శరన్నవరాత్రులు మరియు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలవ్వబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
శరన్నవరాత్రులు మరియు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలవ్వబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనాకానీ, ఇలా జరగటం అత్యంత బాధాకరం. అక్కడి ప్రజల పరిస్థితి తలచుకుంటే ఎంతో బాధగా ఉంది.
యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియక, ఎప్పుడు ఏ బాంబులు మీద పడతాయో? కుటుంబంలోని వారు ఎటు చెల్లాచెదురవుతారో తెలియక ఎంత భయంతో అల్లాడుతారో? కుటుంబంలోని పెద్దవాళ్లు చనిపోతే అమాయకులైన చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో బాధ కలుగుతోంది.
యుద్ధాలు లేకుండా ఉంటేనే మన దగ్గర ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాము. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు అల్లాడుతున్నారు..ఇంకో చోట యుద్ధాలు.. ఇదంతా ఏమిటో ? అర్ధం కావటం లేదు.
కొంతమంది పట్ల మరి కొందరు దాడులు చేయటం కూడా బాధాకరం. ఈ దాడుల సమయంలో పిల్లలు, పెద్దవాళ్లు భయంతో ఎంత అల్లాడిపోతారో.. తలచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
ఎక్కడైనా ఏ ప్రజల పట్ల అయినా కూడా, ఆ విధంగా దాడులు చేయటం బాధాకరం.
మనుషుల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉంటాయి. గొడవలకు అనేక కారణాలుండవచ్చు.
కొందరు ఇతరులపై ఆధిపత్యం కొరకు గొడవలకు, దాడులకు, యుద్ధాలకు సిద్ధపడతారు. కొందరు శత్రువుల నుంచి తమను రక్షించుకొనడానికి యుద్ధాలు చేస్తారు. ఇంకా ఎన్నో కారణాలుండవచ్చు.
గొడవలు జరిగినప్పుడు .. ఎవరి కోణంలో వాళ్ళు ..మా అభిప్రాయమే సరైనది.. అంటారు. ఎవరి వాదన వారిది.
కారణాలేమైనా, యుద్ధాల వంటి వాటి వల్ల ఎన్నో బాధలుంటాయి. అందువల్ల..దాడులు, యుద్ధాల వంటివి ఆగిపోతే బాగుంటుంది.
ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి.
************
కొన్ని విషయములు..link..
శ్రీ వేంకటేశ్వరస్వామికి సమర్పించే పదార్ధాలలో వాడే ఆవునేతిలో కల్తీ జరిగిందని అంటున్నారు. ఇలా కల్తీ చేయటం మహాపరాధం.
దైవానికి సమర్పించే పదార్ధాలలో కల్తీ చేసే వారు, దైవం పట్లకానీ, సాటి జీవులపట్ల కానీ అధర్మం చేసినవారు దైవన్యాయస్థానం నుంచి తప్పించుకోలేరు.
*************
ఆవునేతిని వేరే సంస్థల నుంచి కొనటం కాకుండా, దేవస్థానం నిర్వాహకులు ఆవులను పెంచి, పాలను సేకరించి, నేతిని తీసి వాడవచ్చు.
పశుగ్రాసం కొరకు కొంత భూమిని కొని (దేవాలయ భూములు కూడా ఉంటాయి ..) చక్కగా పశువులను పెంచితే, స్వచ్చమైన నేయి లభిస్తుంది. ఆ నెయ్యి మిగిలితే ఇతర దేవాలయాలకు కూడా సరఫరా చేయవచ్చు.
లేదంటే, జాగ్రత్తగా పరీక్షించి..కల్తీ చేయని వారి వద్ద నుండి నేతిని తీసుకోవచ్చు.
***********
దేవాలయాలకు కొందరు గోవులను దానం చేస్తారు. అయితే, గోవులను పోషించటానికి, వాటిని చక్కగా చూసుకోవడానికి సరైన వ్యవస్థ ఉండాలి. అందుకు చాలా ధనం అవసరం. గోవులను చక్కగా చూసుకునే మనుషులు కూడా ఉండాలి.
*************
ఇంకొక విషయమేమిటంటే, హిందుధర్మాన్ని నమ్మిన హిందువులే దేవస్థానాల వద్ద పనిచేయాలి. హిందుధర్మాన్ని నమ్మని వారిని దేవస్థానాలలో నియమించటం ఏమిటో అర్ధం కాదు.
అయితే, కొందరు హిందువులు కూడా పాపభీతి లేకుండా, దేవాలయాల వద్ద అధర్మంగా ప్రవర్తించటం వార్తల ద్వారా తెలుస్తుంది. ఇలాంటి వారిని కూడా దేవాలయాల పనుల నుండి దూరంగా ఉంచాలి.
*************
సహజంగా పశువులు ఆరుబయట తిరుగుతూ మేత మేస్తాయి. పాతకాలంలో ఆవులను పెంచేవారు కూడా, మేత మేయడానికి వాటిని పచ్చికబయళ్లకు తీసుకువెళ్ళేవారని తెలుస్తుంది.
ఈ రోజుల్లో చాలాచోట్ల గోవులను ఒక దగ్గర కట్టేసి మేత వేసి పెంచుతున్నారు.
గోవులు మేతకు వెళ్లి తిరిగివచ్చే సమయాన్ని గోధూళి సమయంగా చెబుతారు. ఆ సమయం విలువైనదని ప్రాచీనులు తెలియజేసారు.
నాకు ఆవుల పెంపకం గురించి సరిగ్గా తెలియదు. నాకు తెలిసినంతలో, ఈ మధ్యకాలంలో ఆవులను, గేదెలను పెంచేవారు ..అవి ఉండే స్థలంలో నేలను సిమెంటుతో చేయిస్తున్నారట. అలా సిమెంట్ నేలపై పడుకోవటం అనేది వాటికి కష్టంగా ఉంటుందట.
మూగజీవులు వాటి బాధలను చెప్పలేవు కదా.. మనుషులు ఆలోచించి వాటికి ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా ఏర్పాటు చేయాలి.
***************
ఆవులు పవిత్రమైనవి, ఆవులను పూజించాలి..అని చెబుతారు . కానీ, ఈ రోజుల్లో పాలు, నెయ్యి వాడేవారిలో... ఎంతమంది గోవులను చక్కగా పెంచి, వాటి పాలను, నేతిని వాడుతున్నారు?
అందరూ ఆవులను చక్కగా చూసేవాళ్లయితే, ఆవులు ఆహారం కొరకు రోడ్లపై ఎందుకు తిరుగుతాయి? కబేళాలకు అన్ని పశువులు ఎందుకు తీసుకుపోబడతాయి?
పెద్ద వయస్సు వచ్చిన ఆవుల పేడను ఎరువుగా చేసి మొక్కలకు వేయవచ్చు.
***********
పాతరోజుల్లో తిరుమలకు ఎందరు భక్తులు వచ్చేవారో తెలియదు కానీ, రవాణావసతులు పెరిగిన ఈ రోజుల్లో రోజూ వేలమంది తిరుమలకు వస్తున్నారు. ఎక్కువమంది దైవదర్శనానికి రావటం మంచిదే. అయితే, అంతమందికి లడ్డూలను ఇవ్వాలంటే, వేల కిలోల నెయ్యి అవసరమవుతుందట.
స్వచ్ఛమైన నెయ్యి బోలెడు లభించటం
కష్టమనుకుంటే, తిరుమలలో దైవానికి స్వచ్ఛమైన నేతితో కొన్ని లడ్డూలను
నివేదించి, తీపిబూందీని కూడా దైవానికి నివేదించి, భక్తులకు చిన్న లడ్డును
లేక తీపిబూంది వంటివి ప్రసాదంగా ఇవ్వవచ్చు. పాతకాలంలో తిరుమలలో తీపిబూందీని
కూడా ప్రసాదంగా ఇచ్చేవారని అంటున్నారు.
గుడినుంచి తెచ్చిన లడ్డు వంటి ప్రసాదాన్ని.. చాలామందికి కొద్దిగా పంచాలన్నా కష్టమే.
బోలెడు ప్రసాదం తయారీకి బోలెడు నెయ్యి ..అవసరమవుతుంది. అందువల్ల, ఎక్కువమందికి ఇవ్వాలంటే కొద్దిగా ఇస్తే సరిపోతుంది.
**********
దైవమే దిక్కు.
మనుషులు దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తే దైవకృపను పొందగలరు.
కర్నూల్లో పెద్ద వరద వచ్చినప్పుడు మేము ఉద్యోగరీత్యా కర్నూల్ లో ఉండేవాళ్లం. సడన్ గా వరదనీరు పెరిగి కర్నూల్ మునిగిపోతుందంటూ వార్తలు వచ్చాయి.
డ్యాం సామర్ధ్యం కన్నా ఎక్కువ నీరు వస్తోంది కాబట్టి, ఇంకో కొన్ని గంటలు గడిస్తే తప్ప కర్నూలు ఏమవుతుందో ఏమీ చెప్పలేము..తాటిచెట్టు అంత ఎత్తు నీళ్ళు ఊళ్ళోకి వస్తోందంటూ..వార్తలు వచ్చాయి.
ఈ
వార్తలు విన్న ప్రజలు కొందరు, వేరే ఊర్లలోని బంధువుల వద్దకు వెళ్లారు.
కొందరు వేరే ఊళ్ళలోని హోటల్ రూంస్ తీసుకుని ఉన్నారు. బాగా ట్రాఫిక్ జాం
కూడా అయ్యి, వెళ్లలేక చాలామంది తిరిగి వచ్చేసారన్నారు.
వర్షాలు తగ్గితే తప్ప ఏమీ చెయ్యలేము...అనే పరిస్థితి. భయాందోళనతో దైవాన్ని స్మరించుకున్నాము. దైవం దయ వల్ల డ్యాంకు ఏమీ కాలేదు.
వరదద్వారా వచ్చిన బురద తీయటం చాలా కష్టమయ్యింది. మా ఇల్లు ఎత్తుగా ఉంది కాబట్టి, మాకు వరదనీరు రాలేదు.
మా ఇంటిచుట్టుపక్కవాళ్ళం కొందరం కలిసి వరదబాధితుల వద్దకు వెళ్ళి కొన్ని పులిహోర పొట్లాలు ఇచ్చాము. నేను కొద్దిమందికి.. అన్నం, కొబ్బరిపచ్చడి, టమేటో పప్పు, వంకాయ కూర.. పేపర్ ప్లేట్లలో పెట్టి ..ఇవ్వటం జరిగింది.
అప్పుడు చాలామంది రోడ్లపైన నడుచుకుంటూ వెళ్ళారు. వరదబాధితులకు చాలామంది ఇతరప్రాంతాల వారు సహాయం చేసారు. దైవం దయవల్ల డ్యాముకు ఏమీకాలేదు..కర్నూల్ కు భారీ ముప్పు జరగలేదు.
************
మనదేశంలో అనేకరాష్ట్రాలలో పెద్దడ్యాములు ఉన్నాయి...వాన పెరిగితే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది.
గతకొద్దిరోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారెజ్ గురించి, వానలు పెరిగితే బ్యారేజ్ నీటిమట్టం పెరుగుతుంది కాబట్టి, ఆ ప్రవాహాన్ని బ్యారేజ్ తట్టుకుంటుందా? లేదా? బ్యారేజ్ కు ఏదో ప్రమాదం జరిగిపోతుందంటూ ..వార్తలు వచ్చాయి.
ఇలాంటప్పుడు ఎవరికైనా ఎంతో భయాందోళనలు కలుగుతాయి. ప్రజలు పానిక్ అవుతారు. ఇలాంటివార్తలు విన్నప్పుడు.. డ్యాంల, బ్యారేజీల భద్రత ఎంత? అనే సందేహాలు ,భయాందోళనలు కలుగుతున్నాయి. ఎవరైనా కుట్రలు చేసినా చాలా ప్రమాదం.
ఏమైనా జరిగితే ఆ వినాశనాన్ని ఊహించగలమా? ఇవన్నీ గమనిస్తే, భారీ డ్యాములు నిర్మించటం కన్నా, చిన్నడ్యాములు నిర్మిస్తే మంచిదనిపిస్తుంది.
ఏ కారణం చేతైనా భారీ డ్యాములు నిర్మిస్తే, ఆ డ్యాములకు ఎక్కువ నీరు వచ్చినా ప్రమాదం జరగకుండా ..ముందు జాగ్రత్తలు తీసుకుని నిర్మించాలి. ఒక పెద్ద డ్యాము కన్నా, రెండు లేక మూడు చిన్న డ్యాంలలో( రిజర్వాయర్లలో ) నీటిని నిల్వ చేసుకుంటే మంచిదనిపిస్తుంది.
*************
ప్రతిఊరిలో చెరువులను పద్ధతిగా ఉంచుకోవాలి. కాలువలను చక్కగా ఉంచుకోవాలి. చెక్ డ్యాములు నిర్మించుకోవాలి. ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి.
సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వచ్చిపడటం వల్ల కూడా ..కొన్ని సమస్యలు కలిగి ప్రజలలో ఆందోళన కలుగుతుంది.
దేశంలో సమస్యలు ఒకదానితరువాత ఒకటి ఉంటూనే ఉన్నాయి. సమస్యలు ఎందుకొస్తున్నాయి? వీటిని ఎలా పరిష్కరించుకోవాలని అందరూ ఆలోచించి పరిష్కరించుకోవాలి.
దేశంలో ఎప్పుడూ సమస్యలేనా? ..ఇంకెప్పుడు భారతదేశం బాగుపడుతుంది?
అవినీతి, స్త్రీల పట్ల అత్యాచారాలు, నిరుద్యోగసమస్య....ఇలాంటి పరిస్థితి మారాలి.
ఇవన్నీ పోవాలి. పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే.
భారతదేశం ఎంతో గొప్పదేశం అయ్యుండి కూడా, ఇక్కడి ప్రజలు ఎందుకు దేశాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు?
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలయినా కూడా భారతదేశం పేదదేశంగా ఎందుకు ఉంది? ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా నిరాశ కలుగుతుంది .
మనం మనదేశాన్ని అభివృద్ధి చేసుకోలేని చేతకాని దద్దమ్మలం, చవటలం కాదు కదా..దేశపౌరులందరూ దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలి.
సమాజాన్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే, కొన్నిసార్లు కఠినంగా ఉండటం కూడా అవసరం.
పాలకులు సమాజాన్ని చక్కగా అభివృద్ధి చేయాలి..అదే సమయంలో చెడ్డగా ప్రవర్తించేవారిని శిక్షించాలి.
పాలకులు చెడ్డవారిపట్ల ఉదాశీనంగా, చేతకానివారిలా ఉంటే సమాజానికి హాని జరుగుతుంది. సామరస్యం అంటూ..చెడు పట్ల ఉదాశీనంగా ఉండటం గొప్ప అనిపించుకోదు.
యువత ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లే పరిస్థితి కాకుండా, స్వదేశంలోనే చక్కగా జీవించేలా వ్యవస్థలను మార్చుకోవాలి.
ఎప్పుడూ సినిమాలు, క్రికెట్, సోషల్మీడియా, అస్తమాను సెల్ఫోన్లు చూడటం..అని కాకుండా, పట్టుదలగా దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించే దిశగా యువత మరియు ప్రజలందరూ మారాలి.
జనాలు కొందరు ఒక మైక్ పుచ్చుకుని, పనిచేసే వారి వద్దకు వెళ్ళి అనేక ప్రశ్నలు అడుగుతూ విసిగిస్తుంటారు. ఇంకా కొందరు రెచ్చగొట్టే ప్రశ్నలు వేస్తూ గొడవలు పెడుతుంటారు.
..........
రాజకీయాలు స్వచ్చంగా ఉండేలా మార్పులు జరగాలి. అవినీతి పోవాలి. పేద, ధనిక అసమానతలు తగ్గాలి.. భారతదేశం గత వైభవాన్ని పొందాలి. భారతీయులు ప్రపంచానికి మార్గదర్శకులు కావాలి.
అంతా దైవం దయ.
..............
మంచి అంతా దైవం దయ. దైవానికి అనేక కృతజ్ఞతలు.
ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ.. గురించి ఈనాడులో కొన్ని వివరాలు చదివిన తరువాత ..
సింగపూర్ను ఆయన ఎన్నో కోణాల నుంచి అభివృద్ధి చేయటం జరిగిందని తెలుస్తోంది.
........
కొన్ని విషయాల గురించి చెప్పుకుందాము.
సింగపూర్ లో సహజ వనరులు లేకపోయినా అంతర్జాతీయ వ్యాపారంలో దూసుకువెళ్తోందట.
( మనదేశం కూడా ఆర్ధికంగా అంతర్జాతీయంగా వెలుగులు విరజిమ్మితే బాగుండు .)
సింగపూర్ ప్రజలకు ఉన్నతమైన అలవాట్లు ఉండాలని ఆయన భావించారట. ప్రజల వ్యసనాలను వదిలించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసారట .
( మనదేశంలో ప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయం కోసం ఆధారపడకుండా ఉంటే బాగుంటుంది. .)
వెనుకాముందూ చూడకుండా వీధుల్లో తుపుక్కున ఊసే వారితో జరిమానా కట్టించారట.
( మన దేశంలో కూడా ఇలాంటివి అమలులోకొస్తే బాగుంటుంది.)
ఇద్దరు పిల్లల్ని మించి కనొద్దని హుకుం జారీ చేసాడట. అయినా వినకుండా గంపెడు పిల్లల్ని కనేవారి మీద పన్నులు వేశారట.
( ఇక్కడ పన్నులు వేయకపోయినా, ఓటుహక్కు రద్దుచేయటం..వంటివి చేయొచ్చేమో? ఎవరికైనా ఒక్కరు కాకుండా, ఇద్దరు పిల్లలు ఉంటే మంచిది.)
కాలుష్యనివారణకూ అధిక ప్రాధాన్యతను ఇచ్చారట... కారు కొనాలంటే ఆ
ధరకు ఒకటిన్నర రెట్లు మొత్తాన్ని పన్నుగా చెల్లించాలనే షరతు విధించారట.
ఇంకా కొన్ని షరతులూ ఉన్నాయట.
ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటే, ప్రజారవాణా వ్యవస్థను
ఉపయోగించుకోవచ్చట. అందుకే సింగపూర్ లో ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే కారు
ఉంటుందట.
( మన దేశంలో కూడా ఇలా జరిగితే బాగుంటుంది.)
..........
ఆయన అధికారంలోకి రాకముందు, ప్రజలు .. మురుగునీటినీ, పారిశ్రామిక వ్యర్ధాల్నీ నదుల్లోకి మళ్లించేవారట.
మన జీవితాల్ని మనమే సర్వనాశనం చేసుకుంటామా? ఇదేం పద్ధతి ? అని ఆగ్రహంగా ప్రశ్నించారట లీ క్వాన్ యూ.
ప్రజలు ఆలోచనలో పడి జలవనరులను సంరక్షించుకోవటానికి స్వచ్చందంగా ముందుకొచ్చారట..
( మనదేశంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరిగితే బాగుండు . మనదేశప్రజలు కూడా జలవనరులను సంరక్షించుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకొస్తే బాగుంటుంది.)
...............
మాతృభాషకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారట.
( మాతృభాష అంటే మృత భాషగా భావించే మన దేశంలోని జనం తమ అభిప్రాయాలను మార్చుకుని మాతృభాషను గౌరవిస్తే బాగుంటుంది..)
సింగపూర్ లో అవినీతి చాలా తక్కువట.
( ఇలాంటివి మనదేశంలో అసలు ఊహించగలమా ? మన దేశంలో కూడా అవినీతిపరుల పని పట్టే పటిష్టమైన వ్యవస్థ వస్తే బాగుంటుంది.)
.............
సింగపూర్లో ఖనిజవనరులు అసలేమీ లేవట. నీటివసతి కూడా అంతంత మాత్రమేనట. లీ క్వాన్ యూ అధికారాన్ని చేపట్టే నాటికి సింగపూర్ సంక్షుభిత దేశమట.
అయితే, నాయకుని ఆలోచనలకు ప్రజలూ స్పందించి తమ సహకారాన్ని అందించారట.
అయినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సింగపూర్ను అభివృద్ధి చేసిన
మహామనీషి లీ క్వాన్ యూ అంటారు. ఇలాంటి నాయకులను ప్రజలు కలకాలం
గుర్తుంచుకోవటంలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు.
అయితే, నాయకునికి సహకరించిన అధికారులూ, ప్రజలూ కూడా ఎంతో అభినందనీయులే.
నాయకులు, అధికారులూ, ప్రజలూ కలిసి పనిచేస్తే చక్కటి స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని అనుభవపూర్వకంగా తెలుస్తోంది.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కొంత ప్రమాదంలో ఉందంటున్నారు. దైవం దయవల్ల వాన పడటం తగ్గింది. బ్యారేజ్ కు ఏమీకాదు.
***************
ప్రపంచంలో చాలాచోట్ల పెద్ద ఎత్తున వరదలు, ఎండలు, అతివృష్టి, అనావృష్టి..వంటివి వస్తున్నాయి. పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల కూడా ఇలా జరుగుతాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు ఏం చేయలేరు.
మనుషులు అంతులేని కోరికలతో టెక్నాలజీ పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తే, కార్బండయాక్సైడ్ పెరగటం, ఓజోన్ పొర పలచబడటం, భూమి వేడెక్కటం, హుధుద్ తుపాన్ లాగ తుపాన్లు రావటం ..వంటివి ఎన్నో జరుగుతాయి.
గ్లోబల్ వార్మింగ్.. వంటి వాటివల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతాయంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో సముద్రమట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఊర్లు..
ఉదా..సముద్రపు ఒడ్డున ఉన్న వైజాగ్, ముంబై, చెన్నై..వంటి ఊర్లు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయంటున్నారు.
కొందరు పర్యావరణహిత శాస్త్రవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, చాలామంది పట్టించుకోవటం లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల అవి కాలువల్లో, చెరువుల్లో నీటికి అడ్డం పడిపోతున్నాయి.
డ్రైనేజ్ సిస్టం సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. వానలు పడితే ముంబయ్, చెన్నై, హైదరాబాద్ ..వంటి నగరాల్లో కూడా వరదలు వస్తున్నాయి.
*****************
కొండచరియల క్రింద , చెరువుల్లో,కాలువల్లో.... ఇళ్లు కడితే ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది.
అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేస్తే మరల ప్రభుత్వాలను తిట్టిపోస్తారు. అక్రమంగా కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగస్తుల ఆస్తులను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి. అవినీతిపనులు చేసే వారికి కఠినశిక్షలుండాలి.
ప్రభుత్వం వారు, అధికారులు, ప్రజలు అందరు .. ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే వ్యవస్థలు అన్నీ బాగుంటాయి. అంతేకానీ, ఎవరికి వారు తప్పులు చేస్తూ ఉంటే వ్యవస్థల పరిస్థితి తప్పులతడకలాగే ఉంటుంది.
అవినీతితో వేలకోట్ల అక్రమ సంపాదన సంపాదించేవారు కొందరు, ఆఫీసుల్లో లంచాలు తీసుకుని, ఏ పనికైనా పర్మిషన్ ఇచ్చే వారు కొందరు, ఎన్నికల్లో వెయ్యి రూపాయలు.. ఒక మద్యం సీస..ఒక బిరియానిపాకెట్ తీసుకుని ఓట్లు వేసేవారు కొందరు. ప్రజలు చాలామంది ఇలా ఉన్నప్పుడు, వ్యవస్థ దానికి తగ్గట్లే ఉంటుంది.
సమాజంలోని అందరూ ఎవరి పని వారు సక్రమంగా చేస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది.
***********
దైవానికి కూడా భయపడకుండా చాలామంది పాపాలు చేస్తున్నారు. ఎవ్వరైనా దైవం నుంచి తప్పించుకోలేరు..అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మంచిది.
************
ఈ మధ్యకాలంలో చాలా ఊళ్ళలో వరదలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కటే అంతా చేయలేరు. ప్రజలు కూడా సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.
మా చిన్నతనంలో మా తాతగారి ఊర్లో వేసవికాలంలో చెరువు ఎండినప్పుడు, ప్రజలే కలసి పూడిక తీసేవారు. ఎండ తగ్గిన తరువాత సాయంకాలం పనిచేసేవారు. కొన్నిసార్లు వెన్నెలవెలుగులో కూడా పనిచేసేవారు. అదంతా చాలా సందడిగా ఉండేది.
చెరువులను, కాలువలను ఆక్రమించి .. ఇప్పటికే ఎంతోకాలం నుంచి బోలెడు కట్టడాలు నిర్మించారు.
అవి చెరువులు, కాలువలు ప్రవహించే ప్రాంతాలని కొందరికి తెలిసి కూడా కట్టడాలను నిర్మిస్తే, కొందరు తెలియక కొన్నామంటారు. తెలిసిచేసినా, తెలియకచేసినా దాని పర్యవసానాలు ఉంటాయి.
అయితే, ఇప్పుడు ఆ కట్టడాలను కూల్చాలంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఇక, ప్రభుత్వాలు ఏం చేయగలరు? మరీ అడ్దంకిగా ఉన్న వాటిని కూల్చక తప్పదు కానీ, అన్నింటిని పడగొట్టాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో? చెప్పలేము.
భవిష్యత్తులో అయినా కొత్తగా అక్రమకట్టడాలు కట్టకుండా ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి.
వరదలు వచ్చే ప్రాంతాలలో ఇళ్లను భూమికి బాగా ఎత్తుగా కడితే.. కొద్దిగా వరద వచ్చినప్పుడు నీరు ఇంట్లోకి రాకుండా ఉంటుంది.
బుడమేరు వరద రావటం వంటి సంఘటనలలో.. బుడమేరు వద్ద ఎత్తుగా గోడ కట్టడం వల్ల, వరద ఊరిమీదకు వచ్చే ప్రమాదం తగ్గవచ్చని నిపుణులు అంటున్నారట.
బుడమేరు నీరు సహజంగా కొల్లేరు సరస్సులో కలుస్తుందట. బుడమేరు కొల్లేరు వరకు సరిగ్గా వెళ్ళేలా దారిలో అడ్డంకులను తొలగించాలి. కొందరు జనాలు కొల్లేరును కూడా కబ్జా చేస్తున్నారట.
గండ్లు పడి పెద్ద ఎత్తున వరదలు ఊర్ల మీద పడినప్పుడు.. ప్రాణనష్టం, వందలు లేక వేలు కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది..సహాయకార్యక్రమాలకు కూడా బోలెడు శ్రమ మరియు బోలెడు డబ్బు ఖర్చవుతుంది ..అలాంటప్పుడు, ఎక్కువ డబ్బు ఖర్చయితే.. అప్పు తెచ్చి అయినా .. గోడవంటిది కట్టడం లేక వరద నీరు నిల్వ కొరకు చిన్న రిజర్వాయర్ కట్టడం.. వంటి శాశ్వతపరిష్కారాలు చేయటం మంచిది.
వరదలు వచ్చే అవకాశమున్న ఊర్లలో.. అక్కడక్కడా ఎత్తైన భవనాలను నిర్మిస్తే వరదబాధితులకు పునరావాసకేంద్రాలుగా ఉపయోగించవచ్చు.
ప్రభుత్వాలు పడవలను, బల్లకట్టులను.. ఎక్కువసంఖ్యలో కొనుగోలు చేసి ఉంచి, పడవలు నడిపే వారిని సిద్ధం చేసి ఉంచుకుంటే..ఎప్పుడైనా వరదలు వస్తే ప్రజలను త్వరగా రక్షించడానికి, ఇళ్లపైన ఉన్నవారికి ఆహారపొట్లాలను అందించడానికి పడవలు ఉపయోగపడతాయి. పడవల ద్వారా, మారుమూల ఉన్నవారికి కూడా త్వరగా సహాయాన్ని అందించవచ్చు.
**********
పడవలను ఉపయోగించటం మనకు కొత్తకాని, కేరళలో పడవలను ఎక్కువగా ఉపయోగిస్తారు.. అక్కడ రవాణాకు కూడా పడవలను ఉపయోగిస్తారు. మనకు కూడా పాతకాలంలో బకింగ్ హాం కాలువ ద్వారా రవాణావ్యవస్థ ఉండేదట.
*************
ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు పడవలు ఉపయోగపడతాయి. నీరు తగ్గినతరువాత పడవలు ఉపయోగపడవు. విజయవాడలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు పడవలను ఉపయోగించారు. నీరు తగ్గిన ప్రాంతాలలో వరదబాధితులను రక్షించడానికి ప్రభుత్వం వారు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇది మంచి ఆలోచన. ఇలాంటప్పుడు ట్రాక్టర్లు బాగా ఉపయోగపడతాయి.
***************
విజయవాడ వరదల్లో ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు. ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.
గోదావరి జిల్లాలు, విశాఖలో, ఉత్తరాంధ్రలో ..విపరీత వర్షాలు త్వరగా తగ్గుముఖం పడితే
బాగుండు. ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు. ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.
కొందరు జోతిష్కులు చెబుతున్న ప్రకారం.. రాబోయేరోజుల్లో తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయని చెబుతున్నారు. అవి వింటే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి.
అయితే, భక్తితో దైవస్మరణ, దైవనామస్మరణ, లోకక్షేమం కొరకు యజ్ఞయాగాదులు చేయటం, ధర్మబద్ధంగా జీవించటం..వంటి వాటివల్ల రాబోయే విపత్తులు గణనీయంగా తగ్గుతాయి.
గ్రహ స్థితులు ఎలా ఉన్నా .. దైవభక్తి, మన ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితులను మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని .. అందుకు సంబంధించిన విధులను చక్కగా ఆచరించటం మంచిది. అందువల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎక్కువసార్లు చేయకపోయినా, కొన్నిసార్లు అయినా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అయితే, గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లు పాటించటం మంచిది. సర్వగాయత్రి మంత్రాన్ని అందరూ చేయవచ్చు, సర్వగాయత్రిని చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
అయితే, కొందరు సర్వగాయత్రి మంత్రాన్ని చదవటంలో కూడా.. అలా కాదు, ఇలా చదవాలంటూ..చెబుతున్నారు. ఇవన్నీ సందేహాలు ఎందుకనుకుంటే.. దైవస్మరణ, దైవనామస్మరణ చక్కగా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కలికాలంలో దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయమని పెద్దలు తెలియజేసారు.
********************
వ్రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు.
ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.
ఉదా.. భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుందని తెలుస్తుంది.
*********
గ్రంధాల ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
ఎవరైనా బాగా పట్టుదలగా తపస్సు చేస్తే, దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది.
కొందరి విషయాలలో.. తపస్సు వల్ల విపరీతమైన వేడి వచ్చి, ఆ వేడి లోకమంతా వ్యాపిస్తే.. ఆ వేడిని తట్టుకోలేని ప్రజలు దేవతలను ప్రార్ధిస్తే.. దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది. ఆ వరాలను పొందిన తరువాత, వరాలను పొందినవారు వరగర్వంతో ప్రజలను బాధ పెడితే, అప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా లోకక్షేమం కొరకు దైవం వారిని చంపివేస్తారు.
ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, ఒక్కరు దృఢంగా తపస్సు చేస్తేనే లోకంపై చాలా ప్రభావం ఉన్నప్పుడు....కొందరైనా మంచివాళ్ళు లోకక్షేమం కొరకు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే ... దైవం వరాలను ప్రసాదిస్తారు.. అనిపించింది.
******************
లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తూ, పశుపక్ష్యాదులను చంపి తింటూ, పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా?
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా, సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.
మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.
ప్రపంచంలో మతాల పేరిట, అధికారం పేరిట, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం. దైవం అంటేనే శాంతి. అలాంటి దైవం పేరిట రక్తపాతాలు, మారణహోమాలు జరగటం ఏమిటో అర్ధంకాదు.
మతాల పేరుతో క్రూరంగా ప్రవర్తిసున్నవారు దైవం వద్ద తప్పక శిక్షను పొందుతారు.
అధికారం, సంపద కొరకు మతాలను కూడా స్వార్ధపూరితంగా వాడుకుంటారనిపిస్తుంది. ఇలాంటివారు
సామాన్యప్రజలకు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. వాళ్ళ మాటలు నమ్మిన జనాలు
...వారు ఏం చెపితే అది చేస్తారు. ఇది బాధాకరం. ప్రజలు విచక్షణతో ఆలోచించాలి.
అభద్రత భావం, తమ మాటే నెగ్గాలనే పట్టుదల ..వంటి లక్షణాల వల్ల ..కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ గొడవలు వస్తుంటాయి.
పాతకాలంలో యుద్ధాలలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. యుద్ధంలో స్త్రీలకు, పిల్లలకు, అమాయకులైన వారికి హాని చేయకూడదని నియమాలతో భారత దేశంలో యుద్ధాలు చేసేవారు. అక్కడక్కడా కొన్ని నేరాలు జరిగినా కూడా, ఎక్కువ హింస ఉండేదికాదు. విదేశీ దాడులలో మాత్రం పెద్ద ఎత్తున దాడులు జరిగాయి.
గతకొంతకాలంగా ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది. పిల్లలు, స్త్రీల పట్ల, మగవారి పట్ల .. దారుణాలు చేయటం ఏమిటో? వాళ్లు మనుషులేనా? అనిపిస్తుంది. అలాంటి వాళ్లను ఏం చేసినా పాపం ఉండదు. అలాంటి దారుణాలు చేసిన వారికి దైవం సరైన బుద్ధి తప్పక చెబుతారు.
సనాతనధర్మం, హిందువులు బాగుండాలని కోరుకుంటున్నాను.
ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళైనా అమాయకులు, మంచివాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ దేశానికి చెందినవాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా వారి చెడ్డతనం ...నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను. (వారి చెడ్డతనం పోని పరిస్థితిలో ఆ చెడ్డవాళ్లు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను.)
లోకకల్యాణం కొరకు పాతకాలంలో యజ్ఞయాగాదులు చేసేవారు. ఈ రోజుల్లో చాలావరకు కల్తి వస్తువులు ఉన్నాకూడా, వాటితోనే యజ్ఞయాగాదులు చేస్తే ఎంతోకొంత ఫలితం తప్పక ఉంటుంది.
ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి. దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.
ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా, నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం? వారి సంగతి దైవం చూసుకుంటారు.
కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.
ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ, పాపాలు చేసి అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.
సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు.
ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి. హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.
ఎవరైనా మనకు ఆపద కలిగించాలని చూస్తే, భయపడి కూర్చోము కదా..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము. ఎవ్వరైనా తమకు ఆపదలు సంభవించినప్పుడు అధైర్యపడకుండా, దైవాన్ని నమ్మి ఆ ఆపదల నుంచి రక్షించుకోవాలి. శత్రువులను ఎదుర్కుని గెలవాలి.
ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది. అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు.
మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.
కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలు వింటుంటే, చూస్తుంటే ..భరించలేని బాధగా ఉంది. రాక్షసమూక పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. ఇక దైవమే దిక్కు.
అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి.
అంతా దైవం దయ .
**************
ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి. యుద్ధాలు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు కష్టాలు పడుతున్నప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. దైవం చెడ్దవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. పురాణేతిహాసాలలో దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.
అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు.
మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి. దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
సృష్టిలో దైవం మహాశక్తి. ఒక్క దైవశక్తే ప్రపంచంలో అందరినీ సృష్టిస్తారు. అంతేకానీ, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క దైవం సృష్టించరు. విశాలమైన భూప్రపంచంలో వివిధ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అనేక మతాలు పద్ధతులు ఏర్పడ్డాయి. ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ఆరాధిస్తున్నారు.
అయితే, ఎవరైనా పాటించే పద్ధతులు ఇతరులకు హానికలిగించే విధంగా ఉండకూడదు.
భగవంతుని పేరుతో కూడా కొందరు ఇతరులను బాధించడానికి ప్రయత్నిస్తారు. అలా చేయటం చాలా తప్పు. జీవితంలో కష్టాలు పోవాలని దైవాన్ని ప్రార్ధిస్తాము. అలాంటప్పుడు దయామయులైన దైవం పేరు చెప్పి క్రూరమైన పనులు చేయటం ఏమిటి?
***************
సనాతనధర్మం మతం కాదంటారు కొందరు. సనాతనధర్మము ఆదర్శవంతమైన గొప్ప విధానము.
మన ప్రాచీనులు ..లోకాః సమస్తాః సుఖినో భవంతు..అని తెలియజేసారు. ఆ విధంగా ప్రపంచంలోని అందరూ బాగుండాలని కోరుకుంటాము.
పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు కలిగిఉండాలని మన పెద్దలు మనకు నేర్పించారు. పెద్దవాళ్ళు సహనాన్ని గురించి గొప్పగా నేర్పించినప్పుడు ప్రజలు సౌమ్యంగా తయారవుతారు.
సహనము,
పరమతసహనం..వంటిలక్షణాలు కలిగిఉండాలని పెద్దలు చెప్పటంలో తప్పులేదు.
వాళ్లు అలాగే చెప్పాలి కూడా. అలాకాకుండా ఒకరినొకరు చంపుకోమని చెబితే అందరూ
ఒకరినొకరు చంపుకుంటారు. అప్పుడు అందరూ బాధలు పడవలసి వస్తుంది.
అయితే, ఎవరైనా పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తునప్పుడు మాత్రం
అందుగుతగ్గ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
***********
అన్ని మతాలవారు చక్కగా జీవించవచ్చు. అయితే, ఎవరైనా హిందు మతాన్ని లేకుండా చేయాలని.. మతమార్పిడులకొరకు నయానాభయానా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి.
ఎవరైనా మనపట్ల దాడులు చేస్తే మనం శాంతి అంటూ చేతులు ముడుచుకుని కూర్చోము కదా ..మన రక్షణ కొరకు ఎంతకైనా పోరాడుతాము.
లోకంలోని అమాయకులు, మంచివారికొరకు..
లోకాః సమస్తాః సుఖినో భవంతు ..అనుకోవాలి కానీ,
చెడ్డవారి కొరకు కాదు.
పరమతసహనం, సహనం..వంటి లక్షణాలు మంచివే. అయితే, ఇతరులు పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు, మనల్ని మనం కాపాడుకోవటం తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అలాంటప్పుడు సహనం..అని నింపాదిగా కూర్చుంటే ఏం జరుగుతుందో చెప్పలేం.
మనల్ని రక్షించుకోవటానికి తెలివిగా ఏదో ఒకటి చేయాలి. దైవాన్ని ప్రార్ధిస్తూ మన వంతు ప్రయత్నం మనం తప్పక చేయాలి.
******************
హిందువులకు పరమత సహనం ఎక్కువ. రామకృష్ణమఠంలో అన్ని మతాలవారికి ప్రవేశం ఉంది. ఒక యోగి ఆత్మ కధ పుస్తకంలో ఇతరమతముల ప్రస్తావన ఉంది.
************
నా ఫ్రెండ్ ఒకామె నాకు శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణ చరితామృతము గ్రంధాన్ని ఇవ్వటం జరిగింది.ఆ విధంగా నాకు శ్రీ దత్తాత్రేయ అవతారమైన శ్రీపాదుల వారి గురించి తెలిసింది. మేము కురువపురం కూడా వెళ్లి దర్శించుకున్నాము. ఆ గ్రంధంలో శాయి గురించి కొన్ని విషయములున్నాయి. ఈ విషయాల అంతరార్ధం ఏమిటో.. ఆ విషయాల గురించి దైవానికే తెలుస్తుంది.
***************
కొన్ని సంవత్సరాల క్రితం వరకు షిరిడిసాయిబాబా గురించి చాలామందికి తెలియదు. కొందరు శిరిడిసాయిబాబా గురించి సినిమాలు తీయటం జరిగింది. ఆ సినిమాలో కొందరు బ్రాహ్మణులు కూడా పాత్రధారులుగా నటించారు, పాటలు వ్రాసారు, పాడారు. ఆ పాటలు ఎలా ఉన్నాయో చాలామందికి తెలుసు. ఆ సినిమాల ద్వారా ఎందరో ప్రభావితులయ్యారు. కొందరు పండితులు కూడా సాయిబాబా పూజల గురించి గొప్పగా ప్రచారం చేసారు, గ్రంధాలు కూడా వ్రాసారు.
సమాజంలో గొప్ప పేరు ఉన్నవారు చెబుతున్న విషయాలను సామాన్యప్రజలు నమ్ముతారు. వారు చెప్పిన విషయాలను పాటిస్తారు. సమాజంలో ఆధ్యాత్మిక విషయాలలో దిశానిర్దేశం చేసే బ్రాహ్మణులు చెప్పే విషయాలను చాలామంది నమ్ముతారు. శిరిడి లోని కొందరు బ్రాహ్మణులు కూడా సాయిని అనుసరించారు.
క్రమంగా సాయి పూజలు పెరిగేసరికి..కొన్ని సందేహాలు కలిగి, సాయిబాబా పూజలు ఎందుకు చేస్తున్నారంటూ.....ఇప్పుడు సామాన్యప్రజలను తప్పు పడుతున్నారు.
కొంతకాలం క్రిందట సాయిబాబాను గురించి గొప్పగా చెప్పి సమాజంలో వ్యాపింపచేసినది హిందువులే. సామాన్యజనం ఆకర్షించబడి సాయిపూజలు ఎక్కువయ్యేసరికి, ఇప్పుడేమో సాయికి పూజలు చేయవద్దని చెప్తున్నవారు కూడా హిందువులే.
**************
జనాలు షిరిడి సాయి వెంట పడితే, ఆయన తన అభిప్రాయాలను చెప్పి ఉండవచ్చు.
సాయిబాబా హిందుదేవతలతో పాటు ఇతరమతాల దేవతలను కూడా స్మరించేవారు కాబట్టి, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయంతో కొందరు హిందువులు .. షిర్డిసాయిని పూజించవద్దని అంటుండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.
**************
నాకు ఏమనిపిస్తుందంటే, హిందువులలో ఉన్న కొన్నివిధానాలను చాలామంది హిందువులు పాటించలేకపోతున్నారు. షిర్డిసాయిబాబా చెప్పిన విధానాలు
తేలికగా ఉంటాయి. అందువల్ల కూడా అనేకమంది సాయి విధానాల పట్ల ఆకర్షితులు అయి
ఉండవచ్చు. విధానాలు సులభంగా ఉంటే, ఆధునిక కాలంలో ప్రజలు త్వరగా
ఆకర్షితులవుతారు.
**************
ఇంకా, ఇంకొక విషయం ఏమిటంటే.. హిందువులకు బోలెడుమంది దేవతలుండగా, బోలెడు పండుగలు ఉండగా చాలనట్లు ఇంకా, ఇతర మతాల వారి పండుగలు కూడా ఎందుకు చేస్తారో? ఏమిటో? అందరూ ఆలోచించవలసి ఉంది.
*************
ప్రతిదానికి మీరు ఇలా చేయకూడదు..ఇలానే చేయాలి..లేకపోతే కష్టాలు మీద పడిపోతాయంటూ చెబుతుంటే, ఈ కలికాలంలో అవన్నీ పాటించటం అందరికి కుదరకపోవచ్చు. తేలికగా ఆచరించే విధానాలు ఎవరైనా చెబితే అటు వెళ్ళటానికి ఇష్టపడతారు.
దైవం
అందరికీ అవసరమే. దైవం అంటే భయంతో కాకుండా, జీవితంలో కష్టసుఖాలను దైవంతో
చనువుగా, ప్రశాంతంగా, అరమరికలు లేకుండా పంచుకోవాలని ఉంటుంది. అయితే పూజలు
అంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి......అనుకునేవిధంగా పరిస్థితి ఉంది.
ప్రశాంతంగా దైవపూజ చేయాలన్నా, అక్కడా అనేక ఆంక్షలు. అది అలా చేయకూడదు, ఇది
ఇలాగే చేయాలంటూ చెబుతారు. జీవితంలో నియమాలు ఎంతో అవసరం. అయితే, ఆ నియమాలు తట్టుకోలేంత ఉంటే మాత్రం పాటించటం కష్టమవుతుంది. అవన్నీ పాటించలేక వదిలేయాలనిపిస్తుంది.
ఇవన్నీ పాటించలేక నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, మతంతో సంబంధం లేకుండా నాకు తోచినట్లు దైవాన్ని పూజించుకుంటే ఎంత బాగుంటుంది.. అనిపిస్తుంది. పండుగ అంటే..దైవాన్ని స్మరించుకోవటం కన్నా, తప్పులు జరగకుండా పనులు ఎలా జరుగుతాయో? అని టెన్షన్ ఎక్కువగా ఉండేది.
ఇప్పుడు అతిని చాలావరకూ తగ్గించుకుని, నాకు తోచినంతలో ప్రశాంతంగా దైవాన్ని ఆరాధించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.
*************
అనేక విషయాలను పాటించే ఆసక్తి ఉన్నవారు పాటించవచ్చు. అయితే, అందరూ పాటించలేకపోవచ్చు. ఎవరి పరిస్థితి వారిది.
పాతకాలంలో ఇన్నిరకాల విషయాలు అందరూ పాటించేవారు కాదు. కొన్ని విషయాలలో వారి వంశాచారం ప్రకారం ..వారి పెద్దవారిని అడిగి పాటించేవారు.
కొందరు.. కోరికలు, కష్టాలు.. తీరాలంటే ఇలా చేయండి..అంటూ అనేక పద్ధతులను చెబుతారు. సోషల్ మీడియాలో ఉండాలంటే.. ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతున్నారు. వీటివల్ల కూడా హిందువులు మరింత అయోమయంలో ఉంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు పరిష్కారమవుతాయో?
******************
హిందువులలోనే కొందరు, మా దేవత గొప్ప అంటే.. మా దేవతే గొప్ప అంటూ.. గొడవలు పడ్డారు. గొడవలు పడే హిందువులవల్ల హిందుమతానికి నష్టం జరిగింది. అలాంటివారు హిందువుల బాగోగుల గురించి పాటుపడుతున్నామనటం విచిత్రం.
హిందువులు
అభివృద్ధి చెందాలంటే, కొన్ని విషయాలను సరిదిద్దుకోవాలి. హిందువులలో ఐక్యత
ఉండాలి. వైష్ణవులు, శైవులు, శాక్తేయులు..అంటూ గొడవలు పడకూడదు.
అంటరానితనం..వంటివి కూడా ఉండకూడదు. మూఢనమ్మకాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాలను విచక్షణతో ధర్మబద్ధంగా పాటించవచ్చు.
ఒకే హిందూ మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.
***********
భారతీయులలో ఐకమత్యం లేకపోవటం వల్ల, భారతీయుల అతి సహనశీలత వల్ల విదేశీయులు ఇక్కడకొచ్చి ఈ దేశాన్ని అనేకసంవత్సరాలు పాలించారు. ఇప్పటికీ భారతీయులలో ఐకమత్యం అంతగా లేదు. విదేశీమతాలవాళ్ళు ఇక్కడకొచ్చి ఇక్కడి వారిని మతాలమార్పిడి చేస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు. పరిస్థితి ఏమవుతుందో ?
మన బలహీనతలను మనం సరిదిద్దుకోకుండా.. అంతా అవతలవారివల్లే అనుకోవటం కన్నా, తమ బలహీనతలను సరిదిద్దుకుంటే బలవంతులవుతారు. తాము బలవంతులయితే శత్రువులను తేలికగా జయించగలరు.
************
పరమతసహనం కొందరికి ఉంటే సరిపోదు..అందరికీ ఉండాలి. మతాల పేరుతో జరుగుతున్న దారుణాలను గమనిస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో? ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో? దైవానికే తెలియాలి.
***********
వేదములు, పురాణేతిహాసాలు ..ఎంతో గొప్పవి. వేదాలు, పురాణేతిహాసాల ద్వారా ఎన్నోవిషయాలను తెలుసుకోవచ్చు.
పురాణేతిహాసాల ద్వారా..జీవితంలో ఎలా ప్రవర్తించితే ఎలాంటి ఫలితాలుంటాయి. ఏది ధర్మం.. ఏది అధర్మం.. ఎలా ప్రవర్తించాలి.. ఎలా ప్రవర్తించకూడదు.. ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి..వంటి విషయాలను కూడా పురాణేతిహాసాలలోని పాత్రల ద్వారా ప్రాచీనులు మనకు తెలియజేసారని నా అభిప్రాయము.
ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు. హిందువులు, తరతరాలనుంచి ఎందరినో దేవతలుగా పూజిస్తున్నారు.
హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.
ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.
మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, ఇలా హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా
పూజిస్తారో.. చెప్పలేము.
అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు.
ఏ దేవతను పూజించినా.. ఉదా..అమ్మవారిని పూజించినా..శివుణ్ని పూజించినా.. విష్ణువును పూజించినా.. ఒకే దైవశక్తిగా భావించి పూజించవచ్చు.
అందరు దేవతలలో ఒకే దైవశక్తిని భావించి పూజించవచ్చు. ఒకే దైవంలో అందరు దేవతలను భావించి పూజించవచ్చు.
శ్రీరాముడు హనుమంతుని మధ్య గల ఆప్యాయత అందరికి తెలిసిందే. హనుమంతుడు శివుని అంశ కలవారు. శిశువును కంసుడు చంపడానికి పైకి విసిరేయగా, ఆ శిశువు యోగమాయగా ప్రత్యక్షమయ్యి.. కొన్ని విషయాలను పలికి అదృశ్యమవుతారు. అమ్మవారు(యోగమాయ).. శివుడు.. విష్ణువు..వీరందరూ ఒకటే. వీరు వేరువేరు ..అని మనుషులు గొడవలు పడకూడదు.
హిందువులు ఇంకాఇంకా ..కొత్త పూజావిధానాలను పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.
ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.
దైవశక్తిని చక్కగా పూజించవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా పూజావిధానాలను పెంచుకోకుండా పూజించుకుంటే సరిపోతుంది. వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప.
ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.
పూజించటానికి ప్రాచీనులు తెలియజేసిన దేవతలు ఉన్నారు... కఠినమైన ఆచారవ్యవహారాలను పాటించి పూజలు చేయకపోయినా, దైవాన్ని నమ్మి, చక్కగా ప్రేమగా స్మరించుకోవచ్చు.
ఈ రోజుల్లో కొందరు తాము దైవాంశగలవారమని, ప్రజల కష్టాలు తీరుస్తామని మోసం చేస్తున్నవారూ ఉన్నారు. ఇలాంటివారు తామే దేవుళ్ళమన్నట్లు పూజలు కూడా జరిపించుకుంటుకున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది. ఇలాంటివారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు తమ వ్యాపారాల కొరకు కొత్తగా పూజలను పెంచుతున్నారనిపిస్తోంది.
ఎవరిని ఏ విధంగా పూజించాలి ? అనే విషయాల గురించి బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.
సమాజంలో అనేక అభిప్రాయాలుంటాయి. కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.
**********
ప్రపంచంలో కొందరు మనుషుల ఆలోచనలు గమనిస్తే , ప్రపంచం ఎటుపోతుందో అర్ధంకావటంలేదు. ఎవరి అభిప్రాయాలు వారివి. అందువల్ల, ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి. దైవమే దిక్కు.
......
ఈ పోస్ట్ చాలా పెద్దగా అయ్యింది .
*************
అందరూ దైవభక్తిని కలిగి..ధర్మముగా
జీవించడానికి ప్రయత్నించాలి.
ప్రాచీనకాలంలో... ప్రపంచంలో చాలావరకు ఒకే పోలికలున్న పద్ధతి ఉండేదేమో అనిపిస్తుంది. విదేశాల్లో ప్రాచీన ఆనవాళ్ళకు.... భారతీయ సంస్కృతికి పోలికలు ఉన్నాయని కొందరు కనుగొన్నారట.
*Shocking similarities between ancient indian & Egyptian mythology | United originals english * Top
Similarities Between Hindu Gods And Greek Gods | In Telugu | Kranthi Vl
*Striking Similarities Between the Indian & Mayan Gods! | Dr.D.K.Hari | Dr.D.K.HemaHari | BharathGyan
*The true origins of ancient Egyptian civilisation: India (Vedic Hindu) Radha Mohan Das - Vedic Science and history ***** ప్రాచీనకాలంలో ఏం జరిగిందో కానీ .. ఇప్పుడు ప్రపంచంలో అనేక మతాలున్నాయి. ఒకే హిందుమతంలోని వారు కూడా బౌద్ధ, జైన..వంటి మతాలుగా ఏర్పడ్డారు. ఇంకా శైవులు, వైష్ణవులు..వంటి ఎన్నో విభాగాలున్నాయి. అన్ని మతాలలోనూ మంచివారుంటారు, చెడ్దవారుంటారు. ************** మరికొన్ని విషయాలేమిటంటే, కొంతకాలం
క్రిందట ఒకరు సాయి అనే పదం హిందువుల గ్రంధాలలో లేదంటే, నేను శాయి అనే
పదం ఉందని వ్రాసాను. ఉదా..వటపత్రశాయి. ఈశా ..అనే పేరును తిప్పి చదివినా
శాఈ.. అని వస్తుందని వ్రాసాను. అయితే, వ్రాసిన వాటిలో కొన్నింటిని కొంతకాలం క్రిందట డిలిట్ చేసాను. మంచి అభిప్రాయంతో వ్రాసినా కూడా ఎన్నో ఆలోచించాలి కదా.. ************ రామకృష్ణమఠంలో అన్ని
మతాల వారికి ప్రవేశం ఉంది. ఒకయోగి ఆత్మకధ లో కూడా ఇతరమతాల వారి గురించి
ఉంది. షిర్డి సాయిబాబా సినిమాలో పాటలో ఇతరమతాల వారు ఆరాధించే వారి పేర్లు
ఉన్నాయి. ఆ పాటలను మనం చాలామందిమి ఎంతో అభిమానంగా విన్నాము, పాడాము. *************** ఈమధ్య నేను ఒక వీడియో చూశాను. అందులో కొందరు హిందువులు గ్రూపుగా సాయి భజన చేస్తూ అల్లా గురించి కూడా పాడుతున్నారు. నాకు తెలిసినంతలో, ఇతర మతాల వాళ్లు హిందూ దేవతలను పూజించరు, పాటలు పాడరు. ఆలాంటప్పుడు హిందువులు మాత్రం అందరూ ఒకటే.. అని, కొందరు మతం మారటం వంటివాటి వల్ల హిందువులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. నిజానికి దైవం ఒకరే. కానీ, మతాలు..ఆ మతాల పద్ధతులు వేరు. అన్ని మతాలను గౌరవించాలని మనకు
పెద్దవాళ్లు చెప్పటం వల్ల .. ఇతరమతాలను గౌరవించటం జరిగేది. అందరితో మంచిగా ఉండాలని పెద్దవాళ్లు చెప్పటం మంచిదే. కానీ, కొందరు మతమార్పిడులు చేయటం, మతం అని గొడవలుచేయటం..వంటివి
జరుగుతున్నాయి. ఇప్పుడు , మతమార్పిడుల వల్ల కలిగే నష్టాలను గురించి బాగా అవగాహన పెరిగింది.పొరుగుదేశంలో హిందువుల పట్ల దౌర్జన్యాలు జరగటం గురించి వార్తలు వింటున్నాము. కొందరు, దేశంలోని కొన్ని భూములు మావే ..అంటున్నారని వార్తల ద్వారా తెలుస్తోంది. వాటిలో కొన్ని దేవాలయాల భూములు.. కూడా ఉన్నాయంటున్నారు. ఇవన్నీ గమనిస్తుంటే, హిందువులం జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తోంది. **************** మంచిగా ఉండే పెద్దవాళ్లు, అందరితో మంచిగా
ఉండాలని తమ పిల్లలకు నేర్పిస్తారు.అలా చెప్పటం సరైనదే. కానీ, పరిస్థితులను
బట్టి కూడా ప్రవర్తించాలి. సమాజంలో కొందరు, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వేధిస్తుంటే , అలా చేయవద్దని కొన్నిసార్లు మంచిగా చెబుతాము. అప్పటికీ వారు మారకపోతే తప్పనిసరిగా వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకానీ, ఎవరైనా అదేపనిగా వేధిస్తుంటే.. ఏమీ కాదులే.. అనుకుంటూ నింపాదిగా.. చేతకానివారిలా ఉండకూడదు. . అలా చేతకాని వారిలా ఉండాలని పెద్దవాళ్లు కూడా చెప్పరు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. రాక్షసులు
తపస్సులు చేసినప్పుడు, కష్టపడి తపస్సు చేసారు కదా..వారు మంచిగా మారటానికి
ఒక అవకాశాన్ని ఇవ్వాలని, దేవతలు వారికి వరాలనిస్తారు. రాక్షసులు వరాలను
పొందిన తరువాత, మంచిగా ఉండకుండా చెడ్దగా ప్రవర్తిస్తే, ఇక వాళ్ళ పట్ల
ఎటువంటి మొహమాటం లేకుండా దైవం వాళ్ళను శిక్షిస్తారు. ఆధునికకాలంలో కొందరు ఎన్నో చెడ్దపనులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళను శిక్షించటం పట్ల ఎటువంటి మొహమాటం ఉండకూడదు. ***************** సమాజంలో
దైవాన్ని నమ్మి పూజించేవారు ఉన్నారు. కొన్ని మతాల వారు
వారి పద్ధతులలో దైవాన్ని పూజిస్తారు. కొందరు ఒక్కమతం అని కాకుండా, అనేక మతాలపద్ధతులను పాటిస్తారు. ఆధునిక సమాజానికి కొంత దూరంగా అడవుల్లో ఉండే ఆటవికులు కొందరు వారి
పద్ధతిలో దైవాన్ని పూజిస్తారు. సమాజంలో కొందరు దైవాన్ని నమ్మని
నాస్తికులున్నారు... ఒక్క మతాన్ని సరిగ్గా పాటించటమే కష్టం. అలాంటప్పుడు ఎక్కువ మతాలను
కలిపి పాటించటం ఇంకా కష్టం. చాలామంది అన్నీ పాటించలేరు. ఇలాంటప్పుడు కొన్నిసార్లు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా భావించే పరిస్థితి ఏర్పడే అవకాశమూ ఉంది.. ఎవరైనా దైవాన్ని పూజించవచ్చు. ********** దైవం ఒకరే... వివిధమతాల పేరుతో అనేక పద్ధతులు ఉన్నాయి. అన్ని మతాలవారు చక్కగా జీవించవచ్చు. పరమతసహనం..వంటి లక్షణాలు అందరికి ఉండాలి. అయితే, కొన్ని మతాలవారు హిందు మతాన్ని లేకుండా చేయాలని.. మతమార్పిడులకొరకు నయానాభయానా ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరైనా పరమత సహనం లేకుండా ప్రవర్తిస్తునప్పుడు, అందుకుతగ్గ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మతాల పేరుతో దారుణాలు చేసే వారు దైవాన్ని కూడా అగౌరవించినట్లే. ఇలాంటివారిని దైవం క్షమించరు. ఎవ్వరైనా సరే, దైవము యొక్క న్యాయస్థానం నుండి తప్పించుకోలేరు. ఒక విషయం ఏమిటంటే, ప్రపంచంలో మతాలు లేకపోయినా దైవం ఎప్పుడూ ఉంటారు. మతాల
పేరుతో మారణకాండలు, మూఢనమ్మకాలు..ఎక్కువయితే, విసిగిపోయిన ప్రజలు..మతాలను
అంతగా పట్టించుకోకుండా, వాటిలోని మంచివిషయాలను మాత్రం
తీసుకుని..దైవభక్తితో దైవాన్ని ఆరాధించుకుంటారు..మానవత్వంతో ధర్మబద్ధంగా
జీవిస్తారు. ప్రపంచంలో సంపద కొరకు, అధికారం కొరకు, మతాల కొరకు..అనేక యుద్ధాలు, దారుణాలు, గొడవలు జరగటం చాలా బాధాకరం. మతాల విషయానికొస్తే, మతం అంటే ప్రశాంతత. అలాంటప్పుడు, మతాల పేరుతో కూడా దారుణాలు జరగటం అత్యంత బాధాకరం.
మతయుద్ధాలు ఆగాలంటే, అన్ని మతాలలోని మంచి విషయాలతో ప్రపంచమంతటా కొత్త మతం ఏర్పడాలేమో? ఒకరితో ఒకరు గొడవలు పడకుండా ఎవరికి నచ్చినట్లు వారు ప్రశాంతంగా దైవాన్ని ప్రార్ధించుకోవచ్చేమో? యుద్ధాలలో ఎక్కువమంది మరణిస్తే మిగిలిన కొద్దిమందితో కొత్తగా ప్రపంచం ప్రారంభమవుతుందేమో? ఇంకా కొత్త విధానం ఏమన్నా ఉంటుందేమో? ఏది ఎందుకు జరుగుతుందో.. దైవానికే తెలుస్తుంది. దైవమే దిక్కు. |