ఇక అవినీతి విషయానికొస్తే,
దేశంలో చాలా అవినీతి జరుగుతోందన్నది నిజం.అవినీతి ఎక్కడ జరుగుతున్నా వ్యతిరేకించవలసిందే.
స్వాతంత్ర్యం వచ్చి చాలాకాలం గడిచినా కూడా దేశంలో పేదరికం ఎందుకు ఉంది?
బ్యాంకుల సొమ్మును ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్న వారిపై ముందే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
విదేశాలలో దాచబడిన నల్లడబ్బును ఎంతవరకూ తిరిగి రప్పించారు ? దేశాన్ని ఎంతవరకూ స్వచ్ఛంగా మార్చారు?
గంగా నది ప్రవహించే రాష్ట్రాల పొడుగునా ఎన్నో వ్యర్ధాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి..అలా వ్యర్ధాలు, మురుగు..వంటివి గంగానదిలో కలవకుండా తీసుకునే చర్యలు ఎంతవరకూ వచ్చాయి?
ఇతర నదులను శుభ్రం చేసే పని ఎంతవరకూ జరిగింది?
దేశంలో ప్రజలకు ఎంతవరకు పరిశుభ్రమైన త్రాగు నీటిని అందిస్తున్నారు? ఇలా ఇన్నో సమస్యలున్నాయి.
అన్నిసమస్యలకూ..ప్రజలు,అధికారులు,ప్రభుత్వాలు... ఇలా అందరూ కారణం.
ప్రజలు,అధికారులు, ప్రభుత్వాలు ..ఎవరి పనిని వారు సక్రమంగా,చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే దేశం దానికదే బాగుపడుతుంది.
సమాజ పరిస్థితిలో మార్పులు రావాలంటే అందరిలో మార్పు రావాలి. అందరిలో నైతికత పెరగాలి.
****************
ఇక,ఎన్నికలలో ఎవరికి ఓట్లు వేస్తారనే విషయంలో కొన్నిసార్లు ప్రజల పద్ధతి ఆశ్చర్యంగా ఉంటుంది.
ఉదా..జయప్రకాష్ నారాయణ గారు నిజాయితీపరులని అందరికీ తెలుసు.
మరి,వారు పార్టీ పెట్టి ఎన్నికలలో నిలబడితే,వారి పార్టీని ప్రజలు గెలిపించలేదు కదా!
************
కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీల వల్ల కూడా ప్రజలు నిరాశ చెందవలసి వస్తుంది.
ఉదా..ఆం ఆద్మీ పార్టీ ఆశయాలను విని ఎందరో సంతోషించారు. అయితే, ఆ పార్టీలో చేరిన కొందరి వల్ల పార్టీ పరిస్థితి అయోమయంగా అయింది.
నేత నిజాయితీగా ఉన్నంత మాత్రాన సరిపోదు.సహచరులు కూడా సరైన వారై ఉండాలి.
కొందరు సహచరులు ముందు నిజాయితీగా ఉండి, అధికారం వచ్చాక మారిపోతారు.
***************
సాధారణ ప్రజలు, అధికారులు, రాజకీయులు అందరూ ప్రజలే.
ఈ రోజుల్లో ఎన్నో సమస్యలకు కారణం ప్రజలలో నైతికవిలువలు తగ్గటమే.
సహజసంపదను దోచేసేవారు కొందరైతే, నల్లడబ్బు విదేశాల్లో దాచేవారు కొందరు.
రాజకీయుల్లో కొందరు అవినీతి చేస్తున్నారు.
అధికారుల్లో కూడా కొందరు చేసిన వందలకోట్ల అవినీతి వివరాలు బయటకు వస్తున్నాయి.
సాధారణప్రజలలో కూడా కొందరు బాధ్యత లేకుండా స్వార్ధంగా ప్రవర్తిస్తున్నారు.
సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. కల్తీలు, లంచాలు, సంపద దోపిడీ..ఇలాంటి విషయాల్లో ఎవరికి దోచినంత వారు దోచుకుంటున్నారు.
............................
అయితే, సమాజంలో ఎందరో నిజాయితీపరులు కూడా ఉన్నారు.
సమాజం మారాలంటే రాజకీయులు, అధికారులు, సాధారణ ప్రజలు అందరిలో నిజాయితీ ఉండాలి.
అయితే, ఎక్కువగా ఇప్పుడు పరిస్థితి ఎలాఉందంటే ...సాధారణ ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు అందరూ అందరే అన్నట్లుంది.
ఇలాంటి పరిస్థితిలో సమాజాన్ని మార్చాలనుకోవటం చాలా కష్టం. అన్నింటికీ దైవమే దిక్కు.
No comments:
Post a Comment