koodali

Friday, February 16, 2018

పోలవరం ప్రాజెక్ట్ ...



ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు అనేక ఉపయోగాలున్నాయని అంటున్నారు. నీరు  ఉంటే సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధాచేయకూడదు. 


చెక్ డ్యాములు, ఇళ్ళ వద్ద , పొలాల వద్ద వర్షపు నీటిని ఒడిసిపట్టే  విధానాల  ద్వారా వర్షపునీటిని ఒడిసిపట్టి  నిలువ చేసే విధానాల గురించి రాష్ట్రప్రభుత్వం విస్త్రుతంగా ప్రచారం చేస్తోంది. ప్రజలు  వీటిపై మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం  ఉంది.  

నీటి వసతి అతి తక్కువగా ఉన్న రాజస్థాన్ వంటి ప్రాంతంలో చెక్ డ్యాములు..వంటి   పద్ధతుల ద్వారా   గణనీయంగా  నీటిని పెంచుకుని పంటలను పండిస్తున్నారని వార్తలు వచ్చాయి. 

కొందరు  తెలుగువాళ్లు రాజస్థాన్ వెళ్ళి  ఈ పద్ధతులను అక్కడి వారికి నేర్పిస్తున్నారట. ఇక్కడి తెలుగువాళ్లు కూడా    ఆ విధానాలను అవలంబించి లాభం పొందవచ్చు. 

  పోలవరం ప్రాజెక్ట్ చాలా పెద్దది.  పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి అయే వ్యయం పూర్తిగా తామే భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికి 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారట. 

నిర్మాణ వ్యయం నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన వారికి పరిహారం,  పునరావాసం వంటి వాటికే 40 వేల కోట్లు ఖర్చవుతాయంటున్నారు. 

 నిర్వాసితుల  పరిహారం, పునరావాసం..వంటివి కూడా ప్రాజెక్టు వ్యయంలో భాగమే కదా! 

మొత్తం అన్నీ కలిపి సుమారు 50 వేల కోట్ల పై వరకూ ఖర్చవుతుందని అంటున్నారు.  మరి  ఇంత డబ్బు  కేంద్రం ఎప్పుడో ఇస్తారో ?  

 ప్రాజెక్ట్  డిజైన్ కొంత మార్చాలని  కొన్ని రాష్ట్రాలు చెబుతున్న    అభ్యంతరాలు ఉండనే ఉన్నాయి.  ఈ విషయాలతో  ప్రాజెక్ట్ సంగతి ఏమవుతుందో తెలియదు. 

 ఇవన్నీ తేలే లోపు  రాజస్థాన్ తరహా నీటి విధానాలను  ఆంధ్రప్రదేశ్లో కూడా  అమలు చేస్తే బాగుంటుంది. 

భారీ ప్రాజెక్టుల వల్ల భూకంపాలు, మరియు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయితే,   ఈ విషయాలను   పెద్దగా  పట్టించుకోకుండా భారీ ప్రాజెక్టులు కడుతున్నారు. 

***************


ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పోలవరం ప్రాజెక్ట్  విషయంలో భద్రాచలంలో శ్రీ  సీతారాములవారి దేవాలయం  ముంపుకు  గురి అవుతుందేమోనని కొందరు సందేహిస్తున్నారు.

 కొందరు  దేవాలయప్రాంతానికి   ఎటువంటి ప్రమాదమూ ఉండదంటున్నారు.

 ఏదిఏమైనా  సీతారాములవారి దేవాలయం ఉన్న ప్రాంతానికి ఎటువంటి  ముప్పు లేకుండా  జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

***********************

 పోలవరం ఒకే భారీ ప్రాజెక్టు గా  కాకుండా  విస్తీర్ణం తగ్గించుకోవటం ,   ప్రాజెక్ట్  ఎత్తు కొంత తగ్గించటం   (సుమారు 5  లేక 10 అడుగులు వరకు..)  లేక  రెండు  మధ్యతరహా ప్రాజెక్టు లుగా   కట్టుకుంటే  ఇబ్బందులు  తగ్గుతాయేమో?

 కొన్ని దేశాల్లో అండర్  గ్రౌండ్ డ్యామ్స్  కూడా కడుతున్నారట. 

  భారీ ప్రాజెక్టుల కన్నా చిన్న, మధ్యతరగతి  ప్రాజెక్టులు మేలు. ఒక పెద్ద భారీ  ప్రాజెక్టు బదులు  రెండు మధ్యతరగతి  ప్రాజెక్టులు నిర్మించుకోవటం సురక్షితం. 

**********
 రాజధానికి 3 వేల కోట్లు ఇచ్చి  ... అమ్మో ! ఇప్పటికే చాలా ఇచ్చేసాం...పోలవరం కట్టడానికి కాలపరిమితి   లేదు...10 ఏళ్ల వరకూ కూడా  కట్టుకోవచ్చు..అంటున్న వాళ్ళు పోలవరానికి 40 వేల కోట్లు ఎప్పుడు ఇస్తారో ? 

పోలవరం  ప్రాజెక్ట్ పరిస్థితి ఏమవుతుందో ... తెలియని  పరిస్థితిలో  అయోమయంలో ఉండేకన్నా,    డిజైన్  కొంత మార్చి   2019 కల్లా  పోలవరం పూర్తిచేయవచ్చనిపిస్తోంది. 

ఎడారిలో జలసిరులు గురించి  ... ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు...

ఎడారిలో జలసిరులు | Special Report on Rajasthan Water Crisis ...




1 comment:

  1. కేంద్రంలో కొత్తప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి. అయితే అలా చేయలేదు. ఇస్తాం.. పరిశీలిస్తున్నాం..అంటూ చాలాకాలం తాత్సారం చేసారు.

    ఆ తరువాత చాలాకాలానికి హోదా ఇవ్వలేం ..ప్యాకేజ్ ఇస్తాం ..అంటూ తేల్చేసారు.

    అప్పటికే విభజన తో అయోమయంలో ఉన్న ఏపీ ప్రజలు ఇక చేసేదేమీలేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తారని నమ్మి ఒప్పుకున్నారు.

    ( ఒప్పుకోక చేసేది కూడా ఏముంది ? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో గొడవపడితే వచ్చే నిధులు కూడా కూడా ఆలస్యమవుతుందని భయం కావచ్చు. చాలాకాలం ఉద్యమాలు చేసి సమయం వృధా చేసుకుంటే .. అభివృద్ధి ఆలస్యం అవుతుందనే ఆలోచనతో కావచ్చు.. ప్యాకేజీకి ఒప్పుకోక తప్పలేదు..)

    అప్పటికే విభజన ఉద్యమాలతో తేరుకోలేని పరిస్థితిలో ఉన్న జనం కూడా ఊరుకున్నారు. ప్యాకేజీ నిధులతో ఏదో పనులు మొదలుపెట్టవచ్చు కదా ! అని ఆశపడ్డారు.

    సమైఖ్య ఉద్యమాలు చేసిన ఉద్యోగస్తులు కూడా రాష్ట్రం ఆర్ధికపరిస్థితి బాగోలేదని తెలిసి కూడా ..తమకు కూడా తెలంగాణా వారిలా జీతాలు పెంచాలని కోరి సాధించుకున్నారు.

    ఇప్పుడు ఏదో ఒకటి రాజధాని అంటూ ఉంది. 10 సంవత్సరాలు వరకూ హైదరాబాద్లోనే ఉంటే అటూఇటూ తిరగటం తోనే సరిపోయేది.
    .......

    బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్యాకేజీకి మీరు ఒప్పుకున్నారు కదా ! అంటూ మాట్లాడుతున్నారు. .

    ప్రత్యేక హోదా ఇవ్వము.. అని చెప్పినప్పుడు ప్యాకేజీకి ఒప్పుకోక ఏం చేయాలి ?

    ఇక, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చూస్తే ..కేంద్రం వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ కు కొద్దిపాటి నిధులు ఇస్తూ త్వరలో పోలవరం పూర్తి చేస్తాం అంటున్నారు.

    మరి కొంతకాలానికి ఏమంటారంటే... ఇతర రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నారు, మేమేం చేయగలం అంటారు.

    పోలవరం కూడా ప్రత్యేక హోదాలా కాకుండా ఉండాలంటే ప్రాజెక్టులో కొద్దిగా మార్పులుచేర్పులు చేసి పూర్తి చేసుకోవచ్చు.

    ReplyDelete