ఏ జాతకాలూ తెలియకపోయినా సత్ప్రవర్తనను కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు......
అయితే , చాలామంది జీవితంలో ముందు ఏం జరుగుతుందోనని ఉత్సుకతతో జాతకాలను చూపించుకుంటారు. జాతకం మంచిగా ఉంటే ఆనందాన్నీ, ఏమైనా తేడాగా ఉంటే బాధను పొందుతారు.
( ఈ రోజుల్లో జాతకాలు చెప్పటం సరిగ్గా తెలిసిన వారు అరుదుగా ఉన్నారు .)
ఆ జాతకమంతా పూర్వం తాను చేసిన మంచిచెడు కర్మల ఫలితమేనని తెలిసినా జీవితంలో చెడు జరగకూడదనే ప్రతివ్యక్తి కోరుకోవటం జరుగుతుంది.
రాసిపెట్టిఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం మనకు ? అని చాలామంది నిరాశగా అనుకుంటారు.... అలా భావించటం పొరపాటు..........
మన సత్ప్రవర్తన ద్వారా .. మన తలరాతను మార్చుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు.
జాతకంలో చెడు సూచనలు కనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోకుండా ముందే జాగ్రత్తపడి.... తమ చెడు ప్రవర్తనను మార్చుకుని, దైవప్రార్ధన, పుణ్యకార్యాలు చేయటం, సత్ప్రవర్తనతో మెలగటం, ఇలాంటివి చేయటం ద్వారా రాబోయే కష్టం చాలావరకూ తగ్గే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు.

పూర్వం ఎందరో ఇలా చేసి తమ జీవితాలను సరిదిద్దుకున్న సంఘటనలు గ్రంధాలలో కనిపిస్తాయి.
ఈ రోజుల్లో కూడా ......... జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనను కలిగిఉన్నప్పుడు .....ప్రభుత్వం వారు , వారి శిక్షా కాలాన్ని తగ్గించి ముందే వదిలిపెట్టడం, ఒకోసారి శిక్షను రద్దు చేయటం జరుగుతోంది కదా.....
అసలు ఎవరైనా.. ఎప్పుడూ సత్ప్రవర్తనను కలిగి ఉంటే ఈ బాధలు ఉండవు కదా !
భగవంతుడు ఎంతో దయామయుడు. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వారిని వారు తప్పక క్షమిస్తారు.
షిరిడి సాయిబాబా ..... భక్తులు తమ జాతకాలలోని దోషాల గురించి భయపడినప్పుడు, వారిని భయపడవద్దనీ, ఆ జాతకాలను ప్రక్కన పెట్టి.......... తనపైన భారం వేయమని చెప్పిన సంఘటనలు జరిగాయి.
ఇలా ఎందరో పూజ్యులు ... తమను ఆశ్రయించిన భక్తులను వారి పూర్వకర్మ ఫలితాలనుండి రక్షించిన సంఘటనలు గ్రంధాలలో చెప్పబడ్డాయి.
కొందరు ఎంత మంచిగా జీవిస్తున్నా వారి జీవితం కష్టాలమయంగానే ఉంటుంది. అంటే.. వారు క్రితం జన్మలో అంత ఎక్కువ తప్పులు చేసారని అర్ధం చేసుకోవాలి.( ఇలా కాకుండా మనకు తెలియని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.)
అలాంటివారు ఈ జన్మలో ఎంతో శ్రమకు ఓర్చి... నియమనిష్టలు కలిగిఉండటం, దానధర్మాలు చేయటం ద్వారా ఆ కష్టాలనుంచీ బైట పడగలరు.
నేను ఒక దగ్గర చదివిన విషయమిది .. నాడీజ్యోతిష గ్రంధాలలో అందరి జాతకాలు ముందే వ్రాయబడి ఉంటాయట.
అయితే ... ప్రస్తుతము మనం చేస్తున్న మంచి,చెడు కర్మలను బట్టి ఆ గ్రంధాలలోని అక్షరాలు ( జాతకాలు ) మారిపోతూ ఉంటాయట.(ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. )
అంటే వర్తమానంలో మన ప్రవర్తనను బట్టి మన తలరాత మారుతుందన్న మాట.
అలాగని జాతకం బాగా ఉన్న వ్యక్తులు ....... ఇంకా తాము ఏం చేసినా ఫరవాలేదు అని అహంకారంతో ప్రవర్తించారనుకోండి.. రాబోయే శుభములు తగ్గిపోతాయేమో !
* ఏ జాతకాలూ తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే సరియైన దారిని చూపిస్తారు.
No comments:
Post a Comment