koodali

Wednesday, October 26, 2016

భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో...


శిరిడిసాయిని పూజించినందువల్ల మహారాష్ట్రలో కరువు వచ్చిందని కొందరు అంటున్నారు.

కరువు, అతివరదలు మాహారాష్ట్రలోనే కాదు, దేశంలో ఎన్నో చోట్ల రావటం జరిగింది.

కరువు, అతి వరదలు.. ప్రజలు పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల.. గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్నాయి. అంతేకానీ, సాయిని పూజించటం వల్ల కాదు.

 ఇక్కడ శిరిడిసాయి పూజలు ప్రారంభించకముందే భారతదేశంపై  విదేశీయుల దండయాత్రలు జరిగాయి.

 ఎందరో ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు .ఆ రోజుల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. ఎందరో చంపబడ్దారు. చంపబడిన వారిలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు.

 మరి భారతదేశంపై విదేశీదండయాత్రలు ఎందుకు జరిగాయో? చెప్పండి. అప్పటికి శిరిడిసాయి పూజలు లేవు కదా!

 ప్రజలకు కష్టాలు వస్తే ఫలానా దేవుడిని పూజించటం వల్లే అనటం తప్పు.

 ప్రజలు తాము చేసిన పాపపుణ్యాలకు తగ్గట్లు ఫలితాన్ని అనుభవిస్తారు. ఆ కష్టాలు పోవటానికి దైవాన్ని గానీ గురువును గానీ ఆశ్రయిస్తారు.

ఇంద్రుడంతటి వారే .. వృత్రాసుర వధ తరువాత కొంత కష్టాన్ని అనుభవించవలసి వచ్చింది.

ప్రజలైనా అంతే . తాము చేస్తున్న కర్మలకు తగిన ఫలాలను అనుభవిస్తారు.

హిందువులు కొందరు పాటించిన అంటరానితనం, కొన్ని మూఢాచారాలు .. వల్ల భారతదేశంపై విదేశీ దాడులు జరిగి  ప్రజలు కష్టాలు అనుభవించి ఉంటారనుకోవచ్చు కదా!

  ముస్లింలు విగ్రహారాధనను చేయరు.  శిరిడిసాయి శిరిడిలో ఎన్నో హిందూదేవాలయాలను బాగుచేయటానికి ప్రోత్సహించారు.

ఆ  రోజులలో శిరిడిలో సాయి సమక్షంలో శంఖము ఊదటం, గంట వాయించటం, హారతి ఇవ్వటం వంటివి జరిగేవంటారు.

సాయి చెవులకు హిందువుల వలె కుట్లు( రంధ్రము) ఉండెడివంటున్నారు.

 ఇప్పుడు శిరిడిసాయి విగ్రహాన్ని నెలకొల్పి ప్రజలు పూజలు
చేస్తున్నారు.విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేయటం హిందూ పద్ధతే.


No comments:

Post a Comment