koodali

Wednesday, April 18, 2012

ద్రౌపది...పంచపాండవులు...కర్ణుడు.



కొందరు ఏమంటారంటే , ద్రౌపది తనకు ఆరవ భర్తగా కర్ణుడు అయితే బాగుండు అని మనసులో భావించినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఒక పాత సినిమాలో కూడా ఇలాంటి ఒక సంఘటన ఉంది.


కానీ కర్ణుడు కుంతీదేవి యొక్క పుత్రుడని కుంతీదేవికి మాత్రం తెలుసు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణునికి తెలుసు. అంతేకానీ కర్ణుడు భారతయుద్ధంలో మరణించే వరకూ పాండవులకు మాత్రం ఆ విషయం తెలియదట.


యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత మాత్రమే కర్ణుడు తమకు అన్నగారని తెలుసుకున్న ధర్మరాజు , ఆ విషయం తమకు ముందే తెలిస్తే ఎంత బాగుండేది అని బాధపడినట్లు, ( కుంతీదేవి తమకు కర్ణుని విషయం ముందే చెప్పనందుకు బాధపడుతూ..... ) ఇకపై స్త్రీల నోట్లో రహస్యాల వంటివి దాగకూడదని శపించినట్లు ...పెద్దలు చెబుతారు కదా !


శాపం సంగతి ఎలా ఉన్నా, కర్ణుడు చనిపోయేంత వరకూ పాండవులకు అతను కుంతీదేవి కుమారుడని తెలియదన్నది వాస్తవమే అనిపిస్తుంది.


మరి అలాంటప్పుడు ద్రౌపదికి కూడా కర్ణుడు చనిపోయేవరకూ , కర్ణుడు కుంతీదేవి కుమారుడని తెలియదు కదా !


కర్ణుడు కుంతీదేవి కుమారుడనే విషయమే ద్రౌపదికి తెలియనప్పుడు .... కర్ణుడు తనకు ఆరో భర్తగా వస్తే బాగుంటుందని ద్రౌపది భావించినట్లుగా కొందరు ప్రచారం చేయటం చాలా అన్యాయం. ( అసలు పంచ పాండవులందరినీ కూడా వివాహం చేసుకోవాలని ద్రౌపది కోరుకోలేదు . అదలా జరిగిందంతే. )


ఇవన్నీ చూస్తుంటే, పురాణేతిహాసాలలోని సంఘటనలను ఎన్నో తరాలనుంచి కొందరు తమకు నచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి ప్రచారం చేస్తున్నారేమో ? అనిపిస్తోంది.


5 comments:

  1. సినిమా రామాయణం మహా భారతం వేరు , వ్యాసుడు , వాల్మీకి రాసిన మహాభారతం రామాయణం వేరు . సినిమా రామాయణం, మహా భారతాలలో ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు . అయితే సినిమా శక్తివంత మయిన మీడియా కాబట్టి వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీలుంటే ఒక సారి వ్యాసుని మహాభారతం, వాల్మీకి రామాయణం చదవాలి తెలుగులో కూడా ఉన్నాయి. రామాయణం, భారతం ఎప్పటివో అల్లూరి సీతారామ రాజు అంటే ఇటివల కాలం వారే కదా అల్లూరి సీతారామ రాజు వాస్తవంగా ఎలా ఉండేవారో . సినిమా రామరాజుకు దానికి సంబంధం లేదు . అల్లురిని సినిమా కోసం ఎలా తీర్చిదిద్దింది త్రిపురనేని మహా రథి ఆ మధ్య రాసిన ఒక బుక్ లో ప్రస్తావించారు

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ఎవరికైనా పొరపాట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ, తెలిసి జరిగినా తెలియక జరిగినా ( పొరపాటుగా జరిగినా ) ఇలా జరగటం దురదృష్టకరం.

    కర్ణుడు చనిపోయేంత వరకూ పాండవులకే కర్ణుడు తమ అగ్రజుడని తెలియనప్పుడు , ద్రౌపది కర్ణుని గురించి ఆలోచించినట్లుగా సినిమాలో చూపించటం అత్యంత దురదృష్టకరం.

    ఇక కొందరు ద్రౌపది కర్ణుని గురించి ఎంతో ఆలోచించినట్లుగా పుస్తకాల్లో వ్రాస్తున్నారు. ఇది కూడా దారుణమైన విషయం.

    ఇలా సినిమాలు తీసేవాళ్ళు, పుస్తకాల్లో వ్రాసేవాళ్ళూ .అన్నీ తెలిసే కావాలని చేస్తున్నారో ? లేక పొరపాటుగా చేస్తున్నారో ? భగవంతునికే తెలియాలి..

    ReplyDelete
  3. మురళీ గారి వ్యాఖ్యానం తో నేను ఏకీభవిస్తున్నాను. అయినా జరిగిందో లేదో తెలియని ఈ భారత, రామాయణం లాంటి ఇత్యాది గ్రంధాలని భూతద్దంలో చూసే కన్నా..అందులో చెప్పబడిన మంచి విషయాల గురించి ఆలోచించడం బాగుంటుంది కదండీ! శోధన అనవసరం కదా!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      .భండారు శ్రీనివాస రావు గారు – వార్తా వ్యాఖ్య.లో .... రామాయణ, భారతాల గురించి ఎంతో చక్కటి వ్యాసాలు వ్రాసారండి.

      రామాయణం పుక్కిటి పురాణమా ? ( శనివారం 3 డిసెంబర్ 2011 )

      మహాభారత యుద్ధం కవుల కల్పనా? - ( మంగళవారం 25 అక్టోబర్ 2011 )

      ఇంకా, రామసేతు గురించి, అలనాడు శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారకానగరం యొక్క కొన్ని ఆనవాళ్ళను సముద్రంలో గుర్తించామని కూడా ఆధునికులు చెబుతున్నారు. ( ఈ విషయం గురించి నేను వార్తాపత్రికల్లో కూడా చదివానండి. )

      ఇవన్నీ గమనిస్తే రామాయణ, భారతాలు జరిగినవేనని పెద్దలు చెప్పిన విషయం మరింత స్పష్టంగా తెలుస్తోంది.
      ...........
      ఇక మీరన్నట్లు ..పురాణేతిహాసాల్లో చెప్పబడిన మంచి విషయాల గురించి ఆలోచించడం బాగుంటుందండి. కానీ , కొందరు అందులో చెప్పబడిన మంచి విషయాల గురించి వదిలేసి , అందులో లేని విషయాలను కూడా కల్పించి లోకానికి అందిస్తూ హేళన చేయటం వల్లనే బాధ కలుగుతోంది.

      కొందరయితే , ద్రౌపది గురించి ఎన్నో విషయాలను కల్పించి వ్రాస్తున్నారు. వాటిని ఖండించకపోతే కొంతకాలానికి అవన్నీ నిజమేమోనని, , అవన్నీ మూలకధలో ఉన్నాయేమోనని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చినా రావచ్చు.

      అయినా, ఎంతమంది పురాణేతిహాసాలను హేళన చేసినా ...దైవం అన్ని సమస్యలను పరిష్కరించగల సర్వసమర్ధులని నాలాంటి ఆస్తికుల నమ్మకం.( మీరు కూడా ఆస్తికులని నేను అనుకుంటున్నానండి. .)

      Delete
  4. రామాయణ, మహాభారతాలు వీరగాథా ఇతిహాసాలు. అవి చరిత్రకాదూ, పూర్తిగా కల్పనా కాకపోవచ్చు. ఒక యుగం అంటే కొన్ని శతాబ్దాలకాలంలో జరిగిన వివిధ వీరగాథల్ని, పరిణామాల్ని గుదిగుచ్చి రాయబడ్డ సంకలిత కావ్యగాథలు. కవి లేక రచయితలు ఒక్కరు కాక పలువురు వుండవచ్చు. ఆ పలువురి కథాకథనాల్ని ఒక్కరు ఉదాహరణకు ఏ వ్యాసుడో, లేక వాల్మీకో వాడుకొని వుండవచ్చు. ద్రౌపదిని బహుబర్తృత్వ సముదాయానికి ప్రతీకగా తీసుకోవాలి అంతే. నేటికీ టిబెటన్లలో, జాట్లలో ఇలాంటి బహుభర్తృత్వ సంప్రదాయం వుంది. ఒకసారి వీక్ (వీక్) ఇంగ్లీషు వారపత్రికలో ఈ జాట్ల సంప్రదాయం గురించి పెద్ద వ్యాసమే వచ్చిందికూడ. కుంతి చివరలో కర్ణుడ్ని కలిసి పాండవులతో కలిసి ద్రౌపదినికూద ఏలుకోమని చెప్పిందనీ, దానికి అతడు మంచో చెడో నేను దుర్యోధనునికి మిత్రద్రోహం చేయను, కాని నా తమ్ముల్ని కూడ ఒక్క అర్జునిడికి తప్ప సమ్హరించను అనీ, చివరకు నేను మిగిలినా, అర్జునుడు మిగిలినా పాండవులు ఐదుగురే అవుతారులెమ్మనీ జవాబిచ్చినట్లు కథ.

    ReplyDelete