ఒకప్పుడు నాకు ఉద్యోగం చెయ్యాలని ఇంకా సమాజాన్ని ఉద్దరించాలనీ అలా ఏవేవో కోరికలుండేవి.
* ముందు నన్ను నేను ఉద్దరించుకుంటే అదే గొప్ప అని ఇంకా, ఎవరి స్వధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించటం కూడా సమాజ ఉద్దరణలో భాగమే అని, నాకు ఆలస్యంగా తెలిసింది.
( మా టీచర్ ఒకామె ( నాస్తికవాది ) మాకు దేవుడు లేడు అంటూ చెప్తుండేవారు. అవన్నీ నమ్మి నేను దైవ ప్రసాదాన్ని నిరాకరించటం లాంటి తప్పులు కూడా చేశాను.
కానీ, భగవంతుడు దయామయుడు కాబట్టి నన్ను క్షమించారు. )
కొన్ని సంవత్సరాల క్రితం........
ఒక రోజు మా అబ్బాయి చిన్నప్పుడు ( నెలల వయసు ఉన్నప్పుడు ) హఠాత్తుగా విపరీతంగా ఏడవటం మొదలుపెట్టాడు.
ఎంత ఊరుకోబెట్టినా ఆపకుండా గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్నాడు. కడుపు నొప్పి అనుకుని మందు కూడా వేశాను.. బొమ్మలు ఇచ్చినా, బయట తిప్పినా, ఏడుపు ఆపలేదు.
నాకు చాలా భయం వేసింది. ఏం జరిగిందో తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో తెలియని భయం, అయ్యో పిల్లాడు ఇంత బాధ పడుతున్నాడే అన్న బాధ ..
నేను ఎంత ప్రయత్నించినా బాబు ఏడుపు ఆపలేదు.
*ఆ గందరగోళంలో వత్తిడితో కూడిన విసుగుతో నేను బాబును ఒక చిన్న దెబ్బ కూడా వేసినట్లు గుర్తు. అయినా ఏడుపు ఆపలేదు.
ఇక భయం వేసి నా భర్తకు ఫోన్ చేసి హాస్పిటల్ కు తీసుకు వెళ్దాము... అని చెబుదామనుకుంటుంటే , ఏడ్చిఏడ్చి అలసిపోయి పిల్లాడు నిద్రపోవటం జరిగింది.
* బాబును మంచంపై పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంటే చూశాను. తన చేతి వెనుక ఎర్రటి చీమ కుడుతోంది.
దానిని తీసిపారేశాను. కానీ , ఆ సంఘటన తరువాత నేను ఉద్యోగం చెయ్యలేదని బాధపడటం తగ్గిపోయింది.
ఇదంతా ఆలోచిస్తే నాకు ఎంతో బాధ కలిగింది.
తల్లినయిన నాకే విసుగు కలిగిందే ! అయ్యో ! తన బాధ ఇదీ అని చెప్పటానికి ఇంకా మాటలు కూడా రాని చంటిపిల్లలను పనివాళ్ళకు, లేక క్రచ్ లకు అప్పగించి వెళితే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని ?
అంటే వాళ్ళు సరిగ్గా చూడరని కాదు. బాగా చూసె వాళ్ళు కూడా కొందరు ఉంటారు లెండి.
ఎంతైనా ఇంటి వాళ్ళంత ఆప్యాయంగా చూస్తారా ? ఏమో !
పూర్వం పేదస్త్రీలు పనులకు వెళ్ళేటప్పుడు తమ చంటి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్ళి చీరతో వీపుకు కట్టుకుని పనిచేసేవారట. లేకపోతే పొలం గట్టున చెట్టుకు చీరతో కట్టిన ఉయ్యాలలో పడుకోబెట్టి కొంచెం పెద్దపిల్లలను కాపలాగ పెట్టి పనులు చేసుకొనేవారట.
( అంటే ఇప్పుడు అందరూ అలా చేయమని కాదు. వాళ్ళు పిల్లలను అంత జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్పటానికి అలా చెప్పాను అంతే. ).
. మేము ఒక దగ్గర ఉన్నప్పుడు... మా పొరుగున ఇంట్లో ఒకరి అమ్మాయి బిడ్డ పుట్టాక రెండో నెలలోనే పాలుత్రాగే బిడ్డను తల్లిదండ్రుల వద్ద వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలు వెళ్ళిపోయింది.( కెరీర్ కోసమని .)
( ఆమెకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం కూడా లేదు. ( అయినా సంపాదనకు అంతు ఎక్కడుంది ? )
పెద్దవాళ్ళు పనిలో సాయం చేసే ఆమె సహాయంతో ఆ బిడ్డను చూసేవారు. పని ఆమె రానిరోజున వాళ్ళ పని ఇక అంతే.
పూర్వం తల్లిదండ్రులు చంటిపిల్లలను పెంచుతుంటే తాతా బామ్మలు, మనుమలు,మనుమరాండ్ర ముచ్చట్లతో కాలం గడిపేవారు.
కానీ, డాక్టర్ వంటి వృత్తులలో ఉన్న ఆడవాళ్ళ పిల్లలను పెంచటానికి మాత్రం వారి పెద్దవాళ్ళు తప్పక సహాయం చేయటం బాగుంటుంది.
అంటే , నాకు ఏమనిపిస్తుందంటే .......
వీలయినంతవరకు చంటి పిల్లలను పెంపకానికి బయటివాళ్ళ దగ్గర వదలటం కంటే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర ( తాతగార్లు, అమ్మమ్మ,నాయనమ్మ) వదలడమే మంచిది అనిపిస్తుంది....
ఇప్పుడు నాకు ఇంటిని చూసుకోవటం, కొంచెం సేపు పూజ చేసుకోవటం, పత్రికలు, పుస్తకాలు చదవటం ఇలా సమయం సరిపోవటం లేదు.
అసలు పుస్తక పఠనం అలవాటు ఉన్నవారికి బోర్ కొడుతోంది అనే సమస్యే ఉండదు..
న్యూక్లియర్ ఫామిలీ లో ఉండే నష్టాలు ఇంకా చాలానే ఉన్నాయండి. కాని మారుతున్న పరిస్థితులివి. కొంతమంది పెద్దలు తామే వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. స్త్రీల బాధ్యతలు పెరిగినప్పుడు, ఉద్యోగాలు కావాలి అనుకున్నప్పుడు, ఎంత మంది తల్లులు ఇటువంటి మానసిక వేదన అనుభవిస్తున్నారో తలచుకుంటే బాధనిపిస్తుంది. చాలా ఆఫీస్ లల్లో క్రచ్ లు పెడుతున్నారు. అలాంటి కొన్ని సదుపాయాలు ఆయా ఆఫీసులు కలగ చేస్తే బాగుంటుంది. తల్లికి మానసిక వేదన తప్పుతుంది.
ReplyDeleteచాల బాగ చెప్పారు. మా అమ్మాయి తన మూడు నెలల బాబుని నా దగ్గర వదిలి 4,5 నెలలు తప్పని సరిగ వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది.బాబుని చూసుకోవడం నాకు ముచ్చటగానే ఉండేది. కాని తల్లికి
ReplyDeleteదూరంగా పెరగడం నాకు చాల బాధకలిగించేది.మధ్యలో 1-2 సార్లు వచ్చి
వెళ్ళేది. వాళ్ళమ్మ దగ్గరున్నపుడు వాడిలో చురుకుదనం కనిపించేది.దగ్గరలేనప్పుదు చాలా డల్ గా ఉండేవాడు.అలాంటిది పిల్లల్ని బయటివారికి అప్పజెప్సడం అంటే చాల బాధాకరం పిల్లలకి 4,5 సంవత్సరాలు వచ్చేవరకు తల్లి దగ్గర పెరగడం మంచిది.
,
మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరన్నట్లు చాలా మంది ఉద్యోగం చేసే తల్లులు పిల్లల గురించి బాధపడుతూనే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు.
.మీరన్నట్లు కొంతమంది పెద్దలు తామే వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. నాకు తెలిసిన భార్యాభర్తలు రిటైర్ అయాక కొంతకాలం కొడుకు దగ్గర ఉండటానికి వెళ్ళారండి. వెళ్ళిన కొద్దికాలానికే తిరిగి వచ్చేశారు.
అదేమిటని అడిగితే, వారి కోడలు ఉద్యోగానికి వెళ్ళి రాత్రికే వస్తారట. ఈ లోపు ఇంటిపని, పిల్లల పని వీరు చెయ్యవలసి వచ్చేదట. ఈ పెద్దవయసులో తాము ఆ పనంతా చెయ్యలేమని వారు వచ్చేశారట.
అంటే కోడలు కొంచెం ముందే వస్తే కొద్దిపని ఆమె చేస్తుంది. పెద్దవారు ఎక్కువ పని చేయలేరు గదా !.ఎవరి కారణాలు వారివి. అనిపించిందండి
ఈ మధ్యలో పిల్లలు బాధలు పడుతున్నారు. అందుకే పిల్లలను చదువు పేరుతో హాస్టల్స్ లో వేస్తున్నారు. అక్కడయితే పిల్లల బాధలు కళ్ళకు కనబడవు కదా ! కొన్ని హాస్టల్స్ లో ప్రొద్దున్నే బాత్రూం కు వెళ్ళటానికి ఉదయం 3 గంటలకే లేచి క్యూలో నుంచోవాలట.
ఏంటో ! కలికాలమండి....
మీకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరు అన్నారు కదా ! ,........ మీ మనవడు వాళ్ళమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆ పసివాడిలో చురుకుదనం కనిపించేది అని. .
నిజమేనండి. తల్లిని బిడ్డలు అతి చిన్నవయసు నుండే గుర్తు పడతారట. తల్లి పాలు త్రాగి పెరిగిన పిల్లలకు భవిష్యత్తులో జబ్బులు కూడా ఎక్కువగా రావట. ఇంకా తల్లీబిడ్డల మధ్య ఆప్యాయత కూడా చక్కగా ఉంటుందట. .