koodali

Wednesday, August 10, 2011

సున్నితమైన విషయాలు ఉన్నాయి కదా !

.ఓం.

రామాయణం, భారతం ..........ముందే ఒక ప్రణాళిక ప్రకారం దైవం ఈ కధలు నడిపించారని పెద్దల ద్వారా తెలుసుకున్నాము.

భూమిపై పాపుల భారం తగ్గించుటకై భారతయుద్ధం జరిగిందని, రావణాసురుని వధ కొరకు రామావతరణం జరిగిందని పెద్దలు చెబుతారు.


రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది. ( అవన్నీ నాకు అంతగా తెలియవు . ) తోచినంతలో , ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి ..

భూమిపై దుష్టులను సంహరించాలంటే దైవానికి చిటికెలో పని.

దైవం తలచుకుంటే రామాయణంలో సీతాపహరణం . .భారతంలో కురుక్షేత్రం సంగ్రామం జరగవలసిన అవసరం లేదు.


శ్రీరామునికి, శ్రీ కృష్ణునికి కూడా దుష్టులను సంహరించటం పెద్ద పనేమీ కాదు.

రాజ్యవిస్తరణ మిషతో రాములవారు రావణాసురుని చంపవచ్చు.

శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేసి దుష్టులైన రాజులను చంపవచ్చు.

( పరశురాముడు ఒక్కరే ఎందరో క్షత్రియులను చంపటం జరిగింది కదా ! )

కానీ, రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది.

( అవన్నీ నాకు అంతగా తెలియవు . )

అయితే, ఇలా కూడా ఆలోచించవచ్చేమో అనిపించిందండి.......

ఈ కధలలోని పాత్రధారుల పూర్వ కర్మలు ఒక కారణం. , ఇంకా ఈ కధల ద్వారా, అందులోని వారి జీవితాల ద్వారా రాబోయే తరాలవాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.


విష్ణుమూర్తి భృగు మహర్షి శాపం వల్ల ఎన్నో అవతారాలు ధరించవలసి వచ్చింది . తద్వారా దుష్ట శిక్షణ జరిగింది కూడా. .

ఇంకా, విష్ణుమూర్తి సతీవియోగం అనుభవించాలన్నది కూడా (కొంతకాలం ) భృగు మహర్షి శాపం.


ఇంకా, మనం ఈ కధల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలు, మనస్తత్వాలకు సంబంధించిన విషయాలు, న్యాయశాస్త్ర సంబంధ విషయాలు కూడా తెలుసుకోవచ్చు.

ఎన్నో ఉపకధల ద్వారా మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదా.శకుంతల కధ.

తెలిసీతెలియని యుక్తవయసులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా పిల్లలకు చెప్పటానికి పెద్దలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.

శకుంతలా దుష్యంతుల వంటి కధల ద్వారా పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. .

ఇవేకాక , కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో తప్ప , ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది.

ఉదా.. రామాయణంలో కైకేయికి మంధర ప్రబోధం వల్ల రామాయణం ఒక పెద్ద మలుపు తిరిగింది.


భారతంలో సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు కోరిన కోరికల వల్ల భీష్ముడు రాజ్యాధికారానికి , వివాహానికి దూరంగా ఉండటం భారతంలో ఒక పెద్ద మలుపు.

( శంతనుని భార్య గంగాదేవి ఆయనను వదలి వెళ్ళిన తరువాతే సత్యవతీదేవిని వివాహమాడటానికి నిశ్చయించుకున్నాకూడా .........)

.ఇక రామాయణంలో  సవతులంటే సుమిత్రాదేవి వంటి మంచి వారూ ఉంటారు. ( కానీ అరుదుగా ఉంటారు. )


లోకంలో మంధర వంటివారి మాటలు విన్న కైకేయి లాంటివారే ఎక్కువగా ఉంటారు.

ఇవన్నీ చూశాక నాకు అనిపించింది. ఒక వివాహంతోనే సంసారంలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి.

మనలాంటి సామాన్యులు ఒక్క వివాహంతో సరిపెట్టుకుంటే చాలు.

బోలెడు పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త సమస్యలు , కొత్త లంపటాలూ సృష్టించుకునేకన్నా , ఉన్న జీవితాన్ని తృప్తిగా గడిపితే చాలు అని కూడా ఈ కధల ద్వారా తెలుసుకోవచ్చు అనిపించింది.


మంచివారైనా, చెడ్డవారైనా , ఎవరికయినా తన జీవితభాగస్వామి ఇంకో వివాహాన్ని చేసుకోవటమనే విషయం అత్యంత బాధను కలిగిస్తుంది.

స్త్రీలకు సవతులు ఉండటం అనే విషయం వైధవ్యాన్ని మించి బాధను కలిగిస్తుందని హయగ్రీవుని చరిత్రలో చెప్పబడింది.

ఇంకా,

ధర్మరాజుకు జూదం ఆడటం వల్ల కష్టాలు వస్తాయని తెలుసు. ( వారు రాజ్యాన్ని కోల్పోయారు కదా !. )

దైవం నడిపించిన వీరి జీవితాల ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, ఉదా...మనలో కొందరు ఉంటారు.

వాళ్ళకి అన్నీ మంచి అలవాట్లే ఉంటాయి. కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు ఉంటుంది.

ఇక వారు ఏమనుకుంటారంటే, నాకు ఉన్నది ఒక్క చెడ్డ అలవాటే కదా ! దీనివల్ల నష్టమేమిటి ? అనుకుంటారు.

కానీ ఒక చిన్న చెడ్డ అలవాటు వల్ల కూడా ఎన్ని నష్టాలు జరగవచ్చో ధర్మరాజు పాత్ర ద్వారా తెలుసుకోవచ్చు.

తెలివి గలవాళ్ళు అలా తెలుసుకుని తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

వితండవాదులు ధర్మరాజంతటివారే జూదం ఆడగాలేంది నేను ఆడితే తప్పేంటి ? అని జీవితాన్ని నష్టపోతారు.

ఎవరి తలరాతను బట్టి వారి బుద్ధి ఉంటుంది మరి. అంతా దైవం దయ.

ఇంకా,

(ఇక్కడ దేవలోకాలలోని దేవతల గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే, దేవతల ధర్మాలు వేరు. మానవుల ధర్మాలు వేరు. దేవతలకు మానవుల వంటి శరీరాలు ఉండవు. దేవతలకు సంబంధించిన విషయాల్లో పైకి కనిపించేవి కాకుండా అసలైన అంతరార్ధాలు ఎన్నో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. వారి శరీరాలు మనలా ఉండవు. అయితే, వారు ఎలాంటి రూపమైనా ధరించగలరు. వారు తమ శక్తితో ఎన్నో అద్భుతాలు చెయ్యగలరు. ఒక టపాలో చెప్పుకున్నాము.

వారి విషయాలను మానవసంబంధ దృష్టితో చూసి అపార్ధం చేసుకోవటం తెలివితక్కువతనం.

( ఇంతకుముందు చెప్పుకున్న విషయాల్లో చాలావరకూ భూమిపై మానవులుగా జన్మ ఎత్తినవారి గురించి చెప్పబడ్డాయి
. )

ఇంకా,
శ్రీ కృష్ణుల వారు కూడా కొన్ని సాంసారిక కష్టాలను అనుభవించినట్లుగా లోకానికి కనిపిస్తుంది. ( శ్రీ కృష్ణుల వారు విష్ణుమూర్తి అంశావతారం. )

రుక్మిణీదేవికి సంతానం కలిగారు. కానీ జాంబవతికి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు.

అందువల్ల తనకీ సంతానం కావాలని ఆమె కోరగా కృష్ణుడు శివుని గురించి తపస్సు చేస్తారు.


అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు.

అప్పుడు కృష్ణుడు వారితో తన కోరికను వెల్లడించి, తాను లౌకిక కోరికలతో తపస్సు చేసినందుకు బాధపడతారు.

పార్వతీపరమేశ్వరులు ఎన్నో వరాలను ప్రసాదించి ..

ఇంకా, యాదవుల ప్రవర్తన వల్ల ముని శాపం, తద్వారా చాలావరకూ యాదవ వంశ నాశనం, ఇంకా ఎన్నో విషయాలను చెప్పి అంతర్దానమవుతారు.

ఈ టపా వ్రాయటానికి బాగానే గాభరా పడ్డానండి.

సున్నితమైన విషయాలు ఉన్నాయి కదా !

* దైవం దయవల్ల ఈ మాత్రం వ్రాయగలిగానండి. ఎప్పుడయినా నేను వ్రాస్తున్న విషయాల్లో ఒప్పులను దైవం దయగానూ, తప్పులను నావి గానూ పాఠకులు గ్రహించవలసినదిగా కోరుతున్నాను.
ఇందులో పొరపాట్లు ఉన్నచో దైవం క్షమించాలని ప్రార్దిస్తున్నానండి.



No comments:

Post a Comment