దైవానికి అనేక వందనములు,
సుధా సముద్రములో, మణిద్వీపములో, చింతామణిగృహములో నివసించే ఆదిదంపతులైన పరమాత్మకు {శ్రీమన్మహాదేవుడుశ్రీమన్మహాదేవి} వందనములు.
అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.
వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
మహారాష్ట్రీయులు ఏ శుభకార్యక్రమము ప్రారంభించిన ప్రప్రధమమున శ్రీ గణపతి దేవునితో సహా నవగ్రహాలు, ముఖ్యముగా శనేశ్వరుణ్ణి పూజించటము అనాదిగా వస్తున్న సుసంప్రదాయము.
చైత్రశుద్ధ ప్రతిపాదా ( గుడిపాడువ ) అంటే ఉగాది పర్వదినమున శని శింగణాపూర్ లో విశేష ఉత్సవాలు జరుగుతాయట.
నూతన సంవత్సరములో ఆటంకాలు, అవరోధాలు, కష్టనష్టాలు తొలగించి సుఖశాంతులు ప్రసాదించుమని ఆ కరుణాలవాలను భక్త సముదాయము శిరోధార్యులై వేడుకుంటారట.
అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.
***************
( 2014 సంవత్సరములో వ్రాసిన ఉగాది పోస్టులోని విషయములతో.. ఇప్పటి తెలుగు సంవత్సరము పేరు వేసి పోస్ట్ చేయడమైనది.)
No comments:
Post a Comment