* ఓం.
*సవరణ ...నేను ఇంతకు ముందు ఒక టపాలో....
సుఖాలు పుణ్యక్షయం కోసం.....దుఃఖాలు పాప క్షయం కోసం . అన్న విషయాలు ... ఇంద్రుడు శచీదేవితో చెప్పారని వ్రాయటం జరిగిందండి.
కానీ ఇవన్నీ , దేవగురువైన బృహస్పతి ఇంద్రునితో చెప్పిన సంగతులు. ( మహిషాసురుడు ఇంద్రునితో యుద్ధానికి సిద్ధమయినప్పుడు . )
వారు చెప్పిన దాంట్లో కొంత భాగం........
*సుఖాలు పుణ్యక్షయం కోసం. .దుఃఖాలు పాప క్షయం కోసం. సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవరూపంలో ఖర్చయిపోతాయి. సంచిత పాపాలు దుఃఖానుభవరూపంలో ఖర్చయిపోతాయి....అంటూ చెప్పటం జరిగింది.
................................
ఇంకా ,వృత్రుని సంహరించిన తరువాత , ఇంద్రుడు మనశ్శాంతిని కోల్పోయి దేవలోకాన్ని వదిలి మానససరోవరం ప్రాంతానికి వెళ్ళటం జరిగింది.
అనంతరం కొన్ని సంఘటనల తదుపరి, శచీదేవి దేవగురువైన బృహస్పతి సలహాతో , అమ్మవారిని ఆరాధించి ఇంద్రుని వద్దకు రావటం జరుగుతుంది.
అప్పుడు దేవేంద్రుడు శచీదేవిని ఓదార్చుతూ చెప్పిన కొన్ని సంగతులు .....
* జగన్మాత పాదపద్మాలను ధ్యానించేవారికి ఏ సంకటాలూ రావు. ఎన్నడూ రావు. ఒకవేళ ఏదైనా సంకటం లాంటిది వచ్చినట్టు కనిపించినా అది నీ శ్రేయస్సుకే అవుతుంది.
అని కొన్ని విషయములను తెలిపి, ఇంకా భువనేశ్వరిని ఉపాసించమని చెప్పటం జరిగింది.
తరువాత కొంతకాలానికి అమ్మవారి దయవల్ల ఇంద్రుడు తిరిగి దేవలోకానికి రావటం జరిగింది.

*******************
లంకలో సీతమ్మ జాడను కనుగొన్న హనుమంతుడు..ఏదైనా ఒక సంఘటనను ( గుర్తుగా .) రాములవారికి చెప్పటానికి చెప్పమన్నప్పుడు. .....
ఈ సంఘటనను సీతాదేవి హనుమంతునికి చెప్పటం జరిగింది.
.ఒకసారి సీతారాములు ఒక పర్వతప్రాంతములో ఉన్నప్పుడు, ఒక కాకి తన ముక్కుతో పొడిచి , రక్తం వచ్చేంతగా సీతాదేవిని గాయపర్చటం జరుగుతుంది.
అప్పుడు శ్రీరాముడు ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించగా , ఆ కాకి లోకాలన్నీ తిరిగి , మరల వచ్చి రక్షించమని రాములవారిని శరణు కోరుతుంది.
( ఈ కాకి ఇంద్రుని సంతతికి చెందినదిగా చెప్పబడింది.అంటే ,మామూలు కాకి కాకపోవచ్చు.? )
అప్పుడు , శ్రీరాముడు బ్రహ్మాస్త్రప్రయోగం వృధాపోరాదని చెప్పి, , ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. అనగా ........
అప్పుడు కాకి తన ప్రాణాలకు బదులుగా ఒక కన్ను కోల్పోతుంది.
ఈ కధలో ఆ కాకి చేసినది చిన్న తప్పు కాదు.
అయినా పక్షి కాబట్టి ,. సీతారాములు దయగలవారు కాబట్టి , అంతగా గాయపరిచిన కాకిని చంపకుండా వదిలేశారు.
జీవించిఉన్న మానవులను అలా రక్తం వచ్చేవరకు గాయపరచటం కాకుల సహజలక్షణం కాదు.
చీమ గానీ, దోమ గానీ మనల్ని కుడితే .. పాపం అల్పజీవి కదా ! కుట్టనీ ! అని జాలిపడము కదా ! నలిపేసి చంపేస్తాము.
కానీ, సీతారాములు దయగలవారు కాబట్టి , వారు దానిని చంపకుండా వదిలేశారు.
ఇంకా, ఎన్నో తెలిసిన రావణుడు సీతాదేవిని అపహరించిన పాపానికి తగ్గ శిక్షే పడింది....

తను చేసిన అధర్మానికి ఫలితంగా ఎందరో బంధువుల, మిత్రుల , ప్రజల మరణానికి కారణమయ్యాడు.
ఆఖరికి తన వారసులతో సహా మరణించాడు...
.ఈ విషయాల ద్వారా ఎన్నో తెలుసుకోవచ్చు.
.................................................
ఇంకా, మనలో చాలా మందిమి ఏమనుకుంటామంటే,
పెద్దవాళ్ళు పుణ్యకార్యములు చేస్తే ఆ పుణ్యఫలం వారి కుటుంబానికి, ఇంకా తరువాతి తరాలకూ కూడా వస్తుందని అనుకుంటాము.
మరి అలాగే , పెద్దవాళ్ళు పాపాలు చేస్తే వారి తరువాతి తరాలకు ఆ పాపఫలితాలు రావా ? అన్న సందేహం వచ్చింది నాకు.
ఉదా. మనకు ఎవరైనా సొమ్ము బాకీ ఉన్నారనుకోండి .వారు ఆ బాకీని తీర్చలేకపోతే ఆ సొమ్మును వారి వారసుల వద్ద వసూలు చేస్తాము కదా !
తల్లిదండ్రుల ఆస్తులకే కాదు.... అప్పులకూ పిల్లలు వారసులే కదా !
రావణాసురుడు, దుర్యోధనుడు కుటుంబాలు ఏమయ్యాయో తెలుసుకున్నాము కదా !
* మరి కష్టాలు అనుభవించినా సీతారాముల వారసులు సుఖంగా ఉన్నారు.
* ఇతరులను కష్టపెట్టి వారి కష్టాల పునాదులపై తమ కలల సౌధాలు నిర్మించాలనుకునేవాళ్ళ కుటుంబాలు .. కష్టాల పాలయ్యే అవకాశం ఉంది.
( దుర్యోధనుని ,రావణుని వంటి వారి కుటుంబంలా ).
అందుకే పెద్దవాళ్ళు పాపాలు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించాలి.....అని తెలుసుకోవచ్చు.
* ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నయెడల క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment