కొన్ని దైవ విగ్రహమూర్తులలో కాలంతో పాటూ పెరుగుదల కనిపిస్తోంది.
ఉదా..కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఇంకా, యాగంటి లోని నందీశ్వరుడు .
కాణిపాకాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా చెబుతారు . శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి కొంత దూరంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది..
,కాణిపాకంలో స్వామివారికి కొంతకాలం క్రిందట భక్తులు చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు.
కొంతకాలం క్రిందట యాగంటిలోని నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటానికి స్థలం సరిపడా ఉండేదట.
ఇప్పుడు అలా ప్రదక్షిణ చెయ్యటానికి , అంత స్థలం లేనంతగా నంది విగ్రహంలో పెరుగుదల కనిపిస్తోంది. ఇవన్నీ దైవలీలలే.
హేతువాదులు ఏమంటారంటే, కొందరేమో రాళ్ళు పెరుగుతాయి అంటున్నారు.
కొందరేమో రాళ్ళలో జీవం ఉండదు కాబట్టి ఎలా పెరుగుతాయి ? అలాంటి పెరుగుదల అసంభవం.అంటున్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళకే తేలటం లేదు.
ఇంకా కొందరు ..ఒక్కోసారి భూమిలో వచ్చే మార్పుల వల్ల కొంతభాగం పర్వతాలు ఏర్పడుతాయి ,.అలాగే విగ్రహాలు పెరుగుతాయి అంటున్నారు.
పర్వతాలు ఏర్పడటానికీ, విగ్రహాలు పెరగటానికి పోలికే లేదు.
మరి, విగ్రహాలు పెరుగుతున్నా కూడా అవి ఒక పద్ధతిగా పెరుగుతున్నాయి.
అంటే వినాయకుని మూర్తి అలాగే చక్కగా ఒక పద్ధతిలో పెరుగుతోంది.
నందీశ్వరుని ఆకారం, ముఖకవళికలు ,చెవులు, పాదాలు ,ఇతర శరీరాకృతి చెక్కుచెదరకుండా చక్కగా అలాగే ఉండి పెరగటం జరుగుతోంది.
అంటే , ఇష్టంవచ్చినట్లు కాకుండా పూర్వపు ఆకారంలోనే పెరుగుదల కనిపిస్తోంది. కాబట్టి ఇదంతా దైవలీల.
సమాజంలో సవాలక్ష సమస్యలుండగా దేవుడు లేడని నిరూపించటానికి కొందరు ఎందుకు ఇంతగా తాపత్రయపడతారో అర్ధం కాదు.
సృష్టిలోని వ్యవస్థ పనిచేయటం గురించి కొద్దిగా తెలుసుకున్న శాస్త్రవేత్తలను ఎంతో గౌరవిస్తారు.
కానీ ఆ విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన సృష్టికర్త అయిన మహాశక్తిని ఒప్పుకోము అని అగౌరవపరుస్తారు. ఇది చాలా అన్యాయం..
అంటే ;గాలిలో ఆక్సిజన్ ఉంటుందని కనిపెట్టిన శాస్త్రవేత్తను గౌరవించినంతగా,
గాలిలో ఆక్సిజన్ ఉండేలా ఏర్పాటు చేసిన భగవంతుని గౌరవించరు కొందరు హేతువాదులు.
అంతటితో ఊరుకోకుండా, దైవం అంటూ ఎవరూలేరని కూడా చెప్పటానికి కొందరు చాలా తాపత్రయపడతారు..
ఎవరు ఎలాంటి పేరుతో పిలిచినా దైవము ఒక మహా శక్తి ..
............
కాణిపాకంలో స్వామి వారికి కొన్ని సంవత్సరాల క్రితం చేయించిన వెండికవచం ఇప్పుడు సరిపోవటం లేదు. ( స్వామివారి మూర్తి పెరగటం వల్ల. ).
Monday, March 26, 2012
దైవ విగ్రహాలు పెరగటం గురించి.....
Subscribe to:
Post Comments (Atom)
అద్భుతంగా చెప్పారు.
ReplyDeleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
Deleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
ReplyDeleteనేను చాలా ఆలస్యంగా మీకు మీ కుటుంబ సభ్యులకి నా తరఫున నా కుటుంబ సభుల తరఫున నందన ఉగాది శుభకామనలు తెలుపుకుంటున్నా.
ReplyDeleteనెనరుంచండి
కృతజ్ఞతలండి.
Deleteమీరు మీ కుటుంబసభ్యులు, మరియు అందరూ ఆనందంగా ఉండాలని దైవాన్ని కోరుకుంటూ శ్రీ నందన నామ ఉగాది శుభాకాంక్షలండి.
చాలా చక్కగా వివరించారు
ReplyDeleteజైశ్రీరాం
జైశ్రీరాం
Deleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
Good One
ReplyDeleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
Deleteచాలా బాగా చెప్పారండీ! రాళ్ళు పెరగడానికి చాలా కారణాలున్నా ఒక ఆకారంలో పెరగటం మాత్రం వింతే! మంగళగిరి పానకాల స్వామి గుడి నేను చూసిన మొదటి వింత. దేవుడు(ఆ కొండ మీద) పానకం త్రాగడం వెనుక కొన్ని కారణాలు ఉన్నా సరిగ్గా సగం మాత్రమే త్రాగడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ReplyDeleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
Deleteయాగంటి దేవాలయ పరిసరాల్లో ఒక శాపం కారణంగా కాకులు కనిపించవట. అయితే అక్కడ ఇతర పక్షులు ఉంటాయట.
ఇక్కడి నంది విగ్రహ పరిమాణం పెరిగే విషయాన్ని భారత పురావస్తు శాఖ వారు కూడా ధ్రువీకరించారట.
అవునండి. మంగళగిరి పానకాల స్వామి వారి గుడిలో , దైవానికి సమర్పించిన పానకంలో , సగం పానకము ప్రసాదంగా భక్తులకు తిరిగి అందటం ఎంతో ఆశ్చర్యము, అద్భుతమైన విషయం.
ఇంకా, ఆ గుడిలో అంత పానకం ఉన్నా చీమలు ఉండవని నేను విన్నానండి. .......ఇవన్నీ అద్భుతాలే.
ఇలాంటి దైవ లీలలు ఎన్నో ఉన్నాయండి..
బాగుంది.
ReplyDeleteకృతజ్ఞతలండి. అంతా దైవం దయ.
Delete