శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి పారాయణ చేయకూడదని పండితులు తెలియజేసారు..
ఉదా.....
శ్రీ లలితాదేవి యొక్క కొన్ని నామములు ....
* అజా
* క్షయవినిర్ముక్తా
* ముగ్ధా
* క్షిప్రప్రసాదినీ
అజా క్షయవినిర్ముక్తా ముగ్దా క్షిప్రప్రసాదినీ .. అని పారాయణ చేయాలట .
అజాక్షయ వినిర్ముక్తా ముగ్దాక్షి ప్రప్రసాదినీ .. అని పారాయణ చేయకూడదట.
****************
శ్రీ ఆదిత్యహృదయము ను పఠించేటప్పుడు ఒక దగ్గర నాకు ఒక సందేహం కలిగింది.
హిరణ్యగర్భ శ్శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః || అని చదివేటప్పుడు ..
అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః..అని వరసగా గబగబా పఠించటం కాకుండా, శ్శిశిరనాశనః .. అని చదవటంలో కొద్దిగా గాప్ ఉండాలేమో ? అనిపించింది.
అగ్నిగర్భోఽదితేః పుత్ర తరువాత కొద్దిగా గాప్ ఇచ్చి, శ్శంఖ శ్శిశిరనాశనః .. అని చదవాలా ? లేక
అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి, శ్శిశిరనాశనః..అని చదవలా? లేక
. అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః || అని చదివేటప్పుడు ..మొత్తం వరుసగా చదవవచ్చా? ..లేక .. కొద్దిగా గాప్ ఇచ్చి చదవాలా ? అనేది నాకు తెలియదు.
కొన్ని చోట్ల ఇలా కూడా ఉంది....అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ||అని.
నాకు సంస్కృతం తెలియదు కాబట్టి , ఈ విషయం గురించి నేను సరిగ్గా చెప్పలేను. ఈ విషయం గురించి పండితులను సలహా అడిగి పఠించడం మంచిది. లేక నెట్ లో ఆదిత్యహృదయం వినవచ్చు.
ADITYA HRUDAYAM WITH TELUGU LYRICS AND MEANING..వద్ద అర్ధమును చదవగలరు.
No comments:
Post a Comment