చిన్నపిల్లల పట్ల అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించటం మంచివిషయం.
ఇంకా పెద్ద వయస్సున్న అమ్మాయిల పట్ల దాడుల చేసే వారిని కూడా శిక్షించాలి. అయితే, ఈ కేసులలో తప్పుడు కేసులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంకో బాధాకర విషయమేమిటంటే , మగపిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటివి కూడా జరగకుండా చూడాలి.
మగపిల్లల పట్ల లైంగికదాడులను జరిపే వారిని కూడా కఠినంగా శిక్షించాలి.
పాతకాలంలో నేరాలు జరిగేవి కానీ, ఇంత పెద్దమొత్తంలో జరిగేవి కావు. నిర్భయ చట్టం తెచ్చినా నేరాలు తగ్గటం లేదు.
నేరాల పెరుగుదలకు మూలకారణాలను కనుగొని సమస్య తీవ్రతను తగ్గించటానికి ప్రయత్నించాలి. మత్తుమందుల నిరోధానికి చర్యలు తీసుకోవాలి.
అసభ్యప్రసారాలను చూసిన ప్రభావం వల్ల , అప్పటికి అందుబాటులో ఉన్న బలహీనులైన చిన్నపిల్లల పట్లా, వృద్ధుల పట్లా కూడా అత్యాచారాలు జరగవచ్చు.
పాతకాలంలో, ఆధునిక పోకడల గురించి నగరాలలో ఉండే కొద్దిమంది ప్రజలకు మాత్రమే తెలుసు.ఆ కొద్దిమంది ఆధునిక పోకడలను అనుసరించేవారు.
అయితే, దృశ్యమాధ్యమాలు పెరగటం వల్ల , మారుమూల పల్లెల వరకూ అందరికీ అన్ని విషయాలూ తెలుసుకునే అవకాశం వచ్చింది.
కొందరి విషయంలో మంచి కన్నా చెడు ఎక్కువ ఆకర్షిస్తుందని అంటారు కదా! గత కొన్ని సంవత్సరాలలో ప్రజల పోకడలో చాలా మార్పులు వచ్చాయి.
అసభ్యకర దృశ్యాలను తీస్తున్నప్రజలదీ తప్పే...అలాంటి వాటిని చూస్తున్న ప్రజలదీ తప్పే.
మత్తుమందులు , అసభ్యకర విషయాలు, అవినీతి, అత్యాశ..ఇలాంటివాటితో సమాజానికి హాని చేయటం సరైనది కాదు.
No comments:
Post a Comment