విభజన తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర అనే విభేదాలతో ఏపీ గొడవలలో మునిగిపోతుందని కొందరు అనుకున్నారు. అయితే, అలా గొడవలు లేకుండా ఉన్నదానితో సర్దుకుని ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో కొందరు హటాత్తుగా రాయలసీమ వెనుకపడిపోతోందంటూ మాట్లాడటం బాధాకరం.
రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలోనే ఎన్ని ముక్కలు చేయాలో అన్నీ చేసేయవలసింది. అంతేకానీ, ఇప్పుడు నాలుగేళ్ళ తరువాత రాయలసీమ కు అన్యాయం జరుగుతోందంటూ వేర్పాటు మాటలు మాట్లాడుతున్నారు.
రాయలసీమపై నిజంగా ప్రేమ ఉంటే, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాలలో ప్రత్యేక హోదా వల్ల కలిగే ...పరిశ్రమలకు రాయితీలు వంటివి కల్పించండి. అంతేకానీ ఇప్పటికే సమస్యల తో సతమతమవుతున్న ఏపీలో మరిన్ని సమస్యలను సృష్టించకండి.
విభజన సమయంలో వెనుకబడిన ప్రాంతాలను ఆదుకుంటామని చెప్పి అతికొద్ది నిధులు మాత్రమే ఇచ్చారు. బుందేల్ ఖండ్ కు ఇచ్చినట్లు ఇస్తామన్నారు. వాళ్లకు వేలకోట్లు ఇచ్చారు.. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చినదెంత?
**************
ఇప్పటికే సమైఖ్యరాష్ట్రంలో ఏపీ బాగా నష్టపోయింది. రాష్ట్రం నుండి ఎవరైనా విడిపోవాలని అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు ?
ఇక మీదట సమైఖ్య రాష్ట్ర ఉద్యమాలు ఎవరూ చేయకపోవచ్చు. చిన్నచిన్న రాష్ట్రాలు చేయడానికి , డిల్లీ వంటి రాజధాని కట్టిస్తాం అని హామీలు గుప్పించడానికి కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కూడా.
నీటిలభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో నీటి అవసరం తక్కువగా ఉండే పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
నదీపరీవాహకప్రాంతం అయి యుండికూడా ఆంధ్రప్రాంతం ఎంతోకాలంగా నిర్లక్ష్యం చేయబడింది, కనీసం వ్యవసాధారిత పరిశ్రమలను కూడా సరిగ్గా ఏర్పాటుచేయలేదు.
***************
విభజన జరిగి నాలుగు సంవత్సరాలయినా రాజధాని అమరావతికి 2.. వేలకోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా నిదానంగా నిధులు ఇస్తే రాజధాని ఎప్పటికి కట్టాలి? ఈ రోజుల్లో 2..వేల కోట్లకు రాజధాని కట్టగలరా?
ఒక రాజధానికే దిక్కులేనప్పుడు రెండో రాజధాని అంటున్నారు. కేంద్రం సరిపడినన్ని నిధులిస్తే ఎన్ని రాజధానులైనా కట్టొచ్చు.
జమ్మూ కశ్మీరులోని ప్రత్యేక పరిస్థితి వల్ల అక్కడ రెండురాజధానులు ఉన్నాయి . ఏపీలో అలా ఎందుకు కోరుకుంటున్నారో తెలియటం లేదు.
రెండు రాజధానుల కన్నా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా పన్ను రాయితీలు వంటివి అడగటం బాగుంటుంది. రాష్టంలోని అన్ని ప్రాంతాలు చక్కగా అభివృద్ధి చెందాలి.
ఉత్తరాంధ్రలో వైజాగ్ లో బాగా అభివృద్ధి జరుగుతోంది. అలాగే, రాయలసీమలో కర్నూలును అభివృద్ధి చేయాలి. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికే అభివృద్ధి చెందింది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ చక్కగా అభివృద్ధి చెందాలన్నదే అందరి అభిప్రాయం.
బీజేపీ వాళ్లు కేంద్రంతో సామరస్యంగా మాట్లాడి రాష్ట్రానికి నిధులు తేవాలి ...అంతేకానీ , రాష్ట్రం కన్నా పార్టీనే ముఖ్యం అన్నట్లు మాట్లాడటం , నిధులు సరిగ్గా ఇవ్వకుండానే చాలా ఇచ్చేసాం....వంటి మాటలు మాట్లాడటం బాధాకరం.
ఇవన్నీ గమనిస్తే , రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు ( రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే పార్టీలు.. )....కేంద్రంలో జాతీయపార్టీలు అధికారంలోకి రావటం బాగుంటుందనిపిస్తోంది.
విభజన సమయంలో ఏపీకి బీజేపీ సపోర్ట్ రాకపోయినా ...విభజన తరువాత బీజేపీ న్యాయం చేస్తుందని భావించి ఉమ్మడి గా అధికారాన్ని ఇచ్చారు ప్రజలు.
ఇప్పుడు బీజేపీపై ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. ఈ విషయాన్ని వాళ్లు గ్రహించటం మంచిది. బీజేపీ అంటే అంతోఇంతో సానుభూతి ఉన్నవారికి కూడా వాళ్లంటే వ్యతిరేకత పెరిగేలా ...వారి మాటలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించకపోతే వారికే నష్టం.
ఈ రోజుల్లో చాలామందిలో స్వార్ధం ఎక్కువయింది. మిగతా వారు ఎలాపోయినా ఫరవాలేదు.. మేము బాగుంటే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఇలాంటి వారు రాజకీయుల్లోనూ, ప్రజలలోనూ కూడా ఉన్నారు. ఇలాంటి స్వార్ధపరుల సంఖ్య పెరిగిన సమాజంలో నీతి, నియమాల గురించి ఎక్కువగా ఆలోచించటం వృధాప్రయాస అనిపిస్తుంది.
ఇతరులను అన్యాయం చేసేవారు దైవం నుంచి తప్పించుకోలేరు.
No comments:
Post a Comment