koodali

Friday, March 16, 2018

న్యాయస్థానాల ద్వారా న్యాయం .....


ఇక, తెగతెంపులు చేసుకోవటం  మినహా వేరే దారిలేని పరిస్థితి  వచ్చింది.
*********

చట్టసభలో  ప్రకటించిన హామీలను అమలుపరచడానికి ప్రజలు ఉద్యమాలు చేయవలసి రావటం, దీక్షలు చేయవలసి రావటం బాధాకరం .  

సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగిందన్నప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. 

మరి,  ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించకూడదో తెలియటం లేదు.

 న్యాయంగా రావలసిన హక్కుల కోసం కేంద్రాన్ని ప్రాధేయపడవలసిరావటం   బాధాకరం. 

 అవిశ్వాసం ద్వారా దేశంలోని ఇతర పార్టీలను  ప్రాధేయపడవలసిరావటం  కూడా  బాధాకరం.  అయితే, అవిశ్వాసం... తప్పని పరిస్థితి ఏర్పడింది.  

 ఏది ఏమైనా  ఇలాంటి  గందరగోళ  పరిస్థితులు ఏర్పడటం  అత్యంత బాధాకరం. 

* ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా న్యాయం జరగటం బాగుంటుంది.

***************
రాష్ట్రాలలో  ఎన్నో పార్టీలు.. ప్రజలు పార్టీల వారీ విడిపోయి గొడవలు పడటం..ఇదే ఇప్పటి రాజకీయం... . విభజించి పాలించు అనే సిద్ధాంతం.

తమిళనాడు  రాజకీయం  గందరగోళ పరిస్థితిలో ఉంది. ఏపీలో  అలాంటి పరిస్థితి రాకూడదు.  ఇక, ఇలాంటి పరిస్థితిలో  కర్నాటకలో ఎన్నికల ఫలితం  ఏమవుతుందో చూడాలి. 

******************
ఇక, ప్రత్యేక హోదా  విషయానికొస్తే,

  విభజన సందర్భగా..  చట్టసభలో.. ఏపీకి  ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

 ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. కేంద్రంలో ఎవరున్నా ఇవ్వవలసి ఉంటుంది.

 కేంద్రంలో కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి. అయితే అలా చేయలేదు. 

ఇస్తాం.. పరిశీలిస్తున్నాం..అంటూ చాలాకాలం తాత్సారం చేసారు.

 ఆ తరువాత చాలాకాలానికి హోదా ఇవ్వలేం ..ప్యాకేజ్ ఇస్తాం ..అంటూ తేల్చేసారు. 

అప్పటికే విభజన తో అయోమయంలో ఉన్న ఏపీ ప్రజలు ఇక చేసేదేమీలేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తారని నమ్మి ఒప్పుకున్నారు....

బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్యాకేజీకి మీరు ఒప్పుకున్నారు కదా ! అంటూ మాట్లాడుతున్నారు. .

ప్రత్యేక హోదా ఇవ్వము.. అని చెప్పినప్పుడు ప్యాకేజీకి ఒప్పుకోక ఏం చేయాలి ?

 నా విషయానికి వస్తే, ప్యాకేజ్ ప్రకటన నాకు బాగానే అనిపించింది. ..

ఎందుకంటే, మనకు హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలలో కూడా హోదా గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది.   దేశంలో అలజడులు మొదలవ్వటం ఎందుకు ? ఎలాగూ  హోదా కు తగ్గని విధంగా  ప్యాకేజ్ ఇస్తామన్నారు కదా ! అనిపించింది.

అయితే,  ప్యాకేజ్  ద్వారా ఇచ్చేవి కూడా   సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల ...ఇప్పుడు తిరిగి అభిప్రాయం మార్చుకోవలసి వస్తోంది.

హోదాతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఉంటాయని కొందరంటున్నారు. 

కొందరేమో ప్రత్యేక రాయితీతో పాటు  పన్ను రాయితీలు ఇవ్వరు ..అంటున్నారు. 

పన్నురాయితీలు లేని హోదా వల్ల పెద్ద లాభం ఉండదు కాబట్టి ..హోదా  అడిగే విషయంలో  ఇప్పుడయినా స్పష్టత  అవసరం.

మొత్తానికి,  ఆంధ్రప్రదేశ్ రాష్టృ విభజన వల్ల  జరిగిన పరిణామాల వల్ల ఇకపై ఏ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నం  చేయకపోవచ్చు.




No comments:

Post a Comment