమార్గంలో ఉండాలని చెప్పే బోధలు.
ReplyDeleteఅందుకే శాస్త్ర విహితమైన కర్మలను ఆచరించాలి. మంచి విషయాలు తెలియజేసేరు.
ధన్యవాదములు.
మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.
Deleteనిజమేనండి.
శాస్త్ర విహితమైన కర్మలను ఆచరించటం వల్ల మంచి జరుగుతుంది.
నరకమనే భయం ఉంటేనయినా మనుషుల్లా ఉంటారని...
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.
Deleteనిజమేనండి.
నరకమనే భయం ఉంటేనయినా మనుషుల్లా ఉంటారని...
అయితే జీవులు తాము చేసుకున్న కర్మానుసారంగా ఫలితాలను అనుభవించటానికి స్వర్గం..నరకం , జన్మ...పునర్జన్మ ... అనేవి ఉంటాయి.