ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్ఞతలండి.
....................
ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాయాసీత యొక్క ప్రస్తావన వాల్మీకిరామాయణంలో లేదంటున్నారు. కానీ, చాయాసీత గురించి నారాయణ మహర్షి నారద మహర్షితో స్పష్టంగా చెప్పటం జరిగింది. ఈ వివరములు శ్రీదేవీ భాగవతములో ఉన్నాయి. ఇవన్నీ చదివిన తరువాతే నేను చాయాసీత గురించి వ్రాసాను.
.................
పైన వ్రాసిన విషయంతో ఇప్పుడు వ్రాయబోయే విషయానికి సంబంధం లేదు లెండి.
ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరపు పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణులైన వారికి నా శుభాకాంక్షలు .
ఉత్తీర్ణులు కాని పిల్లలు అధైర్యపడవద్దని కోరుకుంటూ, ఈ అపజయాన్ని విజయానికి సోపానంగా మార్చుకుని ధైర్యంగా ముందుకు సాగాలని పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు నా సలహా .
ఫెయిల్ అయిన పిల్లలు ఆత్మహత్యల వంటి పిచ్చిపనులు చెయ్యరాదని, పిల్లలను విపరీతంగా సూటిపోటి మాటలతో తిట్టవద్దని తల్లితండ్రులకు నా విజ్ఞప్తి.
జీవితంలో ఉన్నతశిఖరాలను అధిరోహించిన వారెందరో ఒకప్పుడు అపజయాన్ని ఎదుర్కొన్నవారేనని ఎందరో గొప్పవారి కధల ద్వారా మనకు తెలుస్తుంది కదా !
No comments:
Post a Comment