koodali

Monday, January 22, 2024

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4

 

వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్..

లింక్స్ పైన క్లిక్ చేసి చదవగలరు..

 

   సీతారాములు ఏం చేసిఉంటే అందరు ప్రజలు మెచ్చుకునేవారు...

 

శ్రీ మద్రామాయణము..సుఖాంతము.. 

 

జాతకాలు విషయంలో నాకు కలిగిన కొన్ని సందేహాలు....

 

  జీవితంలో సంపాదన ఉంటే చాలా ?

 

 బలవంతులు బలహీనులను పీడించకూడదని మాట్లాడే హక్కు వ...

 

 మితిమీరిన స్వేచ్చ.....

 

 పాపాలు పండే రోజు ఎప్పుడు వస్తుందో ...

 

దైవ సృష్టి ...

 

 పురాణేతిహాసాలలోని జీవిత కధల ద్వారా ..

 

  ఇప్పుడు ఎవరెంత మంచిగా ఉంటున్నారు?

 

8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. తిరువణ్ణామలై పుణ్యక్షేత్రంలో.. టోపీఅమ్మ అనేఆమె ఉంటారు. ఆమె ఎప్పుడైనా తనమానాన తాను నడుచుకుంటూ వెళ్తున్నా కూడా, కొందరు ఆమె చుట్టూ చేరి ఆమె కూర్చుంటే కూర్చోవటం, నిల్చుంటే నిల్చోవటం, ఆమె ఏదైనా తినిపడేస్తే అది ఏరుకుని తినటం చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఆమెకు ఇబ్బందిగా ఉండొచ్చు.. ఆమెకు శక్తులున్నాయని, ఆ శక్తులతో వీళ్ళకు కష్టాలు తీరాలని కొందరు ఆమె చుట్టూ గుమిగూడుతున్నారేమో ..అనిపిస్తుంది. కొంతమందిమాత్రం ఆమె పట్ల గౌరవంతో చూసి వెళ్తారు. ఆమెను ప్రక్కన ఎవరైనా అనుసరించినప్పుడు ఆమెకు ఇబ్బందిలేకుండా ఉంటే ఫరవాలేదుకానీ, ఆమెకు ఇబ్బందిగా ఉంటే విసిగించకూడదు.

    టోపీఅమ్మ పరిస్థితి ఏమిటో తెలియదు కానీ, ప్రజలు ఆమెను ఇబ్బందిపెట్టకూడదు.

    ReplyDelete
    Replies
    1. కొందరు గొప్పవారుగా అయిన వారు తిని వదిలేసిన   పదార్ధాన్ని తింటే శక్తి వస్తుందని నమ్మి, దానికొరకు కొందరు జనం తాపత్రయపడుతున్నారు. జనాలు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియటం లేదు. గొప్పవారు గొప్పవారే కానీ, దైవం అందరికంటే గొప్పవారు కదా..దైవాన్ని ప్రార్ధించుకుంటే దైవం సాయం చేస్తారు.. దైవానికి నివేదించిన దైవప్రసాదాన్ని పుచ్చుకుంటే శక్తి వస్తుంది.
      ......
       చాలామంది మనుషులకు తమ కష్టసుఖాలను చెప్పుకోవటానికి తమతో మాట్లాడే సాటి మనుషులు కావాలి. ఈ రోజుల్లో గురువులని చెప్పే వారిని నమ్మాలన్నా , ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? తెలియటం లేదు. అందువల్ల దైవాన్ని ప్రార్ధించుకోవాలి. కష్టసుఖాలను దైవానికి చెప్పుకోవాలి. ఇంకా మనుషులతో కూడా చెప్పుకోవాలనిపిస్తే, బాగా నమ్మకం ఉన్నవారితో చెప్పుకోవచ్చు. అలాగని, ఎవర్ని పడితే వారిని నమ్మటం మంచిదికాదు. జాగ్రత్తగా ఉండాలి.

      Delete
  3. వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. ఇలా ఇంతకుముందు కూడా వ్రాసాను. ఇలా ఎందుకు వ్రాస్తానంటే, దైవానికి సంబంధించిన విషయాలలో తెలియనివి ఎన్నో ఉంటాయి. అందువల్ల ఇలా వ్రాసాను.

    ReplyDelete
  4. మీడియా చాలా శక్తివంతమైన సాధనం. అందువల్ల ప్రతివిషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మంచికి.. చెడుకు ఉపయోగిస్తుంటారు. మీడియా ద్వారా వెలువడే అభిప్రాయాలు, రచనలు, సినిమాలు, సీరియల్స్..వంటివాటి వల్ల ఎందరో ప్రభావితులవుతారు.

    ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీడియాలో వచ్చే పతి విషయము మనం కూడా చేయాలనుకోకూడదు. ప్రపంచంలో ఎందరో ఎన్నో తెలియజేస్తుంటారు. మనము విచక్షణతో వ్యవహరించాలి.

    ప్రపంచంలో ఎన్నో విషయాలున్నాయి. అన్నీ మనం చేయలేము. చేయకూడదు కూడా..ఎందరో ఎన్నో చేస్తుంటారు. మనము అవన్నీ చేయాలంటే కష్టం కదా. ఎవరేది చేస్తే అందంతా మనమూ చేయాలనుకోకూడదు. చూసి, విని, వాటిలో మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోవచ్చు అంతే.

    ప్రపంచంలో ప్రతిదీ మనం కంట్రోల్ చెయ్యలేము. మనల్ని మనం అదుపులో పెట్టుకుంటే ఎంతోగొప్ప.. చేతకాకపోతే దైవాన్ని శరణు వేడుకోవాలి. దైవం గురించి కూడా మీడియాలో చెప్పే అనేకవిషయాలను అందరూ పాటించలేరు. మన శక్తికొద్ది సరళంగా కూడా దైవాన్ని ఆరాధించుకోవచ్చు. దైవం మనల్ని అర్ధం చేసుకుంటారు.

    ReplyDelete
  5. సృష్టిలో అపారమైన విజ్ఞానం ఉంటుంది. గ్రంధాలలో కూడా అపారమైన విజ్ఞానం ఉంది. అంతటినీ తెలుసుకోవటం సాధ్యం కాదు. దేవరహస్యాలు కూడా ఉంటాయి. అవి దైవానికే తెలుస్తాయి. అన్నింటి గురించి శోధిస్తూ ఉండటం కన్నా,  అవసరమైనంత తెలుసుకుంటే చాలు. అంతేకానీ, జీవితమంతా విషయపరిజ్ఞానం కొరకే వెచ్చించటం వల్ల ఏం ప్రయోజనం?

    నాకు ఏమనిపిస్తుందంటే, దైవాన్ని నమ్ముకుని, అవసరమైనంతవరకు విషయాలను తెలుసుకుని, జీవితాన్ని ధర్మబద్ఢంగా గడపటానికి ప్రయత్నిస్తే .. దైవమే అన్నీ చూసుకుంటారనిపిస్తుంది.

    ReplyDelete
  6. ఈమధ్యన కొందరు చాలావిషయాలను చెబుతున్నారు. విన్నవాళ్ళకు ఏంచేయాలో అర్ధం కాదు.
    ఉదా..కొబ్బరికాయను కడిగి దేవుని వద్ద కొట్టకూడదంటూ కొందరు చెబుతున్నారు. కొన్నిసార్లు  మార్కెట్లో కొబ్బరికాయలు ఉంచే ప్రదేశం అంత శుచిగా ఉండకపోవచ్చు..కాయకొట్టినప్పుడు నీటితోపాటు మురికి కూడా క్రిందకుదిగుతుందికదా..ఆ నీటిని దేవునికి సమర్పించటం బాగుండదనే అభిప్రాయంతో కాయలను కొట్టేముందు కడగాలనిపిస్తుంది.  అందువల్ల కాయలను కడిగి, తడి కొంత ఆరినతరువాత కొట్టవచ్చు. ఇంటివద్ద కొబ్బరిచెట్టు ఉండి కాయలు శుభ్రంగా ఉంటే కడగకుండానే కొట్టుకోవచ్చు. నేను చాలాసార్లు కొబ్బరికాయను కడిగి దేవునికి కొడుతుంటాను.తప్పోఒప్పో దైవానికి తెలియాలి.

    ReplyDelete
  7. పురాణేతిహాసాల్లో ఉన్నవి లేనివీ కల్పించి, చాలా సినిమాల్లో చూపిస్తున్నారు. కొన్ని సీరియల్స్ మూఢనమ్మకాలు పెరిగేలా చూపిస్తున్నారు. అవి చూసి ప్రజలకు నిద్రలో చిత్రమైన కలలు వచ్చి, భయపడి ఏం చెయ్యాలో? సలహాచెప్పమని అందరినీ అడుగుతుంటారు. ఇక, ఎవరికితోచిందివారు చెబుతుంటారు. ఇదంతా ఏంటో? ఎక్కడికి వెళ్తుందో? భగవంతునికే తెలియాలి.

    ReplyDelete