koodali

Monday, April 8, 2013

సమస్యల సమాజంలో............

ఇప్పుడు  సమాజంలో  ఎన్నో  సమస్యలు  ఉన్నాయి...వాటిలో  కొన్నింటిని  గమనిస్తే,

ఫ్లోరైడ్   నీటివాడకం  వల్ల  ఎందరో  ప్రజలు  విపరీతమైన  అనారోగ్య  సమస్యలతో  బాధలు  పడుతున్నారు. ఫ్లోరైడ్  నీటితో   పెరిగే  మొక్కల  ద్వారా  లభించే  ఆహారాన్ని  తిన్నా  వ్యాధులు  వస్తాయని  కొందరు  అంటున్నారు. 


   త్రాగేనీరు,  వంటకు  వాడే  నీటిలో   ఫ్లోరైడ్  లేకుండా   జాగ్రత్తలు  తీసుకుంటే  ఈ  అనారోగ్యాన్ని  చాలావరకు   నివారించవచ్చు. 

ఒక్కో  కుటుంబానికి  త్రాగటానికి,  వంటకు  రోజుకు  రెండు  బిందెల   శుద్ధ  జలాన్ని  అందిస్తే    ఫ్లోరైడ్ తో  వచ్చే  సమస్యలు  చాలావరకూ  తగ్గుతాయి.

 ఒక్కొక్క  ఊరికి   నీటిని శుద్ధి  చేసే  ప్లాంట్ ను  ఏర్పాటు  చేసి  ఒక్కో  కుటుంబానికి  రోజుకు  రెండుబిందెల  నీళ్ళను  అందించాలి. 


  ఆవులు,  గేదెలు
, మేకలు,  గొర్రెలు, మొదలైన  జీవులకు   చెరువులలో  ఫ్లోరైడ్  నీరు  త్రాగటం  వల్ల    అనారోగ్యం  వస్తుందో  లేదో  నాకు  తెలియదు.  

 ఇంటివద్ద  పశుపక్షాదులను   పెంచుకునేవారైతే  వాటికి  కూడా  త్రాగటానికి  శుద్ధజలాన్ని  అందించటం   మంచిది.
...........................

  ఇప్పుడు  కిలో  బియ్యం  45  రూపాయల  వరకు  అమ్ముతున్నారు.    విత్తనం  వేసి   పంట  చేతికి  వచ్చేవరకు  రైతులు  ఎంతో  కష్టపడతారు.  తీరా  పంట  చేతికి  వచ్చినా  తాను  పండించిన  పంటకు  ధరను  నిర్ణయించుకునే  అధికారం  రైతుకు  లేదు. 


అటు  రైతుకు  గిట్టుబాటు  ధర  లభించటం  లేదు.  ఇటు  వినియోగదారులకు  బోలెడు  ధర  పెట్టి  కొనవలసివస్తోంది.  మధ్యలో  జరిగే  మాయాజాలం  ఏమిటో  ?


 ప్రజల   ధోరణి  కూడా  చిత్రంగా ఉంటుంది . ప్రజల  ధోరణి  గురించి  ఒక  ఉదాహరణను  చూద్దాం.  రైతుబజారులో  కిలో   పొటాటోస్  కొనాలంటే  ఎంతో  బేరమాడతారు. 


 పెద్దషాపింగ్  మాల్  కెళ్ళి  ఎంతో  ఖర్చు  పెట్టి  ఒక  పాకెట్ పొటాటో  చిప్స్   కొని  కులాసాగా  తింటారు.   

చిప్స్  పాకెట్  వద్ద  బేరమాడటానికి  ప్రజలకు  అవకాశం  లేదు  కదా !  అయినా  ఎంత రేటైనా  బాధపడకుండా    కొనేస్తారు.

.................................
 

ఈ  రోజుల్లో  అన్ని  వస్తువుల  రేట్ల  విపరీతంగా  పెరిగిపోయాయి.మరి  ఇంతలా   రేట్లు పెరిగితే    సామాన్యులు  ఎలా  జీవించాలి  ?

 ఉదా...  ఉదయం  నుంచి  రాత్రి  వరకు   రోడ్ల  ప్రక్కన  కూర్చుని  చెప్పులు  కుట్టేవారు  ఉంటారు. రోజుకు  ఎంతమంది  చెప్పులు  తెగుతాయి. 

చెప్పులు   కుట్టేవారికి  చాల  తక్కువ  ఆదాయం  వస్తుంది .   ఇలాంటి  వారు  కుటుంబాన్ని  ఎలా  పోషించాలి  ? 

వీళ్ళకు  జీతాలు  పెంచేవారు  ఎవరూ  ఉండరు  కదా  ! దేశంలో  ఇలాంటి  అల్పాదాయ  వర్గాల  వాళ్ళు  ఎందరో  ఉన్నారు.  

  పెద్దలు  చెప్పినట్లు...వ్యక్తి  స్వార్ధం  కొంచెం  తగ్గించుకుని  పొరుగువారి  క్షేమం  గురించి  కూడా  ఆలోచిస్తే  రేట్లు  విపరీతంగా  పెరగవు.

సమాజంలో  ఎన్నో  సమస్యలకు   ముఖ్య కారణం  వ్యక్తులలో  పెరిగిన  స్వార్ధం .

మన స్వార్ధాన్ని   కొంచెం  తగ్గించుకుని  పొరుగువారి  క్షేమం  గురించి  కూడా  ఆలోచిస్తే  సమాజంలో  ఎన్నో  సమస్యలు  ఉండవు.

...........................................


ఇప్పుడు  విద్యుత్  కొరత  బాగా  ఉంది.  మనుషుల  అవసరాలు  పెరుగుతుంటే  సహజవనరులు  తరుగుతుంటే  కొరత  ఉండకేం  చేస్తుంది.

విద్యుత్  కొరతతో  సతమతమవుతుంటే  విద్యుత్ ను  పొదుపుగా  వాడుకోవాలి  కదా  !  కాని  అలాంటిదేమీ  కనబడటం  లేదు. 


షాప్స్  వద్ద  లేక   ఫంక్షన్స్   వద్ద  చూస్తే,  అవసరానికి  మించి   దీపాలు  వెలుగుతూనే  ఉన్నాయి. 

   ఎన్నో  దేశాల  వాళ్ళు  సౌరశక్తిని  చక్కగా  ఉపయోగించుకుంటున్నారు.  సౌరశక్తి  పుష్కలంగా  లభ్యమయ్యే  మనదేశంలో   కూడా   సౌరశక్తితో  వీధిదీపాలను  వెలిగించవచ్చు.   


పెద్ద  అపార్ట్మెంట్స్  పైన,  ఆఫీసుల  పైనా  , పరిశ్రమలపైనా  సౌరపలకలను  అమర్చుకోవచ్చు    కదా  !

ఇంకో  సమస్య  ఏమిటంటే,  విద్యుత్  బాగా  దొరికితే  విచ్చలవిడిగా  వస్తువులను  తయారుచేస్తారు.  విపరీతంగా  వస్తువులను   తయారీ  చేస్తే   సహజవనరులు  అయిపోతాయి.

అన్నింటికన్నా  పెద్ద  సమస్య .......  వస్తువుల  తయారీ  ప్రక్రియ  వల్ల  పెరిగే   వాతావరణ  కాలుష్యం. 


ఇవన్నీ  ఆలోచిస్తే  విద్యుత్  కొరత  ఉంటేనే  మంచిదేమో ....  అని కూడా  అనిపిస్తోంది.
.......................................


పర్యావరణ  కాలుష్యం  వల్ల  ఎన్నో  జీవజాతుల  ఉనికి ప్రమాదంలో  ఉన్నదని  అంతర్జాతీయ  సభలలో  చర్చలు ? జరుగుతున్నాయి.   అయినా  కాలుష్యం  తగ్గించటం  గురించి   అంతగా  పట్టించుకోవటం  లేదు.

ముందుతరాలవాళ్ళు  కాలుష్యం  బారిన  పడితే  మనకేమిటి ?  ఇప్పుడు  ఉన్నవాళ్ళ   అవసరాలే  ముఖ్యం .   అన్నట్లు  కొందరు  విచిత్రంగా  మాట్లాడుతున్నారు. 


 తమ  స్వార్ధమే  ముఖ్యం  అంటూ  ప్రవర్తించేవారిని  దైవం  గమనిస్తూనే  ఉంటారు
......................................

ఈ  రోజుల్లో  సమాజంలో  ఎంతో  పేదరికం  కనిపిస్తోంది. 


సమాజంలోని  సమస్యలను  పరిష్కరించుకోవటం  కన్నా,   ఎలాగైనా  సరే   వీలైనంత  ఎక్కువ  డబ్బును  సంపాదించి  ఖరీదైన  వస్తువులను  కొనుక్కుని  ఎంజాయ్  చేయటం,   వినోదంగా  సినిమాలు  చూడటం,  క్రీడలను  చూడటం  గురించే  జనం  ఎక్కువ  శ్రద్ధను  చూపిస్తున్నారు.

 ఇలాంటి  వ్యక్తులు   ఎక్కువగా ఉన్న సమాజంలో  సమస్యలు  ఎలా  పరిష్కారమవుతాయి  ?
...........................................


మన  అంతులేని  కోరికల  కోసం   ఇష్టం  వచ్చినట్లు  పర్యావరణాన్ని  కలుషితం  చేస్తే  చాల  సమస్యలు  వస్తాయి. 


 ఇప్పటికే  వాతావరణం  కలుషితం  అయి  కొన్ని  దేశాల  వాళ్ళు  ముక్కుకు  ఆక్సిజన్  డబ్బాలను  కట్టుకు  తిరుగుతున్నారట. 


  విపరీతమైన  కాలుష్యం  వల్ల  ఈ  భూమికి  పెరుగుతున్న  ప్రమాదాన్ని ,  తద్వారా  మనకు,  మన  ముందుతరాలకు   రాబోయే    ముప్పులను  తప్పించటానికి    ఏం  చేస్తే  బాగుంటుందో   అందరూ  ..ఆలోచించవలసిన  అవసరం   ఎంతో   ఉంది.

......................


దైవపూజలు  చేసే  భక్తులు   తన  హితంతో  పాటు  సమాజ  హితాన్ని  కూడా  కోరుకోవాలి.     పాపాలు  చేస్తూ   పూజలు  చేయటం    మంచి  పద్ధతి  కాదు. 

రావణాసురుడంతటి  వాడే  ఎన్నో  పూజలు  చేసినా  కూడా  కొన్ని  పాపాలు  చేయటం  వల్ల  శిక్షకు   గురయ్యాడని   గ్రహించి   భక్తులు  జాగ్రత్తగా  ఉండటానికి  ప్రయత్నించాలి. 

పాపాలు  చేసిన  వ్యక్తులు  తాము  చేసిన   తప్పులను  తెలుసుకుని  పశ్చాత్తాపపడితే , అప్పుడు  వారు  చేసిన  పాపాలకు   పడే   శిక్ష  తగ్గే  అవకాశం  ఉంది .
అంతా  దైవం దయ.

 

8 comments:

  1. అమ్మో ఇన్ని టపాలా ఒక్క రోజు, ప్రతిదానికి వ్యాఖ్య రాయాలంటే ఒక టపా అయిపోయేలా ఉంది. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా సమాజంలో ఇంకా చాలా సమస్యలు ఉండటం ఎంతో విచారకరమైన విషయం.

      Delete
  2. ఈ సమస్యలన్నీ అందరికీ తెలుసు. అనుభవిస్తున్నారు కాబట్టి. కానీ పాలకులు ఎవ్వరూ వీటిని పరిష్కరించాలి అనే మార్గంలో ఆలోచించ టల్లేదు అనుకుంటా. ఎలక్షన్లో గెలవటానికి వీటిని పరిష్కరించాల్సిన అవసరం లేదల్లె ఉంది. ఎందుకంటే ఈ సమస్యలు సంవత్సరాల బట్టీ ఉన్నాయి.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    సమాజంలోని చాలా సమస్యలు తేలికగా పరిష్కారమయ్యేవే. చిత్తశుద్ది, గట్టి సంకల్పం ఉంటే చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

    అయితే వ్యక్తులలో పెరిగిన స్వార్ధం వల్ల ఎక్కడిసమస్యలు అక్కడే పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి.

    ReplyDelete
  4. మీ సామాజిక స్పృహకు అభినందనలు.కనీసం ఈ మాత్రం స్పందనకూడా జనానికి ఉండటం లేదు.చాలా ముఖ్య మైన అంశాలను ప్రస్తావించారు.

    ReplyDelete
    Replies


    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

      సమాజంలోని సమస్యల గురించి మనలాంటి చాలామందిమి బాధపడుతున్నాము.

      అయితే ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో భగవంతునికే తెలియాలి.


      Delete
  5. కొంచెం బాధేస్తుంది. దేశం లోనే అభివృద్ధి కి రెండు మోడల్స్ ఉన్నాయి కదా. గుజరాత్, బీహార్. కనీసం ఆవిధంగా అనుసరించటం ఎందుకు చెయ్యకూడదో అర్ధం కాదు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

      నిజమేనండి . ఈ మధ్య కాలంలో బీహార్ రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించటానికి చెప్పుకోతగినంతగా కృషి జరుగుతోందంటున్నారు.

      గుజరాత్ లో సౌరశక్తిని చక్కగా ఉపయోగించుకుంటున్నారట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే , గుజరాత్ లో సౌరశక్తి ఉత్పత్తి కొరకు కృషిచేస్తున్నవారిలో ఎక్కువమంది తెలుగువారేనట.

      ఈ మధ్య తమిళనాడులో ప్రారంభించిన ఒక పధకం బాగుందని విన్నాను. అతి తక్కువ ధరలతో ఆహారపదార్ధాలను విక్రయించే హోటల్స్ ఏర్పాటు చేశారట. ఈ హోటల్స్ లో చాలా తక్కువ ధరలకే ఆహారం లభిస్తుందట.

      ఇలాంటి పధకాల వల్ల బీదవారు కనీసం కడుపునిండా భోజనం చేయవచ్చు. అనిపిస్తోంది.


      Delete