మా మామ గారిది, నా భర్తది బదిలీలు ఉండే ఉద్యోగాలు. మా మామ గారు రిటైర్ అయిన తరువాత మా ఊరిలో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి చుట్టుప్రక్కల చాలా సందడిగా ఉంటుంది.
మా అత్తగారు మామగారు అప్పుడఫ్ఫుడూ మా వద్దకు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తుంటారు. మేము కూడా అప్పుడఫ్ఫుడూ మా ఊరు వెళ్ళివస్తుంటాము.
ఇక మా అత్తగారు, మా అమ్మగారిలానే పిండివంటలు, పచ్చళ్ళు చేసి పంపిస్తుంటారు ఇప్పటికీ .
ఇప్పుడు వాళ్ళూ పెద్దవాళ్ళయ్యారు కదా ! కష్టపెట్టటం ఎందుకని వద్దని చెబుతుంటాను.
ఆ మధ్య మా మామగారు అత్తగారు .... కాశీ వెళ్ళినప్పుడు నాకూ, మాతోడికోడలుకు చీరలు కొని తెచ్చారు.
మాకు ఆడపడుచులు లేరు. నా భర్త వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. మా తోడికోడలు నేను మంచి ఫ్రెండ్స్ .
ఇది చూసి కొందరు మీరు సొంత అక్కచెల్లెళ్ళలానే భలే కలిసిమెలిసి ఉన్నారే. అని ఆశ్చర్యపోతారు.
( కొందరేమో అత్తగారి మీద చాడీలు చెప్పుకోవటానికి అలా కలిసిమెలిసి ఉంటున్నారు. ...అని జోక్స్ వేస్తుంటారు.
మా అత్తగారితో మేము ఇద్దరమూ చక్కగా ఉంటాము. ఆమె కూడా మాతో బాగా ఉంటారు.
ఏంటో ! ఈ ప్రపంచం చాలా చిత్రమైనదండి...
కలిసి మెలిసి ఉన్నా తప్పుగా మాట్లాడతారు. కలిసి మెలిసి లేకున్నా తప్పుగా మాట్లాడతారు.
ఈ ప్రపంచం చాలా.....
.......................
( కొందరేమో అత్తగారి మీద చాడీలు చెప్పుకోవటానికి అలా కలిసిమెలిసి ఉంటున్నారు. ...అని జోక్స్ వేస్తుంటారు.)
కొన్ని టీవీ సీరియల్స్ , కొన్ని సినిమాలు కూడా ఈ విధమైన ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాయి.
కొన్ని సీరియల్స్ , సినిమాలు లో ...... అమాయకంగా నటిస్తూ వెనుక గోతులు తీసే వ్యక్తులను, కుటుంబసభ్యులే వాళ్ళలోవాళ్ళే విషాన్ని కలిపి ఇచ్చే సన్నివేశాలను చూపిస్తున్నారు.
ఇలాంటివి చూపించటం వల్ల మనుషుల్లో ఒకరంటే ఒకరికి నమ్మకాలు పోయి అపార్ధాలు వచ్చే అవకాశం ఉంది.
అయితే,ఇలా సీరియల్స్,సినిమాలు తీసేవాళ్ళను మనం ఆపలేము కదా!
ఇలాంటివి చూసినా, విన్నా వాటి ప్రభావానికి లోను కాని మానసిక దృఢత్వాన్ని మనం పెంపొందించుకోవాలి.
ఎవరైనా ఇతరులమీద చెడ్డగా పితూరీలు చెప్పినా వెంటనే నమ్మకూడదు.
వాటి వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.
సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి.... ఎన్నో కోణాలనుంచీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అయితే ఎంత తెలివి గలవాళ్ళయినా మానవుల తెలివి పరిమితం కాబట్టి , మనవంతు ప్రయత్నం మనం చేస్తూనే ......మనల్ని సరైన మార్గంలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించాలి..
నేటిరోజుల్లో కలిసుంటే వింత కదా!!!
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteమీరు అన్నది నిజమేనండి.
అయితే, మా మామగారు ఉద్యోగరీత్యా బదిలీలపై కొన్ని ఊళ్ళలో ఉద్యోగం చేసారండి. ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఉంటున్నారు.
ఆ ఇల్లు ఒక గుడికి దగ్గరగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
వారు కావాలని గుడికి దగ్గరలో స్థలం కొని ఇల్లు కట్టడం జరిగిందండి.
అలా గుడికి దగ్గరలో స్థలం దొరకటం అదృష్టం. అని కొందరు అన్నారు. అంతా దైవం దయ......