koodali

Monday, April 29, 2013

పాపాలు చేస్తున్న వారికి సద్బుద్ధి .......

ఈ  బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న  అందరికి  అనేక  కృతజ్నతలండి .  
......................... 

 ఈ  రోజుల్లో    సమాజం   అయోమయంగా  తయారయింది.   డబ్బు  సంపాదన  కోసం  వెంపర్లాడుతూ ..   తరతరాల  సంస్కృతి,  నైతికవిలువలు   నాశనమవుతున్నా  పట్టించుకోవటం  లేదు.   ఎన్నో  నేరాలు,  ఘోరాలు  జరుగుతున్నాయి . 
 
  నేరాలను  చేసిన  వారిపట్ల  కఠినమైన  శిక్షలు  ఉండటం  ఎంతో  అవసరం  . అయితే  నేరాలను  తగ్గించాలంటే,  చట్టంతో  పాటు  ప్రజల  బాధ్యత  కూడా  ఎంతో  ఉంటుంది.


ఒక    వ్యక్తి  నేరం  చేస్తే  అందుకు  ఎన్నో  కారణాలుంటాయి.  చిన్నతనం  నుండి  తల్లితండ్రుల  పెంపకం,  పరిసరాల  ప్రభావం,       ఆర్ధిక  అసమానతలు,  స్నేహసంబంధాలు  ,  మీడియా  ప్రభావం,  వ్యక్తులలో   మద్యపానం  అలవాట్లు   ..........ఇలా   ఎన్నో  కారణాలుంటాయి.


మద్యపానం  వల్ల  సమాజంలో  ఎన్నో  సమస్యలు  వస్తాయి.   కొంతకాలం  క్రిందట  మద్యపానం  వంటి  అలవాట్లున్న  వాళ్ళను  సరిగ్గా  గౌరవించేవారు  కాదు.  వాళ్ళను  చాటుగా  అయినా   జనం   తిట్టుకునేవారు. 


ఈ  రోజుల్లో  అయితే , తాగితే  తప్పేమిటి  ?  మద్యాన్ని  అమ్మితే  తప్పేమిటి  ? అని  ఎదురు  ప్రశ్నించే  స్థాయికి  సమాజంలో  మార్పులు  కనిపిస్తున్నాయి.


 హింసతో  కూడిన  వీడియో గేంస్  ఆడితే పిల్లలలో  హింసాప్రవృత్తి  పెరుగుతుందని   పరిశోధకులు  చెబుతున్నారు.

    మద్యపానం, అసభ్యకర  దృశ్యాలను  చూడటం  వంటి  వాటివల్ల  మనుషులు  తమ  విజ్ఞతను,  వివేకాన్ని   కోల్పోయే  అవకాశం  ఉందని   అందరికే  తెలిసిందే. 

మద్యపానం,  అసభ్యకర చిత్రాలను  చూసి  విచక్షణ  కోల్పోయిన  వాళ్ళ  వల్ల  సమాజంలో  అనేక  నేరాలు  జరిగే  అవకాశం  ఉంది.   ఈ రోజుల్లో  జరుగుతున్న  నేరాలను   చూస్తుంటే  సమాజం  ఎటు  పోతుందో  అర్ధం  కావటం  లేదు. 

 ఈ  రోజుల్లో   సెల్ ఫోన్స్,  ఇంటర్నెట్  వంటి  వాటి  ద్వారా  హింసా దృశ్యాలను  ,  శృంగారదృశ్యాలను  ఎప్పుడుపడితే  అప్పుడు  చూసే  అవకాశం  కలిగింది.   వాటి  ప్రభావం  సమాజంపై  ఎంతో  ఉందని  తెలుస్తోంది. 

  మద్యపానం,  అసభ్యకర  దృశ్యాలు   ప్రదర్శించటం  తప్పని  అందరికీ  తెలుసు.  దురదృష్టకరమైన   విషయమేమిటంటే ,  మంచి  చెడు  తెలిసి  కూడా ....... ఎలాగైనా  సరే  డబ్బు  సంపాదించటమే  జీవితధ్యేయం  . అని  భావించే వారి  సంఖ్య  పెరిగిపోయింది.

 మనుషుల  బలహీనతలను  ఆసరాగా  చేసుకుని  డబ్బు  సంపాదించే  వాళ్ళను  దైవం  చూస్తూ  ఊరుకోరు. 

మద్యపానం  వల్ల  చితికిపోయిన  కుటుంబసభ్యుల  ఉసురు  ఊరికేపోతుందా  ? అసభ్యకరమైన    దృశ్యాలతో  సమాజాన్ని  కలుషితం  చేస్తున్న  వారి  పాపం  ఎప్పుడు  పండుతుందో  ?  ఇతరుల  సంపదను  అన్యాయంగా  కొల్లగొట్టి  కోట్లాది  రూపాయలను  కూడబెడుతున్న వారి  పాపం  ఎప్పుడు  పండుతుందో  ?  ఇవన్నీ   భగవంతునికే  తెలియాలి. 

 పాపాలు  చేస్తున్న  వారికి   సద్బుద్ధి  కలగాలని   దైవాన్ని  కోరుకుంటూ .................


4 comments:

  1. వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    Let us pray GOD.

    ReplyDelete
  2. చక్కటి టపా అనురాధ గారు. డబ్బు సంపాదించటమే ప్రధాన ధ్యేయం ఇప్పుడు అందరికీ!

    ReplyDelete
  3. వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి డబ్బు సంపాదించటమే ప్రధాన ధ్యేయం ఇప్పుడు అందరికీ!

    అధర్మంగా సంపాదించిన డబ్బు వల్ల ఎన్నో సౌకర్యాలను పొందినా కూడా, మనశ్శాంతి మాత్రం ఉండదని గ్రంధాల ద్వారా తెలుస్తోంది.

    మనశ్శాంతి లేకపోయాక ఎంత డబ్బు, ఎన్ని సౌకర్యాలు ఉంటే మాత్రం ఏం లాభం ? అని పాపాలు చేసేవారు తెలుసుకుంటే సమాజంలో మంచి మార్పు వస్తుంది.

    ReplyDelete