రాబోయే శివరాత్రి సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
....................................
క్రింద వ్రాసిన విషయాలను ఈ పోస్ట్ వేసిన చాలాకాలానికి వ్రాసి ఇక్కడ పోస్ట్ చేసాను.
marikonni vishayaalu..
స్త్రీలు గుమ్మడికాయ కొడితే వంశనాశనం అవుతుందట.మగవాళ్లే కొట్టాలట. నిజమే కావచ్చు. కుదిరినవాళ్లు చక్కగా పాటించగలరు. వంశనాశనం అనిచెపితే ఎవరైనా భయపడతారు.
ఉన్న విషయాన్ని చెప్పటం మంచిదే. చెపితే కుదిరినవాళ్లు పాటించగలరు. విషయాలు అనేకం అయినప్పుడు, అన్నింటిని పాటించలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయగలం ?
.............................................
ఇంతకుముందు గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదని ఎవరోచెబితే, దానిగురించి వ్రాసాను.
గుమ్మడికాయ రోజు వంటలో వాడము కాబట్టి ఫరవాలేదు కాని, కొబ్బరికాయ ఎక్కువే వాడతాము కదా. కొబ్బరికాయ కూడా స్త్రీలు కొట్టకూడదని ఎవరో చెప్పారు.
గుమ్మడికాయను కొట్టకూడదన్నారు. మగవాళ్లు కొడితే స్త్రీలు ముక్కలుగా కోయవచ్చని అంటున్నారు.
అయితే, వంటకు గుమ్మడికాయను కొట్టడానికి, ప్రతిసారి ఇంట్లో మగవాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పటికి దానిని వండటం వాయిదా వేసి పక్కన పెట్టేస్తారు.
అయితే, వంటకు గుమ్మడికాయను కొట్టడానికి, ప్రతిసారి ఇంట్లో మగవాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పటికి దానిని వండటం వాయిదా వేసి పక్కన పెట్టేస్తారు.
కొందరు మగవాళ్లు ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటారు. కొందరు తరచు ఊర్లు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలో, ఎవర్ని అడగాలో.. తెలియదు.
కొందరు మగవారు ఇలాంటి విషయాలు నమ్మకపోవచ్చు, అలాంటప్పుడు కుటుంబంలో గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది.
ఇలాంటప్పుడు, గుమ్మడికాయ కొట్టడానికి మెషిన్ ఉంటే బాగుండనిపిస్తుంది. మెషిన్ కొడుతుంది కాబట్టి, స్త్రీలకు దోషం ఉండదు.
నేను నెట్లో మిషన్ల కోసం వెతికాను. అలాంటి మెషిన్లు పెద్దవి ఉన్నాయి. 25 వేలు ధర ఉంది. అలాకాకుండా ఇంట్లో వాడుకోవటానికి చిన్న మిషన్లు తక్కువధరలో వస్తే బాగుంటుంది.
ఒకటి కొంతతక్కువ ధరలో ఉంది కాని, వాళ్లు ఇప్పుడు తయారు చేస్తున్నారో లేదో తెలియదు.
కూరగాయలు అమ్మే షాపుల వద్ద ఇలాంటి మెషిన్ పెట్టవచ్చు.
.............................................
చలిదేశాలవాళ్లు.. గుమ్మడిని బాగా వాడతారు. ఇప్పుడు గుమ్మడికాయలను వాటికవేముక్కలు చేసే మిషన్లు కనిపెట్టారు.
మార్కెట్లో ఆవకాయకు ముక్కలు కొట్టినట్లు, గుమ్మడికాయలను కొట్టడానికి ఎవరైనా ఉండాలి.
గుమ్మడికాయలు అమ్మేవారిని, గుమ్మడికాయను కొట్టి ఇమ్మని అడగవచ్చు. (వాళ్ళు స్త్రీలు కాకుండా పురుషులయితే..)
..........................................
కొబ్బరి,గుమ్మడి పుష్టికరమైనవి. సందేహాలతో వాడకం తగ్గిస్తే, హిందువులు బలమైన ఆహారానికి దూరం అవ్వవలసి వస్తుందని ఇంతకుముందు రాసాను.
అయితే, తీపిగుమ్మడికాయ వేడి, వాతం అని, చాలామందికి అంతగా పడదు. అలాంటప్పుడు, ఎక్కువగా తినకుండా అప్పుడప్పుడు తినటం మంచిది.
కేరళ, కర్ణాటక వాళ్ళు బూడిదగుమ్మడితో కొబ్బరివేసి కూటుకూర చేస్తారట.బూడిదగుమ్మడిలో ప్రత్యేకమైన లక్షణాలున్నాయని,అది చాలాబలవర్ధకమైనదని,అందువల్ల రోజూ కాకుండా అప్పుడప్పుడు తినాలట.
ఆయుర్వేదం బాగా తెలిసినవారిని అడిగి వాడుకోవచ్చు.
................................................
................................................
చెడ్దపనులు చేసినవాళ్లకు కష్టాలురావటం, వంశనాశనం వంటివి జరిగే పరిస్థితి రావచ్చు ... అని అందరికి తెలిసిన విషయమే అయినా, చాలామంది భయపడకుండా పాపాలు చేస్తున్నారు.
దైవభక్తులం అని చెప్పుకునేవాళ్లు కూడా కొందరు పాపాలు చేస్తున్నారు.
......................................
రావణాసురుడు చేసిన పనుల వల్ల అతనితోపాటు అతని కుమారులు కూడా చనిపోయారు.
అయితే, కొందరు పెద్దవాళ్లు చెడ్దవాళ్లు అయినాకూడా, వాళ్ల పిల్లలు మంచివాళ్లు ఉంటారు. మరి, పెద్దవాళ్లు చేసిన పాపాలకు పిల్లలు శిక్ష అనుభవించాలా? అనే ప్రశ్న వస్తుంది.
పిల్లలు పెద్దవాళ్లతో పాటు పాపపు పనులు చేయకపోతే, వాళ్లకు మంచి జరిగే అవకాశముంది.
అయితే, కొందరు పెద్దవాళ్లు చెడ్దవాళ్లు అయినాకూడా, వాళ్ల పిల్లలు మంచివాళ్లు ఉంటారు. మరి, పెద్దవాళ్లు చేసిన పాపాలకు పిల్లలు శిక్ష అనుభవించాలా? అనే ప్రశ్న వస్తుంది.
పిల్లలు పెద్దవాళ్లతో పాటు పాపపు పనులు చేయకపోతే, వాళ్లకు మంచి జరిగే అవకాశముంది.
ప్రహ్లాదుని తండ్రి దైవాన్ని వదలమని ఎంత కష్టపెట్టినా, ప్రహ్లాదుడు దైవాన్ని వదల్లేదు. ప్రహ్లాదుడు రక్షించబడ్దాడు.
........................................
ఎవరైనా, గుమ్మడికాయ..వంటి విషయాలతో సరిపెట్టటం కాకుండా, జీవితంలో పాపాలు చేయకుండా ఉండటానికి కూడా ప్రయత్నించాలి.
గుమ్మడికాయలు మగవాళ్లు కోయటం..వంటివి పాటించి, ఇవి పాటిస్తేచాలు ఇక కష్టాలురావని, పాపాలు చేస్తూ ఉంటే కష్టాలు వచ్చే అవకాశముంది.
కష్టాలు రాకూడదంటే పాపాలు చేయటం ఆపాలి, కనీసం అందుకు గట్టిగా ప్రయత్నించాలి.
No comments:
Post a Comment