koodali

Wednesday, November 2, 2016

ఆదిశంకరాచార్యుల వారు ఎంతో గొప్పవారు...


ఈ టపాను కొన్ని సంవత్సరాల క్రిందట వ్రాసాను.
 శంకరాచార్యుల వారి గురించి ఒకరు వ్రాసిన విషయాలను చదివి ..వారు శంకరాచార్యులను విమర్శించారని అభిప్రాయపడి ఈ టపా వ్రాసాను.
...........
   Thursday, December 13, 2012


శంకరాచార్యుల వారికి స్త్రీలంటే ఎంతో గౌరవం .....

*  ఆదిశంకరాచార్యుల వారి  ప్రశ్నోత్తర రత్న మాలికలోని   కొన్ని  విషయాలను  గురించి,  కొందరు  ఏమనుకుంటారంటే,  శంకరాచార్యుల  వారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఉన్నదేమో  ? అని  అపోహపడతారు.
*ఈ  విషయాల  గురించి  నాకు  తెలిసింది  చాలా  తక్కువ.  నాకు  తెలిసినంతలో , నా  అభిప్రాయాలను  వ్రాయాలనిపించి  వ్రాస్తున్నాను. 
* ఆదిపరాశక్తిని  ఎంతగానో  ఆరాధించిన   శంకరాచార్యులవారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఉండదు.
* ఆదిశంకరాచార్యుల  వారు శిష్యులకు  బోధించినది  ఈ “ ప్రశ్నోత్తరీ మణిరత్నమాల ” అనుకుంటున్నాను.

ప్రశ్నోత్తర రత్న మాలికలోని  ఈ  విషయాలను  గమనించితే,   శంకరులవారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఎంతమాత్రం  లేదని  తెలుస్తుంది.
* Who is  the friend  for  a  family  man  ?
a.  His  wife.

* Who  is  God  whom  we  can  see  ?
a.   Mother.

* Who  is the  teacher  fit  to  be  worshipped  ?
a.  Father.

* Who  is  a  brahmachari  (  unmarrieD  lad  doing austerities ) ?
a.  He  avoids  contact  with  women  and  is  safe  from  such  contacts.


*   తల్లిని  కనిపించే  దైవంగా  ,  భర్తకు  జీవితంలో  స్నేహితురాలిగా  భార్యను  చెప్పటం  బాగుంది.
* వారు  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండమని  చెప్పినది  వివాహం  కాని బ్రహ్మచారులు,   ..వంటి  కొందరిని   ఉద్దేశించి    చెప్పారని  అనిపిస్తున్నది.
.......................


* పై  విషయాలను  గురించి,    నాకు తోచిన  అభిప్రాయాలను  క్లుప్తంగా  చెప్పుకోవాలంటే,,
* వివాహం  కాని  బ్రహ్మచారులైన  పురుషులు ,  స్త్రీలకు  తగుమాత్రం  దూరంగా  ఉండాలి. లేకపోతే.........వారి  విద్యాభ్యాసం  కుంటుపడి,  వారి  భవిష్యత్తు  అంధకారమయ్యే  ప్రమాదముంది.


* తపస్వులైన  పురుషులు  స్త్రీలకు  తగుమాత్రం  దూరంగా  ఉండాలి. లేకపోతే......వారి  తపస్సుకు  భంగం  కలిగి , అప్పటివరకు  సంపాదించుకున్న  తపశ్శక్తిని  కోల్పోవలసివస్తుంది. అప్పుడు   తపస్సు  ద్వారా  వారు  పొందాలనుకున్న ప్రయోజనాలు  నెరవేరవు  కదా  !

*( గృహస్తుల  వంటి వారు   కూడా  కోరికలను  సిద్దింపజేసుకోవటానికి ,  కొన్నిసార్లు  తపస్సులు    చేస్తుంటారు....ఇలాంటివారు  కూడా   దీక్షా  సమయంలో  స్త్రీలకు  కొంతవరకు   దూరంగా  ఉండాలి. అయితే,  దీక్షావిధికి  సంబంధించిన  సహాయం, ఆహారాన్ని  తయారుచేసి అందించటం, అనారోగ్యం  కలుగకుండా  చూసుకోవటం..మొదలైన  సేవల  విషయంలో  భార్య  సహాయాన్ని    పొందవచ్చు  అనుకుంటున్నాను...)
..................................

 * శంకరాచార్యుల  వారు,  తల్లి  మరణించిన  సందర్భంలో,   తానే  వచ్చి   అంత్యక్రియలు  నిర్వహించారని  విన్నాను.  సన్యాసాన్ని  స్వీకరించిన  వ్యక్తి  తన  తల్లికి  అంత్యక్రియలు  చేయకూడదని  అప్పటి  వారు   కొందరు  అన్నారట.
*అయితే,,సన్యాసస్వీకారం  అప్పుడు   గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారని  అంతర్జాలంలో వ్రాసారండి. . అలా ఇచ్చినమాట  ప్రకారం  వారు   తల్లి  పట్ల  తన  బాధ్యతను  నిర్వర్తించారనిపిస్తుంది. దీనిని  బట్టి  చూస్తే,  తల్లి  అంటే   వారికి  ఎంతో  గౌరవం  అని  మనం  తెలుసుకోవచ్చు.

* ఒక సారి  ఆదిశంకరాచార్యుల  వారు  భిక్షకు  వెళ్ళినప్పుడు , పేదరాలైన  ఒక  స్త్రీ  భిక్ష  వేయటానికి  ఇంట్లో  ఏమీ  లేక,   ఒక  ఉసిరికాయను  భిక్షగా  సమర్పించగా ,  ఆ  ఇల్లాలి  పరిస్థితికి  జాలి  కలిగి  అప్పటికప్పుడు  కనకధారా  స్తోత్రాన్ని  పఠించి   శ్రీ  మహాలక్ష్మి అమ్మవారి   అనుగ్రహాన్ని  పొంది  బంగారు  ఉసిరి పండ్ల  వాననే  కురిపించారంటారు. 
 
* ఇవన్నీ  గమనిస్తే  వారికి  స్త్రీలంటే  గొప్ప  గౌరవం   అని  తెలుస్తుంది.
....................................

* పూర్వం    కొందరు  తపస్వులు,  మహర్షులు    స్త్రీ  విషయంలో  పొరపాట్లు  చేసి, అప్పటివరకూ   కష్టపడి  సాధించిన  ఎంతో  తపశ్శక్తిని  పోగొట్టుకున్నారు.  ఉదా....విశ్వామిత్రుల  వారు.

* తపస్వులు  తపస్సులు  చేసేటప్పుడు  ఎంతో  నిగ్రహంగా   ఉండాలి.  ఇంద్రుడు  వంటివారు  తపస్వుల   నిగ్రహాన్ని  పరీక్షించటానికి  అప్సరసలను   పంపటం   వంటి   ఎన్నో  పరీక్షలను  పెడతారు. ఈ   పరీక్షలో  నెగ్గినవారికే  తపోఫలం  లభిస్తుంది.
 

* ఇక  గృహస్తుల  విషయంలో ,   వివాహమైన  పురుషుడు  ధర్మపత్నితో  సంసారాన్ని  సాగించటం  వరకూ  ఎవరూ  అభ్యంతరం  చెప్పరు. . భార్యాభర్తలు  అర్ధనారీశ్వరులన్నారు  కదా ! పెద్దలు. 

* అయితే,   ఒక  సంసారాన్ని  నిర్వహించాలంటేనే  కొన్ని  కష్టాలుంటాయి.   ఇక  ఎక్కువమంది  స్త్రీలతో  భాంధవ్యాలను   పెంచుకుంటూ  పోతే  పురుషులకు  బాధ్యతలు,  కష్టాలు    పెరగటం  తప్ప,  సుఖమేమీ  ఉండదు.

 * అందుకని  గృహస్తులు  కూడా  పరాయి  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండాలి.

* ఇక  పురాణేతిహాసాల్లో  చూస్తే , కొందరు   స్త్రీలు  అనుకున్నంత  అబలలు  కాదని  తెలుస్తుంది.  శ్రీ  రాముని  వనవాసానికి  పంపించే  విషయంలో  చాడీలు  చెప్పిన  మంధర,  రావణునికి  చాడీలు  చెప్పి  సీతాదేవిని   అపహరించటానికి  కారకురాలైన   శూర్పణఖ  స్త్రీలే.

* పై  విషయాలను  గమనించితే,  పురుషులు  కొన్ని  సార్లు,  స్త్రీల  విషయంలో   తగుమాత్రం  దూరంగా  ఉండాలి  .అని  తెలుస్తుంది..  

శంకరాచార్యుల  వారు  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండమని  చెప్పినది , వివాహం  కాని బ్రహ్మచారులు,   ..వంటి  కొందరిని   ఉద్దేశించి   చెప్పారని  అనిపిస్తున్నది.

* శంకరాచార్యుల  వారు,  తల్లిని  కనిపించే   దైవంగా , భర్తకు  చక్కటి  స్నేహితురాలిగా  భార్యను  చెప్పటాన్ని  గమనించితే,  వారికి  స్త్రీలంటే  ఎంతో  గౌరవం  అని  తెలుస్తుంది.
.................................

* ఆదిశంకరాచార్యుల వారి  ప్రశ్నోత్తర రత్న మాలికలోని   కొన్ని  విషయాలను  గురించి,
అంతర్జాలంలో  ఈ  లింక్స్  ద్వారా  తెలుసుకోవచ్చు..........

prasnottara ratna malika of adi sankaracharya - gleanings from ...
Prashnottara Ratna Malika | Vedanta Spiritual Library
Hinduism EBooks: Prasnottara Ratna Malika of Adi Sankaracharya ...


* నేను  పై  విషయాలను  ఎవరితోనూ  పోటీ  కోసం  వ్రాయలేదండి.  ఆదిశంకరాచార్యుల  వారికి  స్త్రీలంటే  ఎంతో  గౌరవం . అని  ప్రజలకు  తెలియజేయాలన్నది  నా  తాపత్రయం.

  * వ్రాసిన  విషయాల్లో  పొరపాట్లు  ఉన్నచో  దయచేసి   క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 

Monday, October 31, 2016

కార్తిక సోమవారం సందర్భంగా...

కార్తిక మాసం శివకేశవులకు ప్రీతికరమైనది. 

శివపంచాక్షరీ స్తోత్రం....
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

భస్మాంగ రాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్యై  నకారాయ నమశ్శివాయ.


మందాకినీసలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

స్యై మకారాయ నమశ్శివాయ.


శివాయ గౌరీవదనారవింద

సూర్యాయ దక్షాధ్వరనాశకాయ

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ

స్యై శికారాయ నమశ్శివాయ.


వశిష్ట కుంభోద్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర లోచనాయ

స్యై వకారాయ నమశ్శివాయ.


యక్షస్వరూపాయ జటాధరాయ

పినాక హస్తాయ సనాతనాయ

సుదివ్య దేహాయ దిగంబరాయ

స్యై యకారాయ నమశ్శివాయ.


పంచాక్షర మిదం పుణ్యం యః పఠేఛ్చివస్సన్నిధౌ

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.

పైన వ్రాసిన వాటిలో అచ్చు తప్పులు ఉన్నచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Friday, October 28, 2016

లక్ష్మీకటాక్షం....

దీపావళి రోజులలో లక్ష్మీ పూజ చేస్తారు.

 విదేశీ వస్తువులను కొనటం ద్వారా లక్ష్మీకటాక్షం ఇతరదేశాలకు పోవటం కాకుండా ....

లక్ష్మీదేవి కటాక్షం మనపై చక్కగా ఉండటానికి ఎక్కువగా స్వదేశీ వస్తువులను వాడాలి.

రాజధాని  అమరావతిలో మరికొన్ని కట్టడాలకు శంకు స్థాపన జరిగింది.

 అంతా శుభం జరుగుతుందని కోరుకుందాము.



Wednesday, October 26, 2016

భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో...


శిరిడిసాయిని పూజించినందువల్ల మహారాష్ట్రలో కరువు వచ్చిందని కొందరు అంటున్నారు.

కరువు, అతివరదలు మాహారాష్ట్రలోనే కాదు, దేశంలో ఎన్నో చోట్ల రావటం జరిగింది.

కరువు, అతి వరదలు.. ప్రజలు పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల.. గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్నాయి. అంతేకానీ, సాయిని పూజించటం వల్ల కాదు.

 ఇక్కడ శిరిడిసాయి పూజలు ప్రారంభించకముందే భారతదేశంపై  విదేశీయుల దండయాత్రలు జరిగాయి.

 ఎందరో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు .ఆ రోజుల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. ఎందరో చంపబడ్దారు. చంపబడిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

 మరి భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో? చెప్పండి. అప్పటికి శిరిడిసాయి పూజలు లేవు కదా!

 ప్రజలకు కష్టాలు వస్తే ఫలానా దేవుడిని పూజించటం వల్లే అనటం తప్పు.

 ప్రజలు తాము చేసిన పాపపుణ్యాలకు తగ్గట్లు ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ కష్టాలు పోవటానికి దైవాన్ని గానీ గురువును గానీ ఆశ్రయిస్తారు.

ఇంద్రుడంతటి వారే .. వృత్రాసుర వధ తరువాత కొంత కష్టాన్ని అనుభవించవలసి వచ్చింది.

ప్రజలైనా అంతే . తాము చేస్తున్న కర్మలకు తగిన ఫలాలను అనుభవిస్తారు.

హిందువులు కొందరు పాటించిన అంటరానితనం, కొన్ని మూఢాచారాలు .. వల్ల భారతదేశంపై విదేశీ దాడులు జరిగి  ప్రజలు కష్టాలు అనుభవించి ఉంటారనుకోవచ్చు కదా!

  ముస్లింలు విగ్రహారాధనను చేయరు.  శిరిడిసాయి శిరిడిలో ఎన్నో హిందూదేవాలయాలను బాగుచేయటానికి ప్రోత్సహించారు.

ఆ  రోజులలో శిరిడిలో సాయి సమక్షంలో శంఖము ఊదటం, గంట వాయించటం, హారతి ఇవ్వటం వంటివి జరిగేవంటారు.

సాయి చెవులకు హిందువుల వలె కుట్లు( రంధ్రము) ఉండెడివంటున్నారు.

 ఇప్పుడు శిరిడిసాయి విగ్రహాన్ని నెలకొల్పి ప్రజలు పూజలు
చేస్తున్నారు.విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేయటం హిందూ పద్ధతే.


Tuesday, October 25, 2016

కొన్ని విషయములు...


   
సాయి బాబా వారి కధలోని కొంతమంది హిందువుల పేర్లు నానా సాహెబ్ డేంగలే, బాపూ సాహెబ్ బుట్టీ, కాకా సాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణులు. 
 
ఈ పేర్లలో సాహెబ్ అనే పదం హిందువులలోనూ, ముస్లింలలోనూ కూడా ఉంటుంది.

కొందరు ఏమంటున్నారంటే, షిరిడిసాయి మహమ్మదీయుడు కాబట్టి పూజించకూడదని చెబుతున్నారు.

 షిరిడి సాయి ఎప్పుడూ తాను మహమ్మదీయుడా, హిందువా, లేక మరెవరు ? అనే విషయాల గురించి చెప్పలేదంటారు.

వారి ఆచరణ గురించి పుస్తకాలలో చదివితే,  చాలా మతాల ఆచారాలను కలగలిపి వారు ఆచరించినట్లు తెలుస్తుంది. 

********************
 
కొందరు ఏమంటున్నారంటే, సాయి మాంసాహారం తినేవారు కాబట్టి.. అలాంటి వ్యక్తిని ఎలా పూజిస్తారని ప్రశ్నిస్తున్నారు.

  బెంగాల్ ప్రాంతపు బ్రాహ్మణులు చాలామంది చేపలు తింటారట.
  
************
 ఈ క్రింది విషయాలను ఈ పోస్ట్ వేసిన కొంతకాలం తరువాత వ్రాసి ప్రచురించటం జరిగింది..2024 లో..

హిందువులకు చాలామందిదేవతలు ఉన్నా కూడా, కొత్తవాళ్ళను ఎందుకు పూజిస్తున్నారంటూ కొందరు మాట్లాడుతున్నారు. అయితే, క్రొత్త దేవతలను ఆరాధించటం హిందువులకు క్రొత్తకాదు.

 
హిందువులకు చాలామంది దేవతలు ఉన్నాకూడా, తరతరాలనుంచి ఎందరినో  దేవతలుగా పూజిస్తున్నారు.  ఒక్కో యుగంలో దైవం అవతారాలను ధరించినప్పుడు, ఆ అవతారాలను పూజిస్తారు.  ప్రాచీనగ్రంధాలలో లేని దేవతలు ఎందరినో ఇప్పుడు దేవతా అవతారాలుగా పూజిస్తున్నారు. 
 
ఉదా.. కొందరు గొప్పవారు మానవులుగా జీవించినప్పుడు గొప్పమహిమలు కలిగి ఉంటారు. అలాంటి కొందరి శరీరత్యాగం తరువాత, వారిని కూడా దేవతలుగా గుడికట్టించి పూజిస్తున్నారు. వారి పూజా విధానాలు ఏర్పరుస్తారు.

 
మహిమలు గలవారు గొప్పవారే.. దేవతలవంటివారే. వారిని గౌరవించవలసిందే. అయితే, హిందువులకు మరింత ఎక్కువమంది దేవతలు పెరుగుతారు. భవిష్యత్తులో ఇంకా ఎందరిని దేవతాస్వరూపాలుగా పూజిస్తారో..చెప్పలేము.

 
హిందువులకు అనేకమంది దేవతలు ఉన్నా కూడా, అవధూతలను, ఇంకా చాలామందిని పూజిస్తుంటారు. అవధూతలు వంటివారు గొప్పవారే. అలాగని అవధూతలు ఎవరైనా పరమపదించితే వారి విగ్రహాలను తయారుచేసి, దేవాలయాలను నిర్మించి  దేవతలుగా పూజలు మొదలుపెడితే .. బోలెడు పూజలు, బోలెడు ఆచారవ్యవహారాలు అవుతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.

 
దైవం సృష్టి అంతటా ఉంటారు. అలాగని ప్రతి జీవినీ దైవంగా భావించి విగ్రహాలు చేసి, గుడులు కట్టి పూజించలేరు కదా.. దైవాన్ని ఒకమహాశక్తిగా భావించి చక్కగా ఆరాధించుకోవచ్చు.

 
హిందువులు ఇంకాఇంకా ..కొత్త  పూజావిధానాలను  పెంచుకుంటూ వెళ్తే, భవిష్యత్తులో భక్తుల మధ్య గొడవలు వచ్చి, వివిధ శాఖలుగా చీలే అవకాశమూ ఉంది. ఇప్పటికే హిందువులు బౌద్ధులు, జైనులు..ఇంకా కొన్ని శాఖలుగా అయ్యారు.
 
 
ఇప్పటికే ఒకే మతంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. పూజా విధానాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆచారవ్యవహారాల విషయంలోను   అభిప్రాయభేదాలుంటున్నాయి. వీటివల్ల సామాన్య భక్తులలో అయోమయం నెలకొంటుంది. వ్యవస్థ క్లిష్టంగా కాకుండా, సరళంగా ఉంటే బాగుంటుంది.

 
దైవశక్తిని చక్కగా పూజించవచ్చు. భవిష్యత్తులో అయినా మరింతగా  పూజావిధానాలను  పెంచుకోకుండా పూజించుకుంటే  సరిపోతుంది.  వేదములలో, పురాణేతిహాసాలలో, ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో.. చెప్పబడిన దేవతలను చక్కగా పూజించుకుంటే చాలా గొప్ప.

 
 ఇంకా కూడా కొత్తగా పూజించాలంటే, వారిని  వేదములలో.. పురాణేతిహాసాలలో.. ఇంకా కొన్ని ప్రముఖ గ్రంధాలలో..చెప్పబడిన దేవతాస్వరూపాలుగా భావించి, ఒకరితోఒకరు గొడవలు లేకుండా, హిందుమతంలో మరిన్ని విభజనలు జరగకుండా పూజించుకోవాలి.


 ఎవరిని ఏ విధంగా  పూజించాలి ? అనే విషయాల గురించి  బాగా ఆలోచించి నిర్ణయించుకోవాలి. హిందుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి.
సమాజంలో అనేక అభిప్రాయాలుంటాయి. కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి. కొన్నిసార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి నచ్చదు. ఇలాంటి పరిస్థితిలో దైవమే దారి చూపాలి.


 
 

Monday, October 24, 2016

ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి సాయిని ...


హిందువులు..ఎందరో దేవతలను, గురువులను, అవతారమూర్తులను.. ఆరాధించుకుంటారు. అలాగే షిర్డిసాయినీ ఆరాధించుకుంటున్నారు.

  *************
హిందువులు రాయిలోను, రప్పలోనూ, చెట్టు లోనూ  కూడా దైవాన్ని భావించి ఆరాధిస్తారు. గురువును దైవంగా పూజిస్తారు చాలామంది.

*******************
 కొందరు స్వార్ధపరుల వల్లా, కొందరు తెలిసీతెలియని వారి వల్లా హిందుత్వంలో కొన్ని  మూఢనమ్మకాలు  ప్రవేశించాయి.
ఇలాంటి వాటి వల్ల  హిందూ సమాజం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. 
 

 హిందువులు ఎన్నో మూఢనమ్మకాలను, కఠినమైన ఆచారవ్యవహారాలను పెంచుకున్నారు. అవన్నీ పాటించలేని కొందరు సులభంగా ఉండే పద్ధతుల పట్ల ఆకర్షితులవుతున్నారు. 
 
 
అనేకమైన ఆచారవ్యవహారాలను పాటించలేక , ఇన్ని పద్ధతులు ఎందుకు ఆచరించాలంటూ నాకు కూడా చాలాసార్లు విసుగు అనిపించేది. ఆచరించకపోతే ఏమవుతుందో అని భయంతో ఆచరించాను. ఇప్పుడు చాలావరకూ తగ్గించుకుని నాకు వీలైనంతలో ఆచరిస్తున్నాను. ఇప్పుడు భయం తగ్గింది. 
 

హిందువులు ఇతర పద్ధతులలోకి వెళ్ళకుండా ఉండాలంటే,  తమ మూఢాచారాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాల విషయంలో కూడా కాలానుగుణంగా  కొంత సులభంగా ఉండాలి. 
 
 
అంతేకాని, ప్రతిది ఇలా చెయ్యకూడదు, ఇలానే చెయ్యాలి అంటూ..అదేపనిగా చెప్పుకుంటూ పోతూ ప్రజలను నిందించటం సరైనది కాదు.
.................
 
 మరికొన్ని విషయాలు..ఈ విషయాలను ఈ పోస్ట్ వ్రాసిన చాలాకాలం తర్వాత వ్రాసి పోస్ట్ చేయటం జరిగింది.
............
సమాజంలో రకరకాల మనస్తత్వాలవారుంటారు. కొందరు తమ మతంప్రకారం దైవాన్ని ప్రార్ధించుకుంటారు. కొందరు అనేకమతాలదేవతలను కూడా ప్రార్ధించుకుంటారు. కొందరు దైవాన్ని నమ్మని నాస్తికులుంటారు. 
 
సాయిబాబా షిరిడి వస్తే, అక్కడ కొందరు హిందువులు వారిని  సాయి అని పిలిచారట. తరువాత భక్తులు రావటం పెరిగింది. షిర్డిసాయి తనకు ఆడంబరంగా పూజలు చేయటం వద్దనేవారట. అయినా భక్తులు వినరు కదా..
 
సమాజంలో ఎందరో గొప్పవాళ్లు యోగులు, అవధూతలు ఉంటారు. వాళ్లు ఎంతో గొప్పవారే. ..హిందువులు ఎందరో యోగులను, అవధూతలను కూడా పూజిస్తారు. 
 
కొందరు మహిమలు కలవారు వారిమానాన వారు ఆడంబరం లేకుండా జీవించి మరణించిన తరువాత, వారి పేరుతో కొత్త విధానాలను తెచ్చి తాము లాభం పొందాలని చూసే వాళ్ళూ సమాజంలో ఉంటారు.
.....................
 
సాయిబాబా.. దత్తాత్రేయస్వామి అవతారం అని కొందరు, హనుమంతుని అవతారం అని కొందరు అంటున్నారు కదా.

అసలు దత్తాత్రేయుల వారు, హనుమంతుల వారు ఉండగా..ఇంకా ఎందుకు బాధ...దత్తాత్రేయస్వామివారిని, ఆంజనేయస్వామివారిని పూజిస్తే సాయిబాబాను కూడా పూజించినట్లే.....అలా వద్దనుకుంటే సాయిబాబాను పూజించుకోవచ్చు.

సాయిరాం, సాయి కృష్ణ అని సాయిబాబాకు రామ, కృష్ణ పేర్లను కలిపి అంటున్నారు కదా.. శ్రీరాముని, శ్రీకృష్ణుని పూజిస్తే సాయిని కూడా పూజించినట్లే.  దైవము ఒకే శక్తి.
 ...........................
 
కొందరు గొప్పవారికి మహిమలు ఉంటాయి. వారు ఎంతో గౌరవనీయులే. అలాగని చాలామంది దేవతలను పెంచుతూ ఉంటే, హిందువులకు బోలెడు దేవతలు, బోలెడు శాఖలుగా మారి, భవిష్యత్తులో ఏమవుతుందో?
 .....................
 
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి ఎక్కువ డబ్బు ఖర్చుచేయలేము,  ఎక్కువ సమయం చేయలేము...అనుకుంటే, తక్కువ ఖర్చుతో, కొంత సమయంలో  పద్ధతిగా చేయవచ్చు. అసలే చేయకుండా మానటం కన్నా, చేయటం మంచిది కదా.. అనుకుంటున్నాను.

 
హిందువులు చాలా నియమాలను  పాటించగలిగిన వాళ్లు పాటించవచ్చు. అందరూ అలా పాటించాలి, లేకపోతే కష్టాలు మీదపడిపోతాయని చెప్పకూడదు. కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా తరించుతారని ప్రాచీనులు తెలియజేసారు.
 
హిందు పెద్దలు కూడా ఈ విషయాలను గమనించాలి.  
ఈ  రోజుల్లో ఆచారవ్యవహారాలంటూ  బోలెడు నియమాలను చెబితే, పాటించలేక సరళంగా దైవపూజ చేసే మార్గాల వైపు జనం వెళ్లే అవకాశం ఉంది.

 పూజ అంటే చాలా నియమాలు పాటించలేమో? అని భయపడకండి. ఎక్కువ నియమాలతో కాకుండా,  సరళంగా కూడా హిందూదేవతలను పూజించుకోవచ్చు....చాలా నియమాలతో పూజించగలిగే వారు అలా పాటిస్తూ పూజించుకుంటారు.

 ఎవరైనా కూడా, దైవము పట్ల ప్రేమతో చక్కగా పూజించుకుంటే మంచిది.
**********
 వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
 
 

Friday, October 21, 2016

పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా....



సైనికులలానే  పోలీసులు కూడా ప్రజల రక్షణ కొరకు ఎంతో శ్రమపడుతున్నారు.


  ప్రజల రక్షణ కొరకు త్యాగాలు చేసిన.. అమరులైన పోలీసులకు వందనములు.


 దేశప్రజల రక్షణ కొరకు ఎందరో ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.


 ఇవన్నీ గమనించి ప్రజలు కూడా తమ జీవితంలో బాధ్యతగా.. ఆదర్శపౌరులుగా జీవించటానికి ప్రయత్నించాలి.
 
*****************
 
మరి కొన్ని విషయములు..

ఈ రోజుల్లో చాలా మంది ఎలాగోలా డబ్బు  సంపాదించి, వస్తువులను కొనటం కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.

దుస్తుల కోసం, ఫర్నిచర్ మరియు  కార్లు..వంటి వాటి విషయంలో అవసరానికి మించి ఖర్చుపెడుతున్నారు.

ఈ రోజుల్లో చాలామందికి నెలకే వేలు లేక కొన్ని లక్షల వరకు  ఆదాయం వస్తోంది. ఈ డబ్బుతో విపరీతంగా వస్తువులను కొనిపడేస్తున్నారు.

మనిషి  సౌకర్యంగా జీవించాలంటే కొన్ని వస్తువులు చాలు.
 ఉదాహరణకు దుస్తుల విషయంలో చూస్తే..

 ఒక మనిషి ఒక సంవత్సరానికి.. రోజువారీ ధరించే దుస్తులు అరడజను( సుమారు 1000  రూపాయల లోపు ), వారాంతాల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ధరించటానికి  నాలుగు దుస్తులు ( సుమారు 1000 నుంచి 2000 ధరలో ) ఫంక్షన్స్లో  ధరించటానికి (2000 నుంచి 5000 ధరలో)  రెండు ఖరీదైన డ్రస్సులు కొనుక్కోవచ్చు.

ఈ విధంగా ఒక  మహిళకు  సంవత్సరానికి సుమారు  సుమారు  10,000 లేక  25,000 ఖర్చు చేస్తే 12 చీరలు లేక డ్రస్సులు వస్తాయి.. వచ్చే సంవత్సరం మళ్లీ కొత్తవి కొనుక్కోవచ్చు.

  అయితే, ఈ రోజుల్లో చాలామంది ఒక్కో డ్రస్సుకే 20 వేలు, 50 వేలు, ఒక లక్ష..ఆపైన కూడా ఖర్చు చేసి కొంటున్నారు.

 ( సొంత ఫంక్షన్స్ కొరకు అయితే కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి  దుస్తులు కొనుక్కోవచ్చు. )

డబ్బు ఎక్కువఉన్న వారు కూడా  పరిమితమైన ధరలో వస్తువులు కొనుక్కోవచ్చు.

కోటి రూపాయల కారు కన్నా 10 లక్షల లేక 20 లక్షల  కారును కొనుక్కోవచ్చు.

 (పైన వ్రాసిన ధరలను కొంచెం ఎక్కువ తక్కువగా మార్చుకోవచ్చు.)

మార్కెట్లో కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నవన్నీ కొనాలని ఆశపడకుండా ఏది అవసరమో అవే కొనుక్కుంటే బాగుంటుంది.

 బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టి బోలెడు వస్తువులను కొనటం కన్నా, తగుమాత్రం వస్తువులను కొనుక్కుని,  తమ ఉద్ద ఉన్న డబ్బుతో.. డబ్బు బాగా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది.

 ఉదా.. డబ్బు లేక  వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నవారికి, డబ్బు లేక చదువుకు దూరమవుతున్నవారికి..ఇలా సహాయం చేయవచ్చు.

ఊళ్ళలో నీటిశుద్ధి కేంద్రాలను  ఏర్పాటుచేయవచ్చు. ఉచిత అన్నదానం, వైద్యకేంద్రాలను ఏర్పాటుచేయవచ్చు. ఇలా ఎన్నో చేయవచ్చు. 
 
పర్యావరణాన్ని రక్షించే సంస్థలకు ధనసహాయం చేయవచ్చు. 
 
పశుపక్ష్యాదులను కాపాడే వారికి సాయం చేయవచ్చు.

ఐశ్వర్యాన్ని అతి ఆడంబరంగా ప్రదర్శించేవారికి ఇతరుల నుండి దృష్టి ( నెగటివ్ శక్తి..) తగిలి కష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

ఒంటినిండా, ఇంటినిండా ఎన్నో వస్తువులు  ప్రోగేసుకోవటం కన్నా, మనతో పాటు ఇతరుల జీవితాలు బాగుపడటంలో  సహాయపడటం ఎంతో మంచిది.
 
************
 మరి కొన్ని విషయములు..