koodali

Monday, April 23, 2012

*కొన్ని ధర్మ సందేహాలు...


బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్ఞతలండి.

..............................................

వ్యాసులవారి   కుమారుడైన  శుకుడు     గృహస్థాశ్రమం  అంటే  విముఖతను  చూపిస్తూ  సన్యాసాశ్రమం    అంటే  మక్కువ  చూపిస్తున్నప్పుడు    వ్యాసులవారు  శుకునితో   ఎన్నో  విషయాల  గురించి  చెప్పటం   జరిగింది. 


  అలా     చెబుతూ  .....  ఇంద్రియాలు   ఎంతో   బలవత్తరమైనవని,   ఆశ్రమస్వీకరణ  ఒక  వరసలో  వెళ్ళాలి  తప్ప   ,   దుముకుళ్ళు  చెల్లవు.  అంటూ .నచ్చచెప్పటానికి  ప్రయత్నిస్తారు. 

 

  ఇంకా, ... జనకమహారాజు   గృహస్థాశ్రమంలో  ఉంటూనే  జీవన్ముక్తునిగా     జీవించటం  గురించి  చెప్పి , ఆ  విషయాల  గురించి   తెలుసుకురమ్మని  శుకుని  జనకుని  వద్దకు  పంపటం  జరుగుతుంది  కదా  !

ఇక్కడ   నాకు  కొన్ని  ధర్మసందేహాలు  కలిగాయి.

 నాకు  తెలిసినంతవరకూ  వ్యాసులవారు  ద్వాపరయుగానికి  చెందిన  వారు  అనుకుంటున్నాను.  మరి  జనకుడు  అంటే  సీతాదేవికి  తండ్రి  .

1. శుకుడు  వెళ్ళి  కలుసుకున్న       ఈ  జనకుడు  ఎవరు  ? సీతాదేవి   యొక్క    తండ్రి  గారా  ?

 లేక

2.  సీతాదేవి   యొక్క తండ్రి    అయితే  ఆ     జనకుడు   అంతకాలం  జీవించి  ఉన్నారా  ? 

 

 (  అప్పటివారు  కొందరు  అలా  ఎంతోకాలం  జీవించి  ఉండేవారు  కదా  !  ఉదాహరణకు  త్రేతాయుగానికి  చెందిన  హనుమంతులవారు  ఇప్పటికీ  జీవించి  ఉన్నారని  అంటారు  కదా  ! )

 లేక
3.  నిమి  యొక్క  వారసులు (  విదేహులు  )  జనకులు  అన్న  పేరుతో  ప్రసిద్ధి  చెందారు. శుకుడు  మిధిలా  నగరానికి  వెళ్ళి    కలిసిన  జనకుడు    ( ద్వాపరయుగంలోని  )   ఆ   జనక   పరంపరకు  చెందిన  వ్యక్తా ?

 లేక

4.  శుకుడు  మేరువును  ,  హిమాలయాలను  దాటి  మిధిలా  నగరానికి  చేరినట్లు  అంటారు.  అలా  చూస్తే ... ఒకవేళ  ధ్యానం ,  యోగా   మొదలైన  ప్రక్రియల   ద్వారా   శుకులవారు    పురాతనకాలానికి  చెందిన  సీతాదేవి  తండ్రి  అయిన  జనకులవారితో   సంభాషించారా  ? 


లేక
 5. కాలంలో  వెనక్కి  వెళ్ళి  జనక  మహారాజుతో  సంభాషించారా  ? 

  (  ఒక  సినిమాలో  ...వ్యక్తులు    టైం  మెషిన్లో  భూతకాలానికి  ,  భవిష్యత్తు  కాలానికి  వెళ్ళినట్లుగా ... )


6..ఇవన్నీ  కాకుండా  ఈ  సందేహాలకు  వేరే   సమాధానాలు  ఉన్నాయా  ?   ఇలా .... ఎన్నో  ఆలోచనలు  వచ్చాయి.

ఇవన్నీ  కాకుండా ,  వేరే   సమాధానాలు  ఎవరికైనా   తెలిస్తే  ,     దయచేసి  చెబుతారా  ?  (  మీకు  ఇబ్బందిలేకపోతే  ) మీకు  తెలిసిన  విషయాలు   ఈ  బ్లాగులో  చెప్పటం  ఇబ్బందిగా  అనిపిస్తే ,  మీ  బ్లాగులో  అయినా  చెప్పగలరు..

 

ఈ  క్రింది  వ్యాఖ్య  ల వద్ద  కూడా  చదువుతారా...

  .................................................................

 


1 comment:

  1. కష్టేఫలే శర్మగారు తమ బ్లాగులో ..... పురాణపాత్రలను ఈనాటి వ్యక్తులతో పోల్చి వివరిస్తూ చక్కటి ప్రయత్నం చేసారు. .దేవయాని పాత్ర గురించి శర్మగారు మరియు శ్యామలీయంగారి మధ్య జరిగిన మంచి చర్చ వల్ల దేవయాని పాత్ర గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిసాయి.

    . శర్మగారు తమ వ్యాఖ్యలలో ..పురాణాలలోనే ఇటువంటివి ఉన్నాయి కనక మేము ఇప్పుడు చేస్తే తప్పేమీ అని అడిగే ప్రబుద్ధులూ ఉన్నారు. పాత వారి జీవితాలలో జరిగిన తప్పులు మన జీవితాలలో జరగకుండా చూసుకోవడం విజ్ఞుల లక్షణం.అని వ్రాశారు.

    నిజమేనండి, అలా దబాయించే వాళ్ళూ ఉంటారు. ఇలా అడిగే వాళ్ళు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే , పురాణాలలో పొరపాట్లు చేసిన వ్యక్తులు దానికి తగ్గ కష్ట ఫలితాన్ని అనుభవించినట్లు కనిపిస్తుంది. వారిని అనుకరించే ఇప్పటి వారు కూడా అలాంటి కష్టాలను అనుభవించవలసి ఉంటుంది. అని గుర్తుంచుకోవాలి మరి. ..

    ఇంకా, ఈ బ్లాగులో లక్కరాజు గారు ఒక వ్యాఖ్యలో, మిరప కారం వల్ల కలిగే కొన్ని లాభాలు గురించి వ్రాసారు. .....అవి . చదివిన తరువాత , మిరపకాయల వాడకం గురించి మన ప్రాచీనులకు కూడా తెలుసు అని నాకు కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. ఇలా తమకు తెలిసిన విషయాలను అందరితో పంచుకోవటం వల్ల, అందరికీ కొత్త ఆలోచనలు కలిగే అవకాశం ఉంది.

    ReplyDelete