ఈ రోజులలో సరైన ఉపాధి అవకాశాలు లేక ఎందరో ప్రజలు ఇతర రాష్ట్రాలకు , విదేశాలకు వెళ్లి అక్కడ ..ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి.
అందువల్ల అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అభివృద్ధి చెందాలి. ఎక్కడికక్కడ విద్య మరియు ఉపాధి లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
స్థానికంగా మా ఉద్యోగాలు మాకే కావాలి.... అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పరిస్థితిలో .. ఎక్కడివారికి అక్కడ ఉపాధి అవకాశాలను కల్పించటం తప్పనిసరి.
మనవాళ్ళు విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి లభించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే సంస్థలు స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి.
*******
పరిశ్రమలతో పాటు వ్యవసాయరంగం కూడా అభివృద్ధి చెందాలి.
సారవంతమైన నేలలు, ఎన్నో నదులు, శ్రమించే వ్యక్తులు ఉండి కూడా ..ఇప్పటికీ భారతదేశం పప్పుదినుసులను ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉండటం స్వయంకృతాపరాధం.
పండించిన పంటలను నిల్వ చేసుకునే సౌకర్యాలు లేక పండిన పంటలు పాడైపోతున్నాయి .
పండించిన పంటను నిల్వ చేసుకునే సౌకర్యాలను కల్పిస్తే , ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. ఎంతో ధనం వృధా కాకుండా ఉంటుంది.
ఆహారపదార్ధాల తయారీ సంస్థల ద్వారా కూడా ఎందరికో ఉపాధి లభిస్తోంది.
ఇప్పటి యాంత్రిక కాలంలో కొన్ని పెద్దపెద్ద పరిశ్రమలవాళ్ళు కూడా ...20 వేలమందికి ఉపాధి కల్పిస్తామని సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఉంది.
అయితే, కడియం తోటల పై ఆధారపడి సుమారు 20 వేలమందికి ఉపాధి లభిస్తున్నదని వార్తల ద్వారా తెలుస్తోంది.
**************
పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలనూ ప్రోత్సహించాలి...
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి కూడా ఎన్నో దేశాలు చాలా ఆదాయాన్ని పొందుతున్నారు. ఎంతో మందికి ఉపాధి అభిస్తోంది.
*************
దేశంలో పేదరికం పోవాలన్నా, అందరికీ ఉపాధి లభించాలన్నా, ఆర్ధిక అసమానతలు తగ్గాలన్నా మనుషుల్లో స్వార్ధం పోవాలి... నల్లడబ్బు, అవినీతి వంటివి ఉండకూడదు.
సంపద కొందరి వద్దే పోగయ్యే పరిస్థితి పోయి , అందరికీ సంపద పంచబడే పరిస్థితి ఉన్నప్పుడు పేదరికం ఉండదు.
No comments:
Post a Comment