చాలా విషయాలలో గుర్తింపు కోసం వ్రేలిముద్రలను తీసుకుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో చాలామందిలో చేతి ముద్రలు సరిగ్గా కనిపించటం లేదని అంటున్నారు.
వ్రేలిముద్రలు అరగడానికి అనేక కారణాలుంటాయి.
పెద్ద వయస్సు వల్ల చేతిముద్రలు అరిగిపోతాయని కొందరు అంటున్నారు. అయితే, మధ్య వయస్సు వారిలో కూడా ఇలాంటి సమస్య వస్తోంది.
ఇంకో కారణమేమిటంటే... స్త్రీలు , పురుషులు గిన్నెలు శుభ్రం చేయడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు.
గిన్నెలు తోమేటప్పుడు పాతకాలంలో కొబ్బరి పీచు, ఎండుగడ్డి వంటివి వాడేవారు.
ఆధునిక కాలంలో గరుకుగా ఉండే పీచు వాడుతున్నారు.
గిన్నెలు శుభ్రం చేయడానికి స్టీల్ పీచు ...వంటివి వాడటం వల్ల కూడా చేతుల చర్మం పలచబడే ప్రమాదముంది.
అందువల్ల గరుకు పీచుతో పాత్రలను శుభ్రం చేసేటప్పుడు డైరెక్ట్ గా కాకుండా, స్టీల్ పీచు పైన మామూలు మెత్తని పీచు కప్పి శుభ్రం చేయడం మంచిది.
స్టీల్ వూలు తయారీదారులు స్టీల్ పీచు పై భాగాన మెత్తని కవర్ ఉండేటట్లు తయారుచేయాలి. పని చేసేటప్పుడు గ్లవ్స్ వాడవచ్చు.
ఇంకో కారణమేమిటంటే , కొందరు తమ చేతులను శుభ్రం చేయడానికి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇందువల్ల కూడా చర్మం పలుచబడవచ్చు.
చేతిముద్రలు అరిగే సమస్య వల్ల , ముఖ కవళికలను గుర్తించటం వంటి పద్ధతులను ప్రవేశపెడుతున్నారు.
చేతి చర్మం పలుచబడితే చర్మం వద్ద మంట వచ్చే అవకాశం ఉంది.
పనులు చేసేటప్పుడు చర్మం అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
No comments:
Post a Comment