koodali

Wednesday, August 3, 2011

ప్రహ్లాదునికి అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ఏమని చెప్పారంటే,

 
ఓం.
పురాణేతిహాసములలోని కధలను కొందరు విమర్శిస్తారు.

అందులోని నీతిని గ్రహించకుండా పైపై విషయాన్ని చూసి వితండవాదాలు చేస్తారు.

పిల్లలకు పంచతంత్రము వంటి కధల
ద్వారా ,

పెద్దవారికి పురాణేతిహాసములు, ఇంకా ఇతర ప్రాచీనగ్రంధముల ద్వారా దిశానిర్దేశం చేశారు పెద్దలు.

పిల్లలకు ఎన్నో కధలు చెప్పారు పెద్దలు. ,

ఉదా. పంచతంత్రము లోని కధలలో జంతువులను ప్రధాన పాత్రలుగా చేసి లోకంలోని ఎన్నో విషయాలను బోధించారు .

జంతువులను పాత్రలుగా పెట్టి కధలు చెబితే పిల్లలు ఇష్టంగా కధలు వింటారు కాబట్టి , అలా జంతువులు పాత్రలుగా కధలు చెప్పటం జరిగింది.

తెలివిగల పిల్లలు ఆ కధల ద్వారా అందులోని నీతిని నేర్చుకొని . జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

వితండవాదులైన పిల్లలు ఆ కధలలోని నీతిని వదిలేసి ....... అసలు జంతువులు ఎక్కడయినా మాట్లాడుతాయా ?

జంతువులు ఎక్కడయినా మనుష్యుల్లా ఆలోచిస్తాయా ?నిరూపించండి. అని, ఇంకా,

అంతా ట్రాష్. మూఢత్వం, పెద్దలు చెప్పటం మీరు వినటమూ ........ అంటూ వితండవాదాలు లేవదీస్తారు.

అలాగే , పురాణేతిహాసములలోని నీతిని నేర్చుకోవాలి అంతేకానీ , వితండవాదం చెయ్యటం సరి కాదు.

ఆ కధల ద్వారా మంచి పనులు చేసే వాళ్ళు తాత్కాలికంగా కష్టాలు అనుభవించినా , చరిత్రలో గొప్పవారిగా చిరకీర్తిని సంపాదించుకుంటారు. అని,

చెడ్డపనులు చేసేవాళ్ళు తమతో పాటు ఇతరులను కూడా కష్టాలపాలు చేసి చెడ్డవాళ్ళుగా చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు . .అని తెలుస్తుంది.


దుర్యోధనుడికి రాజ్యభోగములు ఎన్నో ఉన్నా కూడా ఎప్పుడూ ..పాండవులను ఏ విధంగా కష్టాలపాలు చెయ్యాలి ?

ఒకవేళ పాండవులు వనవాసం మధ్యలో మానేసి తనమీదకు దండయాత్రకు వస్తారేమో ?

ఇంకా ఇలాంటి ఆలోచనలతోనే జీవితం తెల్లారిపోయింది.

అష్టైశ్వర్యాలు చుట్టూ ఉన్నా ఇలాంటివారు ఏమీ మనశ్శాంతిగా ఉండలేరు.

మనశ్శాంతి లేనప్పుడు అష్టైశ్వర్యాలూ ఉన్నా ఏం లాభం?

పాండవులు వంటి వారు ఉన్నంతలోనే సంతోషంగా ఉంటారు. ( వారికి అత్యాశలు ఉండవు కాబట్టి ).

ఒక సందర్భంలో ,ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ఏమని చెప్పారంటే,

* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.

* అమ్మవారు చెప్పిన విషయాన్ని అంతగా వివరించే శక్తి నాకు లేదు .

ఈ రోజుల్లో కూడా చూడండి.

తగినంత సంపాదన ఉండి ,
సంగీతాన్ని నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా , తమకు వచ్చిన పాటలు హాయిగా పాడుకుంటూ జీవితాన్ని గడిపేసేవారూ,

తమకు ఇష్టమయిన వ్యాపకంతో, ఉన్నంతలో సంతోషంగా ,తృప్తిగా జీవితాన్ని గడుపుతున్నవారూ ఎందరో ఉన్నారు.

ఇంకా, బోలెడు అక్రమ సంపాదన ఉన్నా కూడా అసహనంతో, అభద్రతతో మనసంతా అల్లకల్లోలంగా ఉండే వారూ ఉన్నారు. .

అందుకే మనం తెలుసుకోవలసింది ఏమంటే ......

* దైవం దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని.
 

4 comments:

  1. తెలివిగల పిల్లలు ఆ కధల ద్వారా అందులోని నీతిని నేర్చుకొని . జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

    వితండవాదులైన పిల్లలు ఆ కధలలోని నీతిని వదిలేసి ....... అసలు జంతువులు ఎక్కడయినా మాట్లాడుతాయా ?
    -----------
    ఒకటే బ్రెయిన్ . వ్యత్యాసాన్ని నాలుగు మాటల్లో చెప్పారు.మంచి అయినా చెడు అయినా అర్ధం చేసుకోటం లో ఉంది. అర్ధం చేసుకోవటం వారి వారి పెంపకాన్ని బట్టి ఉంటుంది.

    ReplyDelete
  2. ప్రస్తుతము పెద్దలే అవగాహన చేసుకోటానికి ప్రయత్నము చేయుటలేదు. పిల్లల్ని ఏమి తప్పు పడాతాము.
    పురాణేతిహాస గ్రంథాలను చదివి తర్కించుకోవటములోనే జీవితాలు గడిపేస్తున్నాము. తర్కము మాయ అంటుంది భాగవతము.
    పెద్దలు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు. ఆచరణ లేకుండా బోధిస్తే ఎదురుతిరుగుతారు. సమాథానము చెప్పలేని దుస్థితికి పెద్దలు దిగజారుతారు.

    దైవము, థర్మాచరణము తప్ప మనవునికి శాంతినిచ్చేవి ఈ సృష్టిలో లేవు.. లేవు.. లేవు..

    ReplyDelete
  3. జవాబు ఇవ్వటానికి ఆలస్యమయినందుకు సారీ చెబుతూ..వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

    "మంచి అయినా చెడు అయినా అర్ధం చేసుకోవటం లో ఉంది. అర్ధం చేసుకోవటం వారి వారి పెంపకాన్ని బట్టి ఉంటుంది. "
    మీరు చెప్పింది నిజమేనండి..

    ReplyDelete
  4. జవాబు ఇవ్వటానికి ఆలస్యమయినందుకు సారీ చెబుతూ..వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

    "ప్రస్తుతము పెద్దలే అవగాహన చేసుకోటానికి ప్రయత్నము చేయుటలేదు. పిల్లల్ని ఏమి తప్పు పడాతాము.
    పురాణేతిహాస గ్రంథాలను చదివి తర్కించుకోవటములోనే జీవితాలు గడిపేస్తున్నాము. తర్కము మాయ అంటుంది భాగవతము.
    పెద్దలు ఆచరిస్తే పిల్లలు అనుసరిస్తారు. ఆచరణ లేకుండా బోధిస్తే ఎదురుతిరుగుతారు. సమాథానము చెప్పలేని దుస్థితికి పెద్దలు దిగజారుతారు.

    దైవము, థర్మాచరణము తప్ప మనవునికి శాంతినిచ్చేవి ఈ సృష్టిలో లేవు.. లేవు.. లేవు.. "

    మీరు చెప్పింది నిజమేనండి..

    ReplyDelete