* రాళ్ళూ లోహాలవంటి పదార్ధాలలోని శక్తులకన్నా మహత్తరమైన శక్తుల్ని మానవమనస్సు తనలోంచే విడుదల చెయ్యగలదు : చేసి తీరాలికూడా : లేకపోతే కొత్తగా బంధవిముక్తి పొందిన భౌతిక అణు ( రాక్షస ) శక్తి ప్రపంచం మీద విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది. ఆటంబాంబుల గురించి మానవజాతికి గల ఆందోళన వల్ల కలిగే పరోక్ష లాభం , బహుశా , యోగశాస్త్రం పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు.
* పైన వ్రాసిన విషయాలు..... " ఒక యోగి ఆత్మకధ " గ్రంధంలో చెప్పబడిన విషయాలు .
........................
ఇక్కడ ఒక కధ...............
పూర్వం ఒక ఊరిలో నలుగురు మిత్రులు ఉండేవారు. తాము ఏదైనా కొత్తరకమైన విజ్ఞానాన్ని ...... నేర్చుకోవాలని నిశ్చయించుకున్నారు,.
అలా నేర్చుకొని సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఒక ప్రదేశంలో నలుగురూ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా నలుగురూ నాలుగు దిక్కులకు వెళ్ళి తిరిగి సంవత్సరం తర్వాత కలుసుకున్నారు.
కుశలప్రశ్నల తరువాత తాము నేర్చుకున్నకొత్తరకమైన విజ్ఞానాన్ని గురించి చెప్పుకున్నారు. నాలుగవ వ్యక్తి మాత్రం తానుఅలాంటి కొత్త విజ్ఞానాన్నీ ఏమీ నేర్చుకోలేదని చెప్పాడు.
నలుగురూ అలా ఒక అడవిలో నడుచుకుంటూ వెళుతుండగా ఒక దగ్గర ఒక ఎముకల ప్రోగు కనిపించింది.
మొదటి వ్యక్తి ఆ ఎముకలు సింహపు ఎముకలని గుర్తించి వాటిని తిరిగి అతికించే విజ్ఞానం తనకు తెలుసనీ, ఆవిజ్ఞానాన్ని అందరికీ ప్రదర్శించదలచానని చెబుతాడు..
రెండో వ్యక్తి తాను ఆ ఎముకల గూడుకు చర్మం, రక్తమాంసాలు ఇత్యాదులన్నీ ఏర్పరుస్తాను అంటాడు. మూడో వ్యక్తి తాను దానికి ప్రాణం పోస్తాను అంటాడు.
ఇవన్నీ వింటున్న నాలుగో వ్యక్తి గాభరా పడి ఆ సింహాన్ని తిరిగి బ్రతికించితే చాలా ప్రమాదం కాబట్టి అలా చేయవద్దని ప్రాధేయపడతాడు.
వారు వినకపోగా అతనిని హేళన చేస్తారు.
అప్పుడు నాలుగో వ్యక్తి అక్కడే ఉన్న ఎత్తైన చెట్టు ఎక్కి కూర్చుంటాడు.
మిగిలిన ముగ్గురూ తమ విద్యలతో ఆ సింహాన్ని బ్రతికించటం, అది ఒక్కసారి జూలు విదిల్చి లేచి ఆ ముగ్గురిని చంపి తిని వెళ్ళిపోవటం జరుగుతుంది.
ఈ కధ వల్ల మనం ఏం నేర్చుకోవచ్చంటే, వివేకం లేని విజ్ఞానం వల్ల మిగిలేది వినాశనమే.....అని.. .
మనకు ఇలాంటి కధలు బోలెడు ఉన్నాయి.
*ఈ కధలో చెప్పిన సింహం కన్నా ......... అణుశక్తి అత్యంత శక్తివంతమైనది. దానితో చెలగాటం అత్యంత ప్రమాదకరం. మనం దానికి దూరంగా ఉండటమే ఏకైక పరిష్కారం.
* దైవానికి మాత్రమే ఏదైనా సాధ్యం.. .
ఇప్పుడు జపాన్ లో జరుగుతున్న ఇంతటి విలయాన్ని చూసి కూడా ,
మన దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలను........ భూకంపాలు, సునామీలూ ఏమీ చెయ్యలేవని చెబుతూ ............ ఇలాంటి అణుకేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటున్న వారిని.........ఎలా అర్ధం చేసుకోవాలి ?
జపాన్ లో చూడండి ఇలాంటి మాటల్ని నమ్మి ........ ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్నది ప్రజలే.
అందుకే ప్రజలే గట్టిగా ప్రయత్నించి తమ బ్రతుకుల్ని బాగుచేసుకోవాలి. కళ్ళముందు అధర్మం జరుగుతోంటే చూస్తూ ఊరుకోవటం కూడా పాపమే....
భూకంపాలు, సునామీల వల్ల కొద్ది మంది చనిపోయే అవకాశం ఉంది. .......... కానీ మానవులు కోరి తెచ్చుకున్న దరిద్రం లాంటి, అణుప్రమాదాలవల్ల అనేక మంది చనిపోయే అవకాశం ఉంది.
ఆ అణుధూళి యొక్క దుష్ప్రభావాలు వేల సంవత్సరాలు వరకూ ప్రపంచంలో మిగిలి ఉండి .. ఆ రేడియేషన్ వల్ల మరింత మంది బాధలుపడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవన్నీ తెలిసినా కూడా ఇంకా అణువిద్యుత్ అవసరం అనటం అన్యాయం.
త్రీమైల్ ఐలెండ్ దుర్ఘటన తర్వాత, అమెరికాలో అణువిద్యుత్ కేంద్రాల కొరకు పెద్దగా ఆసక్తి కనబడ లేదు.
ముందుముందు జపాన్ తిరిగి కోలుకున్నా, ప్రపంచం మీద పడ్డ అణుధార్మికత సంగతి ఏమిటి ?
ఇప్పుడు వర్షం కురిస్తే అందులో తడవకుండా ఉంటే చాలు ........ సేఫ్ అన్నట్లు ప్రచారం చేస్తున్నారు.
కానీ, ఆ వర్షం నీరు , కాలువలు ద్వారా నదులలో చేరి ఆ నీటినే త్రాగటానికి, పంటలు పండించటానికి వాడతాము కదా మరి అప్పుడు ఏం చేయగలం................
ఈ దుష్ప్రభావాలు ఒక్క జపాన్ కే కాదు మొత్తం ప్రపంచం పైనే చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే అణుధార్మికత ఆకాశంలో కూడా కలిసింది కదా......( ఓజోన్ పొర దెబ్బతింటే అందరికీ ప్రమాదమే. )
* కొందరు ఏమని అనుకుంటారంటే ప్రపంచం ఏమైనా ఫరవాలేదు తమకు సంపాదనే ముఖ్యమని...........ప్రజలు త్వరలో ఇవన్నీ మర్చిపోతారనీ.......
భూకంపాలు, సునామీల సంగతి అటుంచి ప్రపంచదేశాలు ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొంటున్నాయి.
ఆ విధంగా ప్రమాదాలు జరగకుండా తాము చాలా గట్టి భద్రత కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు కొందరు .. ఈ భద్రత గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆఖరికి ఇంత విలయాన్ని చూసి కూడా ఆర్ధికాభివృద్ధికి ......... అణువిద్యుత్ అవసరం అనటం చూస్తే మనిషికి ప్రాణాల కన్నా డబ్బే ముఖ్యమా ? అనిపిస్తోంది.
ఇవన్నీ వింటుంటే, వినాశకాలం దాపురిస్తే విపరీత బుధ్ధులు పుడతాయి అంటారు గదా............ అది గుర్తు వస్తోంది.
*అందుకని .,ప్రజలు తమను తాము కాపాడుకోవాలంటే,........... ఇలాంటి అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించక తప్పదు..

మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజమండీ.ఇది మానవజాతి స్వయంకృతాపరాధం.తెలిసి తెలిసీ ప్రకృతి విరుద్ధమైన పనులు చేసి ఫలితాన్ని అనుభవిస్తున్నాం.ఇక ముందు జీవాయుధాలు,జెనెటిక్ కోడ్స్‌లో మార్పుల ఫలితంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కో వలసి వస్తుందో ఆలో చిస్తే భయమేస్తుంది.
ReplyDeleteనేను వజ్రం గారితో ఏకీభవిస్తాను. జీవాయుధాలు,జెనెటిక్ కోడ్స్‌లో మార్పులు రావటానికి అమెరికాలో చాలా వ్యతిరేకత ఉన్నది. కొత్తవి దాదాపు కనుగోనేవి ఇక్కడే. కాకపోతే అవన్నీ విజ్ఞాన శాస్త్ర పత్రికలలో వ్రాయటం మూలంగా నేర్చుకుని, క్రమం లేకుండా వాడుక లోకి వస్తున్నాయి. ఉదా: కొరియాలో క్లోనింగ్. క్యూబా లో స్టెం సెల్ల్స్ వాడుక.
ReplyDeleteకృతజ్ఞతలండి.
ReplyDeleteనిజమేనండి. ఇవన్నీ మానవుల స్వయంకృతాపరాధాలే. అయితే ఇదంతా గొప్ప అభివృద్ధి అని చెప్పుకుంటారు కొందరు . ఇలాంటివారి మొండి వైఖరి వల్ల అందరూ బాధలు అనుభవించాల్సి రావటమే విషాదం.,
కృతజ్ఞతలండి.
ReplyDeleteకొందరు పాశ్చాత్య దేశాలవాళ్ళు , కొన్ని పరిశోధనల వల్ల ఎదురవుతున్న సైడ్ ఎఫెక్ట్స్ ను గ్రహించి వాటిని తగ్గించుకుంటున్నారు.
కానీ భారతదేశంలో చాలామంది ఇవన్నీ సీరియస్ గా పట్టించుకోవటం లేదు. వీరి భావదారిద్ర్యం ఎప్పుడు పోతుందో ?.