koodali

Friday, March 16, 2012

కుటుంబవ్యవస్థ కుదురుగా ఉండాలంటే...... ....



వివాహం జరిగి అత్తవారింటికి వచ్చే కొత్త కోడలికి ఎన్నో భయాలు ఉంటాయి.  క్రొత్త వ్యక్తులు, క్రొత్త వాతావరణం , అలవాట్లు, ఆంక్షలు ఎలా ఉంటాయోనని భయం ఉంటాయి.

ఈ రోజుల్లో ఆధునిక పోకడలతో పెరిగిన పిల్లలు తమతో అడ్జస్ట్ అవగలరా ? అని అత్తవారికీ ఆందోళనగానే ఉంటుంది.

ఇక, ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఎటూ ఉండనే ఉంటారు. ...

కోడలికి చనువిస్తే నెత్తికెక్కుతుంది. జాగ్రత్తమ్మా ! అని ఒకామె అత్తగారితో అంటే ...

భర్తను కొంగున ముడి వేసుకోవటం నేర్చుకో. లేకపోతే నీ పని అంతే అని . కోడలితో అంటుంది ఒక ఆమె. ...

ఇక ఈ ఇంట్లో నీ అధికారం తగ్గిపోతుంది జాగ్రత్త అమ్మాయ్! అని
ఆడపడుచుతో వేళాకోళంగా ( ? )అంటుంది ఇంకొక ఆమె.

ఈ అమ్మలక్కలు కొందరు తెలిసి అంటే , కొందరు తాము ఇతరుల మనస్సులను నొప్పిస్తున్నామని తెలియకుండానే అంటారు.


తెలిసి అన్నా తెలియక అన్నా అత్తాకోడళ్ళ మనస్సులలో అనుమాన బీజాలను వేసేస్తారు. ఇలాంటివారి మాటలతో జాగ్రత్తగా ఉండాలి..

( లా వ్రాయకూడదేమో ? కానీ, ఈ క్రింది విషయాలు వ్రాయటానికి ఇలా వ్రాయవలసి వచ్చింది. )


అత్తగారు తానూ ఒకప్పుడు కొత్త కోడలిగా అడుగుపెట్టిన రోజులను గుర్తు తెచ్చుకోవాలి.

కొత్తకోడలు తానూ భవిష్యత్తులో అత్తగారు అవుతాను కదా ! అని అనుకోవాలి..

ఆడపడుచులు తమ అత్తవారింట్లో తాము ఎంత ఆప్యాయతను ఆశిస్తారో గుర్తుతెచ్చుకోవాలి.

అప్పుడు వారి మధ్య గొడవలు రావు.

బయట కష్టపడి ఇంటికి వచ్చిన మగవారికి , ఇంట్లో అత్తాకోడళ్ళు తిట్టుకోవటం ...... వంటి గొడవలు ఉంటే ఇద్దరికీ సర్ది చెప్పలేక, బయటే ఎక్కువగా తిరుగుతుంటారు.


భర్త ఎంతో కష్టపడి ఇంటికి వచ్చి, ఆ అలసటలో నాలుగుమాటలు అంటే చాలు .. ఇక భర్తను మనసులో తిట్టుకుని , నాకు ఇంట్లో గుర్తింపు లేదు, బయటి వాళ్ళు నన్ను ఎంతో పొగుడుతారు. అని తెగ ఫీలయిపోయి బాధలు కొనితెచ్చుకుంటుంది భార్య.


ఇంటిపని, పిల్లల పనితో అలసిపోయి ఆ అలసటతో భార్య ఏదైనా నోరు జారితే, భర్త ఆమెను నాలుగు తిట్టి ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు. నా భార్య గయ్యాళి, ఎప్పుడూ సాధిస్తుంది. అని , బయట నన్ను ఎంతో గౌరవిస్తారు
అంటూ, బయటకు వెళ్ళిపోయి బాధలు కొనితెచ్చుకుంటాడు భర్త. .


భార్య తన భర్త నుంచీ ప్రేమను , జీవితాంతం అతను తనను చక్కగా చూసుకోవాలని అతనినుంచి భద్రతను ,  కష్టసుఖాలలో తోడునీడగా కడవరకూ కలిసి జీవించాలని ఆశిస్తుంది. భర్త ఆప్యాయంగా నాలుగు మంచిమాటలు మాట్లాడితే చాలు భార్య పొంగిపోతుంది.


భర్త తన భార్య నుంచీ ప్రేమను, కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలనీ,  తన గొప్పదనాన్ని భార్య ప్రశంసించాలని ,కష్టసుఖాలలో తోడునీడగా కడవరకూ కలిసి జీవించాలని ఆశిస్తారు. భార్య భర్త గొప్పదనాన్ని
ప్రశంసించి నాలుగు మంచిమాటలు మాట్లాడితే చాలు భర్త పొంగిపోతాడు.


మనము ఇంటాబయటా ఎందరినో పొగుడుతూ ఉంటాము. అలాంటప్పుడు తనకోసం, పిల్లల కోసం కష్టపడుతున్న భర్తను భార్య..భార్యను భర్తా పొగిడితే తప్పేమిటి ?

 
బయటివాళ్ళు ఎప్పుడో మనకు చిన్న సహాయం చేసినా , వాళ్ళు మనల్ని కొద్దిగా పొగిడినా ఉబ్బితబ్బిబ్బయిపోతాము. మనమూ వాళ్ళను ఎంతో పొగుడుతాము.

కానీ, .ఇంట్లో వాళ్ళు మనకోసం ఎంత కష్టపడినా , ఎంత సహాయం చేసినా పెద్దగా పట్టించుకోము. ఆ ! ఏముందిలే, తన బాధ్యత కాబట్టి చేస్తున్నారు .. అని తేలిగ్గా తీసుకుంటాము.


బయటి వారు మనకు చేసిన సహాయాన్ని గుర్తించినంతగా ...... కుటుంబసభ్యులు మనకు చేస్తున్న సహాయాన్ని గుర్తించము.

అయితే, ఇంట్లోవాళ్ళకు రోజూ అదే పనిగా ఒకరినొకరు పొగుడుకోవటానికి కుదరదని అందరూ గుర్తించాలి.

అయితే మానవమాత్రులన్నాక చిరాకులు పరాకులు సహజం. ఆ గొడవలను తెగేదాకా లాగకుండా జాగ్రత్తపడాలి.

అప్పుడే వారి పిల్లలకు కూడా సర్దుకుపోవటం తెలుస్తుంది.

కుటుంబంలో అందరూ కలుపుగోలుగా , సందడిగా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది

ఇంట్లో అందరూ ఒకరినొకరు చక్కగా అర్ధం చేసుకుని జీవిస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది..


8 comments:

  1. అతి పరిచయదవజ్ఞతా, అన్నారు. భార్య/భర్త లు ఒకరికొకరు స్నేహితులలా స్వాంతన ఇచ్చుకున్నపుడు సమస్యలు లేవు. మనము అనుకుంటే సమస్య లేదు, నేను అనుకుంటే సమస్య మొదలవుతుంది.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి. .....బాగా చెప్పారండి.

      ఈ రోజుల్లో భార్యాభర్తలు , మనము అనుకోకుండా నేను ,నా హక్కులు..... అనుకోవటం వల్లే చాలావరకూ సమస్యలు వస్తున్నాయి.

      Delete
  2. ఏమండోయ్,

    కొత్త గా పెళ్ళి అయి ఇంటికి తీసుకు వచ్చిన అమ్మాయి పట్ల భర్త కి ఏమీ ఇట్లాంటి నేర్చుకోవాల్సిన గురుతర బాధ్యతలు లేవంటారా ? ఆల్ రెస్పాన్సిబిలిటీ 'ఆండొల్ల' మీదే నంటారా ?


    రాపిడ్ ఫైర్,
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబీగారూ మీరా ! వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      మీరు భలే సందడి చేస్తారండి.

      ( కొత్త గా పెళ్ళి అయి ఇంటికి తీసుకు వచ్చిన అమ్మాయి పట్ల భర్త కి ఏమీ ఇట్లాంటి నేర్చుకోవాల్సిన గురుతర బాధ్యతలు లేవంటారా ? ఆల్ రెస్పాన్సిబిలిటీ 'ఆండొల్ల' మీదే నంటారా ?.....)


      * జీవితమే అందరికీ అన్నీ నేర్పిస్తుంది ... అని కూడా నాకు అనిపిస్తుందండి.

      Delete
  3. చాలా బాగా చెప్పారండీ! బాగుంది.
    ఇంకొక మాట ఏమిటంటే.. జిలేబీ ..గారి మాటే..నా మాట కూడా!
    అబ్బాయిలకి.. కూడా చాలా తెలియాలి. మరొక పోస్ట్ అలాగున వ్రాయండి ఆడవారి మనసులో..అబ్బాయి ఎలా ఉండాలో తెలుస్తుంది.

    ReplyDelete
  4. వనజవనమాలి గారూ మీకు నచ్చుతుందని నేను అనుకున్నాను. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

    భార్య తన భర్త నుంచీ ప్రేమను ,...... జీవితాంతం అతను తనను చక్కగా చూసుకోవాలని అతనినుంచి భద్రతను , ...... కష్టసుఖాలలో తోడునీడగా కడవరకూ కలిసి జీవించాలని ఆశిస్తుంది..... భర్త ఆప్యాయంగా నాలుగు మంచిమాటలు మాట్లాడితే చాలు భార్య పొంగిపోతుంది.

    టపాలో వ్రాసిన ఈ విషయాలు మగవాళ్ళు పాటిస్తే భార్య సంతోషంగా ఉంటుంది.

    Dharmecha, ardhecha,kamecha, mokshecha…Nathi charami, nathi charami, nathi charami…

    ............అని పెండ్లి నాడు చేసిన ప్రమాణములను గుర్తుంచుకుని పాటించాలనే పెద్దలు అలా ఏర్పాటు చేసారు.

    ReplyDelete
  5. kani bharya entha help (Home and Office) chesina puchika pullalaga thisese bharthalni emicheyyalantarandi...enni chesina nuvvemi cheyyaledhu nee bhadyathagane chesavu naa kosam cheyyaledhu ante..??

    ReplyDelete
  6. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీ వ్యాఖ్యను ఈ మధ్యనే చూశాను.(పాత వ్యాఖ్యలను తిరగేస్తుంటే..)

    ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    వ్యక్తులు గత జన్మలో చేసిన కర్మ ఫలాలను బట్టి ఇహ జన్మలో శుభాశుభాలు ఉంటాయంటారు. ఇలాంటప్పుడు ,పుణ్యకర్మలను ఆచరించటం వల్ల.. గత కాలపు పాపకర్మ క్షీణించి, శుభకరమైన మార్పులు కలిగే అవకాశం ఉంది. వ్యక్తులు అర్ధం చేసుకుని అనుకూలంగా మారే అవకాశం ఉంది.

    అయితే, గత కాలపు పాపకర్మ బలంగా ఉన్నదని జాతకం ద్వారా తెలుస్తున్నప్పుడు, పుణ్యకర్మలు మిక్కుటంగా చేయవలసి ఉంటుంది. స్త్రీలకు ఎన్నో వ్రతాలు, నోములు కూడా తెలియజేశారు పెద్దలు.

    ReplyDelete