koodali

Wednesday, April 4, 2012

వేదవతి...చాయాసీత...స్వర్గలక్ష్మి....ద్రౌపది.

ఓం.

శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణచరితామృతము గ్రంధములో ........ సీతాదేవి గురించి, ద్రౌపదిదేవి గురించిన వివరములు ఉన్నాయి.

పరమాత్మాపరాశక్తులు వేరు కాదు . వారు ఒక్కరే. ఒకే మూలతత్వం. సృష్టి ఆదిలో ఆ మూలతత్వం తన్ను తాను రెండుగా విభజించుకోవటం జరుగుతుందట.


ఆ మూలశక్తి తన భావానికి అనుగుణంగా ఏ రూపాన్నయినా పొందటం జరుగుతుందట. ( అన్ని రూపాలూ ,అన్ని శక్తులూ వారే కాబట్టి. ) సగుణగానూ నిర్గుణగానూ ........ స్త్రీగానూ పురుషునిగానూ కూడా ఉండగలరట.

వారు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను...సరస్వతీ , లక్ష్మీ, గౌరీ శక్తులను సృష్టించి వారికి సృష్టి యొక్క సృజన , పాలనా , సంహారక బాధ్యతలను అప్పగించారట. ఈ దేవీ దేవతామూర్తులు అనేక రూపాల్లో ఉంటారు.


ఉదాహరణకు........లక్ష్మీ దేవి పూర్ణావతారంగా వైకుంఠంలో విష్ణుమూర్తి వద్ద ఉంటుంది. లోకంలో అంశావతారాలుగానూ కళాంశావతారాలుగానూ ఉంటుంది. ఇంకా రాజ్యలక్ష్మిగానూ, గృహలక్ష్మిగానూ ఇత్యాది ఎన్నో రూపాల్లో ఉంటుంది.

శ్రీఅనఘాదేవీసమేతశ్రీ
దత్తాత్రేయుల వారు ......మూలతత్వానికి ప్రతీకలు. వారు పరాశక్తిపరమాత్మ స్వరూపులు.....శ్రీఅనఘాదేవీసమేతశ్రీదత్తాత్రేయుల వారిలో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు...సరస్వతిలక్ష్మిగౌరి....శక్తులు ..... ఉన్నారు.

రామాయణంలో ..... సీతారాముల వనవాస కాలంలో ,...... అగ్నిదేవుడు చాయాసీతను సృష్టించినట్లుగా .... చాయాసీతనే రావణాసురుడు అపహరించినట్లు ..... గ్రంధములలో ఉన్నది.


శ్రీరాముడుసీతాదేవి కోరిక మీద బంగారు లేడి కొరకు వెళ్ళిన సమయంలో ......రావణాసురుడు ..... సీతమ్మను అపహరించటానికి వచ్చినప్పుడు ...... సీతాదేవి భయపడి కుటీరంలోపలి అగ్నిహోత్రం వద్దకు వెళ్ళగా ....... అప్పుడు అగ్నిహోత్రుడు 
ఛాయాసీతను సృష్టించటం ....రావణాసురుడు ఛాయాసీతను అపహరించటం జరిగిందని నేను ఒక దగ్గర చదివానండి.

నాకు ఏమనిపిస్తుందంటే ....వేదవతిగా ఉన్నప్పుడు , ఆమె తానే ..... రావణాసురుని నాశనం కొరకు మళ్ళీ జన్మిస్తానని చెప్పటం జరిగింది కదా ! అలాగే సీతాదేవిగా జన్మించింది.


ఇంకా, విష్ణుమూర్తికి కొంతకాలం భార్యా వియోగం అనుభవించాలని భృగు శాపం ఉంది కదా !

అయితే, వేదవతి ప్రతిజ్ఞ నెరవేరాలంటే .. రాముని భార్య అయిన సీతాదేవిని ( వేదవతిని ) రావణుడు అపహరించటం అనేది కాకుండా ..ఛాయాసీతను రావణాసురుడు అపహరించటం వల్ల .. ఆమె ప్రతిజ్ఞా నెరవేరుతుంది .... ఇంకా శ్రీరాముని భార్య అయిన సీతాదేవి అగ్నిదేవుని రక్షణలో ఉండటం ... ఇదంతా పద్ధతిగా సముచితంగా ఉంది.

 

అగ్ని పరీక్ష తరువాత అగ్నిదేవుడు అసలు సీతను రామునికి అప్పగించిన తరువాత ...... 
ఛాయాసీత తపస్సు చేసి స్వర్గ లక్ష్మి అయ్యిందట. .

తరువాత ఆమె ద్వాపర యుగంలో ద్రౌపదిగా జన్మించటం ...... పాండవ పత్నిగా అవటం జరిగిందట.
స్వర్గలక్ష్మిదేవి అంశ అయిన ద్రౌపదిలో ..... పార్వతీదేవి అంశ ( దుర్గాదేవి ) కూడా ఉన్నదట.


పార్వతీ దేవి లోని రౌద్రాంశలోని కొంత భాగం ద్రౌపదీ దేవిలో ఉందనిపిస్తుంది. (
రౌద్రాంశ ఎందుకు అంటే.. ద్రౌపది ద్రుపదుడు పంతంతో చేసిన యాగం నుంచి ఆవిర్భవించింది అన్నది కూడా గమనించవలసిన విషయం. )

ఇంకో విషయం ఏమంటే........ విష్ణుమూర్తి మరియు పార్వతీ దేవి సోదరసోదరీలు. విష్ణుమూర్తి స్త్రీరూపం ధరిస్తే పార్వతీదేవీ అవుతారట.


విష్ణుమూర్తి యొక్క స్త్రీ రూపం పార్వతీ దేవి అన్నమాట. ( విష్ణుమాయ, విష్ణుదుర్గ అనే నామములు లోకంలో ప్రచారంలో ఉన్నాయి కదా ! . )



.మన దేశీయులు కొందరు ప్రాచీనగ్రంధాలలోని విషయాలను ఎగతాళి చేస్తారు. ద్రౌపదికి అయిదుగురు భర్తలట. కుంతికి ఆరుగురు కొడుకులట హి..హి..అంటూ ఎగతాళి చేస్తారు. ద్రౌపది అగ్నిగుండంలోనుంచీ జన్మించింది.కుంతీదేవి కూడా కారణజన్మురాలు. ఇలాంటి వారి గురించి ఎగతాళిగా మాట్లాడతారు.

వీటన్నింటి వెనుక ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి. మనకు ఆ అంతరార్ధాలు గురించి తెలియదు. అయినా విమర్శించటం, ఇలాగే కాలం గడిచిపోతోంది. ఇదంతా మన దురదృష్టం.

విదేశీయులు కొందరు మన ప్రాచీన గ్రంధాలలోని విషయాలను మనకన్నా ఎంతో శ్రద్ధగా తెలుసుకుంటున్నారు.
Shiva and Durga - Stephen క్నాప్స్.Part 2 - Science and Vedic Knowledge, Hinduism....

...................
మహర్షి వ్యాఘ్రపాదుని కుమారుడైన ఉపమన్యువు తపస్సు చేయగా ....శివపార్వతులు .... ఇంద్రుడు శచీదేవిలా  వచ్చి ఉపమన్యువుని పరీక్షిస్తారట.
 ( శివుడు ఇంద్రునిలా పార్వతి శచీ దేవిలా ). అలా ఇంద్రునిలా వచ్చిన శివుణ్ణి సురేశ్వరా అంటారట..
...........

రాక్షసులు  ఎన్నో  మెలికలు  వేసి  దేవతల  వద్ద   నుంచి  వరాలను పొందిన  సందర్భాలలో .....వారు   పొందిన    వరాలకు  భంగం  కలుగకుండానే  ఎంతో  చాకచక్యంగా  ఆ  రాక్షసులను    దైవం  సంహరించటం  జరిగింది. 


 ఒకవేళ   దేవతలకు     ఏదైనా     సమస్య    ఎదురైతే   , ఆదిపరాశక్తి అయిన పరమాత్మ   చాకచక్యంగా  ఆ  సమస్యను  పరిష్కరించగలరు.  ( దేవతల  గౌరవానికి  భంగం  కలుగని  రీతిలోనే  దేవతలకు  వచ్చిన  సమస్యలను  కూడా  చాకచక్యంగా   పరిష్కరించగల  సమర్ధత  దైవానికి  ఉంటుంది  ...అని నా అభిప్రాయం.) 


12 comments:

  1. నాకు ఉన్న సందేహములు:
    1. అసలు సీత రావణాసురుని వెనకాల వెళ్ళక పొతే, "సీత పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు" అన్న నానుడి ఎందుకు వచ్చింది..
    2. అసలు సీత రావణాసురిని లంకలో లేనప్పుడు, ఎవరో ఒక అనామకుడు అన్న మాటలకు రాముడు సీత ని అడవిలో ఎందుకు వదిలాడు.. (అప్పటికి అందరికీ తెలుసు అగ్ని ప్రవేశం సంగతి.)
    3. ఇక్కడ రాముడు అడవుల్లో సీత కోసం కష్టాలు పడి లంకకు వెళ్ళి రావణాసురిని చంపితే, అసలు సీతా దేవి అక్కడ అగ్ని దేముని ఇంట హాయిగా విశ్రాంతి తీసుకుంతే అది ఆదర్శం ఎలా అవుతుంది..
    పై ప్రశ్నల వల్ల నేను ఏదో నాస్తికుణ్ణని, రామ భక్తి లేని వాణ్ణని అనుకోవద్దు.. నేను నిత్యం రామ సేవలో తరించే వాణ్ణే ... కాని నా ఈ సందేహాలు పొడుస్తూ వుంటాయి..
    ఇహ మీ పోస్టులో వేదవతే అసలు సీత అని కంఫ్యూజన్ గా రాసారు.. క్లారిటీ లేదు..
    ఇంకో సందేహం ఏమిటంటే ఎప్పుడో త్రేతా యుగం లో వున్న కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అయోధ్యలో వుండడం సమంజసమేనా..యుగానికి యుగానికీ మధ్య భూకంపాలు వస్తాయేమో కదా..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      ఆలస్యంగా జవాబిస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      రాముడు వనవాసం చేస్తూ సీత రామునితో పాటు వెళ్ళకపోతే ...........

      రాముడు మునులను హింసిస్తున్న రాక్షసులతో యుద్ధాలు చేస్తూ కష్టాలు పడుతుంటే, సీతాదేవి అంతఃపురంలో ఉంటే అది ఆదర్శం ఎలా అవుతుంది. భార్య భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి కదా ! అనేవారేమో ? అనిపిస్తుంది.

      ( అయినా సీతాదేవి రామునితో వెళ్ళకుండా అంతఃపురంలో ఉన్నా రావణుడు అపహరించడని ఏమిటి గ్యారంటీ ?................ఒకవేళ అలా జరిగితే సీత రామునితో వనవాసానికి వెళ్ళకపోవటం వల్లే సీతాపహరణం జరిగింది అనేవారేమో ? ).

      Delete
    2. సీతమ్మను అడవులకు పంపించటం. ......... ఇక్కడ గమనించవలసినది ఏమంటే ......అగ్నిపరీక్ష తరువాత కూడా .......ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు.


      ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. పైకి అనకపోయినా.....


      అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...

      ( నేను పాత టపాలో వ్రాసిన విషయం ఇది. మరీ స్పష్టంగా వ్రాస్తే బాగుండదేమోనని అప్పుడు వివరించలేదండి. )

      ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ....... అని వ్రాసినదానిలో ఎన్నో అర్ధాలున్నాయి. కొన్ని అభిప్రాయాలను వివరిస్తానండి.

      సీతాదేవి గొప్ప పతివ్రత. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. ఆమె మహిమ గురించి రామునికి తెలుసు. సీతాదేవిని అరణ్యాలకు పంపించిన తరువాత అశ్వమేధ యాగ సమయంలో ఇంకో వివాహం చేసుకొమ్మని కొందరు సలహా ఇచ్చినా రాముడు వినలేదు. స్వర్ణ సీతాదేవిని తయారుచేయించి భార్యగా భావించి యాగాన్ని నిర్వహించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు సీతాదేవి గురించి రాముని అభిప్రాయం లోకానికి తెలియటానికి.


      మరి రామునికి సీతాదేవి అంటే అంత గొప్పభావం ఉన్నప్పుడు అడవులకు ఎందుకు పంపించారు ? అంటే .......

      సామాన్య వ్యక్తి ఏం చేసినా లోకం అంతగా పట్టించుకోదు. రాముడు చక్రవర్తి. . యధా రాజా తధా ప్రజా అంటారు కదా ! రాజు ప్రజలక్షేమం గురించి ఎన్నో రకాలుగా ఆలోచించవలసి ఉంటుంది.

      రామాయణ గాధ జరిగి తరాలు గడిచినా అప్పటి వారు ఎలా ప్రవర్తించారు అని ఇప్పటికీ ప్రజలు శల్యశోధన చేస్తున్నారు కదా ! !


      సీతాదేవి దైవాంశసంభూతురాలు. ఆమె పాతివ్రత్య బలం వల్లే రావణుడు ఆరు బయట అశోకవనంలో ఆమెను ఉంచి తనను వివాహమాడమని బ్రతిమలాడుకోవటం తప్ప మరో విధంగా ప్రవర్తించలేదు కదా !


      ఈ రోజుల్లో అందరు ఆడవాళ్ళు సీతమ్మలా పతివ్రతలు కాదుకదా ! అయితే ఈ రోజుల్లో కూడా పతివ్రతలయిన స్త్రీలు చాలా మంది ఉన్నారు.

      అయితే మరి కొందరు స్త్రీలు తమ భర్త కాకుండా వేరే సంబంధాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు కదా ! .

      ఇలాంటి దురాచారులైన స్త్రీలు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి కూడా భర్త తమను గౌరవించి తీరాలని నిర్భందిస్తే ఆ భర్తకు ఏది దారి ?

      ఇలా ఎన్నో ఆలోచించి దూరదృష్టిగల ఆ నాటి వారు అలా చేసారేమో ?.

      ఉత్తమ మైన రాజుగా రామయ్య ..ఉత్తమమైన రాణిగా సీతమ్మ ప్రజలను దృష్టిలో ఉంచుకుని తమ జీవితంలోని సుఖసంతోషాలను త్యాగం చేసి ఉంటారు అనిపిస్తుంది.

      పురాణేతిహాసాలు ద్వారా లోకానికి ఎన్నో విషయాలు తెలుస్తాయి....

      Delete
    3. ఆ పామరుడు తన భార్య విషయంలో ఒక సమస్య వచ్చిన సందర్భంలోనే అలా వ్యాఖ్యానించాడు అన్నది మనం గమనించాలి..

      Delete
    4. వేదవతి లక్ష్మీదేవి అంశతో జన్మించిందని పెద్దలు చెప్పినట్లు గ్రంధాలలో ఉన్నదండి. అందుకే అలా వ్రాశాను.

      Delete
    5. రాముడు సామాన్య మానవుడుగా జన్మిస్తే సీతాదేవిని అడవులకు పంపించేవారు కాదు అనిపిస్తుంది. .

      Delete
  2. ఇప్పుడు అయోధ్యలో ఉన్న కట్టడాలు త్రేతాయుగం నాటివో కాదో నాకు తెలియదండి. అయితే కొన్ని ప్రాచీన కట్టడాలను పునర్నిర్మించి ఉండవచ్చు కూడా. పూర్వీకులు నిర్మించిన ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉన్నాయి కదా !

    రామసేతు, ఇంకా సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం ఆనవాళ్ళు శాటిలైట్స్ ద్వారా గుర్తించామని ఆధునికులు అంటున్నారు కదా !

    నాకు తెలిసినంతలో కృతయుగం నుంచీ కలియుగం పూర్తయ్యే వరకూ మరీ పెద్ద ప్రళయాలు రావనుకుంటా, యుగానికీ యుగానికీ మధ్య వచ్చేవి సామాన్య ప్రళయాళే. అందువల్ల త్రేతాయుగం నాటి కట్టడాలు కొన్ని నిలిచి ఉండే అవకాశం ఉంది..

    పూర్వయుగాల్లో ఇప్పటికన్నా గొప్పసైన్స్ ఉండేదనిపిస్తుంది. అలా కట్టిన కట్టడాలు కాబట్టి అవి చాలా కాలం ఉంటాయి....

    ReplyDelete
    Replies
    1. విష్ణుమూర్తికి కొంతకాలం భార్యావియోగం ఉంటుందని భృగు మహర్షి ఇచ్చిన శాపం ఉంది కదా !

      పునీతుడైన అగ్నిదేవుని రక్షణలో సీతాదేవి ఉండటానికి ఎవరికైనా అభ్యంతరం ఏముంటుంది ? పరమ పతివ్రత అయిన సీతాదేవి అక్కడ శ్రీరాముని తలచుకుంటూ బాధతోనే గడుపుతుంది కానీ హాయిగా విశ్రాంతి ఎలా తీసుకుంటుంది ?

      Delete
    2. ద్వాపర యుగంలోని పరీక్షిత్తు మహారాజు సమయంలోనే కలి ప్రవేశించటం చూస్తే యుగానికి యుగానికి మధ్య ( నాలుగు యుగాలకు మధ్య కాలంలో ) భూమి మీది జీవజాలం అంతరించి పోయేంత మహా ప్రళయాలు రావేమో ? అనిపిస్తుందండి.

      అయితే మహాభారత యుద్ధం కూడా ఒకరకంగా ప్రళయం లాంటిదే ....

      Delete
  3. Nonsense. వాల్మీకి రామాయణంలో మాత్రం ఛాయాసీత ప్రసక్తే ఎక్కడా లేదు. అది తర్వాత ఎవరో వీరభక్తులు సృష్టించిన కాకమ్మకథే ననడంలో సందేహమే లేదు. ఇంకా రాముడు రావణుడ్ని చంపినతర్వాత, సీతను తనదగ్గరికి తీసుకురాబడ్డప్పుడు చాల నీచంగా అందరిముందూ దూషిస్తాడు. నీకు కావాలంటే లక్ష్మణుడితోనో,భరతుడితోనో, లెక విభీషణుడితోనో లేక నీకు ఇష్టంవచ్చినవాడితో [లేచి] పొమ్మని కసురుతాడు. ఆ అవమానం భరించలేక సీత తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుందేమో. దాన్ని తర్వాత అగ్నిదేవుడు రక్షించి తిరిగి అప్పగించినట్లు కథ అల్లారేమో ననిపిస్తుంది. అదండీ, ఈ 'మర్యాదా పురుషోత్తముడు' రాముడి అసలు యెవారం!

    ReplyDelete
  4. చాయాసీత ప్రసక్తి వాల్మీకి రామాయణంలో ఎందుకు లేదో నాకు తెలియదండి. అయితే , శ్రీ దేవీ భాగవతము లో చాయాసీత గురించి స్పష్టంగా ఉంది. శ్రీ దేవీ భాగవతము కూడా ఎంతో గొప్ప గ్రంధము.

    సీతాపహరణానికి ముందు అగ్నిదేవుడు శ్రీరాముని వద్దకు వచ్చి, సీతాపహరణం జరగబోతోందని చెప్పి , సీతాదేవిని తన సంరక్షణలో ఉంచుతానని చెప్పి, చాయాసీతను రాములవారికి అప్పగించి వెళ్తారు.

    వారు అటువెళ్ళగానే బంగారుజింక కనిపించటం , చాయాసీత ఆ బంగారులేడి కావాలని కోరటం, తరువాత సీతాపహరణం జరుగుతాయి. రావణవధ అనంతరం సీతాదేవికి జరిగిన అగ్నిపరీక్ష సమయంలో , చాయాసీత అగ్నిలోకి వెళ్ళగా , అగ్నిదేవుడు అసలు సీతాదేవిని శ్రీరామునికి అప్పగిస్తారు.

    ReplyDelete
    Replies
    1. అగ్నిపరీక్ష తరువాత రాముల వారు సీతాదేవిని వెళ్ళమనటంలో అర్ధం..

      లక్ష్మణుడు, భరతుడు, విభీషణుడు..సీతాదేవికి సోదరుల వంటివారు కాబట్టి, రాములవారు అలా అని ఉంటారని ఒకరు చెప్పగా విన్నాను.

      సీతాదేవి రాముని వద్దకు రాగా రాముల వారు ఏమీ అభ్యంతరం చెప్పలేదు కదా!

      Delete