" ఒక యోగి ఆత్మకధ " గ్రంధము లోని కొన్ని విషయాలు ఇక్కడ................
*ఈ ఓంకారమే, సృష్టిలోని ఏకైక సత్తకు కారకమైన కాంతి ప్రకంపన.
*" సృష్టి అంతా నియమబద్ధమైనది.విజ్ఞానశాస్త్రవేత్తలు కనిపెట్టగల, బాహ్యజగత్తులో పనిచేసే సూత్రాల్ని ప్రకృతి నియమాలు అని అంటున్నారు. కాని గుప్తమైన ఆధ్యాత్మికస్థాయిల్నీ, గూఢమైన అంతశ్చేతననూ పాలించే సూక్ష్మనియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి.
*విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాలలో అతి అద్భుతమైనది కాంతి..
*దేవుడు జ్వాలగానూ కాంతిగానూ సాక్షాత్కరిస్తాడన్న విషయాన్ని ప్రతి యుగంలోని భక్తులూ ధ్రువపరుస్తారు. " ఆయన కళ్ళు అగ్నిజ్వాలల మాదిరిగా ఉన్నాయి." అంటాడు సెంట్ జాన్ ."...అంతే కాకుండా, ఆయన ముఖాకృతి ప్రచండ భాను తేజంలా ఉంది." .† రివలేషన్ 1:14=16( బైబిలు )
*గురుత్వాకర్షణ నియమం న్యూటన్ తరవాత ఎంత సమర్ధంగా పనిచేస్తోందో ఆయనకు ముందు కూడా అలాగే పనిచేసింది. మానవుడి నమ్మకమనే అనుమతి ఉంటేనే కాని విశ్వనియమాలు పనిచెయ్యలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం గందరగోళమయిపోయి ఉండును.
పెద్దలు చక్కగా చెప్పారు........... నిజమే.... *గురుత్వాకర్షణ నియమం న్యూటన్ తరవాత ఎంత సమర్ధంగా పనిచేస్తోందో ఆయనకు ముందు కూడా అలాగే పనిచేసింది. మానవుడి నమ్మకమనే అనుమతి ఉంటేనే కాని విశ్వనియమాలు పనిచెయ్యలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం గందరగోళమయిపోయి ఉండును.
ఇంకా........ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొన్నారు .......... వారు గొప్పవారే.
అయితే ఆ నియమాల్ని........ అప్పటికే సృష్టిలో ఉన్నదాన్ని వారు కనుగొన్నారు అంతే .
కొందరు నాస్తికులు ఏం చేస్తారంటే....... గాలిలో ఆక్సిజనుంటుందని, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని............... .ఇలా నియమాలను కనుగొన్న శాస్త్రవేత్తలను గౌరవిస్తారు .......
కానీ ........ ఆ నియమాలను మొదట ఏర్పరిచిన సృష్టికర్తను అగౌరవిస్తారు.( అంటే దైవం అని ఎవరూ లేరు అంటారు .)
ఇది చిత్రంగా లేదూ............
గురుత్వాకర్షణ లాంటి నియమాలను కనుగొన్న వారినే అంత గౌరవించినప్పుడు............ గురుత్వాకర్షణ లాంటి నియమాలను ఏర్పరిచిన సృష్టికర్త అయిన ......... పరమాత్మను ....... ఎంతగా గౌరవించాలో అందరూ ఆలోచించాలి.
కానీ ........ ఆ నియమాలను మొదట ఏర్పరిచిన సృష్టికర్తను అగౌరవిస్తారు.
ReplyDelete--------
శాస్త్రవేత్తలు చేసే పని, సృష్టికర్త ఎప్పుడో చేసిన ప్రకృతి నియమాలు కనుగొనటమే. శాస్త్రవేత్తలు సృష్టికర్తను అగౌరవ పరచటమంటూ ఉండదు. సృష్టికర్త ఇచ్చిన గాలి నీరు ఎండా వానా అనుభవిస్తూ ప్రకృతికి విరుద్ధంగా వాటిని అగౌరవ పరుస్తుంటేనే జరిగేవి ఆ ప్రకృతి కల్పించిన సునామీలు. అప్పుడే తెలిసేది జీవితానికి అర్ధం ప్రకృతి ధర్మం.
థాంక్స్ ఫర్ ది పోస్ట్.
"సృష్టికర్త ఇచ్చిన గాలి నీరు ఎండా వానా అనుభవిస్తూ ప్రకృతికి విరుద్ధంగా వాటిని అగౌరవ పరుస్తుంటేనే జరిగేవి ఆ ప్రకృతి కల్పించిన సునామీలు. అప్పుడే తెలిసేది జీవితానికి అర్ధం ప్రకృతి ధర్మం. "అని మీరు చెప్పిన ఈ విషయం చక్కగా ఉందండి.
ReplyDeleteఇక నాస్తికులు సృష్టికర్తను అగౌరవిస్తున్నారు అని ఈ టపాలో వ్రాసిన విషయం గురించి...........
(సారీనండి. ) టపాలో "కొందరు నాస్తికులు " అని వ్రాశానండి .
అంటే. నేను అలా అన్నది నాస్తికవాదులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే. అంతే గానీ శాస్త్రవేత్తలు అందరినీ ఉద్దేశించి అలా అనలేదండి.
మీ కామెంట్ చదివాక టపా చివరలో కొన్ని చిన్నచిన్న మార్పులుచేర్పులు చేయటం జరిగింది. .............. కృతజ్ఞతలండి...............