భగవంతునికి సంబంధించిన విషయములలో నా అభిప్రాయములు వ్రాస్తున్నాను కదండి. నాకు పెద్దగా పాండిత్యం లేదు. నాకు సంస్కృతము కూడా రాదు.
అయితే తెలిసినంతలో నా అభిప్రాయములు వ్రాయాలని నా తాపత్రయం.
వీటిలో పొరపాట్లు కనిపిస్తే , దయచేసి తెలిసిన వాళ్ళు చెప్పగలరు. ( మీకు ఇబ్బంది లేకపోతే )
ఇక, కొందరు ఏమంటారంటే , దేవుడు వేరు .. జీవుడు వేరు అంటారు.
కొందరేమో దేవుడు జీవుడు .. వేరు కాదు , ఒకటే అంటారు.
నాకు ఏమనిపిస్తుందంటేనండి. రెండు అభిప్రాయములు కూడా సరైనవే అని.
1. ఉదా..పిల్లలు తల్లిదండ్రుల నుంచీ పుట్టడం జరుగుతుంది.
అలా చూస్తే, తల్లిదండ్రులూ పిల్లలూ ... వేరువేరు కాదు అనిపిస్తుంది..
కానీ , పిల్లలు జన్మ ఎత్తిన తరువాత తల్లిదండ్రులు, పిల్లలు.. వేరే గదా అనిపిస్తుంది. !
2. ఉదా...ఒక పెద్ద మొక్క నుంచి విత్తనముల ద్వారా గానీ ,అంటు కట్టడం ద్వారా గానీ పిల్ల మొక్క ఏర్పడుతుంది .
ఇక్కడ పెద్ద మొక్క నుంచే పిల్ల మొక్క ఏర్పడుతుంది.కాబట్టి,.
ఒక కోణం నుంచీ చూస్తే ,పెద్దమొక్క పిల్ల మొక్క ....... వేరు వేరు కాదు., రెండూ ఒకటే అనిపిస్తుంది..
కానీ ,ఇంకో కోణం నుంచీ చూస్తే, పెద్ద మొక్క నుంచీ విడిగా ఏర్పడిన తరువాత ,
పెద్దమొక్క పిల్లమొక్క ... వేటికవి వేరే కదా ! అనిపిస్తుంది.
ఇలాగే భగవంతుని నుంచే జీవులు ఏర్పడ్డారు.
ఆ విధంగా చూస్తే .. దేవుడు జీవుడూ వేరువేరు కాదు అనిపిస్తుంది..
కానీ జన్మ ఎత్తి జీవుడుగా ఏర్పడిన తరువాత... జీవుడూ దేవుడూ ... కొద్దిగా వేరు . అని కూడా అనిపిస్తుంది.
(అదే సమయంలో జీవునిలో దేవుడు ఉన్నాడని కూడా అనిపిస్తుంది. ).
ఈ ఉదాహరణలతో దేవుని జీవుని ... పూర్తిగా పోల్చలేము కానీ కొంతవరకూ పోలిక కనిపిస్తుంది.
ఆత్మలో పరమాత్మ ఉంటారని కొందరు అంటున్నారు.
* అయితే ,.. తాను కానిదేదీ ఈ సృష్టిలో లేదని దైవం చెప్పటం జరిగింది.
* ఇంకా,... జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారం ప్రేరేపిస్తూ ఉంటానని కూడా దైవం చెప్పటం జరిగింది.
అందుకే అనిపిస్తుంది..
తల్లిదండ్రులకు పిల్లలకు , పెద్దమొక్కకు పిల్లమొక్కకు ఉండే బంధం ఒక జన్మవరకో కొన్ని జన్మల వరకో మాత్రమే ఉంటుంది.
* కానీ దైవానికి జీవులకు ఉన్న బంధం విడదీయరానిది. అంతం లేనిది.
జీవులందరూ ఎప్పటికయినా తిరిగి భగవంతుని చేరవలసినవారే.
ఇందులో పొరపాట్లు ఉంటే క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
మీ విశ్లేషణ చాలా బాగుంది.
ReplyDeleteమీకు ధన్యవాదములండి.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteత్రిగుణాల అవతల దేవుడు.. త్రిగుణల ఇవతల జీవుడు.. అంతే..
ReplyDeleteఅంతా వాడే...విష్ణుమాయ....మాయ లేకపోతే కథ లేదు...
మీకు ధన్యవాదములండి.
ReplyDelete" త్రిగుణాల అవతల దేవుడు.. త్రిగుణల ఇవతల జీవుడు.. అంతే..అంతా వాడే...విష్ణుమాయ....మాయ లేకపోతే కథ లేదు... "మీరు చక్కగా చెప్పారు.
* నిజమేనండి. కానీ , జీవితంలో ఎదురయ్యే పరీక్షలను మనం తట్టుకోవాలన్నా ..... ఆ మహా మాయనే ( దైవాన్నే ) శరణువేడాలని పెద్దలు చెబుతున్నారు.
జీవితంలో ఒక ఉన్నతస్థాయి ఉద్యోగం సంపాదించాలంటేనే కొన్ని పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది.
మోక్షమనే అత్యున్నతమైన స్థాయిని పొందాలంటే కూడా కొన్ని పరీక్షలు ఎదుర్కొనవలసి ఉంటుంది.
ఉదా... విద్యార్ధులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే పాఠాలు చెప్పే అధ్యాపకులనే సహాయం అడగాలి. ( మనకు పాఠాలలో అర్ధం కాని అంశాలను వివరించి చెపుతారు కదా !. .)
అదే సమయంలో మనము కూడా బాగా శ్రద్ధగా చదవాలి కూడా. అప్పుడే పరీక్షలో ఉత్తీర్ణులమవుతాము.
అలాగే దైవం పెట్టే పరీక్షలలో మనం నెగ్గి మోక్షము అనే బ్రహ్మానంద స్థాయిని పొందాలంటే........కొన్ని పరీక్షలను తట్టుకోవలసి ఉంటుంది.
అలా తట్టుకోవటానికి కావలసిన శక్తిని కూడా దైవం ద్వారా మాత్రమే పొందగలము.
అదే సమయంలో మానవులు కూడా తమ రాగద్వేషములను అదుపులో పెట్టుకోవలసిన అవసరం కూడా ఉంది.
సత్ప్రవర్తన, శక్తి కొలది చక్కగా స్వధర్మమును పాటించటం మొదలైనవాటి ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. తద్వారా అందరం మోక్షమును పొందగలము......