భగవద్గీతలో .... శ్రీ కృష్ణుడు అర్జునునితో ఏమంటారంటే.. నీకు నాకు ఇంతకుముందు అనేక జన్మలు గడిచాయి. అవి నీకు గుర్తు లేవు .... అని చెప్పటం జరిగింది.
శ్రీ కృష్ణుడు చెప్పిన దానికి ఒక ఉదాహరణ..
నరనారాయణులు ఒకప్పుడు ధర్ముని కుమారులుగా జన్మించి ఎంతో తపస్సు చేసారు. ఆ నరనారాయణులే 28వ ద్వాపరంలో కృష్ణార్జునులుగా జన్మించారట.
( నారాయణుడు కృష్ణునిగా, నరుడు అర్జునునిగా.)
నేను ఇంకో దగ్గర చదివానండి..... విష్ణుపురాణంలో పరాశరుడు మైత్రేయతో ఏమంటారంటే.......
విష్ణుమూర్తి కృతయుగంలో కపిలునిగా జన్మిస్తారట, త్రేతాయుగంలో చక్రవర్తిగా జన్మించి దుష్టులను శిక్షిస్తారట, ద్వాపరయుగంలో వేదవ్యాసునిగా జన్మించి వేదవిభజన చేస్తారట. కలియుగంలో కల్కి గా జన్మిస్తారని చెప్పటం జరిగిందట. ఇలా లోకకళ్యాణం కొరకు భగవంతుడు ప్రతి యుగంలోనూ ఎన్నో అవతారాలను ధరిస్తారట.
ఒకసారి భూదేవి భూమి మీద పెరిగిపోతున్న పాపాత్ముల భారం మోయలేకపోతున్నానని బాధపడగా , ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమ్మవారిని ప్రార్ధించగా....... ఆ జగన్మాత ..... దేవతలారా ! ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించటానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీమీ అంశలతో భూలోకంలో జన్మించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను........మీరంతా నిమిత్తమాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను........అని ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందుతుంది.
ఆ ప్రణాళిక ప్రకారం కశ్యపుడు వసుదేవునిగా, అదితి దేవకీదేవిగా , ఆదిశేషుడు బలరాముడిగా, యోగమాయ యశోదకు కూతురిగా, నారాయణుడు కృష్ణుడిగా, నరుడు అర్జునుడుగా ..ఇలా జన్మించారు.
ఇవన్నీ ముందే తెలిసి అవతారాలను ధరించినా, జన్మనెత్తిన తరువాత వారిలో కొందరికి పూర్వం తామెవరు? అన్నది గుర్తుండదు అనిపిస్తుంది.. (అంతా మహామాయ)
ఉదాహరణకు... అర్జునునికి తాను క్రితం జన్మలో నరుడను అని గుర్తు ఉన్నట్లు అనిపించదు. కృష్ణునకు మాత్రం అంతా తెలుసు అనిపిస్తుంది.
సృష్టిలో ఏది ఎలా నడవాలో , జగన్మాతాపితరులు అలా నడిపించగలరు అనిపిస్తుంది.
.............................................
బ్లాగులోకంలోని సోదర, సోదరీమణులకు.........వివరములు దయచేసి క్రింద వ్యాఖ్యలలో చూడగలరు.
కొన్ని కారణాల వల్ల కొంతకాలంగా నేను ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలను వ్రాయటం లేదు కదా ! వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు వారిని ఎలా సంబోధించాలో, వారి వయస్సు వివరాలు తెలియవు కదా ! అని ఒక సందేహం, ఇంకా, కొన్ని బ్లాగుల్లో మాత్రమే వ్యాఖ్యలు వ్రాస్తే మిగతా వాళ్ళు ఫీలవుతారేమో ? అందరి బ్లాగుల్లో వ్రాయాలంటే సమయం చాలదు కదా !
ReplyDeleteఒకే బ్లాగులో ఒక టపా బాగుందని వ్యాఖ్య వ్రాస్తే రెండో టపాకు కూడా వ్యాఖ్య వ్రాయాలేమో ? లేకపోతే టపా నచ్చలేదు అనుకుంటారేమో ? ఇలా అనేక సందేహాలతో వ్యాఖ్యలు వ్రాయటం మానేసానండి.
కానీ నా బ్లాగులో ఇతరులు వ్యాఖ్యలు వ్రాసినప్పుడు నాకు సిగ్గుగా అనిపించేది. నాకు మర్యాద తెలియదు అనుకుంటారేమో ? అనిపించేది.
ఇలా ఆలోచిస్తుండగా నిన్న" హరిసేవ " బ్లాగులో ' స్టేట్ 7థ్ రాంక్ సాధించిన మా ఈ చిరంజీవిని ఆశీర్వదించండి" టపా చదివానండి. ఆ టపా చదివిన తరువాత వ్యాఖ్య వ్రాయకపోతే బాగుండదు కదా ! అనిపించి వ్యాఖ్య వ్రాసాను.
ఇకముందు అప్పుడప్పుడు ఇతరుల బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయాలని అనుకుంటున్నాను. అంతా దైవం దయ...
నాబ్లాగులో ఇతరులు వ్యాఖ్యలు వ్రాస్తే నాకు ఆనందమే. వ్రాయకపోయినా నేను ఏమీ తప్పుగా అనుకోను. వ్యాఖ్యలు వ్రాసినా వ్రాయకపోయినా నా బ్లాగులోని టపాలు మాత్రం అందరూ చదవాలని నా విజ్ఞప్తి...
Good, keep it up
Deleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
DeleteGood post
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete