ఈ మధ్యకాలంలో కొందరు షిరిడి సాయిని విమర్శిస్తు....
సాయిని పూజించేవారు రాముడిని, శివుణ్ణి పూజించకూడదన్నట్లు మాట్లాడుతున్నారు.
**************
హిందువులు..ఎందరో దేవతలను, గురువులను, అవతారమూర్తులను.. ఆరాధించుకుంటారు. అలాగే షిర్డిసాయినీ ఆరాధించుకుంటున్నారు.
*************
హిందువులు రాయిలోను, రప్పలోనూ, చెట్టు లోనూ కూడా దైవాన్ని భావించి ఆరాధిస్తారు. గురువును దైవంగా పూజిస్తారు చాలామంది.
************
మనిషిగా జీవించిన పైడితల్లిని దేవతగా పూజిస్తున్నారు. మనుషులుగా జీవించిన సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా పూజిస్తున్నారు.
ఇప్పుడు షిర్డిసాయిని పూజించకూడదని అంటున్న వాళ్లు ముందుముందు...పైడితల్లిని, సమ్మక్క, సారలమ్మలను కూడా పూజించకూడదని అంటారేమో?
*******************
కొందరు స్వార్ధపరుల వల్లా, కొందరు తెలిసీతెలియని వారి వల్లా హిందుత్వంలో అంటరానితనం వంటి కొన్ని దోషాలు ప్రవేశించాయి.
ఇలాంటి వాటి వల్ల హిందూ సమాజం ఇప్పటికే ఎంతో నష్టపోయింది.
మూఢనమ్మకాలను, అంటరానితనం ..వంటి భూతాలను తరిమివేయండి.
హిందువులు ఎన్నో మూఢనమ్మకాలను, కఠినమైన ఆచారవ్యవహారాలను పెంచుకున్నారు. అవన్నీ పాటించలేని కొందరు సులభంగా ఉండే పద్ధతుల పట్ల ఆకర్షితులవుతున్నారు.
హిందువులు ఎన్నో మూఢనమ్మకాలను, కఠినమైన ఆచారవ్యవహారాలను పెంచుకున్నారు. అవన్నీ పాటించలేని కొందరు సులభంగా ఉండే పద్ధతుల పట్ల ఆకర్షితులవుతున్నారు.
అనేకమైన ఆచారవ్యవహారాలను పాటించలేక , ఇన్ని పద్ధతులు ఎందుకు ఆచరించాలంటూ నాకు కూడా చాలాసార్లు విసుగు అనిపించేది. ఆచరించకపోతే ఏమవుతుందో అని భయంతో ఆచరించాను. ఇప్పుడు చాలావరకూ తగ్గించుకుని నాకు వీలైనంతలో ఆచరిస్తున్నాను. ఇప్పుడు భయం తగ్గింది.
కొందరు తమకు గల అతిభయం వల్లనో, తమ పేరుకోసమో, డబ్బుకోసమో, తమ స్వార్ధప్రయోజనాల కోసమో..తమకు తోచినట్లు చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.
హిందువులు ఇతర పద్ధతులలోకి వెళ్ళకుండా ఉండాలంటే, తమ మూఢాచారాలను వదిలేయాలి. ఆచారవ్యవహారాల విషయంలో కూడా కాలానుగుణంగా కొంత సులభంగా ఉండాలి.
అంతేకాని, ప్రతిది ఇలా చెయ్యకూడదు, ఇలానే చెయ్యాలి అంటూ..అదేపనిగా చెప్పుకుంటూ పోతూ ప్రజలను నిందించటం సరైనది కాదు.
No comments:
Post a Comment