koodali

Tuesday, March 6, 2018

రోడ్ల మధ్యలో డివైడర్......

 
కొన్ని చోట్ల రోడ్లను వెడల్పు చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయడానికి చాలా వెడల్పు గా స్థలం వదులుతున్నారు.

  డివైడర్ కొరకు వదిలిన స్థలంలో  తారు రోడ్డు  పైనే మట్టి పోసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మొక్కలు నాటినా   సరిగ్గా పెరగవు. 

డివైడర్  కొరకు వదిలిన  స్థలం లో ఉన్న  కంకర రోడ్డు తవ్వి , మట్టి  పోస్తే మొక్కలు పెంచడానికి బాగుంటుంది. అంతేకానీ,   తారురోడ్డుపైనే మట్టి  పోయడం  ఎందుకో తెలియటం లేదు.

ఇలా చేయడానికి ఏమైనా కారణాలున్నాయేమో తెలియదు  కానీ, 

ఎలాగూ ఇంత కష్టపడి రోడ్లు వెడల్పు చేయటం,  డివైడర్లు  ఏర్పాటు  చేస్తునప్పుడు ... డివైడర్ స్థలంలో మొక్కలు  పెరగాలంటే,  కనీసం మొక్క పెట్టే ప్రాంతంలోనైనా క్రింద  ఉన్న కంకరను తవ్వి మట్టి  పోస్తే ,  వేర్లు భూమిలోకి వెళ్లి  మొక్కలు  చక్కగా పెరుగుతాయి కదా ! అనిపించింది. 
*****************

రోడ్డు ప్రక్కన అటూఇటూ  చెట్లు పెంచితే ఎన్నో లాభాలున్నాయి. నీరు  కావాలంటే   మురుగునీటిని శుద్ధి చేసి  ఆ   చెట్లకు పోయవచ్చు. 

అయితే, వైజాగ్లో  హుద్ హుద్ వల్ల  పడిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు పెంచారట. 

 క్రొత్తగా పెంచినవి  ఏవో కొత్త  రకాల చెట్లట. వాటివల్ల  రోడ్లపై వెళ్ళే వారికి శ్వాసకోశవ్యాధుల వంటివి వస్తున్నట్లు  అనుమానంగా ఉందనీ, అందువల్ల నాటిన వాటిని తొలగించాలన్నట్లుగా  కొన్ని వార్తలు వచ్చాయి. 

కొత్తగా మొక్కలు నాటేటప్పుడు మనకు   తెలియని క్రొత్త రకాలను నాటడం కన్నా,  మనకు  పాతకాలం నుంచి తెలిసిన   ఆరోగ్యకరమైన రకాలను  నాటడం మంచిది.

 


No comments:

Post a Comment