koodali

Monday, March 19, 2012

జ్యోతిషం..కొన్ని విషయాలు......



ఓం.....

ఈ రోజు జ్యోతిషం గురించి నాకు తెలిసినంతలో కొన్ని విషయాలను వ్రాద్దామనుకుంటున్నానండి. అలాగని
జ్యోతిషం గురించి నాకేదో బాగా తెలుసని కాదు. కొద్దిగా బేసిక్స్ మాత్రం తెలుసంతే.

జ్యోతిష్యం నిజమైతే కర్మ సిద్ధాంతం తప్పు అవుతుంది. గ్రహ బలం నిజమైతే దైవ బలం శూన్యమవుతుంది. అని కొందరు భావిస్తున్నారు.

దైవబలమూ ( గ్రహబలమూ ) నిజమే. ... ..కర్మసిద్ధాంతమూ నిజమే.. అని నా అభిప్రాయం.



పంచాంగం ప్రకారం లెక్కలు వేసి , ఎంతో ముందే గ్రహణం ఏర్పడే సమయాన్ని చెప్పగలుగుతున్నారు పంచాంగకర్తలు. గణిత శాస్త్రం ఆధారంగా చెప్పబడే పంచాంగం కూడా శాస్త్రమే.

ఇక జ్యోతిషం విషయాని కొస్తే ఎవరైనా జ్యోతిష్యం ఎందుకు తెలుసుకోవటం ? అన్న ప్రశ్నకు నా అభిప్రాయం ఏమిటంటే...

పూర్వజన్మలో మనం చేసిన కర్మను బట్టి ఈ జన్మలో కష్టసుఖాలు ఉంటాయి.... అని
ఆస్తికులు నమ్ముతారు కదా ! మనం గత జన్మలలో చేసిన కర్మను బట్టి ఈ జన్మలో మన జీవితం ఎలా ఉండబోతుందో జాతకచక్రం ద్వారా తెలుస్తుంది. ( జ్యోతిషం చక్కగా తెలిసిన పండితుని ద్వారా తెలుసుకుంటే ) .

అయితే జాతకంలో ఉన్నదాన్ని మనం మార్చుకోలేము అని నిరాశ పడకూడదు అనీ  నాకు అనిపిస్తోంది.


మన జాతకాన్ని మనం ప్రయత్నిస్తే ( దైవానుగ్రహం వల్ల ) మార్చుకోవచ్చు.. అని శ్రీ
మార్కండేయుల వారు , సతీ శ్రీ సావిత్రీ దేవి వంటి .. గొప్పవారి కధల ద్వారా పెద్దలు మనకు తెలియజేసారు . అనిపిస్తుంది.

. అలాగే, వ్యక్తి తన జాతక చక్రాన్ని ముందే తెలుసుకోవటం ఎలాంటిదంటే ..... ఉదాహరణకు ....... ఒక వ్యక్తి హెల్త్ చెకప్ చేయించుకుని తన ఆరోగ్య పరిస్థితిని ముందే తెలుసుకున్నట్లు అన్నమాట.

హెల్త్ చెకప్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటం వల్ల ఆ వ్యక్తి కి ఏ అనారోగ్యమూ లేనట్లు తెలిస్తే మంచిదే ( ఆరోగ్యం బాగుంది కదా అని .. చెడ్డ అలవాట్లు నేర్చుకుంటే అంతే సంగతులు. )


 ఒకవేళ ఏమైనా చిన్నా, పెద్దా అనారోగ్యాలు ఉన్నాయని పరీక్షలో తెలిస్తే ముందే తగు జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది కదా !



అంతేకానీ ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్లు చెకప్ లో తెలిసినప్పుడు ...... అయ్యో ! ఇక నేను ఏంచేయగలను ? బాబోయ్ ! అని ఏడుస్తూ కూర్చోరు కదా !

అలాగే జాతకం గురించి ముందే తెలుసుకోవటం వల్ల..... అంతా మంచిగా ఉంటే సంతోషమే.( బాగుంది కదా అని ....పాపాలు చేయటం మొదలుపెడితే అంతే సంగతులు )......


 ఒకవేళ ఏమైనా చిన్నపాటి తేడాలు ఉంటే భవిష్యత్తులో రాబోయే అపాయాలనుంచీ తప్పించుకోవటానికి ..... ముందే తగు జాగ్రత్తలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది.


అలాగే, మనం గత జన్మలలో చేసిన కర్మలు ...... వాటి ఫలితాలు ఇప్పటి జాతకం ద్వారా తెలుస్తాయి. రాబోయే కష్టాలను తప్పించుకోవటమన్నది..... మనం ఈ జన్మలో చేసే ప్రయత్నం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనుకోవచ్చు.

వ్యక్తులు సరైన ఆహారం తీసుకోకపోవటం వంటి ఎన్నో కారణాల వల్ల అనారోగ్యం వస్తుంది.

..... ఆహారనియమాలను చక్కగా పాటించటం, మందులు వేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు .

రోగం తక్కువగా ఉంటే ఔషధం కొద్దిగా తీసుకున్నా జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది...... బీపీ, సుగర్ వంటివైతే కొద్దిగా కంట్రోల్ అయినా కూడా జీవితాంతం మందులు వాడవలసి వస్తుంది, ......ఇంకా క్రానిక్ డిసీజెస్ అయితే, ఆ జబ్బు ఏ స్థాయిలో ఉందన్న దానిపై నివారణ ఆధారపడి ఉంటుంది.

వ్యకులు పూర్వ జన్మలలో తాము చేసిన పాపకర్మకు ..... ఈ జన్మలో ప్రాయశ్చిత్తం చేసుకోవటం , ఇప్పుడు పుణ్యకర్మలను ఆచరించటం ద్వారా సరిదిద్దుకోవచ్చు అనిపిస్తుంది.

పూజలు, శాంతులు, దానధర్మాలు వంటివి చేయటం ద్వారా రాబోయే కష్టాలను పూర్తిగా పోగొట్టుకోవటం , లేదా ఆ కష్టాన్ని కొద్దిగానైనా తగ్గించుకోగలగటం ....... ఇలా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి దైవానుగ్రహం ఉంటుంది.

***********************
ఒకవేళ ఎవరైనా తమ  జాతకం తెలుసుకోకపోయినా జీవితంలో ఎక్కువగా మంచిపనులు చేస్తూ, .... దైవంపై భారం వేసి జీవించే వ్యక్తిని దైవమే సరైన దారిలో నడిపిస్తారు.
***********************
చెడ్డ పనులు చేసే వారు ఎన్ని తిప్పలు పడ్డా దైవం వారికి అనుకూలించటం జరగదు.


రావణాసురుడు తన కొడుకైన ఇంద్రజిత్తు మంచి ముహూర్తంలో పుట్టాలని భావించి గ్రహాలను మంచి స్థానాలలో ఉంచాలని ప్రయత్నించాడట.


కానీ శ్రీ శనిదేవుని వల్ల రావణాసురుని ఆటలు సాగలేదు. శ్రీ రాముల వారు రావణాసురునితో చేసిన యుద్ధం సందర్భంలో శ్రీ లక్ష్మణుల వారి చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు కదా !
అందుకని జీవితంలో సత్ప్రవర్తన ముఖ్యం.

శ్రీ హనుమంతుల వారు శ్రీ శనిదేవుని ఒక ఆపద నుంచి కాపాడారని అంటారు. అందువల్ల శ్రీరాముని భక్తులను , శ్రీ హనుమంతుని శనివారం నాడు పూజించిన భక్తులను శ్రీ శనిదేవుడు బాధించరని అంటారు. ఇలా ఎన్నో విషయాలను పెద్దలు చెప్పటం జరిగింది. ( నాకు తెలిసినంతలో వ్రాసానండి. )

*********************************
సమయం విషయంలో కూడా ఇప్పుడు మన గడియారాల్లో చూపించే సమయం కన్నా సూక్ష్మమైన లెక్కలు ఉన్నాయట.

Smallest Unit of Time

1 paramanu 60,750th of a second
1 truţi = 29.6296 microseconds
1 tatpara = 2.96296 milliseconds
1 nimesha = 88.889 milliseconds
45 nimesha = 1 prāņa 4 seconds
6 prāņa = 1 vinādī 24 seconds
60 vinādīs = 1 nadī 24 minutes
60 nādīs = 1 ahorātra


100 truti (atoms) = 1 tatpara (speck)
30 tatpara (specks) = 1 nimesha (twinkling)
18 nimesha (twinklings) = 1 kashtha (bit)
30 kashtha (bits) = 1 kala (~minute)
30 kala (minutes) = 1 ghatika (~half-hour)
2 ghatika (half hour) = 1 kshana/muhūrta (~hour)
30 kshana/muhūrta (hour) = 1 ahorātra (~day).

Truti is referred to as a quarter of the time of falling of an eye lid.

ఇలా అన్నమాట. ఈ లోకంలో బిడ్డ పుట్టినప్పుడు లెక్కించటానికి
సమయాన్ని ఈ లెక్కల ఆధారంగా ......చూస్తారో ? చూడరో ? నాకు తెలియదండి.
.....................

లోకంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి వ్యక్తి యొక్క వ్రేలి గుర్తులు వేరువేరు గానే ఉంటాయని అంటారు. ( అందుకే ముఖ్యమైన సందర్భాలలో సంతకాలతో పాటూ వ్రేలి ముద్రలూ తీసుకుంటారు కదా ! ) ఇది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది .


ఈ రోజు జ్యోతిష్యం గురించిన టపా వ్రాయాలని నేను ముందే అనుకున్నానండి. కొద్దిసేపటి ముందు చూస్తే జ్యోతిశ్శాస్త్రం గురించిన శ్యామలీయం వారి వ్యాసం కనిపించింది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది . శ్యామలీయం గారు నన్ను అపార్ధం చేసుకోరని అనుకుంటున్నాను.

వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

4 comments:

  1. నాకు నచ్చలేదండీ! నిర్మొహమాటంగా చెబుతున్నా. ఒక్క లెక్కల విషయం నచ్చింది.

    ReplyDelete
  2. క్షమించండి, పొరపాటు చేశా.

    ReplyDelete
  3. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసానండి.

    అయ్యో ! క్షమించండి, పొరపాటు ...ఇలా మీరు అనకూడదండి. మీరు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పటమే బాగుంది.


    అయితే , తప్పు ఏమిటన్నది నాకు అర్ధం కావటం లేదు. ఇలా వ్రాసానని దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.


    ఎందుకంటే , నా అభిప్రాయం ఏమిటంటే ..వ్యక్తులు .గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగా ఈ జన్మలో జీవితం ఉంటుంది. ..... జాతకం తెలుసుకుని దైవపూజలు చేయటం , దానధర్మాలు చేయటం ద్వారా జాతకదోషాలను సరిదిద్దుకోవచ్చు అని పెద్దలు చెబుతారు కదా !



    అలాగే, ఆహారనియమాలను సరిగ్గా పాటించకపోవటం వల్ల అనారోగ్యం వస్తుంది , వైద్యుల దగ్గర చెకప్ చేయించుకుని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని , మందులు వాడుకోవటం వల్ల అనారోగ్యాన్ని నివారించే ప్రయత్నించవచ్చు కదా !



    ఈ విధంగా ఈ రెండిటిని పోల్చటం జరిగింది.


    సర్ ! మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబితే విషయం నాకూ సరిగ్గా అర్ధమవుతుంది.


    నా వ్రాతల ద్వారా అందరికీ మంచి జరగాలన్నదే నా అభిప్రాయం. దయచేసి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతారని ఆశిస్తున్నాను....

    ReplyDelete
    Replies
    1. సర్ ! మీ అభిప్రాయాన్ని అర్ధం చేసుకోలేక మరింత స్పష్టంగా వివరించమన్నాను అంతే. , దయచేసి అపార్ధం చేసుకోవద్దండి.

      Delete