ఓం .
పూర్వీకులు ఖగోళ శాస్త్రం , వైద్య శాస్త్రం , రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం ఇంకా అనేక శాస్త్రాల ద్వారా ఎంతో విజ్ఞానాన్ని అందించారు.పురాణేతిహాసాలలో కూడా ఎంతో సైన్స్ ఉంది.
...............
దేవకీ దేవి గర్భం నుంచీ రోహిణీ దేవి గర్భం లోనికి పిండాన్ని మార్చటం గురించి ( బలరాముడు ) గ్రంధాలలో చెప్పబడింది. ఇది చదివిన వాళ్ళలో కొందరు.. పిండాన్ని ఒకరి గర్భం నుంచి ఇంకొకరి గర్భానికి ఎలా మారుస్తారు ? అని ఆశ్చర్యపోతారు .
కానీ ఈ రోజుల్లో....... గర్భంలోని పిండాన్ని తల్లి మోయలేనప్పుడు ( కొన్ని అనారోగ్య కారణాల వల్ల ) సొంత తల్లి గర్భంలోని ఆ పిండాన్ని అద్దె తల్లి గర్భంలోకి మార్చి పెంచి .. బిడ్డను సొంత తల్లితండ్రులకు అందిస్తున్నారు. .
ఆ విధంగా పూర్వులు చెప్పినవి సాధ్యమే అని తేలింది కదా!
....................
పూర్వం కొందరి విషయంలో స్త్రీపురుషుల సంబంధం లేకుండానే బిడ్డలు పుట్టేవారని గ్రంధాలలో ఉంది.
కుంతీదేవి ( సూర్య దేవుని ప్రభావం వల్ల ) తన కన్యాత్వానికి భంగం లేకుండానే బిడ్డను పొందటం గురించి గ్రంధాలలో ఉంది. ( అప్పటివారు తమ తపశ్శక్తి వల్ల కూడా సంతానాన్ని ప్రసాదించే అంతటి శక్తి గలవారు.)
ఈ రోజుల్లో పిల్లలు లేని తల్లితండ్రులు కొందరు, స్పెర్మ్ బ్యాంకుల సాయంతో, టెస్ట్ ట్యూబ్ పద్ధతిలో సంతానాన్ని పొందుతున్నారు కదా !
.......................
రాజ్యరక్షణ మరియు వంశ రక్షణ కొరకు , వారసుల కోసం సత్యవతీదేవి వ్యాసుని ఆజ్ఞాపించగా .... ఆయన తనకు ఇష్టం లేకపోయినా తల్లి ఆజ్ఞా ప్రకారం అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించారు.
అయితే వారికి ఇష్టం లేకపోవటం వల్ల ధృతరాష్ట్రుడు గ్రుడ్డివానిగానూ , పాండురాజు పాలిపోయి జన్మించారట.
ఈ సంఘటనల ద్వారా తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు, మానసిక పరిస్థితి పుట్టబోయే బిడ్డల పైన ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో పెద్దలు తెలియజేసారు.
గర్భంలోని బిడ్డకు పరిసరాల్లోని విషయాలను గ్రహించే శక్తి ఉంటుందట. ( అభిమన్యునిలా ) అందుకే ఇంట్లో గర్భిణి స్త్రీ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని పెద్దలు చెబుతారు.
ఈ రోజుల్లో విదేశాల్లోని కొందరు గర్భిణీ స్త్రీలు తమ బిడ్డ తెలివిగా పుట్టాలని సంగీతం వంటి క్లాసులకు వెళ్తున్నారట..
సంతానాన్ని పొందే స్త్రీలు , గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలని , తల్లి మానసిక పరిస్థితి పుట్టబోయే బిడ్డల పైన ప్రభావాన్ని చూపిస్తుందని ఈనాటి శాస్త్రవేత్తలు కూడా కనుగొన్నారు.
.............................
తులసిమొక్కను ఇంట్లో పెంచుకుంటే పుణ్యం , ఎంతో ఆరోగ్యకరం అని పెద్దలు చెప్పారు.
తులసిమొక్క నుంచి ఎంతో ఆక్సిజన్ విడుదల అవుతుందని ఈ నాటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు కదా !
..............................
పూర్వీకులు కొందరు పిండాలను కుండలలో పెంచారని గ్రంధాలలో తెలియజేసారు. అదెలా సాధ్యం ? అని అన్నవారే
ఈ రోజుల్లో టెస్ట్ ట్యూబులలో పిండాలను పెంచటం చూసి పెద్దలు చెప్పినది నిజమే. అని ఒప్పుకుంటున్నారు,
...............................
మహాభారతయుద్ధంలో జరిగే సంఘటనలను ఎంతో దూరంలో ఉండే తన దివ్య దృష్టితో చూస్తూ సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధంలో జరుగుతున్న విషయాలను చెబుతారు.
ఈ విషయాన్ని గ్రంధాలలో చదివి..... ఎక్కడో దూరంగా జరిగే సంఘటనలు ఎవరికైనా ఎలా కనిపిస్తాయి ? మాటలు ఎలా వినిపిస్తాయి ? చోద్యం కాకపోతే ... పురాణాల్లో ఇలాంటి వింతలే ఉంటాయి ... అని హేళన చేసినవారే
... ఈ రోజుల్లో టీవీలు, ఫోనులు వచ్చాక పూర్వీకులు చెప్పిన విషయాలు సాధ్యమే అని ఒప్పుకుంటున్నారు.
...............................
అయితే నాకు ఏమనిపిస్తుందంటే... ఈ నాటి విజ్ఞానం ఎక్కువగా భౌతిక పద్ధతి మీద ఆధారపడింది. పూర్వీకుల విజ్ఞానం భౌతికశాస్త్రాన్ని దాటి ఇంకా ముందుకెళ్ళింది అనిపిస్తుంది. .
కొన్ని సంఘటనలు చూస్తుంటే శారీరిక బలం కన్నా మానసిక బలం గొప్పదేమో అనిపిస్తుంది. ఉదాహరణకు.. .ఒక వ్యక్తి లారీనో లేక బస్సునో తాడు కట్టి ఆ తాడును పళ్ళ మధ్య పట్టి ఉంచి లారీని కొంత దూరం లాగాడట. సాధారణంగా పళ్ళకు అంత బలం ఉండదు. మరి ఆ వ్యక్తి అలా ఎలా లాగగలిగాడు ?
పూర్వీకులు తమ తపశ్శక్తిని పెంచుకుని ఇలాగే ఎన్నో అద్భుతాలు చేసారా ? అంటే భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది కదా ! అదే తపస్సు ద్వారా పొందే ఆధ్యాత్మిక దైవశక్తి కావచ్చు....
బాగుంది.
ReplyDeleteవ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
Deleteమన పూర్వికులకి కారం ఇంత మంచిదని ఎల్లా తెలిసిందో ! తర తరాలనుండీ మనం తింటున్న మెరపకాయల కారం గురించి ఇవ్వాళే నా కొచ్చిన ఇ-మెయిలు నుండి:
ReplyDeleteAl Sears, MD
11903 Southern Blvd., Ste. 208
Royal Palm Beach, FL 33411
April 11, 2012
Dear Rao,
Most people think that hot spicy food is bad for your health. Yet in some cases, the exact opposite is true. Cayenne peppers can make your eyes water and your tongue burn, but they also have healing power.
Several widely separated cultures have used cayenne for medicinal purposes for centuries. Now modern scientific research validates much of the folklore. Cayenne peppers can ward off the common cold and flu. They take away arthritic pain and help asthma sufferers. Cayenne pepper can stop itching and both internal and external bleeding. Cayenne peppers can help your body fend off ailments such as heart disease, cancers, cataracts, Alzheimer’s disease and others.
Today I’ll show you how to use the naturally occurring, medicinal properties in cayenne peppers to improve your health.
Cayenne contains a compound called capsaicin. Capsaicin is the ingredient that gives peppers their heat. Generally, the hotter the pepper, the more capsaicin it contains. In addition to adding heat to the pepper, capsaicin acts to reduce platelet stickiness and relieve pain. Research shows cayenne can help to:
Improve Circulation.
Benefit Your Heart.
Clear Congestion.
Boost Immunity.
Prevent Stomach Ulcers.
Drop A Few Extra.
If you like to eat peppers, don’t listen to the “naysayers.” Hot Mexican, Szechwan, Indian, or those smoldering Thai dishes can make excellent choices.
You’ll be amazed at how easy it is to incorporate cayenne into your cuisine. I tend to use cayenne by taste and add it to my food in place of black pepper. It is also quite good in salsa.
I also keep a bottle of cayenne in my house for emergencies. The other day, I was cutting down some bananas and accidentally cut my hand with a machete. I sprinkled some cayenne on the cut, applied pressure and the bleeding stopped immediately.
You can also get cayenne in supplement form. Try to get a capsule of at least 500mg, with at least 40,000 heat units, although some may have up to 100,000 heat units.
To Your Good Health,
http://www.holistic-online.com/Herbal-Med/_Herbs/h43.htm
వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
Deleteభారతీయులకు తెలిసిన విజ్ఞానం గురించి శాస్త్రవేత్తల పుణ్యమాని ఇప్పుడు అందరికీ తెలుస్తోంది.
పూర్వపు భారతీయులకు మిరపకాయలు తెలియవని , అప్పటివారు కారానికి బదులు మిరియాలను మాత్రమే వాడారని కొందరు భావిస్తారు. .
కానీ , కృష్ణుడు గోపాలురతో చల్దులు తినేసమయంలో పెరుగన్నంతో పాటు ఊరగాయ ముక్క నంజుకుని తిన్నట్లు గ్రంధాలలో కవులు వర్ణించారు.
ఊరగాయ పెట్టడం అన్నది తరతరాలనుండి అందరికి తెలుసు
. పచ్చళ్ళు మిరపకాయల కారంతోనే చేస్తారు. మిరియాల పొడితో చేయరు . కాబట్టి పూర్వీకులకు మిరపకాయల వాడకం తెలుసని నాకు అనిపిస్తుందండి
.
( కొన్ని పచ్చళ్ళలో కొద్దిగా మిరియాల పొడి వేస్తారు. అంతే. )
మిరపకారం తగుమాత్రం వాడుకుంటే ఆరోగ్యకరమే ....అని పరిశోధనల్లో తేలటం అన్నది ...కారం ప్రియులకు శుభవార్తేనండి... ( ముఖ్యంగా మిరపకాయ బజ్జీలంటే ఇష్టపడే తెలుగువాళ్ళకు ).
రావు గారు. మిరపకాయ మనకు పోర్చ్గీసు వాళ్ళు పరిచయం చేసింది. అంతకు ముందు మిరియాలు, సొంత్టి, పిప్పల్లు మంటకోసం వాడేవాళ్ళు.
Delete>>కృష్ణుడు గోపాలురతో చల్దులు తినేసమయంలో పెరుగన్నంతో పాటు ఊరగాయ ముక్క నంజుకుని తిన్నట్లు గ్రంధాలలో కవులు వర్ణించారు.
ReplyDeleteపురాతన గ్రంధాలను చదివి నిజాలు మాట్లాడండి. మీరుకూడా, కృష్ణుడు బట్టలు ఏరియల్ సర్ఫ్ తో బట్టలు ఉతుకున్నాడు అని రాస్తే అదే నిజమైపోతుందా?