koodali

Wednesday, March 23, 2011

అతి ఆడంబరంగా ఖర్చుపెట్టడం వల్ల దిష్టి తగులుతుందట............

 

కొంతమంది విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి ఆడంబరంగా ఫంక్షన్స్ చేస్తారు. ఫంక్షన్స్ సందడిగా, సంతోషంగా గుర్తు ఉండేలా చేసుకోవాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు.

ఆ చేసే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే ఆ ఫంక్షన్ వారికే కాక సమాజంలో మరికొందరి జీవితాల్లో కూడా సంతోషాన్ని నింపుతుంది.

కొందరు బాగా డబ్బు ఖర్చు పెట్టి ఇతరుల కళ్ళు చెదిరేలా ఫంక్షన్ చేస్తారు.

50 రకాల పదార్ధాలతో భోజనం వడ్డిస్తారు. అతిధులు చాలా మంది వాటిని సగంసగం తిని ఫలానా దానిలో ఉప్పు తక్కువగా ఉంది........ఫలానా దానిలో కారం ఎక్కువయ్యింది అంటూ...........కామెంట్స్ చేస్తారు.


ఇంకా, మా ఇంట్లో అయితే ఇంతకన్నా గొప్పగా ఫంక్షన్ చేశాము............ అని పెదవి విరిచే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము.


కొందరేమో, పైకి అబ్బో ఎంత బాగా చేశారో ఫంక్షన్ అంటూ,. మనస్సులో వీళ్ళకి ఇంత వైభోగమా ! అని కుళ్ళుకునేవాళ్ళూ ఉంటారు.

కొందరు తమకు ఎంత ఆస్తి ఉన్నా ఇతరులకు ఉంటే భరించలేరు.

మరికొందరు వీళ్ళకు ఇంత వైభోగం ఉంది మనకి లేదే అని బాధ పడతారు.

ఇలా ఎదుటివారి నుంచి నెగెటివ్ తరంగాలు తగలటం వల్ల చాలా కష్టాలు వస్తాయట. దీన్నే దిష్టి తగలటం అనవచ్చేమో !

*ఇలా అట్టహాసంగా ఫంక్షన్స్ చేసిన చాలా కుటుంబాల వాళ్ళకి తరువాత ఎన్నో కష్టాలు రావటం, పైకి కనిపించకపోయినా కుటుంబసభ్యుల మధ్య కలతలు రావటం చాలా మంది విషయంలో జరుగుతుంటుంది.

ఇదంతా డబ్బు తగలేసి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

అందుకని ఈ విధానాన్ని కొద్దిగా మార్చుకుని ఒక లిమిట్ వరకూ ఫంక్షన్ కు ఖర్చుపెట్టి మిగతా సొమ్మును పేదవారికి ఉపయోగపడేటట్లు చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది .

ఉదా......కోటి రూపాయల కారు బదులు .............10 లక్షల కారుతో సరిపెట్టుకోవచ్చు. 50 వేల చీర బదులు.............10 వేల చీరతో సరిపెట్టుకోవచ్చు. 2 లక్షల నెక్లెస్ బదులు............1 లక్ష నెక్లెస్ ......... ఇలా ఈ ఖర్చు వారి తాహతును బట్టి మార్చుకోవచ్చు.

కోటి రూపాయల కారులో మిగిలిన సొమ్మును ఇతరుల సహాయానికి వినియోగించవచ్చు.

నేను ఒక దగ్గర చదివానండి. ఒక కుటుంబం ప్రతి సంవత్సరం తమ పిల్లల పుట్టిన రోజు నాడు. ఏం చేస్తారంటే.............ఒకసారి ఒకఅనాధశరణాలయానికి వంటపాత్రలు, కొనుక్కొచ్చిన వాటర్ టాంక్ దానంగా ఇచ్చారట. ఒక సంవత్సరం ఒక పాఠశాలకు ఒక కొత్త గదిని కట్టించటానికి డబ్బు ఇచ్చారట . .

ఇలా ఎన్నో చేయవచ్చు. ఎక్కువగా ధన సహాయం చేయగల కొందరు కలసి ఒక ఫ్లోరైడ్ బాధిత ప్రదేశంలో ఫ్లోరైడ్ శుధ్ధి ప్లాంట్ కట్టించి ఇస్తే ప్రజలు త్రాగు నీటికి వాడుకుంటారు.

కొందరు నెలనెలా అనాధలకు బియ్యం, పప్పులు ఇస్తూంటారు. ఇంకా, చేనేతవారికి కొత్తరకం మగ్గాలు ఇవ్వచ్చు. రైతులకు పనిముట్లు కొని ఇవ్వచ్చు.

కొన్ని హాస్టళ్ళకు వంటకు ...... సోలార్ సిస్టం ఏర్పాటుచేయచ్చు.(
తిరుమలలో సోలార్ సిస్టం ఉంది. ).

కొందరు నిజాయితీ గల వ్యక్తులు పేదవారి కొరకు ట్రస్టులు ఏర్పాటు చేసి సేవ చేసేవారి గురించి పత్రికలలో చదువుతుంటాము.. వారికి మన సొమ్మును అందచేయవచ్చు.

ఇంకా, డబ్బు లేక రోగాలకు చికిత్స చేయించుకోనివారు ఎందరో ఉన్నారు. ఇలా మనసుంటే ఎన్నో మార్గాలున్నాయి.


అదే కోటి రూపాయల కారు కొంటే ఆ లాభమంతా మళ్ళీ డబ్బున్న వారికే చెందుతుంది. అలాంటి కార్లు, నగలు అమ్మేవారు డబ్బున్న వారే అవుతారు సహజంగా.

ఇక కోటికారు తయారు చెయ్యాలన్నా............10 లక్షల కారు తయారుచేయాలన్నా ఉద్యోగస్తుల సంఖ్యలో తేడా ఏమీ ఉండదు. ఉదా.......... 2లక్షల నెక్లెస్ ను తయారు చేయాలంటే ఇద్దరు వ్యక్తులు అవసరమైతే.........1లక్ష నెక్లెస్ చేయటానికి కూడా ఇద్దరు సరిపోతారు.

అందుకని ఇలా కాకుండా .......... ధనవంతులు ఖర్చుపెట్టే విధానాన్ని కొద్దిగా మార్చుకుంటే ఆ సొమ్ము సమాజంలో ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతుంది.

ఆ సహాయం పొందినవారి దీవెనల వల్ల ఆ ధనవంతుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. వారికి కష్టాలు రావు.

ఒకవేళ సహాయం పొందినవారు మరిచిపోయినా భగవంతుడు వీరిని మెచ్చుకుంటారు.

అందువల్ల ధనవంతులు తమ దగ్గరున్న సొమ్ములో కొంత భాగాన్ని దయచేసి సమాజానికి ఖర్చు పెట్టటం వల్ల వారి కుటుంబాలకు సుఖసంతోషాలు కలుగుతాయి. అలాగే సమాజానికి సుఖసంతోషా
లు కలుగుతాయి.

 

2 comments:

  1. అనుకరణ వల్ల వచ్చిన తంటా ఇది.
    సినీ, రాజకీయ, వర్గాల మనుషులను అనుకరించటం ఎక్కువ గా జరుగుతోంది.
    బేవార్స్ సంపాదన ఉన్న వాళ్ళను చూసి మధ్య, దిగువ తరగతి వాళ్ళు కూడా ఈ అనుసరించే వాళ్ళ కి మినహాయింపేమీ కాదు.
    ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, చెప్పినా ఎక్కదు.
    అలాంటి జనం మారితే మంచిది.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    సారీనండి. జవాబివ్వటానికి ఆలస్యమయినందుకు. కామెంట్ ఇప్పుడే చూశానండి. మీరు చెప్పినది నిజమేనండి. ....

    ReplyDelete