ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న అశ్లీలత గురించి ఎప్పటినుంచో ఎందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సరైన చర్యలు చేపట్టడం లేదు.
ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం ..ద్వారా ప్రసారమవుతున్న కొన్ని ప్రసారాల విషయంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా, వేసే వాళ్లు తీస్తున్నారు..చూసే వాళ్లు చూస్తున్నారు.
గత యాభై ఏళ్ళ క్రిందటతో పోలిస్తే సమాజంలో చాలా మార్పు వచ్చింది. పాతకాలంలో మత్తుమందు తాగిన వారి పట్ల కొంత చిన్నచూపు ఉండేది.
ఇప్పుడు మత్తుమందు త్రాగనివారిని చిన్నచూపు చూసేవిధంగా సమాజంలో మార్పులు వచ్చాయి. స్త్రీ పురుషుల సంబంధాల విషయంలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి.
ఈ రోజుల్లో సినిమాలు, సీరియల్స్, అంతర్జాలం, సెల్ఫోన్ల ద్వారా ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివాటి ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది.
సినిమాలల్లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. నిజమే, అయితే, ఎన్నో అసభ్యకరమైన దృశ్యాలను కూడా సినిమాల్లో చూపించారు.
టూ పీస్ దుస్తులు బికినీ దుస్తులు ధరించిన మహిళలు, హీరోహీరోయిన్లు ఒకరిపై ఒకరు పడి దొర్లటం, స్త్రీపురుషుల సరససల్లాపాలు, మద్యం త్రాగటం, రేప్ చేయటం, ఇతరులను చంపటం... ఇలాంటివెన్నో చూపిస్తున్నారు.
రేప్ చేయటం, ఇతరులను చంపటం, స్త్రీపురుషుల సరససల్లాపాలు,....వంటివి పిల్లల కంటపడటం బయట సాధారణంగా జరగదు.. . ఇవన్నీ సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
ఇలాంటి దృశ్యాలను చూస్తున్న చిన్నపిల్లలు, యువత .. మనస్సు ఎలా ఉంటుందో ఆలోచించండి.
ఇవి కొందరు పెద్దలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
సమాజంలో జరిగేవే చూపిస్తున్నాం .. అంటారు సినిమావాళ్లు. .
భార్యాభర్త సరససల్లాపాలు సమాజంలో జరిగేవే ..అయినా..సినిమాలో అదంతా చూపిస్తే ఊరుకుంటారా?
ప్రసారమాధ్యమాల ద్వారా రేపులు, మర్డర్లు.. చూసిచూసి అవన్నీ సాధారణంగా జరిగే విషయాలే ..అనుకునే పరిస్థితి కొందరిలో కలగవచ్చు. కొందరు, అలాంటివి చేయడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపడనవసరం లేదు.
మంచి సినిమా అని వెళితే, కొన్నిసార్లు అందులో కూడా ఐటం సాంగ్ వస్తుంది.
ఐటం సాంగ్స్ అంటూ.. హీరోతో సహా కొందరు మగవాళ్లు ఒకమ్మాయితో అసభ్యంగా పాట పాడుతూ డాన్స్ చేయటం చూపిస్తున్నారు.
పొర్న్ వంటి వాటికి కూడా అడ్డుకట్ట వేయాలి. అంతర్జాలం, సెల్ఫోన్స్..ద్వారా ప్రసారమవుతున్న హానికారక ప్రసారాలకు అడ్డుకట్ట వేయాలి.
ReplyDeleteకొంతకాలం క్రిందట దారుణమైన నేరం జరిగి, కొందరు నిందితులు కొంతకాలం చెరసాలలో ఉన్నారు. తరువాత వారికి మరణశిక్షను కూడా అమలుచేసారు.
అయితే వారిలో ఒక వ్యక్తి .. జరిగిన నేరం గురించి పశ్చాత్తాపపడటం జరిగిందని, చెరసాలలో సత్ప్రవర్తనతో ఉండటం జరిగిందని, మరణశిక్ష అమలుకు ముందు రోదించటం జరిగిందని వార్తల ద్వారా చదివి కొంత బాధ కలిగింది.
ఆ వార్తలను విన్న తరువాత.. నాకు కలిగిన భావాలలో కొన్నింటిని రాస్తున్నాను.
******
కొందరు నేరాలు చేసి, తరువాత చేసిన దానికి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు. నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా ? అనేది తెలియదు.
నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా శిక్ష పడక తప్పకపోవచ్చు.
ఎందుకంటే, బాధితులకు జరిగిన అన్యాయం, వారి బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!
చిన్న నేరం అయితే బాధితులు క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.
పెద్ద నేరం , క్రూరమైన నేరం చేస్తే మాత్రం పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.
అప్పుడు వారు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.
అయితే, మరణం ముందు పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
కొంత తక్కువ నేరం అయితే వాళ్ళు కారాగారంలో కొంతకాలం శిక్ష అనుభవించిన తరువాత వారి ప్రవర్తన మంచిగా ఉంటే శిక్షలో కొంత తగ్గింపు ఉండవచ్చు. కొన్నిసార్లు కారాగారం నుంచి విముక్తి కూడా లభించవచ్చు.
ఎవరైనా సరే, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం కన్నా ముందే మనస్సును అదుపులో ఉంచుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించటం మంచిది.
కొందరు అబ్బాయిలు అమ్మాయిలను వేధించి క్రూరంగా ప్రవర్తించిన వార్తలు వింటాము. అందుకు ఫలితంగా వాళ్ళకు శిక్ష కూడా పడుతుంది. వారికి శిక్ష పడినందుకు అందరూ హర్షిస్తారు. వారు చేసిన క్రూరమైన పనికి శిక్ష పడటంలో తప్పులేదు.
ReplyDeleteఅయితే, సమాజంలో నేరస్తులు తయారుకావటానికి ఎన్నో కారణాలుంటాయి. మద్యపానం, అసభ్యకరచిత్రాలు, పోర్న్ వంటివి చూడటం నుంచి ప్రేరణ,సమాజంలో ఆర్ధిక అసమానతలు వంటి వాటి వల్ల కూడా వ్యక్తులు నేరస్తులుగా తయారవుతారు.
మద్యం అమ్మటం , అసభ్యచిత్రాలు చేయటం , ఆర్ధికదోపిడీ.. వంటివి చేస్తున్న వారు కూడా శిక్షార్హులే. అక్రమచర్యల ద్వారా డబ్బు సంపాదించేవారు ఈ లోకంలో శిక్ష నుండి తప్పించుకున్నా కూడా ...దైవం ఇచ్చే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేరు.