బ్లాగ్ ను చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న వారికి, మరియు పరోక్షంగా ప్రోత్సహిస్తున్న వారు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి..
మూడు విధాలైన టెక్నాలజీ...
కొందరు ఏమంటారంటే....టెక్నాలజీని శాంతియుత ప్రయోజనాలకు కూడా వినియోగించవచ్చు కదా..... అని .......
ఉదా..కత్తిని శాంతియుత ప్రయోజనాలకూ వాడొచ్చు,......అశాంతిని కలిగించే విధంగానూ వాడొచ్చు కదా అని... కానీ కత్తి వేరు... అణు శక్తి వేరు..... రెండిటికి ఎంతో తేడా ఉంది.
కత్తి వల్ల కొందరినే చంపగలరు. కానీ అణుశక్తివల్ల కొద్ది సమయంలోనే కొన్ని లక్షలమందిని చంపే అవకాశం ఉంది.
ఇంకా, కొన్ని వేలసంవత్సరాల వరకూ అణుధార్మికత యొక్క దుష్ప్రభావం రాబోయే తరాలను పీడించే అవకాశం ఉంది. అణుబాంబులకు ఎంతో వినాశనాన్ని కలగచేసే శక్తి ఉంటుందట.
*కత్తివల్ల ఎక్కువ లాభాలు....తక్కువ నష్టాలు ఉన్నాయి. అదే అణుశక్తి వల్ల తక్కువ లాభాలు........చెప్పలేనన్ని నష్టాలు ఉన్నాయి. ఈ తేడాను జాగ్రత్తగా గమనించాలి.
అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.
నా అభిప్రాయంలో......టెక్నాలజీని మూడువిధాలుగా చెప్పుకుంటే....
1.ఈ రకమైన టెక్నాలజీ..... మనకు నిత్యావసరాలకు ఉపయోగపడే టెక్నాలజీ..
దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రాచీన కాలం వాళ్ళు తాము కష్ట పడిపనిచేసి పర్యావరణానికి ఎటువంటి హాని కలగని వస్తువులను వాడుతూ, హానిలేని పధ్ధతులను పాటించేవారు. ఆ విధంగా వారు కూడా ఆరోగ్యంగా ఉండేవారు.
ఆ రోజుల్లో కూడా గొప్ప గొప్ప నాగరికతలు విలసిల్లాయి. అప్పట్లో కూడా ఖగోళశాస్త్రం, ఆయుర్వేదం, ఎన్నోరకాల వృత్తివిద్యలు, ఆర్ధికశాస్త్రం, గణితం ఇలా నిత్యావసరాలకు ఉపయోగపడే విజ్ఞానం వారికి తెలుసు.
ఇంకా, ప్రాచీనుల విజ్ఞానాన్ని తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటి వాళ్ళు కలలు కంటున్న ( టెలి పోర్టేషన్ ) వంటి ఎంతో విజ్ఞానం వారికి తెలుసు.
మనిషి మాయమయి తిరిగి ప్రత్యక్షమవటం, అణిమ, గరిమ వంటి సిధ్ధులు, పరకాయప్రవేశం , టెలిపతి ఇవన్నీ నేటి శాస్త్రజ్ఞులు భౌతికశాస్త్ర పధ్ధతులలో సాధించటానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ ప్రాచీనులు వీటిని దైవసహాయంతో ఆధ్యాత్మికయోగశక్తి ద్వారా సాధించారు.
కానీ, ఇప్పటి కాలపు భౌతికశాస్త్ర టెక్నాలజీతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఎక్కువగా పర్యావరణానికి హానికలగని ....... విధంగాఆ నాటి వారి జీవితం ఉండేది.
అంతే కానీ అభివృధ్ధి పేరుతో వస్తువులను విపరీతంగా ఉత్పత్తి చేసి గుట్టలుగా పోయటం వారికి అలవాటు లేదు..
ఇంకా,వారు తమ నిత్య జీవితంలో అవసరమైన వస్తువులకు ........ ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చేవారు. ఉదా... కత్తి చూడండి. మనకు దీని అవసరం ఎంతో ఉంది.
పంటలు పండించటానికి , కూరగాయలను తరగటానికి, వైద్యులు శస్త్రచికిత్సలు చేయటానికి, అలాగే యుధ్ధంలోశత్రువులనుచంపటానికి ........ ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
కానీ ఒకోసారి దుర్మార్గుల చేతిలో పడితే హత్యలు లాంటివి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కొద్ది నష్టాలు తప్పితే .......దీనివల్ల పర్యావరణానికి పెద్దగా హాని లేదు.
.ఈ రకమైన టెక్నాలజీ వల్ల నష్టాల కన్నా లాభాలే ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకోవచ్చు.
*దుర్మార్గుల చేతిలో ఉన్న కత్తి వల్ల .......జరిగే నష్టం కొద్దిగానే ఉంటుంది. దుర్మార్గుల చేతిలో ఉన్న అణుశక్తి వల్ల ....... జరిగే నష్టం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల అణుశక్తిని పూర్తిగా వదిలిపెట్టటమే ఏకైక పరిష్కారం.
2. ఈ రకమైన టెక్నాలజీ వల్ల ...... లాభమా.......నష్టమా ? అన్నది ఎవరికీ సరిగ్గా తెలియదు. దానిని మనం వాడుకునే విధానం బట్టి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చేమో !
మానవులకు కష్టాన్ని తగ్గించే యంత్రాలు, వాహనాలు, టివీలు, సినిమాలు, ఎలెక్ట్రానిక్ వస్తువులు, ఇలా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకి వచ్చే వస్తువులు ఉన్నాలేకపోయినా మనిషి బ్రతకగలడు.
ఇవన్నీ మనిషి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. వీటిని తగిన పరిమితిలో వాడుకోవాలి.
మరీ ఎక్కువగా వాడితే పర్యావరణానికి ముప్పు, సహజ వనరులు ఖాళీ అయిపోవటం, రాబోయే తరాలకు సహజ వనరులు లేని ఖాళీ భూగోళాన్ని ఇవ్వటం , ఇప్పుడు ఉన్నవాళ్ళకి పనిలేకపోవటం వల్ల నిరుద్యోగ సమస్య, శారీరిక శ్రమ లేకపోవటం వల్ల శరీరం బలహీనపడటం , జబ్బులు రావటం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది.
అందుకని ఈ టెక్నాలజీ వల్ల లాభం ఎక్కువా ? నష్టం ఎక్కువా ? అన్నది ఇతమిధ్ధంగా చెప్పలేము. అది మనం వాడే దాన్ని బట్టి ఉంటుంది.
అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
3. ఈ రకమైన టెక్నాలజీ వల్ల.... లాభాలు ఉంటాయని జనం ( ఎండమావి లాంటి ) భ్రాంతిలో మునిగిపోతారు ... కొద్దిపాటి లాభాలు ఉండి, విపరీతమైన ప్రమాదాలు ఉంటే ఏమిటి అనేది? అందరూ ఆలోచించాలి
ఉదా....అణుశక్తి. దీని సంగతి ఇప్పుడు చాలామందికి తెలుసు. తాత్కాలిక ప్రయోజనాల కొరకు ఆశపడితే ........ వందల సంవత్సరాలు భూమిని పీల్చిపిప్పిచేసే దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి , అణుశక్తిని వాడటం పూర్తిగా విడిచిపెట్టెయ్యటమే ఏకైక మార్గం.
ఇలా టెక్నాలజీని వాడుకోవటంలో ....... ప్రపంచం పైన వాటి ప్రభావాన్ని బేరీజు వేసుకుని మాత్రమే ఉపయోగించుకోవాలి...
.............................
* ఈ వాక్యాలు టపాకు కొత్తగా కలపటం జరిగిందండి...
ఇంకా నాకు ఏమనిపిస్తుందంటేనండి,......అణుశక్తి విషయంలో ప్రమాదాలను నివారించటం అసాధ్యం. ఇంకా, వైద్యరంగంలో దీని సహాయంతో చికిత్సను అందించేవారికి కూడా రేడియేషన్ ప్రభావం వల్ల మొండివ్యాదులు త్వరగా వచ్చే అవకాశముందట.
కొద్ది లాభం కోసం ఎంతో వినాశనాన్ని కలిగించే ప్రమాదం గల దాన్ని ఎవరైనా కోరుకుంటారా ? అందుకే నాకు అనిపిస్తుంది......ఈ అణుశక్తిని కనిపెట్టకుండా ఉంటే బాగుండేది అని.
అణు శక్తిని జబ్బులు నయం చెయ్యటానికి ఉపయోగిస్తారు. దానిని Nuclear Medicine అంటారు. అల్లాగే లాబోరేటరీల్లో సైనైడు, వైరసుల దగ్గరనుండీ అన్నీ ఉంటాయి. అవి బయటకి వస్తే ఎందర్నైనా నాశనం చెయ్యగలవు.మనవాళ్ళు చెప్పినట్లు మనం మన పరిమితులు తెలుసుకుని జీవించాలి. ఇష్టం కదా అని కనపడినంతా తినలేము కదా కడుపు నిండిన తరువాత. అల్లాగే అన్నిట్లోనూ సంయమనం పాటిస్తే అందరికీ బాగానే ఉంటుంది.
ReplyDeleteమీరు చెప్పినట్లు:
అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరు చెప్పినట్లు సైనైడ్, వైరస్ లు ఎంతోమందిని నాశనం చెయ్యగల శక్తి కలవే కావచ్చు. అంటే వాటిని చిన్నపాటి భూతాలుగా చెప్పుకోవచ్చు.
అణుశక్తిని పెద్దభూతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనైడ్, వైరస్ ల దుష్ప్రభావాలతో పోల్చితే ............... అణుశక్తి విషయంలో జరిగే పొరపాట్ల వల్ల ................. కలిగే దుష్ప్రభావాలు, వినాశనం ........................ ఊహకందనంత ఉంటాయట.
వాటి ప్రభావం .........వేల సంవత్సరాలు భూమిపై ఉంటుందని చెబుతున్నారు కదండి. దానివల్ల ఎన్నో తరాల వరకు రకరకాల జబ్బులతో బాధపడే అవకాశం ఉందట.
అలాంటి ప్రమాదాలు జరిగిన చోట్ల ఇప్పటికీ చిన్నమొక్కలు కూడా మొలవలేదట. మొలిచినా ఆ మొక్కలలో, అక్కడి నీటిలో, గాలిలో కొన్ని వందల సంవత్సరాలు అణుధార్మికత నిండి ఉంటుందట.
ఇలాంటి అణుశక్తిని వైద్యంకొరకు ఉపయోగించటం కూడా కొరివితో తల గోక్కోటంలా వుతుందేమో అనిపిస్తోంది. అందుకని దాన్ని ఏ విధంగానూ ఉపయోగించకుండా ఉండటమే శ్రేయస్కరమేమోనని ఒకోసారి అనిపిస్తుంది.
నిజమే అణుశక్తిని వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల జబ్బు ఉన్న సెల్స్ నాశనం అవుతాయి గానీ, ప్రక్కనున్న మంచి సెల్స్ రేడియేషన్ కు గురయ్యి దెబ్బతిని ............... మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ ............. ఇలా అంతులేని కధలా సాగే అవకాశం కూడా ఒకోసారి ఉందట.
అసలు ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న వస్తువుల ద్వారా వెలువడుతున్న రేడియేషన్ వల్లనే జనానికి మొండి జబ్బులు రావటం ఎక్కువయ్యిందని అంటున్నారు .
కొన్ని మొండి జబ్బులు ఆయుర్వేదం , హోమియో లాంటి వాటికి తగ్గటం జరుగుతోంది. ఈ రకమైన మొండిజబ్బులను తగ్గించటానికి ప్రాచీన వైద్యగ్రంధాలను శోధించితే తప్పక మంచి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయమండి.
అప్పటివరకూ,వేరేదారిలేక ఇప్పుడున్న విధానాలను వాడుతూనే ఉంటారేమో ప్రజలు ?
ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారముంటుందట......... శోధించగలిగితే..............( దైవానుగ్రహం తోడయితే.).