ఓం.
హిందువులలో కూడా చాలామంది మా దైవమే గొప్ప అంటూ తమలో తాము వాదించుకుంటారు.
శాక్తేయులు, శైవులు, వైష్ణవులు, ఇలా .....అన్నమాట..
కానీ , బ్రాహ్మణులు అందరికీ సంధ్యోపాసన ముఖ్యమయినది. మరి శ్రీ గాయత్రీ మాత కూడా శక్తిరూపమే అని పెద్దలు చెబుతున్నారు కదా !
చాలామంది శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకుంటారు. వారు త్రిమూర్తి స్వరూపులే గదా !
గురుదేవులైన శ్రీ దత్తాత్రేయస్వామి వారు కూడా త్రిమూర్తి స్వరూపులే గదా !
తిరువనంతపురంలో శ్రీ అనంతపద్మనాభస్వామి వారిని దర్శించేటప్పుడు త్రిమూర్తులు కనిపిస్తారట...
తిరుమల కొండ పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి మూర్తిని కొందరు శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరునిగా ఆరాదిస్తారు.
కొందరు శక్తి రూపమయిన శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భావించి ఆరాధిస్తారట. ఈ విషయం గురించి ఆ మధ్య మీడియాలో చర్చ కూడా జరిగింది...
శివకేశవులకు మధ్య భేదం చూపెడితే నరకానికి పోతారని పెద్దలే చెప్పినా కొంతమంది అంతగా పట్టించుకోరు..ఏమిటో !
ఇందులో పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని కోరుకుంటున్నానండి.
No comments:
Post a Comment