koodali

Friday, October 21, 2016

కంప్యూటర్ కీ బొర్డ్ మరి కొన్ని విషయములు...


కంప్యూటర్ వల్ల రేడియేషన్ తో ఎన్నో సమస్యలు వస్తాయంటారు.. ..

కంప్యూటర్ ముందు కూర్చుని కళ్లకు ఎక్కువ శ్రమ కలగటం వల్ల కూడా తలనొప్పి, మెడనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయట. 

 చాలామంది విషయంలో కళ్ళకు శ్రమ కలగటంతో పాటు  .. గంటల తరబడి వేళ్ళతో  పనిచేస్తే  ఒత్తిడి వల్ల శ్రమ కలుగుతుంది .. అనిపిస్తోంది.


ఇంకో విషయం ఏమిటంటే,  కీ బొర్డ్ నొక్కే శ్రమ లేకుండా మాటతో వ్రాసే టెక్నాలజీ రాబోతుందంటున్నారు.


ఈ విధానంలో కీ బోర్డ్ తో పని లేకుండా వ్యక్తి చెప్పే విషయం మానిటర్ పై వచ్చేస్తుందట.

 అయితే, వ్యక్తి చెప్పే విషయాన్నిఅన్ని భాషలలోనూ, అన్ని యాసలలోనూ  గ్రహించి తప్పులు లేకుండా వచ్చే విషయంలో మరింత మెరుగ్గా రావటం కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారట. ఇది  ఎంతో సంతోషకరమైన విషయం. 
 

ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరిగి ... త్వరలో ఆ సౌకర్యాలు రావాలని ఆశిద్దాము.

 అయితే ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మనం కంప్యూటర్ వద్ద వ్రాసే విషయం ప్రక్కవారికి తెలియటం అన్నివేళలా ఇష్టపడము.
 
ప్రైవసీ కావాలంటే కీ బోర్డ్ అప్పుడప్పుడు అవసరపడుతుందనిపిస్తుంది.
 
మనం కంప్యుటర్ ముందు మాట్లాడే మాటలు ప్రక్కవారికి వినబడని విధంగా ఏమైనా  టెక్నాలజీ ఏర్పాటు చేస్తారా ? లేక మాటలు ప్రక్క వారికి వినబడతాయో ? ఇవన్నీ తెలియదు.

మాట్లాడలేని మూగవారి విషయంలో కూడా కీ బోర్డ్ అవసరం ఉంటుందనిపిస్తుంది.

అయితే ఈ విషయాలలో కూడా శాస్త్రవేత్తలు ఏమైనా పరిశోధనలు చేస్తున్నారేమో తెలియదు.

మాటతో వ్రాసే విధానం వచ్చినా కూడా.... కీబోర్డ్ సౌకర్యాన్ని  తీసివేయకుండా  ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు.

ప్రస్తుతానికి మాత్రం  పెన్ను,పెన్సిల్ వంటి సాధనంతో కీబోర్డ్ వాడటం నా విషయంలో సులువుగా ఉంది.

సన్నటి బాల్ పెన్ను కాకుండా వెడల్పాటి పెన్నుతో అయితే మరింత సులువు అనిపిస్తుంది.
***************

అయితే, ఒక ప్రక్క టెక్నాలజీ తో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని  అనుకుంటుంటే టెక్నాలజీతో ఎన్నో సమస్యలు కూడా  ఎదురవుతున్నాయి.

 కంప్యూటర్  హ్యాక్ చేయటం  ద్వారా ఎన్నో ఇబ్బందులు కలగటం గురించి వింటున్నాము.

ముందుముందు ఏం జరుగుతుందో ఏమిటో.

2 comments:

  1. మాటతో వ్రాసే విధానం వచ్చినా కూడా కీబోర్డ్ సౌకర్యాన్ని తీసివేయకుండా ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు.

    ReplyDelete
  2. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే,

    కర్సర్ వాడేటప్పుడు చూపుడు వ్రేలును మాత్రమే ఎక్కువ ఉపయోగించటం వల్ల కూడా నరాలపై వత్తిడి పెరిగి చేయి, భుజం నొప్పి.. వస్తుందనిపించింది.

    ReplyDelete